18 November 2022

ఆఫ్రికా, మాలి లోని జెన్నాలోగల గ్రేట్ మసీదు సంవత్సరానికి ఒకసారి పునఃనిర్మించ బడుతుంది. The Great Mosque in African Mali Built Once a Year

 

ఆఫ్రికా సహారా ఎడారి లోని దక్షిణ మాలి ప్రాంతం లో ఉన్నగ్రేట్ మసీదు ఆఫ్ జెన్నా”, దాదాపు 20 మీ ఎత్తు మరియు 91 మీటర్ల పొడవు గల ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి-ఇటుకతో నిర్మించబడిన  భవనం. యునెస్కో- జెన్నాలోని  పెద్ద/గ్రాండ్ మసీదు ను రక్షితప్రాంతం గా ప్రకటించినది. జెన్నాపట్టణం యొక్క ప్రధాన భాగం గ్రేట్ మసీదు.

నైజర్ మరియు బని నదుల మధ్య గల జెన్నాపట్టణం లో మానవులు  250BC నుండి నివసించారు. జెన్నా సబ్ -సహారా ఆఫ్రికాలోని పురాతన పట్టణాలలో ఒకటిగా నిలిచింది. జెన్నాపట్టణం 13వ మరియు 18వ శతాబ్దాల మధ్య ఉప్పు మరియు బంగారం వంటి వస్తువులకు కీలకమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. వ్యాపార యాత్రికులు ఈ ప్రాంతానికి ఇస్లాంను పరిచయం చేసిన పండితులను మరియు లేఖకులను కూడా తీసుకువచ్చారు.

జెన్నాలోని  గ్రేట్ మసీదు యొక్క ప్రస్తుత భవనం 1907లో పాత మసీదు స్థలంలో నిర్మించబడినది. పాత మసీదు 19వ శతాబ్దంలో శిథిలావస్థకు చేరుకోవడంతో, కొత్తగా నిర్మించిన గ్రేట్ మసీదు ఇస్లామిక్ విద్యా  కేంద్రంగా మారినది.  

గ్రేట్ మసీదులో మూడు విలక్షణమైన మినార్లు ఉన్నాయి, వందలాది రాడియర్ తాటి చెక్కలు  (టోరాన్) మస్జిద్ యొక్క గోడల నుండి బయటకు వస్తాయి.. అత్యంత వేడిగా ఉండే రోజుల్లో కూడా గ్రేట్ మసీదు చల్లగా ఉంటుంది. 90 అంతర్గత చెక్క స్తంభాల లాటిస్,  పైకప్పు మరియు గోడలకు మద్దతు ఇస్తుంది, ఇది సూర్యుని వేడి నుండి ఇన్సులేషన్ను అందిస్తుంది.

మస్జిద్ పైకప్పు, వేసవి  కాలంలో తాజా గాలి ప్రవాహాన్ని అనుమతించే అనేక ఓపెనింగ్‌లను కలిగి ఉంది, అయితే వర్షాకాలంలో టెర్రకోట మూతలతో మూసివేయవచ్చు. మసీదు ప్రార్థనా మందిరంలో దాదాపు 3,000 మంది ఒకే సారి ప్రార్ధన/నమాజ్  చేయడానికి వీలుగా ఉంది.

జెన్నా గ్రేట్ మసీదు యొక్క గోడలు ప్రతి ఏప్రిల్‌లో జరిగే “క్రేపిసేజ్” అనే  ఉత్సవం లో   తడి మట్టితో ప్లాస్టరింగ్ చేయబడతాయి. మాలి లో వర్షాకాలానికి ముందు జెన్నా గ్రేట్ మసీదు యొక్క మట్టి గోడలకు వార్షిక పటిష్టత/ప్లాస్టరింగ్ అవసరం. ఈ ప్లాస్టరింగ్ పని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మసీదు పటిష్టత కు ఉపయోగం.  

క్రేపిసేజ్ అనేది మసీదును  గోడలు పగుళ్లు మరియు శిథిలాల నుండి రక్షించడానికి రూపొందించబడిన నిర్వహణ(maitaiance) యొక్క ముఖ్యమైన చర్య మాత్రమే కాదు, ఇది జెన్నా ముస్లిం సమాజం, విశ్వాసం మరియు వారసత్వాన్ని జరుపుకునే పండుగ కూడా.

“క్రేపిసేజ్” ఆరంభించడానికి ముందు రోజు రాత్రి, జెన్న పట్టణం మరియు సమీప గ్రామస్తులు “లా న్యూట్ డి వీల్లే లేదా ది వేకింగ్ నైట్” అని పిలువబడే గానం మరియు నృత్యాల కార్నివాల్‌లో పాల్గొంటారు. మూన్‌లైట్ లో జెన్నా  వీధులు దాదాపు 04:00 గంటలవరకు  కీర్తనలు మరియు డ్రమ్ బీట్‌లతో మోగుతాయి, ఇది క్యాలెండర్‌లోని అత్యంత ముఖ్యమైన ఈవెంట్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.

క్రేపిసేజ్ ఉత్సవం ముగిసిన తరువాత తర్వాత, జెన్న పరిసర ప్రాంతాల నుండి జట్లు జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా గ్రేట్ మసీదును తిరిగి ప్లాస్టర్ చేయడానికి పోటీపడతాయి. జెన్నాలో 80 మంది సీనియర్ మేసన్‌ల పర్యవేక్షణలో, యువకులు నిచ్చెన మెట్ల వంటి తాటి చెక్కలు /టొరాన్‌ని ఉపయోగించి తడి మట్టితో నీరు కారుతున్న వికర్ బుట్టలను మోస్తూ గోడలపై మందపాటి మట్టి ప్లాస్టరింగ్ చేయడానికి భవనం యొక్క ముందు భాగం లో ఉంటారు.  

No comments:

Post a Comment