7 November 2022

1857 తిరుగుబాటు తరువాత నిరాశ్రయులు అయిన మొఘల్ బేగముల కథలు

 

సిపాయిల తిరుగుబాటు (లేదా మనం పిలుస్తున్న మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం) 1857లో ఈస్టిండియా కంపెనీ సైన్యానికి చెందిన భారతీయ సైనికులు  తుపాకీలకు ఉపయోగించే కాట్రిడ్జ్‌ల గ్రీజు సమస్యపై ప్రారంభమైంది. ఇది తిరుగుబాటు అనే అర్థం వచ్చే ఉర్దూ పదం "గదర్" ద్వారా ప్రసిద్ధి చెందింది.

తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా లక్నో మరియు ఢిల్లీ చుట్టూ పక్కల ప్రాంతాలలో వేగంగా వ్యాపించింది. తిరుగుబాటు చేసిన సైనికులు పెద్ద సంఖ్యలో బ్రిటీష్ అధికారులను, మహిళలు మరియు పిల్లలను చంపారు. తిరుగుబాటు చేసిన సైనికులు జీవించి ఉన్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను అతని అనుమతి లేకుండానే తమ నాయకుడిగా స్వీకరించారు.

బహదూర్ షా జాఫర్‌ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే ఉదారమైన పెన్షన్‌పై ఉన్న నామమాత్రపు చక్రవర్తి, ఎర్రకోట ఆవరణకు మించిన అధికారం అతనికి లేదు మరియు  తిరుగుబాటు సైనికులకు సహాయం చేయడానికి డబ్బు లేదు. బహదూర్ షా జాఫర్‌ కు బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవటం ఇష్టoలేదు, కానీ నిస్సహాయంగా ఉన్నాడు మరియు తిరుగుబాటు సైనికుల డిమాండ్లతో అoగీకరించాల్సి వచ్చింది.

ప్రారంభంలో బ్రిటీష్ వారికి ఎదురుదెబ్బ తగిలినా, వారు త్వరగా తిరిగి ఏకమై ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోటలో దాదాపు 3,000 రాజ కుటుంబాలు ఉన్నాయి, వీరంతా ప్రస్తుత మరియు గత చక్రవర్తుల వారసులు. చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ యొక్క ఆస్థాన  జీవితం ఆడంబరం మరియు గొప్పతనంతో నిండి ఉంది. కాని నిజమైన అధికారం లేదు.

బహదూర్ షా సున్నితమైన మనస్సు గలవాడు మరియు కవి. ఢిల్లీని ఇంగ్లీష్ రెసిడెంట్ పాలించారు. "లాల్ ఖిలా"లో నివసించే రాజ కుటుంబీకుల జీవితాలు పెద్ద భవనాలు, పెద్ద సంఖ్యలో సేవకులు మరియు బానిసలతో విలాసవంతమైనవి. గదర్ తో  భారతీయ చరిత్రలో మొఘల్ సంస్కృతి అకస్మాత్తుగా మరియు నాటకీయంగా ముగిసింది.

కుల్సుమ్ జమానీ బేగం చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా యొక్క ప్రియమైన కుమార్తె. కోట నుండి బయలుదేరిన రాత్రి, బహదూర్ షా,  కుల్సుమ్ జమానీ బేగంను మరియు ఆమె కుటుంబాన్ని ఖుదా (దేవుడు) సంరక్షణకు అప్పగించి పంపించాడు. ఎర్రకోట నుండి బయలుదేరిన కొద్ది రోజుల్లోనే వారి డబ్బు, నగలు మరియు వారి ఖరీదైన బట్టలు కూడా దోచుకున్నారు. చివరగా దారిలో కొందరు గ్రామస్తులు,  కుల్సుమ్ జమానీ బేగంను మరియు ఆమె కుటుంబాన్ని ఒక గడ్డి గుడిసెలో ఆశ్రయం ఇచ్చారు.

కంపెనీ సైనికులు, చక్రవర్తి వారసులను అరెస్టు చేసి శిక్షించడానికి వెతుకుతున్నారు. చక్రవర్తి వారసులు  హైదరాబాద్‌కు పారిపోయారు, అక్కడ వారికి నవాబ్ లష్కర్ జంగ్ ఆశ్రయం కల్పించారు, నవాబ్ లష్కర్ జంగ్ ఢిల్లీ నుండి తప్పించుకున్న చాలా మంది మొఘల్ రాజకులకు ఆశ్రయం ఇచ్చాడు.

