7 November 2022

షెబా/బిల్కిస్/మకేడా రాణి 1000 BC - 901 BCE Queen of Sheba/Bilqīs/Makeda1000 BC- 901 BCE

 

ఇంగ్లీష్ లో క్వీన్ షెబా, అరబిక్ లో  బిల్కిస్, ఇథియోపియన్ లో మకేడా, 10వ శతాబ్దం BC కు చెందిన పాలకురాలు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం, నైరుతి అరేబియాలోని సబా లేదా షెబా (ఆధునిక యెమెన్‌) రాజ్య పాలకురాలు.

ఇస్లామిక్ సంప్రదాయంలో బిల్కిస్ లేదా బాల్కిస్ గా పిలువబడే షెబా రాణి కథ దివ్య ఖురాన్‌(27:15-44)లో కనిపిస్తుంది, అయితే ఆమె పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించబడలేదు మరియు బిల్కిస్ రాణి కథను ముస్లిం వ్యాఖ్యాతలు వివరించారు.

అరబ్బులు బిల్కిస్‌కి దక్షిణ అరేబియా వంశావళిని కూడా ఇచ్చారు.

ఒక కథనం ప్రకారం, రాణి  మరియు ఆమె రాజ్య ప్రజలు  సూర్యుడిని ఆరాధిస్తారని సులైమాన్ చక్రవర్తి తన హుద్ హూద్  పక్షి (వడ్రంగి పిట్ట)  ద్వారా విన్నాడు.

“నేను సబా నుండి నమ్మకమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. నేను అక్కడ ఒక స్త్రీని చూసాను. ఆమె  ఆ జాతిని ఏలుతుంది. ఆమెకు అన్ని రకాల వస్తు సామాగ్రి ప్రసాదించబడినది. ఆమె సింహాసనం మహోజ్వలంగా ఉంది. నేను చూసాను,ఆమె, ఆమె జాతివారు అల్లాహ్ కు బదులు సూర్యుడి ముందు సాష్టాంగపడుతున్నారు.  (27:22-24)

అల్లాహ్ ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవడు లేదు. ఆయన మహోన్నతమైన ఆధికార పీఠానికి ప్రభువు.ముస్లిం అయి అల్లాహ్/దేవుడిని ఆరాధించమని కోరుతూ సులైమాన్, రాణి కి ఒక లేఖ పంపాడు.”నా ఈ ఉత్తరాన్ని తీసుకుపో” 27:26-28.

అతడు (రాణి గారి దుతా) సులైమాన్ వద్దకు చేరుకొన్నాడు. అప్పుడు సులైమాన్ ఇలా అన్నాడు.”ఏమిటి, మీరు ధనం ఇచ్చి నాకు సహాయం చేయదలచుకున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దానికంటే నాకు ఇచ్చినది ఎంతో ఎక్కువ. మీ కానుకను మీరే అనుభవించండి. “ (ఓ దూతా) నిన్ను పంపిన వారి వద్దకు తిరిగి వెళ్ళిపో, మేము వారి పైకి వారు ఎదిరించలేని సైన్యాలను తీసుకువస్తాము. మేము వారిని పరాభవించి అక్కడి నుండి పారద్రోలుతాము. వారు అవమానితులై ఉండిపోతారు. ”(27:36-37)

రాణి వచ్చినప్పడు, ఆమెను,”నీ సింహాసనం ఇలంటిదేనా? అని అడగబడింది. దానికి ఆమె “ఇది అచ్చంగా అలాంటిదే. మేము ఇంతకు ముందే విషయం తెలుసుకొని విదేయులమైపోయాము(లేక ముస్లిములమైపోయాము) అని అన్నది. 27:42

రాణి, స్వయంగా సులైమాన్, ఆస్థానానికి  వచ్చింది.రాజగృహం లో ప్రవేశించు అని ఆమెకు చెప్పటం జరిగింది. ఆమె దానిని చూచి, అది నీటి కొలను అని  అనుకొన్నది. అందులో దిగటానికి ఆమె తన కాళ్ళ మీద వస్త్రాన్ని పైకి ఎత్తి పట్టుకొన్నది.అప్పుడు సులైమాన్ “ఇది గాజు తో చేయబడిన నున్నని నేల మాత్రమే” అని అన్నాడు. అప్పుడు ఆమె ఎలుగెత్తి ఇలా అన్నది, “ నా ప్రభూ!(ఈ నాటి వరకు) నేను నా ఆత్మకు అన్యాయం చేసుకొంటూ ఉండేదాన్ని. ఇప్పుడు నేను సులైమాన్ తో పాటు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ పట్ల విధేయతను స్వీకరిస్తున్నాను.”-దివ్య ఖురాన్ 27:44

దివ్య ఖురాన్‌లో, రాణి ఏకేశ్వరోపాసకురాలు అవుతుంది మరియు ఆమె రాజ్యాలలో శాంతి నెలకొల్పబడింది.

సులైమాన్  స్వయంగా బిల్కీస్‌ను వివాహం చేసుకున్నాడా లేదా ఆమెను హమ్దానీ గిరిజనుడికి ఇచ్చి వివాహం చేశాడా అనే విషయంలో రుజువైన ఆధారాలు లేవు.

ఇథియోపియన్ జాతీయ ఇతిహాసం కెబ్రా నాగాస్ట్ ("గ్లోరీ ఆఫ్ కింగ్")లో షెబా రాణి ప్రముఖ వ్యక్తిగా కనిపిస్తుంది. ఇథియోపియాలో  షెబా రాణి ని  మకేడా అని పిలుస్తారు. ఇథియోపియా ఇతిహాసాల ప్రకారం సులేమాన్ జ్ఞానం గురించి విన్న తర్వాత షెబా రాణి సులేమాన్ ఆస్థానాన్ని సందర్శించింది. ఆరు నెలలపాటు షెబా రాణి, సులేమాన్  దగ్గర ఉండి జ్ఞానం నేర్చుకుంది. సులేమాన్, షెబా రాణి పొందు వలన షెబా రాణి గర్భవతి అయింది. షెబా రాణి తన రాజ్యానికి తిరిగి వచ్చి మెనిలెక్ అనే కొడుకును కన్నది. మెనిలెక్I, రాజుగా చేయబడ్డాడు, తద్వారా ఇథియోపియా యొక్క సోలోమోనిక్ రాజవంశం స్థాపించబడింది.  సోలోమోనిక్ రాజవంశం,  1974లో హైలే సెలాసీI కాలం వరకు ఇథియోపియాను పాలించినది.

షెబా రాణి యొక్క కథ పర్షియన్లలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె ఒక చైనీస్ రాజు కుమార్తె మరియు పెరి peri (పర్షియన్ పురాణాలలో దేవకన్య ) గా పరిగణించబడుతుంది.

 

 

 

No comments:

Post a Comment