12 November 2022

అబూ హురైరా: హదీసు వ్యాఖ్యాత (603-681) Abu Hurairah: The narrator of Hadith

 

అబూ హురైరా ( 603–681) ప్రవక్త ముహమ్మద్(స) యొక్క సహచరులలో ఒకరు మరియు సున్నీ ఇస్లాం ప్రకారం, హదీసుల యొక్క అత్యంత గౌరవనీయమైన  వ్యాఖ్యాత.

ఇమామ్ అబూ హురైరా, యెమెన్ కు చెందిన ఒక సామాన్యుడు మరియు తన కృషి ద్వారా ఇస్లామిక్ చరిత్రలో అత్యున్నత స్థానానికి  ఎదిగాడు.  పిల్లుల పట్ల అబూ హురైరా కున్న అనుబంధాన్ని సూచిస్తూ, అబూ హురైరా ను “కున్యా అబూ హురైరా”  "ఫాదర్ ఆఫ్ ది కాట్స్  " అని పిలిచేవారు.

అబు హురైరా అని పిలువబడే అబ్ద్ అల్-రహ్మాన్ ఇబ్న్ సఖర్ అల్-అజ్ది బను దాస్ తెగకు చెందినవాడు. అబు హురైరా, బహాలోని జబూర్ గ్రామంలో జన్మించాడు. అబు హురైరా తండ్రి పేరు సఖర్ మరియు తల్లి మైమూనా. అబు 7AH లో మదీనాకు వచ్చాడు.

అబూ హురైరా ప్రవక్త (స) మసీదులో ఉండి మూడు సంవత్సరాల పాటు దైవ ప్రవక్త(స) సేవకు అంకితమయ్యాడు. సుఫ్ఫాలో సభ్యుడైన అబూ హురైరా, ముఖ్య ఉద్దేశ్యం  ప్రవక్త (స) నుండి ఖురాన్ మరియు హదీసులు నేర్చుకోవడo.

అబు హురైరా సుమారు 1,000 రోజులలో ప్రవక్త(స) నుండి 5,374 హదీసులను నేర్చుకొన్నాడు. వాటిలో మొత్తం 1,034 హదీసులు ఇమామ్ బుఖారీ చేత ధృవీకరించబడ్డాయి మరియు బుఖారీ జామ్ అల్ సాహిహ్‌లో చేర్చబడ్డాయి. ఇమామ్ ముస్లిం కూడా అబూ హురైరా నుండి తన పుస్తకంలో 391 హదీసులను చేర్చారు.

అబూ హురైరాకు జ్ఞానాన్ని పొందాలని చాలా ఆసక్తి ఉండేది. అబూ హురైరా అక్షరాస్యుడు కాదు మరియు అబూ హురైరా జ్ఞానం అంతా మౌఖిక ప్రసారం మరియు కంఠస్థం మీద ఆధారపడినది. అబూ హురైరా తన జీవితమంతా అక్షరం పొల్లుపోకుండా సుమారు 5,000 కంటే ఎక్కువ హదీసులను కంఠస్థం చేసి గుర్తు పెట్టుకున్నాడు.

అబూ హురైరా తన అసాధారణ ఫోటోగ్రాఫిక్ జ్ఞాపకశక్తికి ముస్లిం పండితులచే గుర్తించబడ్డాడు. అబూ హురైరా హదీత్ అధ్యయన పండితులకు ఆదర్శప్రాయమైన రోల్ మోడల్‌.

ఒకసారి మర్వాన్ ఇబ్న్ అల్-హకం,  అబూ హురైరా యొక్క జ్ఞాపకశక్తిని పరిశీలించాలనుకున్నాడు. మర్వాన్,  అబూ హురైరాని  తనతో కూర్చోమని ఆహ్వానించాడు మరియు హదీసులు చెప్పమని అడిగాడు. ఒక లేఖకుడు తెర వెనుక కూర్చున్నాడు మరియు అబూ హురైరా ఏమి చెప్పాడో అది వ్రాయమని మర్వాన్ అతనికి చెప్పాడు. ఒక సంవత్సరం తర్వాత, మర్వాన్,  అబూ హురైరాను మళ్లీ ఆహ్వానించాడు మరియు లేఖకుడు వ్రాసిన హదీసులను చెప్పమని అడిగాడు. అబూ హురైరా ఒక్క మాట కూడా మరచిపోకుండ హదీసులను తిరిగి చెప్పాడు.