కొన్ని సంవత్సరాల తరువాత  బ్రిటీష్ వారు  యువరాణి కుల్సుమ్ జమానీ బేగంను హైదరాబాద్ కు వెళ్ళమని సలహా ఇచ్చారు. మొఘల్ శ్రేయోభిలాషులు కొందరు కుల్సుమ్ జమానీ బేగం మక్కా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కుల్సుమ్ జమానీ బేగం ఢిల్లీలో యువరాణిగా ఉన్నప్పుడు ఆమె విడుదల చేసిన బానిసలలో ఒకరు మక్కాకు వలస వెళ్లి అక్కడ అత్యంత సంపన్న వ్యాపారిగా మారారు. మక్కాలోని సంపన్న వ్యాపారి, కుల్సుమ్ జమానీ బేగంను చాలా బాగా చూసుకున్నాడు మరియు కుల్సుమ్ జమానీ బేగం కుటుంబం సుఖంగా ఉండేలా చేశాడు.

టర్కీ రాయబారి, చక్రవర్తి బహదూర్ షా కుమార్తె మక్కాలో ఆశ్రయం పొందిందని తెలుసుకున్నాడు మరియు టర్కీ సుల్తాన్ నుండి కుల్సుమ్ జమానీ బేగంకు పెన్షన్ ఏర్పాటు చేశాడు. కుల్సుమ్ జమానీ బేగం మక్కాలో కొన్నాళ్లు హాయిగా జీవించింది. చివరికి కుల్సుమ్ జమానీ బేగం తిరిగి ఢిల్లీకి రావాలని కోరుకుంది. కుల్సుమ్ జమానీ బేగం, ఢిల్లీకి తిరిగి వెళ్ళినప్పుడు, అక్కడి ఇంగ్లీష్ గవర్నర్ కరుణతో, కుల్సుమ్ జమానీ బేగం కుటుంబానికి పెన్షన్ ఏర్పాటు చేశారు. కుల్సుమ్ జమానీ బేగంకు  బ్రిటీష్ వారు నెలకు పది రూపాయల భారీ పరిహారం ఇచ్చారు

సకీనా ఖానుమ్, నవాబ్ ఫౌలాద్ ఖాన్ కోడలు. గదర్ సమయంలో కంపెనీ సైనికులతో పోరాడుతూ నవాబ్ ఫౌలాద్ ఖాన్ మరణించాడు. నవాబ్ ఫౌలాద్ ఖాన్ మృతదేహాన్ని సైనికులు ఇంటికి తీసుకువచ్చినప్పుడు, సకీనా తీవ్రమైన ప్రసవ వేదనతో కొట్టుమిట్టాడుతోంది. నవాబ్ ఫౌలాద్ ఖాన్ కుమారుడు యుద్ధంలో నాలుగు రోజుల క్రితం మరణించగా, నవాబ్ ఫౌలాద్ ఖాన్ భార్య రెండేళ్ల క్రితం మరణించింది.

నవాబు నవాబ్ ఫౌలాద్ ఖాన్ శవం ముంగిట్లో ముసుగు కూడా లేకుండా పడి ఉండగా, సేవకుల సహాయంతో సకీనా ఒక అబ్బాయిని ప్రసవించింది. సకీనా ఖానుమ్ అర్ధరాత్రి కొన్ని నగలు, ఇంట్లో ఉన్న కొంత నగదు మరియు తను కన్నా నవజాత శిశువుతో పారిపోవాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న నలుగురు పనిమనుషులు సకీనా ఖానుమ్ తో వెళ్లారు.

కొన్ని రోజుల తర్వాత, పనిమనిషులు  డబ్బు మరియు ఆభరణాలన్నింటినీ దొంగిలించి సకీనా ఖానుమ్ ను విడిచిపెట్టారు మరియు  వారు యువరాణి సకీనా కి కొత్తగా జన్మించిన కుమారుడిని కూడా తమతో తీసుకువెళ్లారు. సకీనా  ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగించేందుకు ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు సకీనాకు   పని రానందున, చేసే అలవాటు లేనందున  సకీనా పని చేసే అనేక ఇళ్ల వారు సకీనాను తరచుగా తీసివేసేవారు.

చివరగా, యువరాణి సకీనా తన జీవనం కోసం బిచ్చగత్తేగా  మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక మధ్యాహ్నం సకీనా ఒక పెళ్లి ఇంటి ముందు అడుక్కుంటోంది. వేసవి ఎండల తీవ్రతకు సకీనా అలసిపోయింది. దానికి తోడూ సకీనా చాలా రోజులుగా తినలేదు మరియు విపరీతమైన ఆకలితో ఉంది. సకీనా వేడుకుంటుండగా, ఒక అందమైన యువకుడు పెళ్లి మండపం నుండి బయటకు వచ్చాడు. సకీనా ఆర్తనాదాలు విని, ఎదురుగా కూర్చొని, తను మోసుకెళ్ళే ఆహారాన్ని సకీనా కు ఇచ్చాడు. యువకుడు సకీనా తో మాట్లాడి  ను ఓదార్చాడు మరియు తన తల్లి, పెళ్లి ఇంట్లో పనిమనిషి అని చెప్పాడు

