23 November 2022

అల్-దినావారీ815—895 al-Dīnawarī815—895 ఖగోళ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు మరియు చరిత్రకారుడుastronomer, botanist, and historian

 

అబూ హనీఫా అహ్మద్ ఇబ్న్ దావూద్ దినవారి (పర్షియన్: ابوحنيفه دينوری;) ఒక పర్షియన్ ఇస్లామిక్ స్వర్ణయుగ పాలీమాత్, ఖగోళ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు, లోహశాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు చరిత్రకారుడు. దీనావారి ఆధునిక పశ్చిమ ఇరాన్‌లోని జిబాల్ ప్రాంతం లోని దీనావర్ పట్టణం, 815 లో జన్మించారు.

అల్-దినావారీ పర్షియన్ లేదా కుర్దిష్ మూలాలు మరియు అరబిక్ మూలాలకు చెందినవాడు. అల్-దినావారీ ఇరాకీ నగరాలైన బాస్రా మరియు కుఫాలో వ్యాకరణం, ఫిలాలజీ, జ్యామితి, అంకగణితం మరియు ఖగోళ శాస్త్రాలను అభ్యసించాడు మరియు సంప్రదాయవాదిగా పేరు పొందాడు.

దినవారీ అత్యంత ప్రసిద్ధ రచన “కితాబ్ అల్-నబాత్” ("బుక్ ఆఫ్ ప్లాంట్స్"). దినవారీ అరబిక్ వృక్షశాస్త్ర స్థాపకుడిగా పరిగణించబడ్డాడు.

వృక్షశాస్త్రంపై అత్యంత ప్రసిద్ధ ప్రారంభ ముస్లిం రచనలలో ఒకటైన “కితాబ్ అల్-నబాత్” ("బుక్ ఆఫ్ ప్లాంట్స్") అల్-దినావారీ అభ్యాసానికి సంబంధించిన క్రమబద్ధమైన విధానం ను  ప్రతిబింబిస్తుంది. “కితాబ్ అల్-నబాత్” ("బుక్ ఆఫ్ ప్లాంట్స్") లెక్సికోగ్రాఫికల్ పద్దతిలో, మౌఖిక మరియు వ్రాతపూర్వక అరబిక్ బొటానికల్ సంప్రదాయాలతో పాటు చాలా పర్షియన్ పదాలను కలిగి ఉంటుంది. “కితాబ్ అల్-నబాత్” ("బుక్ ఆఫ్ ప్లాంట్స్") అందమైన గద్యంలో వ్రాయబడి వృక్షశాస్త్రం లో తరతరాలుగా ప్రామాణిక రచన.

కితాబ్ అల్-నాబత్ (మొక్కల పుస్తకం) లో ఆరు సంపుటాలు ఉన్నాయి. మూడవ మరియు ఐదవ సంపుటాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయితే ఆరవ సంపుటం పాక్షికంగా తరువాతి రచనల నుండి అనులేఖనాల ఆధారంగా పునర్నిర్మించబడింది.

అల్-దినావారీ రచనలలో మిగిలి ఉన్న భాగాలలో, 637 మొక్కలు వివరించబడ్డాయి. అల్-దినావారీ మొక్కల పెరుగుదల దశలను మరియు పువ్వులు మరియు పండ్ల ఉత్పత్తిని వివరించాడు.

మొక్కల పుస్తకంలోని మొదటి భాగం ఖగోళ మరియు వాతావరణ శాస్త్ర భావనలను వివరిస్తుంది, అవి గ్రహాలు మరియు నక్షత్రరాశులు, సూర్యుడు మరియు చంద్రులు, సీజన్‌లను సూచించే చంద్ర దశలు మరియు వర్షం, అన్వా మరియు గాలులు, ఉరుములు, మెరుపులు, మంచు మరియు వరదలు వంటి వాతావరణ దృగ్విషయాలతో సహా మొక్కలకు సంబంధించినవి.

కితాబ్ అల్-నాబత్ (మొక్కల పుస్తకం) వివిధ రకాల నేలలను కూడా వివరిస్తుంది, మొక్కలకు ఏ రకాలు మరింత అనుకూలమైనవి మరియు మంచి నేల యొక్క లక్షణాలను సూచిస్తాయి.

