5 November 2022

అల్ – బుకారీ ప్రసిద్ద హదీసు పండితుడు(810-870)

 


ఇమామ్ మొహమ్మద్ అల్-బుఖారీ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత విశిష్ట హదీసు పండితులలో ఒకరిగా పరిగణించబడతారు. అల్-బుఖారీ పుస్తకం సహీహ్ అల్-బుఖారీ, లో అనేక వేల హదీసులు సేకరించబడ్డాయి.

అల్-బుకారీ హదీసుల సంకలనం సహీహ్ అల్-బుఖారీ గ్రంధాన్ని మెజారిటీ సంప్రదాయాన్ని అనుసరించే సున్నీ ముస్లింలు అనుసరిస్తారు. సున్ని ముస్లిములకు సహీహ్ అల్-బుఖారీ దివ్య ఖురాన్ తర్వాత రెండవ మతపరమైన చట్టం మరియు పవిత్రమైన హదీసు గ్రంధం..

అల్-బుఖారీ పూర్తి పేరు అబు అబ్దుల్లా మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్-బుఖారీ మరియు ఇమామ్ అల్-బుఖారీ 810AD లో ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా  నగరం లో జన్మించాడు. అల్-బుఖారీ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. అల్-బుఖారీ తల్లి అతన్ని బాగా చదివించింది మరియు చిన్నతనం నుంచి అల్-బుఖారీ  సైన్స్ పట్ల ప్రేమ మరియు మక్కువ కలిగి ఉన్నాడు.

చిన్నతనంలో, అల్-బుఖారీ కంటి వ్యాధికి గురి అయ్యాడు. కాని త్వరలోనే కంటి వ్యాధి నయమైనది. అల్-బుఖారీ చిన్నతనంలో చాలా తెలివైనవాడు మరియు బలమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నాడు.  అల్-బుఖారీ కి గల బలమైన జ్ఞాపక శక్తీ హదీసుల సేకరణలో సహాయపడినది.

అల్-బుఖారీ యవ్వనంలో పవిత్ర ఖురాన్ కంఠస్థం చేశాడు మరియు ఇస్లాం యొక్క  ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాడు. బుఖారీ చిన్న వయస్సులోనే వేలాది హదీసులను కంఠస్థం చేశాడు. అప్పటి విజ్ఞాన కేంద్రాలలో ఒకటిగా ఉన్న బుఖారా లో ఇస్లామిక్ శాస్త్రవేత్తలు మరియు మత పండితుల సమావేశాలకు అల్-బుఖారీ తరచుగా హాజరు అయ్యేవాడు.

అల్-బుఖారీ 16 సంవత్సరాల వయస్సులో, తన తల్లి మరియు సోదరుడు అహ్మద్‌తో కలిసి హజ్ యాత్ర చేయడానికి మెవ్వ Mevva కు వెళ్లి మరింత జ్ఞానం సంపాదించడానికి అక్కడే ఉన్నాడు. అల్-బుఖారీ ఆరేళ్లపాటు పవిత్ర నగరం మక్కా లో ఉండి హదీసులను సేకరించడం ప్రారంభించాడు.

ఆ తరువాత, అల్-బుఖారీ హదీసులను సేకరించడం కోసం బాగ్దాద్ నుండి కుఫా, డమాస్కస్, ఈజిప్ట్, ఖొరాసన్ మొదలైన అనేక దేశాలకు ప్రయాణించి, మరిన్ని హదీసులను సేకరించడానికి కృషి చేశాడు. వజూ wudu మరియు రెండు రకాత్‌ ప్రార్ధనలు చేసే వరకు హదీసులలో దేనినీ వ్రాయలేదని చెప్పబడింది.

అల్-బుఖారీ అత్యంత నిష్కపటమైన హదీసు సంకలన కర్త. ప్రామాణిక హదిసులను  ఎన్నుకోవడంలో గొప్ప విమర్శనాత్మక వివక్ష మరియు సంపాదకీయ నైపుణ్యాన్ని చూపాడు.

