హైదరాబాద్ రైల్వే
స్టేషన్
హైదరాబాద్ నగరాన్ని మిగిలిన భారతదేశంతో అనుసంధానించాలని హైదరాబాద్ నిజాం భావించి రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళికల ప్రతిరూపంగా హైదరాబాద్ రైల్వే స్టేషన్ నిలుస్తోంది.
1907లో అసఫ్
జా VII ఉస్మాన్ అలీ ఖాన్ చేత నిర్మించబడిన ఈ స్టేషన్‌ను
నామ్-పల్లి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీనిని ఆ రోజుల్లో తేమ మరియు తడి ప్రాంతంలో
నిర్మించారు. అధికారుల ప్రకారం, ఉర్దూలో నామ్ అంటే తడి మరియు తేమ, మరియు పల్లి అంటే స్థలం. అందుకే, దీనికి నాంపల్లి
స్టేషన్ అని నామకరణం జరిగింది. నాంపల్లి స్టేషన్‌కు ఆనుకుని ఉన్న పబ్లిక్
గార్డెన్స్‌గా ప్రసిద్ధి చెందిన బాగ్-ఈ-ఆమ్‌ను నిర్మించడానికి నిజాం ఎంచుకున్న తడి
ప్రదేశం ఇది.
నాంపల్లి/హైదరాబాద్ స్టేషన్
డెక్కన్ నిర్మాణ శైలి ఆధారంగా కంటికి ఆహ్లాదకరమైన మరియు సొగసైన ముఖభాగంతో
రూపొందించబడింది. "హైదరాబాద్ దక్కన్" అని పిలవబడే దాని ప్రారంభం నుండి
నేటి వరకు స్టేషన్ ఎంట్రీ పాయింట్/ప్రవేశ స్థానం నిజాం రాయల్టీ యొక్క గొప్పతనాన్ని
పెంపొందించడానికి సౌష్టవంగా వంపుగా ఉంది.
మొదట్లో, హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్రధానంగా గూడ్స్ ట్రాఫిక్‌ను నిర్వహించడానికి
ఉపయోగించబడింది, అయితే 1921లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మధ్య
కనెక్టివిటీని ప్రారంభించిన బేగంపేట రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత
మొదటి పాసంజర్ రైలు వచ్చింది.
బేగంపేట
రైల్వేస్టేషన్ నిర్మాణంలో జాప్యం జరిగింది. రైలు మార్గం సర్ వికార్-ఉల్-ఉమ్రా
యొక్క ఆస్తి గుండా వెళుతుoది మరియు అతను బేగంపేటలో రైళ్లు ఆగాలని పట్టుబట్టి
అప్పుడు మాత్రమే బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తి నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు.
ఆ తర్వాత రైళ్లు
హుస్సేన్ సాగర్ జంక్షన్ లేదా బేగంపేట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాయి.
1929 మరియు 1934
సంవత్సరాల్లో స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో హైదరాబాద్
నగరాన్ని సందర్శించినందున హైదరాబాద్ స్టేషన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మహాత్మా గాంధీ ఏప్రిల్ 6, 1929 న రైలులో వచ్చినప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్
జన సముద్రాన్ని చూసింది.
గాంధీ జీ రైలు నుండి వెయిటింగ్ కారుకు చేరుకోవడానికి అతనికి 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టింది. 1934లో గాంధీజీ హైదరాబాద్‌కు రెండవసారి సందర్శించారు, గాంధీ జీ సబర్మతి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి హైదరాబాద్ ప్రజలు చేసిన కృషికి తాను ఎలా ప్రభావితామయ్యనో చెబుతూ గాంధీ హైదరాబాద్ ప్రజలకు ఒక లేఖ రాశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1932లో మొదటిసారిగా హైదరాబాద్‌ను సందర్శించారు
ఈనాటికి హైదరాబాద్
స్టేషన్ చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఒకటి, అనేక ఎక్స్‌ప్రెస్
మరియు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడి నుండి ముగియడం లేదా ప్రారంభమవుతాయి. 1973 వరకు
నాలుగు దక్షిణాది రాజధానులలో కేవలం రెండు మాత్రమే దేశ రాజధానికి నేరుగా రైలు
కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. ఒకటి మద్రాస్ నుండి ప్రారంభం అయ్యే 15/16 గ్రాండ్
ట్రంక్ (GT) ఎక్స్‌ప్రెస్,
మరొకటి హైదరాబాద్ నుండి 1955 నుంచి ప్రారంభం అయిన 21/22 సదరన్ లేదా దక్షిణ్
ఎక్స్‌ప్రెస్.
కొత్త రైలు
ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3, 1976న
ప్రవేశపెట్టబడింది మరియు దానిని అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న శ్రీ మధు దండావతే
ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటల సమయం
పట్టింది, ఇది ప్రస్తుతం ఉన్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు కంటే
తక్కువ వ్యవధి. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ చేరుకోవడానికి 33 గంటలు పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు న్యూఢిల్లీ స్టేషన్‌కు చేరుకోవడానికి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు హర్యానా అనే ఆరు రాష్ట్రాల గుండా వెళుతుంది.
రాజధాని మరియు దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించెంతవరకు "బ్లూ బుల్లెట్" గా పిలిచే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ మరియు ఢిల్లీ మధ్య అత్యంత వేగవంతమైన రైలు, ఇది చాలా రైళ్లు ఆవిరితో నడిచే సమయంలో డీజిల్ లోకోమోటివ్‌లతో ప్రవేశపెట్టబడింది. ఇది సేవ, సమయపాలన నిర్వహణ నాణ్యమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది మరియు దక్షిణ మధ్య రైల్వేలో మొదటి 24-కోచ్ రైలు. ప్రారంభంలో, దీనికి నాలుగు స్టాపేజ్‌లు ఉండగా, ఇప్పుడు దీనికి 16 స్టాపేజ్‌లు ఉన్నాయి.
నవంబర్ 15, 2015 నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైల్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చబడింది, ఇది ఇప్పుడు సరికొత్త జర్మన్ డిజైన్ లింక్-హాఫ్‌మన్-బుష్ కోచ్‌లతో నవీకరించబడింది.
భారతదేశం యొక్క 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని, భారతీయ రైల్వేలు స్వాతంత్ర్య పోరాటo తో విడదీయలేని సంబంధం కలిగి ఉన్నాయి, సామాజికంగా సాంస్కృతికంగా మరియు రాజకీయంగా విభిన్న ప్రాంతాలలోని దేశభక్తులను కలుపుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాట వారసత్వాన్ని విజయవాడ, గుంటూరు మరియు గద్వాల్ రైల్వే స్టేషన్లతో సహా వివిధ స్టేషన్లు ప్రతిబింబిస్తూన్నాయి..ధ స్టేషన్లలో హైదరాబాద్ ఒకటిలో హైదరాబాద్ ఒక
No comments:
Post a Comment