11 January 2026

మహమూద్ అక్రమ్: 400 భాషలు తెలిసిన బాలుడు Mahmood Akram: the boy who knows 400 languages

 


భారతదేశం లోని తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల మహమూద్ అక్రమ్‌ సుమారు 400 భాషలను చదవగలడు మరియు వ్రాయగలడు, వాటిలో 46 భాషలను అర్థం చేసుకోగలడు. మహమూద్ అక్రమ్‌ పది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు - తమిళం, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జపనీస్ మరియు కొరియన్.

మహమూద్ అక్రమ్‌ నాలుగేళ్ల వయసులో, కొన్ని వారాల్లోనే ఆంగ్ల అక్షరమాల మరియు మొత్తం 299 తమిళ అక్షరాలను నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల వయస్సు నాటికి, దాదాపు 50 భాషలలో చదవడం, వ్రాయడం మరియు టైప్ చేయడం ప్రారంభించాడు.

మెహమూద్ అక్రమ్ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. పదేళ్ల వయసులో, మహమూద్ అక్రమ్‌ భారతదేశ జాతీయ గీతాన్ని 20 విభిన్న లిపులలో ఒక గంటలోపు రాశాడు. పన్నెండేళ్ల వయసులో, తనతో పోటీ పడుతున్న ఇతర 70 మంది భాషావేత్తల కంటే తక్కువ సమయంలో, కేవలం మూడు నిమిషాల్లోనే ఒక వాక్యాన్ని ఎక్కువ భాషల్లోకి అనువదించాడు.

తమిళనాడు వెలుపల పనిచేస్తున్నప్పుడు 16 భాషలలో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషావేత్త అయిన తండ్రికి జన్మించిన అక్రమ్, శబ్దాలు, లిపులు మరియు ధ్వనుల మధ్య పెరిగాడు. మహమూద్ అక్రమ్‌ చదవగలిగే మరియు వ్రాయగలిగే 400 భాషలలో, కేవలం 46 మాత్రమే అర్థమవుతాయి,"

మహమూద్ అక్రమ్‌ దృష్టిలో, భాష కేవలం ఒక మాధ్యమం మాత్రమే, భాష కంటే తెలియజేసే భావన మరియు మాట్లాడేవారే ముఖ్యం అని సూచించాడు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే మొదటి ఐదు భాషలను చూస్తే, వాటిలో హిందీ కూడా ఉందని మహమూద్ అక్రమ్‌ అన్నాడు.

అక్రమ్ తన సమయాన్ని వారాలుగా విభజిస్తాడు, ప్రతి వారాన్ని పూర్తిగా ఒక భాషకు కేటాయిస్తాడు. తాను అర్థం చేసుకున్న 46 భాషలన్నింటిలో కనీసం B1-స్థాయి సర్టిఫికేషన్ పొందడానికి కృషి చేస్తున్నానని, ఆపై మరిన్ని భాషలలో ప్రావీణ్యం సంపాదించాలి అని మహమూద్ అక్రమ్‌ అన్నాడు. "మనం ఒక వ్యక్తి మాతృభాషలో మాట్లాడినప్పుడు, అతని హృదయానికి చేరుకుంటాము," అని మహమూద్ అక్రమ్‌ చెప్పాడు.

అక్రమ్‌ కు భారతదేశంలో ఓపెన్ స్కూలింగ్‌కు మారాడు మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా తన మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు తరువాత ఆస్ట్రియాలో నాలుగు సంవత్సరాలు గడిపి, తనకు నచ్చిన భాషలు మరియు విషయాలను అభ్యసించి, జర్మన్ భాషలో ప్రావీణ్యం సంపాదించాడు.

ఏదైనా ఒక భాషలో ఉన్నత స్థాయి లేదా ఇంటర్మీడియట్ స్థాయికి 100 రోజుల్లో చేరుకోగలనని అక్రమ్ నమ్ముతాడు, ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న అక్రమ్ ఏకకాలంలో మూడు డిగ్రీలను అభ్యసిస్తున్నాడు: ఇంగ్లాండ్‌లోని ఓపెన్ యూనివర్సిటీ నుండి భాషాశాస్త్రం, మద్రాస్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీషులో బి.ఎ. మరియు అలగప్ప యూనివర్సిటీ నుండి యానిమేషన్‌లో డిగ్రీ.

అక్రమ్ లక్ష్యం బోధన - ముఖ్యంగా, అభ్యాసకుడి మాతృభాష ద్వారా విదేశీ భాషలను బోధించడం. అక్రం తన తండ్రి “అక్రమ్ గ్లోబల్ లాంగ్వేజెస్ ఇన్‌స్టిట్యూట్‌”లో బోధిస్తాడు.

మహమూద్ అక్రమ్ ఒక అద్భుత వ్యక్తిగా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు. పది సంవత్సరాల వయసులో, అక్రమ్ కు దక్షిణాఫ్రికా పౌరసత్వం అందించబడిందని మరియు ఆగ్నేయాసియా అంతటా పాఠశాలలు అక్రమ్ ను గెస్ట్ టీచర్/ అతిథి ఉపాధ్యాయుడిగా ఆహ్వానించాయని నివేదించబడింది.

తిరుక్కురల్‌ను బహుళ భాషలలోకి అనువదించడం, కొత్త భాషలను నేర్చుకోవడం కొనసాగించడం అక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆశయం, ఇది ప్రజల హృదయానికి నేరుగా వెళ్ళే మార్గంగా అక్రమ్  భావిస్తారు.

అక్రమ్ మనం కోసం కొన్ని అరబిక్ పదాలను అందిస్తున్నాడు: మర్హబా (హలో), శుక్రాన్ (ధన్యవాదాలు), కయ్ఫ్ అల్-హల్? (మీరు ఎలా ఉన్నారు), మరియు అల్హమ్దులిల్లాహ్ (దేవుని దయవల్ల అంతా బాగానే ఉంది).

 


No comments:

Post a Comment