అల్-బుఖారీ హదీస్‌ సేకరణలో లో కఠినమైన పద్ధతిని అనుసరించాడు. వ్యాఖ్యాతలు మరియు సూచనలను (narrators and references) విచారింఛి  మంచి వర్గీకరణ మరియు పరిశీలనతో హదీసు సేకరణ లో  అల్-బుఖారీ చిహ్నంగా మారాడు

 హదీసుల సంకలనం  "సహీహ్ అల్-బుఖారీ"తో పాటు, అల్-బుఖారీ  ఇరవైకి పైగా పుస్తకాలను వర్గీకరించాడు. అల్-బుకారీ  "Al-Taʾrīkh al-kabīr (“The Large History”) కూడా రచించాడు.  ఇది నిఘంటువు రూపం లో అక్షరక్రమం లో పేర్లు ఉన్న ఆధునిక కథకుల narrators అనువాదాల పుస్తకం. ఇంకో పుస్తకం "చిన్న చరిత్ర", అనేది ప్రవక్త(స) మరియు అతని సహచరులు మరియు వారి తర్వాత వచ్చిన కథకుల narrators సంక్షిప్త చరిత్ర.

అల్-బుకారీ సంకలనం చేసిన  "అల్-జమాహ్ అల్-సాహిహ్" లేదా "సాహిహ్ అల్-బుఖారీ" అనేది సరైన సారాంశంలో మొదటి వర్గీకరించబడిన పుస్తకం మరియు ఆత్రుత, చిత్తశుద్ధి మరియు తెలివితేటలకు రుజువుగా పరిగణించబడుతుంది. “సాహిహ్ అల్-బుఖారీ” లోని హదీసులు వివిధ దేశాల మధ్య అనేక సంవత్సరాల పాటు కఠినమైన పర్యటనల పలితంగా సేకరించబడినవి.  

అల్-బుఖారీ యొక్క ఉపాధ్యాయులు మరియు ప్రొఫెసర్లలో ఇషాక్ ఇబ్న్ రహావి నిషాపూర్ ఒకరు. ఇషాక్ ఇబ్న్ రహవి సూచన మేరకు అల్-బుకారి,  ప్రవక్త మొహమ్మద్(స) యొక్క సరైన హదీసుల సంక్షిప్త పుస్తకo “అల్-జమాహ్ అల్ సాహిహ్” సేకరించడం ప్రారంభించాడు.

 “సాహిహ్ అల్-బుఖారీ” సంకలనం లో అల్-బుకారీ కఠినమైన పద్ధతి అనుసరించాడు. అల్-బుకారి “సాహిహ్ అల్-బుఖారీ” పుస్తకాన్ని ప్రచురించడానికి ఏ మాత్రం తొందరపడలేదు. సేకరించిన 600,000 హదీసుల నుండి అల్-బుకారీ పూర్తిగా నమ్మదగినదిగా భావించి ఎంపిక చేసిన 7,275 హదీసులను మాత్రమే ఎంచుకున్నాడు  మరియు వాటిని తన అల్-జామి అల్-సాహిః Al-Jāmiʿ al-aī  ("ది అథెంటిక్ కలెక్షన్")లో చేర్చాడు.

 అల్- బుకారీ తన హదీసుల సేకరణను సబ్జెక్ట్ ప్రకారం విభాగాలుగా ఏర్పాటు చేసాడు.  “సాహిహ్ అల్-బుఖారీ” గ్రంధం పై చాలా సమీక్షలు, పునర్విమర్శలు మరియు పరిశోధనలు చేసాడు మరియు  కథనాలను తనిఖీ చేయడంలో అల్-బుకారి చాలా కష్టపడ్డాడు.

విశ్వాసం, న్యాయం, క్రమశిక్షణ, పాండిత్యం, సైన్స్‌, నిజాయితీ తో పాటుగా, హదీసు కథకుడి narrator కథను అంగీకరించడానికి అల్-బుకారీ అనేక షరతులను విధించాడు. కథకుడు వివరించిన వారికి సమకాలీనుడై ఉండాలి మరియు ఆ వ్యక్తి నుండి స్వయంగా విని ఉండాలి.

ఇమాం అల్-బుకారీ జీవిత చివరలో నిషాపూర్‌ నగరాన్ని విడిచిపెట్టి బుఖారాకు వెళ్లాడు. కానీ, బుఖారా గవర్నర్ మరియు అతని పిల్లలకు ప్రత్యేక తరగతులు ఇవ్వడానికి ఇమాం అల్-బుకారీ నిరాకరించడంతో, ఇమాం అల్-బుకారీ సమర్కాండ్ సమీపంలోని ఖర్తాంక్ అనే గ్రామనికి  బహిష్కరించబడి అక్కడ ఆగస్టు 31, 870లో మరణించాడు.

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment