13 January 2026

భారతదేశ సోషలిస్ట్ ఉద్యమాన్ని తిరిగి ఊహించుకోవడం: ఆనంద్ కుమార్‌తో సంభాషణ Reimagining India’s Socialist Movement: A Conversation with Anand Kumar

 


ఆనంద్ కుమార్ 1950లో వారణాసిలోని దేశభక్తి మరియు సోషలిస్ట్ కుటుంబంలో జన్మించారు. ఆనంద్ కుమార్ BHU, JNU మరియు చికాగో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ BHUలో 10 సంవత్సరాలు మరియు JNUలో 25 సంవత్సరాలు సోషియాలజీ బోధించారు. ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ 8 భారతీయ మరియు 6 విదేశీ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ ఇంగ్లీష్ మరియు హిందీలో అనేక ప్రచురణలు చేసారు.. ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ విద్యార్థులు-యువ రాజకీయాలు మరియు ఉపాధ్యాయ సంఘాలలో చురుకుగా ఉన్నారు. ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ BHU మరియు JNU విద్యార్థి సంఘాల అధ్యక్షుడు; BHU ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి మరియు JNU ఉపాధ్యాయ సంఘం మరియు FEDCUTA అధ్యక్షుడు, ఇండియన్ సోషియోలాజికల్ సొసైటీ అధ్యక్షుడుగా పని చేసారు..

జర్నలిస్ట్ అభిష్ కె. బోస్‌తో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ భారతదేశ సోషలిస్ట్ ఉద్యమం క్షీణత, సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో దాని ఔచిత్యం మరియు మార్కెట్ ఆధారిత ఆర్థిక శాస్త్రం మరియు పెరుగుతున్న జాతీయవాద భావాలతో సోషలిస్ట్ భావజాలాన్ని సమన్వయం చేయడానికి వినూత్న వ్యూహాల ఆవశ్యకత గురించి చర్చిoచారు..

ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు:

జర్నలిస్ట్ అభిష్ కె. బోస్: నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జెపి ఉద్యమం వంటి దిగ్గజ పోరాటాలకు నాయకత్వం వహించిన భారతదేశ సోషలిస్ట్ ఉద్యమం 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, సోషలిస్ట్ ఉద్యమ ప్రస్తుత క్షీణత శాశ్వతంగా దాని ఔచిత్యాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుందా లేదా మతతత్వం, అసమానత మరియు ప్రజాస్వామ్య విచ్చిన్నత వంటి సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి, దేశ భవిష్యత్తును రూపొందించడంలో నైతిక మరియు మేధో శక్తిగా తన పాత్రను తిరిగి పొందేందుకు తనను తాను తిరిగి ఆవిష్కరించుకోగలదా?

ప్రొఫెసర్ ఆనంద్ కుమార్: సోషలిస్ట్ ఉద్యమం మూడు భాగాలను కలిగి ఉంది - భావజాలం/విలువ వ్యవస్థ, సామాజిక ఆధారం మరియు సంస్థ మరియు కార్యక్రమ ఆధారిత సమీకరణ. భారతదేశంతో సహా ఆధునిక ప్రపంచ వ్యవస్థలో స్వేచ్ఛ, న్యాయం, గౌరవం మరియు సమానత్వ పునర్నిర్మాణం యొక్క విలువలు మరియు భావజాలం యొక్క ఔచిత్యం పెరుగుతోంది. కానీ వలసరాజ్యాల నిర్మూలన, ప్రజాస్వామ్యీకరణ మరియు అభివృద్ధి ద్వారా ప్రవేశపెట్టబడిన మార్పుల కారణంగా సామాజిక క్రమంలో మార్పు ఉంది. ఇది పెరిగిన సామాజిక చలనశీలతను మరియు ఆకాంక్షాత్మక కొత్త మధ్యతరగతి ఆవిర్భావాన్ని అనుభవించింది. ఎన్నికల ప్రజాస్వామ్యం ద్వారా ఆధిపత్య కులాల ఏకీకరణ కూడా ఉంది. సోషలిస్ట్ ఉద్యమం యొక్క పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక కొత్త కార్యక్రమాన్ని కోరుతుంది.

మహిళలు, దళితులు మరియు మైనారిటీలపై హింస, ప్రజాస్వామ్య సంస్థల విచ్చిన్నత, మతతత్వం, జాతి హింస, ఉపాధి లేని వృద్ధి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మరియు పర్యావరణ విధ్వంసం వంటి సమకాలీన సవాళ్లు, కొత్త పరిష్కారాలు లేదా సోషలిస్ట్ కార్యక్రమాలకు అవకాశం కల్పించాయి

 

అభిష్ కె. బోస్: సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క అఖిల భారత స్థాయి ఆకర్షణ క్షీణించడానికి దారితీసిన ముఖ్య అంశాలు ఏమిటి? ప్రారంభం లో జయప్రకాష్ నారాయణ్ స్థాయి వంటి వ్యక్తి ఆకర్షణ ఫలితంగా ఏర్పడిన  పార్టీ 1951లో అఖిల భారత స్థాయి లో  10.59% ఓట్లను పొందడం నుండి కొన్ని రాష్ట్రాలకు ఎందుకు దిగజారింది?

