20 April 2014

ఇస్లాం లో స్వప్నములు లేదా కలల వివరణ

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలని కేవలం భౌతికంగా, జీవ శాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. అధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని తెలిపే దూతలు గానో చెప్పుకోవచ్చు.

స్వప్నము లేదా కలలను వివరించడం ఇస్లామిక్ సాహిత్యం లో కనిపిస్తుంధి, ఈ రంగములోఇస్లామిక్  విద్వాంసులు తగినంత కృషి చేసి కలలకు వివరణలు లేదా భాష్యం ఇచ్చినారు. కలలను గురించి, కలల వివరణ పట్ల మొదట్నుంచి ముస్లింలకు ఆసక్తి ఉంది. ఇస్లాం లో కలలను గురించి ఇయాన్ ఆర్.ఎడ్గర్ విస్తృత పరిశోధనలు చేసెను. అతని ప్రకారం ఇస్లాం చరిత్ర మరియు ముస్లింల జీవితాలలో కలలు ప్రధాన పాత్ర వహించును. ప్రవక్త (స) మరణించినతరువాత కలల ద్వారానే ముస్లింలు అల్లాహ్ సందేశాలను పొందుచున్నారు.

ముస్లింల దృష్టి లో కల అనునది ఒకరమైన ప్రకృతి అతీత భావన. ప్రవక్త(స) ప్రకారం “విశ్వాసికి వచ్చే కల నబువ్వత్ కు చెందిన నలబై ఆరు భాగాలలో ఒక భాగం అవుతుంది-సహీ బుకారి 2263. దైవ ప్రవక్త (స)ఈ విధంగా ప్రవచించినారు “మంచి కలలు (రుయా)దేవుని తరపున వస్తాయి,చెడ్డ కలలు(హుల్మ్) షైతాన్ తరుపున వస్తాయి. కనుక ఎవరికైనా కలలో ఏదైనా చెడు విషయం కనిపిస్తే మేల్కొన్న వెంటనే అతను ధూ ధూ అనిమూడు సార్లు తన ఎడమవైపు ఉమ్మి  షైతాన్ బారి నుండి దేవుని శరణు వేడుకోవాలి, అలా చేస్తే ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు.”-సహీ బుకారి 3118

ముస్లిం సమాజం కలలు,వాటి వివరణలో పశ్చిమ సమాజం కన్నా బిన్నమైన అబిప్రాయాలను కలిగిఉంది.ఇస్లాం లో “తాబిర్ లేదా తఫ్సీర్” అనే పేర్లతో కలలను వివరించడం జరిగింది  మరియు ఆధునిక ముస్లిం ల జీవితాలలో కలల వివరణ ముఖ్య స్థానాన్ని కలిగిఉంది. ఇస్లామిక్ సాహిత్యం లో మెండు గా ఉన్న కలల ప్రస్తావన పై ఆధునిక పశ్చిమ పరిశోధకులకు సరియైన అవగాహన లేదు. 1400 సంవత్సరాల ఇస్లామిక్ సాహిత్యం లో ప్రస్తావించిన కలల సిద్దాంతాలు, భావనలు, నిర్ధారిత ఫలితాలను, వాస్తవాలను ఆధునిక శాస్త్రవేత్తలు తమ గత 150 సంవత్సరాల పరిశోధనలలో నిరూపించినారు.  రాత్రి ఆఖరు భాగం లోని మూడోవ భాగం లో వచ్చే కలలు నిజమవుతాయని ముస్లింలు సాధారణంగా విశ్వసిస్తారు. ఇదే విషయాన్నిఅనగా  సాధారణ నిద్రలోని ఆఖరి భాగం లోని 3దశలో కలలు వస్తాయని ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది.