అల్-దినావారి, అల్-షైబానీ, ఇబ్న్ అల్-అరబీ, అల్-బాహిలి మరియు ఇబ్న్ అస్-సిక్కిత్ వంటి ఇతర ప్రారంభ ముస్లిం బొటానికల్ రచనల నుండి ఉల్లేఖించారు

 గణితం లేదా ఖురాన్‌పై అల్-దినావారీ రచనలు ఏవీ భద్రపరచబడలేదు. అయినప్పటికీ, ఖగోళ శాస్త్రంపై “కితాబ్ అల్-అన్వా” రచించినాడు.

పూర్తిగా మనుగడలో ఉన్న అల్-దినావారీ ఏకైక రచన అల్-అఖ్బర్ అల్-తివాల్ ("ది లాంగ్ నేరేటివ్స్")పర్షియా దృక్కోణం లో వ్రాయబడిన పర్షియా చరిత్ర..

అల్-దినావారీ ఇతర రచనలు:

పదవ శతాబ్దపు బయోగ్రాఫికల్ ఎన్సైక్లోపీడియా, అల్-నడిమ్ యొక్క "అల్-ఫిహ్రిస్ట్", దినావారీ  యొక్క పదహారు పుస్తకాలు తెలియజేస్తుంది:

గణితం మరియు సహజ శాస్త్రాలు:

1. కితాబ్ అల్-కుసుఫ్ ("బుక్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్")

2. కితాబ్ అన్-నబాత్ యుఫాదిలుహ్ అల్-ఉలమాఫి తలిఫిహ్ (كتاب النبات يفضله العلماء في تأليفه).మొక్కల పై రాయబడిన విలువైనరచన.

3. కితాబ్ అల్-అన్వా (كتاب الانواء).

4. కితాబ్ అల్-కిబ్లా వాజ్-జావాల్ (كتاب القبلة والزوال).

"5. కితాబ్ హిసాబ్ అడ్-దూర్ (كتاب حساب الدور).

6. కితాబ్ అర్-రుద్ అలా రష్ద్ అల్-ఇష్భానీ

7. కితాబ్ అల్-బాత్ ఫి హుసా అల్-హింద్ (كتاب البحث في حسا الهند), "భారతీయ అంకగణితం యొక్క విశ్లేషణ"

8. కితాబ్ అల్-జామ్వాల్-తఫ్రిక్ (كتاب الجمع والتفريق);

9. కితాబ్ అల్-జబర్ వా-ల్-ముకాబిలా (كتاب الجبر والمقابلة), "బీజగణితం మరియు సమీకరణం"

10. కితాబ్ నువాద్ర్ అల్-జబ్ర్ (كتاب نوادرالجبر), "బీజగణితం యొక్క అరుదైన రూపాలు"

సామాజిక శాస్త్రాలు మరియు మానవీయ శాస్త్రాలు:

1. అన్సాబ్ అల్-అక్రాద్ ("కుర్దు పూర్వీకుల చరిత్ర ").

2. కితాబ్ కబీర్ (كتاب كبير) ""

3. కితాబ్ అల్-ఫషాహా (كتاب الفصاحة),

4. కితాబ్ అల్-బుల్దాన్ (كتاب البلدان), "బుక్ ఆఫ్ సిటీస్ (ప్రాంతాలు) (భూగోళశాస్త్రం)"

5. కితాబ్ అష్-షిర్ వా-షురా’ (كتاب الشعر والشعراء), "కవిత్వం మరియు కవులు"

6. కితాబ్ అల్-వషాయా (كتاب الوصايا), కమాండ్‌మెంట్స్ (విల్లు);

7. కితాబ్ మా యులాహన్ ఫిహ్ అల్అమ్మా (كتاب ما يلحن فيه العامّة), మాట్లాడటంలో ప్రజలు ఎలా తప్పు చేస్తున్నారు-వ్యాకరణం.

8. ఇస్లాహ్ అల్-మాంటిక్

9. కితాబ్ అల్-అఖ్బర్ అల్-తైవాల్ (كتاب الاخبار الطوال), "సాధారణ చరిత్ర"

అల్-దినావారీ సాధారణ చరిత్ర (అల్-అఖ్బర్ అల్-తివాల్) అనేక సార్లు సవరించబడింది మరియు ప్రచురించబడింది.

అల్-దినావారీ   ఇరాకీ పండితుడు అల్-జాహితో పోల్చబడినాడు.అల్-దినావారి 895 లో జిబాల్ ప్రాంతం లో మరణించినాడు.

 

 

No comments:

Post a Comment