11 January 2026

డాక్టర్ సల్మా మహఫూజ్ ఒక ముస్లిం సంస్కృత పండితురాలు Dr. Salma Mahfooz- A Muslim Sanskrit Scholar

 



ప్రపంచంలోనే సంస్కృతంలో పిహెచ్‌డి పొందిన మొట్టమొదటి ముస్లిం మహిళ పండితురాలు డాక్టర్ సల్మా మహఫూజ్. సంస్కృతంలో పిహెచ్‌డి సంపాదించడమే కాకుండా డాక్టర్ సల్మా మహఫూజ్ 40 సంవత్సరాలు సంస్కృతాన్ని బోధించింది.

డాక్టర్ సల్మా మహఫూజ్ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని దిబాయ్ పట్టణంలో జన్మించారు. డాక్టర్ సల్మా మహఫూజ్ తండ్రి పేరు ఇష్తియాక్ అహ్మద్ మరియు తల్లి పేరు ఎహ్సాన్ ఫాతిమా.

సల్మా మహఫూజ్ పాఠశాల రోజుల నుండే సంస్కృతంపై ఆసక్తి కలిగి ఉంది 1961లో, సల్మా మహఫూజ్ ఉన్నత పాఠశాల పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU)కి వెళ్లింది, అక్కడ సంస్కృతాన్ని తన ప్రధాన అంశంగా ఎంచుకుంది.

డాక్టర్ సల్మా మహఫూజ్ 1969లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పిహెచ్‌డి పూర్తి చేసింది. సల్మా మహఫూజ్ సంస్కృత నాటకాల్లో హీరోయిన్ల రకాలు “Sanskrit Natko me Nayika Bhed” ("Types of Heroines in Sanskrit Dramas,")  పై పరిశోధన నిర్వహించింది, సల్మా మహఫూజ్, డాక్టర్ రామ్ సురేష్ త్రిపాఠి మార్గదర్శకత్వంలో Ph.D పూర్తి చేసింది. డాక్టర్ సల్మా మహఫూజ్ సంస్కృతంలో పిహెచ్‌డి పొందిన మొదటి ముస్లిం మహిళ.

డాక్టర్ సల్మా మహఫూజ్ విద్యకు మరియు మతానికి మధ్య ఎప్పుడూ సంఘర్షణకు తావివ్వలేదు. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటిస్తూ తన కర్తవ్యాన్ని నెరవేర్చారు.

సల్మా మహఫూజ్ “సిర్ర్-ఎ-అక్బర్ వర్సెస్ ది ఉపనిషత్స్ యొక్క విమర్శనాత్మక అధ్యయనం A Critical Study of Sirr-e-Akbar vis-a-vis The Upanishads” అనే పుస్తకాన్ని రాశారు, ఇది దారా షికోహ్ చేసిన ఉపనిషత్తుల పర్షియన్ అనువాదంపై ఆధారపడి ఉంది. సల్మా మహఫూజ్ భగవద్గీతపై కూడా పరిశోధన చేశారు మరియు పుస్తకాలు ప్రచురించారు.

తన పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత, డాక్టర్ సల్మా మహఫూజ్ బిజ్నోర్‌లోని రాణి భాగ్యవతి కళాశాలలో సంస్కృతం బోధిస్తూ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

బిజ్నోర్‌లో బోధించిన తర్వాత, డాక్టర్ సల్మా మహఫూజ్ తులనాత్మక అధ్యయనం కోసం ఇరాక్‌కు వెళ్లారు, అక్కడ హిందూ మతం మరియు ఇస్లాం మధ్య సారూప్యతలపై పరిశోధన చేశారు.

ఇరాక్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, డాక్టర్ సల్మా మహఫూజ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా నియమితులయ్యారు. అక్కడ డాక్టర్ సల్మా మహఫూజ్ 40 సంవత్సరాలకు పైగా సేవలందించారు. డాక్టర్ సల్మా మహఫూజ్ ఏఎంయూలోని సంస్కృత విభాగానికి అధ్యక్షురాలిగా(ChairPerson) పదవీ విరమణ చేశారు.

డాక్టర్ సల్మా మహఫూజ్ 15 మందికి పైగా పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించారు. డాక్టర్ సల్మా మహఫూజ్ మార్గదర్శకత్వంలో, విద్యార్థులు మహాభారతం మరియు ఇతర ప్రాచీన గ్రంథాలపై పరిశోధనలు చేశారు.

డాక్టర్ సల్మా మహఫూజ్‌కు సాహిత్య మరియు విద్యా రంగంలో చేసిన సేవలకు గాను 2015లో 'అలీగఢ్ రత్న' పురస్కారం లభించింది. అలాగే, సంస్కృత సాహిత్యం మరియు ప్రాచీన భారతీయ గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, గీత వంటి వాటిపై చేసిన విస్తృత పరిశోధన మరియు ప్రచారానికి గాను 'విద్యా రత్న' పురస్కారంతో సత్కరించబడ్డారు.

ఏ మతానికి చెందిన వారైనా తమ మతాన్ని విశ్వాసపూర్వకంగా ఆచరిస్తూనే, తమకు నచ్చిన ఏ విషయం లేదా భాషనైనా ఎంచుకోవచ్చనడానికి డాక్టర్ సల్మా మహఫూజ్ ఒక సజీవ ఉదాహరణ. ఏ భాషను నేర్చుకోవడానికైనా మతం ఎప్పుడూ ఆంక్షలు విధించదు

 


No comments:

Post a Comment