దివ్య ఖురాన్ లో కలలను వివిధ పదాల రూపం లో ప్రస్తావించడం జరిగింది. రుయా/vision (చాయా లేదా రూపు) గురించి 17:60, 37:105, 48:2 ఆయతులలో, హుల్మ్ (కల) గురించి 21:5,52:3 ఆయతులలో, మనం(నిద్ర)గురించి 37:10, బుష్రా(వార్తలు) గురించి 10:6,ఆయతులలో ప్రస్తావించడం జరిగింది.
దివ్య ఖురాన్ లోని క్రింది మూడు సురాలలో కలలను గురించిన వివరణాత్మక ప్రస్తావన కలదు:
1.    
12వ  సూరా యూసుఫ్ లో  యూసుఫ్ (Joseph) కధ మరియు కలల వివరణకు సంబంధించిన వివరణలు కలవు.
2.   37వ సూరా అస్-సాఫ్ఫాత్:  ఈ సురాలో ప్రవక్త ఇబ్రాహిం కు తన కుమారుని బలి ఇమ్మని దేవుడు (అల్లాహ్) ఇచ్చిన ఆజ్ఞ వివరాలు కలవు.

3.     8వ సూరా అల్ ఆనఫాల్ : ఈ సురాలో ప్రవక్త మహమ్మద్(స)  కు వచ్చిన ఒక కల గురించి వివరించడటమైంది.” ఆ సమయాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి, అపుడు ఓ ప్రవక్తా! అల్లాహ్ వారిని కలలో  కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే,మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు, యుద్దం విషయం లో వివాద పడి ఉండేవారు. కానీ అల్లాహ్ మిమ్మల్లి దీనినుండి రక్షించాడు”. దివ్య ఖురాన్ 8:43.  ఈ సురాలో ప్రవక్త (స) కు బద్ర్ యుద్దానికి ముందు రాత్రి వచ్చిన కల గురించి వివరించడమైనది.

లైలతుల్-మీరాజ్ (రాత్రి ప్రయాణం) కు సంబందించిన వివరాలు 17వ సూరా బనీ ఇస్రాయీల్ లో కనిపిస్తాయి.” కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి (ప్రవక్త) ఒక రాత్రి మస్జిదె హరామ్ నుండి, దూరంగా ఉన్న ఆమసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు (అల్లాహ్). ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం  చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును”–దివ్య ఖురాన్ 17:1

దివ్య ఖురాన్ లోని కలలను గురించి ప్రస్తావించిన పశ్చిమ దేశాల రచయితలు లైలతుల్-మీరాజ్ (రాత్రి ప్రయాణం) ను మహమ్మద్ ప్రవక్త (స) కు వచ్చిన కలగా వర్ణించేదరు. కానీ ముస్లింలు ఈ అద్బుద్ధతమైన రాత్రి  ప్రయాణమును (రాత్రి లోని కొంత సమయంలో జరిగినప్పటికి )కలగా గాక నిజముగా జరిగినట్లు భావించేదరు. వాస్తవానికి మహమ్మద్ ప్రవక్త (స) శరీరము మరియు ఆత్మ మక్కా నుంచి జెరూసెలెమ్ కు పయనించినట్లు ఆతర్వాత స్వర్గాన్ని దర్శించినట్లు భావిస్తారు. ప్రవక్త (స) తన ప్రయాణములో 7రకాల స్వర్గాలను దర్శించినట్లు, అక్కడ అనేక మంది ప్రవక్తలను కలసినట్లు వారితో కలసి జరిపిన ప్రార్ధనలలో నాయకత్వం  వహించినట్లు ముస్లిం లు భావిస్తారు. కాబట్టి దీనిని మనం కల అని భావించలేము!

కొంతమంది దివ్య ఖురాన్ లోని అజ్-జుమర్ సూరా లో అల్లాహ్ నిద్ర మరియు కలలో ఆత్మను దేవుడు వశం చేసుకొన్నట్లు భావిస్తారు. మరణ సమయంలో ఆత్మలను వశపరచుకొనే వాడు అల్లాహ్ యే; ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడూ వశపరచుకొంటాడు.ఆయన ఎవడి విషయంలో, మరణ నిర్ణయం అమలు చేస్తాడో, దానిని (అతడి ఆత్మను) ఆపి ఉంచుతాడు; మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు, ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి”. –దివ్య ఖురాన్ 39:42.