యువకుడు సకీనా  తో మాట్లాడుతున్నప్పుడు, యువకుని తల్లి బయటకు వచ్చింది మరియు సకీనా వెంటనే, యువకుని తల్లిని, వదిలి వెళ్ళిన తన పనిమనిషిగా గుర్తించింది మరియు సకీనా కు ఆహారం ఇచ్చిన యువకుడు తన స్వంత కొడుకు అని గ్రహించింది. చాలా సంవత్సరాల తర్వాత సకీనా కోల్పోయిన తన కొడుకును తిరిగి కలుసుకుంది.

ప్రిన్స్  కిస్మత్ బేగ్ బొంబాయిలోని తాజ్ మహల్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేశాడు.  కిస్మత్ బేగ్ ఒంటరి వ్యక్తి. భావ్‌నగర్ మహారాజా బొంబాయిలో ఉన్నప్పుడల్లా తాజ్ మహల్ హోటల్‌లో తరచుగా బస చేసేవారు మరియు ఖిస్మత్ బేగ్ వండిన ఆహారాన్ని ఎంతో ఆస్వాదించేవారు.

ఒకరోజు బరోడా మహారాజు,  వంటమనిషిని కలవాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఎప్పుడూ ఎవరినీ కలవడానికి ఇష్టపడని వ్యక్తి క్విస్మత్ బేగ్. ఖిస్మత్ బేగ్‌ని మీరు ఎవరు?అని బరోడా మహారాజు అడిగినప్పుడు, బేగ్ సుదీర్ఘమైన తాత్విక ఉపన్యాసం ఇచ్చాడు. వంటమనిషి పాండిత్యానికి ఆశ్చర్యపోయిన బరోడా రాజు అతని కథ చెప్పమని క్విస్మత్ బేగ్ ని ఒప్పించాడు.

బేగ్ తన సుదీర్ఘ విచారకరమైన కథను వివరించడం ప్రారంభించాడు. క్విస్మత్ బేగ్ బానిస అమ్మాయికి పుట్టిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా కుమారుడు. మొఘలుల గొప్ప పూర్వీకుడి పేరు మీద క్విస్మత్ బేగ్ కి తైమూర్ షా అని పేరు పెట్టారు. చక్రవర్తి బహదూర్ షా  అతనిని మరియు అతని  తల్లిని  బాగా ఆదరించాడు  మరియు వారు సేవకులు మరియు పరిచారికలతో విలాసంగా జీవించారు. చిన్న వయస్సులో క్విస్మత్ బేగ్ బాగా చదువుకున్నాడు మరియు సాయంత్రం తన ఇంటికి సమీపంలోని దర్గాను సందర్శించేవాడు మరియు సూఫీ ఆధ్యాత్మికత మరియు దేర్విష్ అభ్యాసాలను కలిగి ఉన్నాడు.

గద్దర్(తిరుగుబాటు) ప్రారంభించినప్పుడు, క్విస్మత్ బేగ్ తల్లి సర్వం కోల్పోయింది. క్విస్మత్ బేగ్, వంటవాడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ పాకకళ నేర్చుకున్నాడు. దురదృష్టం క్విస్మత్ బేగ్ ను ఎప్పుడూ వెంటాడేది. రోగాల బారిన పడి తల్లిని, భార్యను, పిల్లలను పోగొట్టుకుని లోకంలో క్విస్మత్ బేగ్ ఏకాకి అయ్యాడు. ఢిల్లీలో నివసించడం క్విస్మత్ బేగ్ కి చాలా బాధ కలిగించింది మరియు బొంబాయికి వలస వెళ్ళాడు. అక్కడ తైమూర్ షా తన పేరును ఖీస్మత్ బేగ్గా మార్చుకున్నాడు.  విధి విలాసం,   చివరి మొఘల్ చక్రవర్తి కుమారుడు ఒక హోటల్‌లో బావర్చి (చెఫ్) అయ్యాడు.

గదర్ భారతదేశ చరిత్రలో జరిగిన ఒక భయంకర విపత్తు సంఘటన. ఇది శతాబ్దాల మొఘల్ ఆస్థాన ఆడంబరాన్ని మరియు కులీనుల సంపన్న జీవితాలను ముగించింది. ప్రభువులు సామాన్యులు అయ్యారు, యువరాజులు పేదలుగా మారారు మరియు బేగంలు బిచ్చగత్తేలుగా మారారు. 

No comments:

Post a Comment