ఆనంద్ కుమార్: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మూడు ఉద్యమాలలో సోషలిస్టులు నిర్వహించిన పాత్ర కారణంగా వారి అఖిల భారత ఆకర్షణ క్షీణించింది - 1) భాషా ఉద్యమం (భారతీయ భాషల వాడకం పెరగడం మరియు ఇంగ్లీషును ఆధిపత్య భాషగా తొలగించడం) హిందీ ఆధిపత్యం మరియు హిందీ దురభిమానం ఆరోపణలు ఎదుర్కొంటున్నది, 2) కుల వ్యతిరేక ఉద్యమం – పట్టు ఉన్న దిగువ మధ్యతరగతి సోషల్ బేస్ ను social base రిజర్వేషన్ అనుకూల మరియు వ్యతిరేక సమూహాలుగా విభజించడం, 'వర్గంలో కులం మరియు కులంలో తరగతి caste in class and class in caste’,' అనే సోషలిస్ట్ లైన్‌కు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం, 3) చిన్న రాష్ట్రం మరియు రాష్ట్ర వ్యవస్థ state system వికేంద్రీకరణ. దీనిని రాజకీయ ఉన్నత వర్గాలు, పారిశ్రామిక ఉన్నత వర్గాలు మరియు అధికారులు వ్యతిరేకించారు. ఇది సోషలిస్టులు జాతీయ ఆకర్షణను కోల్పోయేలా చేసింది. ప్రాంతీయ పార్టీలకు అవకాశం కల్పించే ప్రాంతీయ చొరవలతో వారు సంబంధం కలిగి ఉన్నారు.

 

అభిష్ కె. బోస్: చైనా వంటి కమ్యూనిస్ట్ పార్టీలు మరియు దేశాలు నవ ఉదారవాద విధానాలు మరియు కార్పొరేటీకరణను ఎక్కువగా అవలంబిస్తున్నాయి, ఈ నమూనా మార్పు యొక్క సంక్లిష్టతలను పరిష్కరించడానికి సోషలిస్ట్ పార్టీలు తమ కార్యక్రమాలను ఎలా అనుసరిస్తున్నాయి మరియు సోషలిస్ట్ భావజాలం మరియు మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మధ్య ఉద్రిక్తతలను సమన్వయం చేయడానికి వారు ఏ వినూత్న వ్యూహాలను ఉపయోగిస్తున్నారు?

ఆనంద్ కుమార్: సోవియట్ యూనియన్ పతనం మరియు చైనాలో మార్కెట్ పెట్టుబడిదారీ విధానం పెరుగుదల మార్కెట్ మధ్యవర్తిత్వ ప్రపంచీకరణకు దోహదపడ్డాయి, దీనిని వాషింగ్టన్ కాన్సెన్సస్ Concensus అని కూడా పిలుస్తారు.
ఇది భారతదేశం వంటి వలసరాజ్యాల అనంతర జాతీయ-రాజ్యాలpost-colonial nationలో దేశ ప్రణాళిక మరియు అభివృద్ధి ప్రాజెక్టుల ఆకర్షణను తగ్గించింది. ఇది సోషలిస్ట్ పార్టీలను మార్కెట్ అనుకూల పొత్తులతో జతకట్టడానికి మరియు పెట్టుబడిదారీ వర్గాలకు మరియు ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి వాటి ప్రమోటర్లకు దగ్గరగా ఉండటానికి ఒత్తిడి చేసింది.

సహకార సంఘాలు మరియు స్థిరమైన అభివృద్ధి వ్యూహాలకు తగిన సాంకేతికత వంటి సోషలిస్ట్ మార్గాలను ప్రోత్సహించడానికి ఆవిష్కరణలు పూర్తిగా లేకపోవడం జరిగింది.

 

అభిష్ కె. బోస్. : సంఘ్ పరివార్ యొక్క హిందూత్వ భావజాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు మరియు కాంగ్రెస్ తమ సైద్ధాంతిక విభేదాలను సమర్థవంతంగా పక్కనపెట్టి, ఈ సవాలును ఎదుర్కోవడానికి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పరచుకోగలవా, మరియు అటువంటి కూటమి వారి సంబంధిత రాజకీయ గుర్తింపులపై ఎదురయ్యే చిక్కులు ఏమిటి?

ఆనంద్ కుమార్: పెద్ద, చిన్న పార్టీల మధ్య పొత్తులు పెద్ద పార్టీల ప్రయోజనాల ద్వారానే నిర్ణయించబడతాయి. హిందుత్వ సవాలును ఎదుర్కోవడానికి ఏకం కావడంలో సైద్ధాంతిక విభేదాలు లేవు.

 

అభిష్ కె. బోస్: భారతదేశపు సోషలిస్ట్ ఉద్యమం తన చారిత్రక వారసత్వాన్ని, సరళీకృత ఆర్థిక వ్యవస్థ మరియు పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, ముఖ్యంగా యువత యొక్క మారుతున్న ఆకాంక్షలతో ఎలా సమన్వయం చేసుకోగలదు?