13వ శతాబ్ధాపు ముస్లిం విద్వాంసుడు అల్-కుర్థుబి (1214-1273) ప్రకారం నిద్రలో ఆత్మ శరీరంనుంచి వేరుపడి నపుడు  వచ్చే రూపుల(visions)వలన  మంచి  కలలు సంభవిస్తాయని, ఆత్మ శరీరంలోనికి తిరిగి రావటానికి ముందు అనగా స్థిర పడటానికి ముందు  పీడ కలలు సంభవించునని తెలిపినాడు. అనేక మంది ముస్లిం తత్వవేత్తలు కలలగురించి వివిధ సిద్దాంతాలను వివరించినారు. ఇబ్న్-అరబీ (1164-1240) గ్రీక్ తత్వశాస్త్రము, ముస్లిం మతశాస్త్రము  కలసిన మెటాఫిజికల్ పద్దతిని సూచించినాడు.

ఇస్లామిక్ చరిత్రలో గొప్ప కలల సిద్దాంతిగా ఇబ్న్-సిరిన్ (653-728) పేరుగాంచినాడు. ఇతని ప్రకారం కలలు దివ్య ఖురాన్ మరియు హదీసు గ్రంధాలలో ప్రముఖ స్థానములను ఆక్రమించినవి. ఇతడు రచించిన “తఫ్సీరుల్ అల్-కబీర్” (The Great Book of Interpretation of Dreams)  లో కలలపై 59 ఆద్యాయాలు కలవు. ఇతని ప్రకారం కల కు భాష్యం అనునది వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాలు మరియు అతని జీవన పరిస్థితులపై ఆధార పడి  ఉండును. ఇస్లామిక్ పండితుడు,తత్వ వేత్త ఇబ్న్-ఖల్దున్ ప్రకారం కలలకు వివరణ ఇవ్వడం ఒక శాస్త్రము.  తన ప్రసిద్ధ గ్రంధం మూకద్దిమహ్ (An introduction to History)లో అతడు కలలను మూడు రకాలుగా వర్గీకరణ చేసినాడు. 1. అల్లాహ్ నుంచి వచ్చే కలలు-స్పష్టమైన,దోష రహితమైన అర్థమును,విషయమును కలిగి ఉండును. 2. దైవ దూతల నుంచి వచ్చేకలలు- దృష్టాంతముగా వచ్చునవి-వీటికి వివరణ ఇవ్వ వలసి  ఉంటుంది. 3. సైతాన్ నుంచి వచ్చే కలలు- ఇవి అస్పష్టంగా ,వ్యర్ధముగా ఉండును.