తరువాత ఖిలాఫాత్ కాలంలో అబు హురైరా,ఉలమా ఉపాధ్యాయుడిగా, గవర్నర్‌గా, సైనికుడిగా మరియు హదీస్ ఆడిటర్‌గా పనిచేశాడు.

ఖలీఫా  ఉమర్, అబూ హురైరా ను బహ్రెయిన్ గవర్నర్‌గా నియమించారు మరియు  తూర్పు అరేబియాలో ఫత్వాను రూపొందించడానికి అధికారం ఇచ్చారు. గవర్నర్ పదవిని విడిచిపెట్టిన తర్వాత, అబూ హురైరా మదీనాకు తిరిగి వచ్చి ఫతావా ( ఫత్వా) జారీ చేస్తూ ఖాదీగా (న్యాయమూర్తి) పనిచేశాడు. ఉత్మాన్ మరణం తర్వాత అబూ హురైరా ముఫ్తీగా పని చేయడం కొనసాగించాడు.

ఉమయ్యద్ శకం ప్రారంభంలో, అబూ హురైరా ఖలీఫాత్ లో ప్రచారం చేయబడిన హదీసు యొక్క ప్రామాణికతను అంచనా వేయడానికి బాధ్యత వహించాడు మరియు తరువాత మర్వాన్ పాలనలో అబూ హురైరా మదీనా గవర్నర్‌గా పనిచేశాడు.

అబూ హురైరా కొంతకాలం క్రితం తన యజమాని అయిన బుస్రా బిన్త్ గజ్వాన్ (బాస్రా అమీర్ ఉత్బా బిన్ ఘజ్వాన్ సోదరి)ని వివాహం చేసుకున్నాడు.

అబూ హురైరా చాలా భక్తిపరుడు. అబూ హురైరా 78 సంవత్సరాల వయస్సులో 781లో మరణించాడు. అబూ హురైరా ను మదీనా సమీపం లోని ‘అల్-బాకీ'లో ఖననం చేశారు.

 

హదీసు Hadith:

 అబూ హురైరా కనీసం 5,374 హదీసులు చెప్పిన ఘనత పొందాడు. అబూ బకర్, ఉమర్, ఆయిషా, ఫద్ల్ ఇబ్న్ అబ్బాస్, ఉసామా ఇబ్న్ జైద్, ఉబయ్ ఇబ్న్ కాబ్ మరియు కాబ్ అల్-అహ్బర్ నుండి ముహమ్మద్  ప్రవక్త(స) మరణం తర్వాత అబూ హురైరా హదీసులు సేకరించడం కొనసాగించాడు.

మొదటి హదీత్ పుస్తకమైన "అల్-సహీఫా అల్-సాదిఖా" రచయిత అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ ని అబూ హురైరా స్వయంగా హదీసుల విషయంలో అధిగమించాడు.

అబూ హురైరా నుండి ముహమ్మద్ ప్రవక్త (స)800 మంది సహచరులు  మరియు తబియున్ హదీసులు నేర్చుకున్నారు.  ఈ విషయాన్నీ ఇబ్న్ హజర్ మరియు అద్-దహబి ధ్రువ పరిచారు.

అబూ హురైరా, ఇబ్న్ అబ్బాస్, ఐషా, అబ్ద్ అల్లా ఇబ్న్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్న్ మసూద్ కంటే ఎక్కువ అస్నాద్ కలిగి ఉన్నాడు. హదీథ్ పండితులు హదీసు యొక్క ప్రామాణికతను అంచనా వేయడానికి అబూ హురైరా యొక్క మధబ్ మార్గదర్శకంగా తీసుకోబడింది.