.ఆనంద్ కుమార్: బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం/crony capitalism/క్రొనీ క్యాపిటలిజం పై అసంతృప్తి పెరుగుతోంది. కానీ అది ఒక ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా మారడానికి, ఉద్యోగాలు, ధరల విధానం, ఆరోగ్యం, గృహనిర్మాణం మరియు సామాజిక న్యాయం గురించి సోషలిస్ట్ వేదిక నుండి ఒక ఆచరణాత్మక కార్యక్రమం అవసరం.

 

అభిష్ కె. బోస్: భారతదేశంలో సాంప్రదాయ సోషలిస్ట్ ఉద్యమాల పతనం వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూరించడంలో ఎన్జీఓలు మరియు కమ్యూనిటీ సంస్థల వంటి ప్రత్యామ్నాయ సామాజిక క్రియాశీలత రూపాలు ఎలాంటి పాత్ర పోషించగలవు?

ఆనంద్ కుమార్: భారత ప్రజాస్వామ్యానికి క్రియాశీల పౌరసత్వం అవసరం. ఏ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికైనా ఆందోళన చెందే పౌరులే Concerned citizens వెన్నెముక. అందువల్ల, సోషలిస్ట్ ఉద్యమం పతనం వల్ల ఏర్పడిన అంతరాన్ని పూరించడానికి స్వచ్ఛంద సంఘాలను మరియు పరోపకార దృక్పథాన్ని altruistic orientation ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

 

అభిష్ కె. బోస్: బీజేపీ యొక్క హిందుత్వ భావజాల ప్రచారాన్ని రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య మార్గాల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోగలమా, లేదా దీనికి సాంస్కృతిక మరియు సామాజిక కోణాలను కూడా చేర్చే మరింత సూక్ష్మమైన nuanced విధానం అవసరమా?

ఆనంద్ కుమార్: హిందుత్వ అనేది గుర్తింపు రాజకీయాల ప్రాజెక్ట్. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధేయవాదులు చేసినట్లుగా మతం, భాష మరియు జాతి గుర్తింపును గుర్తించే సాంస్కృతిక రాజకీయాల ద్వారా దీనిని ఎదుర్కోవాలి.

 

అభిష్ కె. బోస్: బీహార్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల గమనాన్ని, ముఖ్యంగా మతతత్వం మరియు లౌకికవాదం మధ్య సమతుల్యత విషయంలో ఎలా ప్రభావితం చేశాయి, మరియు ఇది దేశ భవిష్యత్తుపై ఎలాంటి పరిణామాలను కలిగి ఉండవచ్చు?

ఆనంద్ కుమార్: బీహార్ ఎన్నికల ఫలితాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. పురుషులు మరియు మహిళలు, పేదలు మరియు అంతగా పేదలు కాని not so poor వారి ఓటింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.

 

అభిష్ కె. బోస్: కుల ఆధారిత రాజకీయాలు భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నందున, విస్తృత ఓటర్ల బేస్ ను  ఆకట్టుకునే విస్తృత అభివృద్ధి ఎజెండాలతో కుల సమీకరణాలను సమతుల్యం చేయడానికి ఆర్‌జేడీ వంటి పార్టీలు ఎలాంటి వ్యూహాలను అనుసరించవచ్చు?

ఆనంద్ కుమార్: కులం, వర్గం, లింగం మరియు జాతి అనేవి భారత రాజకీయాలను నిర్దేశించే నాలుగు అంశాలు. ఎన్నికల పోటీలో డబ్బు బలం, మీడియా బలం మరియు కండబలానికి వాటికవే ప్రాధాన్యత ఉన్నాయి. అయితే, లోహియా మరియు జయప్రకాష్‌ల సోషలిస్ట్ వారసత్వాన్ని తాము సొంతం చేసుకునే ముందు, ఆర్‌జేడీ ప్రాంతీయ రాజకీయాల సౌకర్యవంతమైన పరిధి comfort zone నుండి బయటకు రావాలి.

 

అభిష్ కె. బోస్: పెరుగుతున్న జాతీయవాద భావాలు మరియు ప్రతిపక్ష పార్టీలపై పెరుగుతున్న నిఘా నేపథ్యంలో, భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలను ఎలా పరిరక్షించగలదు మరియు అవి సమర్థవంతంగా పనిచేయడానికి ఎలా అవకాశం కల్పించగలదు?

ఆనంద్ కుమార్: భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికల సంస్కరణలే ఏకైక మార్గం. ఎన్నికల వ్యవస్థ యొక్క ఒత్తిళ్లు మరియు సంక్షేమ రాజ్య భావన  కారణంగా మన ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషించలేకపోతున్నారు. దామాషా ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టడం ఒక మంచి ఆలోచన.

 

తెలుగు అనువాదం: సల్మాన్ హైదర్ 

No comments:

Post a Comment