14 April 2014

ఇస్లాం గురించి అపోహలు-అపార్ధాలు-నిజాలు

2014 నాటికి ప్రపంచ జనాభా 715 కోట్లు ఉంది . ఇందులో క్రైస్తవులు 31.6% ముస్లింలు 23%హిందువులు 15% బౌద్ధులు 7%ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దాదాపు  210 కోట్లమంది,ముస్లింలు 160 కోట్ల మంది , హిందువులు 100 కోట్లమంది,బౌద్దులు 37 కోట్ల మందిఉన్నారు. 2050 నాటికి  ప్రపంచ జనాభా 830 కోట్ల నుంచి 1090 కోట్ల కు చేరవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నీ దేశాలలోనూ,అన్నిఖండాలలోనూ విస్తరించి ఉన్న ముస్లింల గురించి వారి  ఆచారాలు,అలవాట్లు,సాంప్రదాయాలను గురించి అనేక దురభిప్రాయాలు/అపోహలు/అపార్ధాలు/అపనమ్మకాలు  సమాజం లో  ఉన్నాయి.
ఈ మద్య పశ్చిమ దేశాలకు సంబందించిన ఒక సాoప్రదాయకవాది మాట్లాడుతూ ప్రపంచ ముస్లింలలో పది శాతం మంది తీవ్రవాదులే అన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం,అనాలోచిత ప్రకటన! ఒక వేళ ముస్లింలలో 10% మండి తీవ్రవాదులు అయితే, ప్రపంచవ్యాప్తం గా  వారి జనాభా దాదాపు 16 కోట్లు ఉంటుంది? ఇంతమంది తీవ్రవాదులను ప్రపంచం
భరించగలుగుతుందా! ఈ లాంటి భాద్యత రహిత,అవాస్తవ ప్రకటనలను అందరూ ఖండించాలి. అసలు తీవ్ర వాదానికి మతంతో సంబంధంలేదు. ఏమతం తీవ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఇస్లాం అనగా శాంతి అని అర్ధం. శాంతి, కరుణా,పరమత సహనంలను ప్రోత్సహించేదే ఇస్లాం.
ఇస్లాం పై గల అపోహలు –వాటి కి వివరణలు
ఒక అపోహ ముస్లిం స్త్రీలందరు బుర్ఖా (VEIL)/హిజాబ్  ధరిస్తారు.
 పశ్చిమ దేశాల వారికి  ముస్లిం స్త్రీ అనగానే భూర్ఖా ధరించిన స్త్రీ గుర్తుకు వస్తుంది. ఇస్లాం లో భూరఖా ధారణ  తప్పనిసరి కాదు అది ఒక సంప్రధాయము/అలవాటు/ఆచారం   మాత్రమే.అది ప్రాంతాన్నిబట్టి,పరిపాలన బట్టి ఉంటుంది.  ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారఖా ధారణను తప్పని సరి చేశాయి కానీ ప్రపంచ ముస్లిం జనాభాలో ఈ దేశాల ముస్లిం జనాభా 5% మాత్రమే.చాలా ముస్లిం దేశాలలో భూరఖా దరించే వారి కన్నా దరించని వారే ఎక్కువ. ఈ మద్య ఫ్రాన్స్ లో భూరఖా ను నిషేదించినట్లు వార్తలు వచ్చాయి నిజానికి ఫ్రాన్స్ లో ముస్లిం జనాభా 37 లక్షల మంది ఉండగా వారిలో భూరఖా దరించేవారు ఫ్రెంచ్ పోలీసుల లెక్కల ప్రకారం 367 మాత్రమే .బెల్జియం లో 5లక్షల మండి ముస్లింలు ఉండగా వారిలో కొన్ని డజన్ల మంది మాత్రమే భూరఖా దరిస్తారు. అలాగే భారత దేశం లోని/భారత ఉపఖండం లోని  స్త్రీలలో అధికులు మతం తో సంబంధం లేకుండా  తలపై కొంగు కప్పు కొంటారు. అది అక్కడి ఆచారం. ఇంకొక విషయం ప్రపంచం లో ముస్లింలు అధికంగా ఉన్న 5 దేశాలలో 4 దేశాలలో స్త్రీలు దేశాద్యక్షురాలు/ప్రధాని పదవిని అదిష్టించినారు. (ఇండోనేషియా,పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ,కొసోవో,కిర్గిస్థాన్, సెనెగల్ )
