బేగం అజీజా ఫాతిమా ఇమామ్ 1924 ఫిబ్రవరి 20న పాట్నాలో జన్మించారు మరియు అజీజా ఇమామ్ అని పిలువబడినది.. అజీజా ఇమామ్ తండ్రి
పేరు డాక్టర్ వలీ అహ్మద్,
పాట్నాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్
మెడికల్ కాలేజీలో బోధించారు. మరియు తల్లి పేరు ఖదీజా అహ్మద్.
చిన్నతనంలోనే, అజీజా ఇమామ్‌ను ఆమె ఖాలా లేడీ
అనీస్ ఫాతిమా ఇమామ్ దత్తత తీసుకున్నారు. లేడీ అనీస్ ఇమామ్ 1937లో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్
సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
అజీజా ఇమామ్ యొక్క ఖాలు పేరు సర్ అలీ ఇమామ్.
బీహార్ రాష్ట్ర స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు. 1909లో బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్
సభ్యునిగా ఎన్నికయ్యారు. 1917లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
అయ్యారు. నిజాం హైదరా తరువాత 1920లో
ప్రధానమంత్రి అయ్యాడు మరియు అదే సంవత్సరంలో లీగ్ ఆఫ్ నేషన్స్ మొదటి అసెంబ్లీలో
భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
అజీజా ఇమామ్ సోదరుడి పేరు కల్నల్ మెహబూబ్
అహ్మద్, ఆజాద్ హింద్ ఫౌజ్ సీనియర్ అధికారి,
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనిక కార్యదర్శి మరియు దేశ స్వాతంత్య్రానంతరం వివిధ దేశాలకు భారత
రాయబారిగా పనిచేసారు.
అజీజా ఇమామ్ యొక్క మామ, మౌలానా షఫీ దావూదీ
భారతదేశ స్వాతంత్ర ఉద్యమం లో ముఖ్యమైన పాత్ర పోషించినాడు. మౌలానా షఫీ దావూదీ అనేక
సార్లు జైలుకు కూడా వెళ్ళాడు, 1924
మరియు 1927 మధ్య, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.
జహ్రా దావూదీ వంటి విప్లవ మహిళలు బేగం అజీజా
ఇమామ్ బంధువులు. మరియు బేగం జుబేదా దావూది వంటి మహిళా స్వాతంత్ర్య సమరయోధులు ఆమెకు
సొంత మేనత్తలు.
అజీజా ఇమామ్ చిన్నప్పటి నుండి చాలా తెలివైనది. ఎన్నో
భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయ్యాక సామాజిక సేవలో నిమగ్నమైంది. అజీజా ఇమామ్ కు
ఉర్దూ భాషపై మంచి పట్టు ఉండేది. దీనివల్ల బీహార్ నుంచి వచ్చే అనేక రిసాల్స్‌లో ఈమె
కథనాలు ప్రచురించబడ్డాయి. యాభైవ దశకం లో అజీజా ఇమామ్ "సుభ్ ఏ నౌ" అనే పత్రికకు
సంపాదకులుగా కూడా అయ్యారు మరియు
చాలా కాలం పాటు సాహిత్య సేవలను అందించారు.
అజీజా ఇమామ్ 1937 నుండి 1939 వరకు బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్
డిప్యూటీ ఛైర్మన్ మరియు తరువాత పాట్నా హైకోర్టు న్యాయమూర్తి గా పనిచేసిన నఖీ
ఇమామ్‌ను వివాహం చేసుకున్నారు.
1973లో, అజీజా ఇమామ్ యొక్క సామాజిక సేవ కారణంగా
ఆమె రాజ్యసభ సభ్యురాలు గా నియమించబడ్డారు. ఆమె పదవీకాలం ముగిసిన తరువాత, ఆమెకు మళ్లీ అవకాశం ఇవ్వబడింది మరియు
అజీజా ఇమామ్ 11 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యురాలు గా
కొనసాగారు.
బేగం అజీజా ఇమామ్ 22 జూలై, 1996న మరణించారు మరియు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లోని బాగ్-ఎ-మూజిబియా
స్మశానవాటికలో తల్లి మరియు సోదరుడి పక్కన ఖననం చేయబడ్డారు.
No comments:
Post a Comment