 వారసత్వం మరియు ప్రభావం:

అబూ హురైరా నివేదించిన హదీసులు వైవిధ్యభరితంగా ఉంటాయి.  ఇవి హదీసులు, 'అఖిదా’, ఫిఖ్ (ఇస్లామిక్ న్యాయశాస్త్రం), ఇజ్తిహాద్, తఫ్సీర్ (ఖురాన్ వివరణ) మరియు ఇస్లామిక్ ఎస్కాటాలజీలో నైపుణ్యం కలిగిన ఇస్లామిక్ పండితులచే ఉపయోగించబడినవి.

'అఖిదా’ పై పుస్తకం “కితాబ్ అల్-ఇమాన్‌”లో  ఇబ్న్ తైమియా తౌహీద్‌ను అధ్యయనం చేయడానికి అబూ హురైరా నుండి హదీసు కథనాలను ఉపయోగించాడు.

ఇబ్న్ కతీర్ ఇస్లామిక్ ఎస్కాటాలజీకి సంబంధించిన “అల్-నిహాయా ఫి అల్-ఫితాన్ వా అల్-మలాహిమ్‌”లో అబు హురైరా యొక్క కథనాలను ఉపయోగించాడు.

అబూ హురైరా యొక్క కథనాలకు సంబంధించిన ప్రస్తావనలు అల్-తబరీ యొక్క “తఫ్సీర్ అల్-తబరీ”, ఇబ్న్ కథిర్ యొక్క “తఫ్సీర్ ఇబ్న్ కథిర్”, అల్-మహల్లి మరియు అల్-సుయుతి యొక్క సహకార తఫ్సీర్ “అల్-జలాలైన్”, అల్-ఖుర్తుబీ “తప్సిర్ అల్- అల్-ఖుర్తుబీ” లో చూడవచ్చు. ఇవన్నీ తఫ్సీర్ లేదా ఖురాన్ వివరణ యొక్క రచనలు. వారు అబూ హురైరా యొక్క ఇజ్తిహాద్ మరియు ఫతావాను కూడా తమ వనరులుగా పేర్కొన్నారు.

న్యాయ సంబంధమైన తీర్పులు లేదా ఫతావా (ఫత్వా) జారీ చేసిన ముహమ్మద్‌ ప్రవక్త(స) కొద్దిమంది సహచరులలో అబూ హురైరా  ఒకడు. ముహమ్మద్ ప్రవక్త(స)సహచరుల నుండి వచ్చిన తీర్పులు లేదా కథనాల ఆధారంగా సున్నీ మధాహిబ్ (మాధబ్, న్యాయ శాస్త్ర పాఠశాలలు) నిర్మాణాత్మకంగా రూపొందించబడినది.  

నాలుగు ప్రధాన సున్నీ మధాహిబ్‌ల పాలక న్యాయశాస్త్రం అబూ హురైరా యొక్క ఫతావా మరియు అతని అనేక కథనాలపై ఎక్కువగా ఆధారపడింది.

తకీ అల్-దిన్ అల్-సుబ్కీ తన పుస్తకం “ఫతావా అబూ హురైరా”లో అబూ హురైరా యొక్క ఫతావాను సంకలనం చేశాడు. రషీదున్ యుగంలో న్యాయశాస్త్ర తీర్పులలో పాల్గొన్న ముహమ్మద్ యొక్క ఆరు ప్రముఖ సహచరులలో అబూ హురైరా ఒకరు.  కొన్ని విషయాలపై, అబూ హురైరా యొక్క తీర్పుపై నలుగురు సున్ని మధాహిబ్‌లు ఇజ్మా (ఏకాభిప్రాయం) కలిగి ఉన్నారని నిర్ధారించారు.

 

 

 


No comments:

Post a Comment