ఇంకొక అపోహ అమెరికన్లు మొదటి నుంచి ముస్లింలను ద్వేషిస్తారు.
 ఇది ఒక తప్పుడు అబిప్రాయం,అవాస్తవము. వాస్తవానికి అమెరికా మొదటినుంచి ఇస్లాం ను ఆదరించినది. అమెరికా అద్యక్షుడు ఐనా థామస్ జఫర్సన్ స్వయంగా అరబ్బీ నేర్చుకొని దివ్య ఖురాన్ చదివే వాడు. వైట్ హౌస్ లో రమాదాన్ ఇఫ్త్తార్ విందు ఇచ్చినాడు. జఫర్సన్ ప్రపంచంలోని అన్నీ మతాల పండుగలను ఆదరించేవాడు. జాన్ ఆడం ప్రవక్త మహమ్మద్ (స) ను “గొప్ప సత్యాన్వేషకునిగా” భావించాడు. క్రైస్తవభిమాని ఐనా బెంజమిన్ రూష్ బైబిల్ తో పాటు కన్ఫిషియస్,మహమ్మద్ ప్రవక్త భోదనలను యువకులు/విద్యార్ధులు  అద్యయనం చేయాలని అనేవాడు.జార్జ్ వాషింగ్టన్ మౌంట్ వెర్నోన్ లో తనతో కలసి పనిచేయమని ముస్లింలను స్వయంగా ఆహ్వానించినాడు. అమెరికా అంతర్యుద్ధం లో సలీం పూర్ లాంటి అనేకమంది ముస్లింలు పాల్గొన్నారు. 1777 లో అమెరికా స్వాతంత్రం పొందినప్పుడు దానిని మొదట గుర్తించినది మొరాకో సుల్తాన్. 1797 ట్రిపోలి సంధిలో అమెరికా తాను ముస్లింల చట్టాలు,మతం, శాంతి కి వ్యతిరేకం కాదని స్పష్టం చేసినది.
ఇంకొక అపోహ ముస్లిం లు అనగా అరబ్బులు, ముస్లింలు అధికం గా మద్య ప్రాచ్యం(middle east) లో నివశిస్తారు.
ఇది నిజం కాదు. ప్రపంచ ముస్లిం జనాభాలో కేవలం 20% మంది మాత్రమే అరబ్ లేదా నార్త్ ఆఫ్రికా లో నివసిస్తారు. ప్రపంచంలోని ముస్లిం లలో 62% మంది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉన్నారు. ఇండోనేషియా లో 20 కోట్ల మంధి, భారత ఉపఖండం లో 50 కోట్లకు పైగా ముస్లింలు నివసిస్తున్నారు. పైగా అరబ్ దేశాల జనాభాలో 10% మంది అరబ్ క్రైస్తవులు కూడా ఉన్నారు .
ఇంకొక అపోహ ఇస్లాం కత్తి పై (బలవంతంగా/హింస ద్వారా)వ్యాప్తి చెందినది.
ఇది నిజం కాదు. క్రైస్తవ మతం  రోమ్ సామ్రాజ్యం లో అధికార మతం గా రూపొందటానికి 400 సంవత్సరాలు పట్టింది. కానీ ఇస్లాం కేవలం 100 సంవత్సరాలలోపే మద్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా లో విస్తరించినది. కత్తి తో అనగా బలం తో ఇంత విశాల భూభాగం లో విస్తరించడం సాద్యమగునా! పర్షియాను జయించడం ప్రాచీన రోమన్లకు సాద్యంకాలేదు, కానీ కేవలం 100 సంవత్సరాల లోపే పర్షియా ఎటువంటి యుద్దం తో సంబంధంలేకుండా ఇస్లాం కు పాదాక్రాంతం అయినది.
క్రైస్తవులు క్రుసేడ్ యుద్దలలో అమానవీయం గా ప్రవర్తించేవారు. అనేక లక్షల సాధారణ పౌరులను, స్త్రీలను -పిల్లలను కరుణ,జాలి  లేకుండా సంహరించేవారు. కానీ ఇస్లాం ఎల్లప్పుడు అమానవీయ మారణ కాండకు పాల్పడలేదు. నాగరిక యుద్ద నియమాలను పాటించేది.ముస్లింలు పరమత సహనం పాటించినారు.
మహమ్మద్ ప్రవక్త (స) మానవీయ,పురోగాత్మక  యుద్ద నీతిని /నియమాలను  ని రూపొంధించినారు.
 ఇస్లాం ప్రకారం
·       స్త్రీలను,పిల్లలను, అమాయకులను సంహరించరాదు- శాంతియుతం గా ప్రవర్తించే,నిరాయుధులు ఐనా ఇతర మతాల సన్యాసులను,మత పెద్దలను,మత నాయకులను యుద్దం లో సంహరించరాదు.
·       పశు,పక్ష్యాదులను అకారణముగా సంహరించరాదు.
·       వృక్షాలను,తోటలను నాశనము చేయరాదు.
·       మంచి నీటి భావులను,సెలయేరులను, నీటి ప్రవాహాలను కలుషితం చేయరాదు.
క్రుసేడ్ యుద్దాలలో విజయం పొందిన క్రైస్తవ సేనలు ఓడిన ముస్లిం సైనికుల తలలు నరకగా,  గెల్చిన ముస్లింలు ఓడి బందీలు  ఐనా  క్రైస్తవ సైనికులకు అన్నపానీయాలు ప్రసాదించినారు.
మద్య యుగాలలో క్రైస్తవులు సాగించిన హింసాకాండ, క్రుసేడ్ లలో వారి యుద్దనీతి/నియమాలను గమనించిన శాంతి కి ,మానవీయ,పురోగామ  యుద్ద నియమాలకు ప్రతినిధులమని చెప్పు కొనే ఆధునిక పశ్చిమ దేశాల వారు  సిగ్గు పడ వలసి ఉంటుంది. ముస్లింలు ఎల్లప్పుడు విద్వ౦సానికి పాల్పడలేదు, పెద్దపెద్ద భవంతులను, కట్టడాలను నిర్మించి వాస్తు సంపదకు, వాస్తు కళకు ప్రతినిధులుగా నిలిచారు.
మరొక అపోహ ఇస్లాం శాస్త్రీయ/అధునాతన భావాలను ప్రోత్సహించదు,వెనుకబడిన మతము.
ఈ భావన కూడా నిజం కాదు. ఇస్లాం శాస్త్రీయతను, శాస్త్ర విజ్ఞానాన్నిఅధునాతన భావాలను  ప్రోత్సహించింది. దివ్య ఖురాన్ లో విశ్వవతరణ,మానవ పరిణామాక్రమం గురించిన ప్రస్తావనలు కలవు,వాటిని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆమోదించుచున్నారు. అసలు ఇస్లాం లేకుండా గా గణితము,సైన్సు అబివృద్ధి చెందివికాదు. ఇస్లాం చరిత్రలో 7-12 శతాబ్దాలు స్వర్ణ యుగం గా పేర్కొనవచ్చును. ఈ కాలం లో మానవ మెదస్సు వికసించినది. అల్గిబ్రా, భూగోళశాస్త్రము,కళలు,సారస్వతము, ఫీలాసఫీ, ఆర్ట్స్,ఆర్కిటెక్చర్, మెడిసన్, ఆరోగ్యం,రసాయనిక శాస్త్రం  పట్టణాభివృద్ధి,సుపరిపాలన  మొదలగు అనేక రంగాలలో ముస్లిం వైజ్ఞానికులు ప్రపంచానికి సేవలు చేశారు. శాస్త్ర-విజ్ఞానాన్ని ముందుకు తీసుకు వెళ్లారు.ముస్లిం లు తాము జయించిన ప్రాంతాలలో విద్యాలయాలు,గ్రంధాలయాలు, ప్రజోపయోగమైన పనులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినారు. వారి నుంచే పడమటి దేశాల వారు విజ్ఞానాన్ని గ్రహించి ఆ తరువాత అబివృద్ధి చేశారు. ఇది చారిత్రిక వాస్తవము.






1 April 2014

ఎన్నికల వేళ భారత ప్రజాస్వామ్యం లో మతతత్వ-సెక్యులర్ శక్తుల మద్య చర్చ/పోరాటం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ప్రజాస్వామ్యం లో సేక్యులర్ -మతతత్వ శక్తుల మద్య చర్చపోరాటం  ప్రారంభము అయినది. వామపక్షాలు,ప్రాంతీయ పార్టీలు,కాంగ్రెస్స్ లాంటి పక్షాలు మతతత్వ శక్తులను దూరంగా పెట్టమని, దేశ సెక్యులర్ లక్షణాన్ని కాపాడమని వోటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోకవైపు బి‌జే‌పి, సంఘ పరివార్ ముస్లింల బుజ్జగింపును ఆపమని,వోట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడవద్దని, అందరి అబివృద్ధి, అందరికీ విద్య,అందరికీ ఉపాధి పై దృష్టి పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాయి. అందరికీ న్యాయం, కొoదరికి బుజ్జగింపు వద్దు,లేదా “సబ్ కా సాత్-సబ్ కా వికాస్”అనే నినాదాలను ఇస్తున్నాయి.
సచార్ నివేదిక వెలుబడిన తరువాత ముస్లింలు దేశ ఆర్ధిక,విద్యా రంగాలలో వెనుకబడిఉన్నారని  కొన్ని సంధార్భాలలో దళితులకన్నా ముస్లింలు అనేక రంగాలలో వెనుకబడిఉన్నారన్న వాస్తవము ముందుకు వచ్చినది. దీనిని సమర్దించే అనేక గణాంకాలు కూడా వెలుబడినవి. ఇలాంటి పరిస్థితులలో ముస్లింలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని వారిని ఓ‌బి‌సి క్యాటగిరి లో చేర్చి రిజర్వేషన్లను కల్పించాలనే(అవసరమైన  మతపరమైన రిజర్వేషన్లను కల్పించిఐనసరే) డిమాండ్ బలపడింది.రాజస్తాన్ లోని జాట్లను,రాజపుత్రలను ఓ‌బి‌సి లుగామరియు గుజ్జర్లనుఎస్‌టి లుగా పరిగణించాలనే డిమాండ్ బలంగా ఉన్నప్పుడూ దేశ జనాభా లో 15% ఉన్న ముస్లింలకు దేశ సంపదలో వారికి రావలసిన భాగాన్ని(రిజర్వేషన్లను)  నిరాకరించడం అవివేకం అవుతుంది.  ఒకవేళ మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించని యెడల సామాజిక పరిస్థితుల దృష్ట్యా ముస్లింలకు ప్రత్యేక అవకాశాలను కల్పించవలసిన అవసరంఎంతైనా ఉంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ న్యాయం కన్నా సామాజిక న్యాయాన్ని కూడా లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది.
మెరిట్,సమర్ధత, సమాన అవకాశాల సాధన కొరకే రిజర్వేషన్లను 50% కు పరిమితం చేయడం జరిగింది అంతే కానీ అంతకన్నా సహేతుకమైన భావన వేరే ఏమీలేదు.అదేవిధంగా ముస్లింలకే కాదు, ఎస్‌సి/ఎస్‌టి/ఓ‌బి‌సి లకు ప్రత్యేక అవకాశాలు వోట్ బ్యాంక్ రాజకీయాలకు మూలమన్న వాదన మొదటినుంచి ఉంది.  ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడం మైనారిటీ లను బుజ్జగించడం అని ,ఎస్‌సి/ఎస్‌టి/ఓ‌బి‌సి లకు రిజర్వేషన్లను కల్పించడం కుల తత్వాన్ని పెంచుతుందని కొందరి భావన.
రిజర్వేషన్లు సమాజం లో విభజనకు కాక , ముందుగానే విభజింపబడిన సమాజంలోని కొన్ని వర్గాలకు రక్షణ కల్పించటానికి తోడ్పడును. ముస్లింలకు,దళితులకు రేజర్వేషన్లు కల్పించడం వోట్ బ్యాంక్ రాజకీయం అనడం  సమాజం లోని ఉన్నత వర్గాలవారు వ్యాప్తి చేస్తున్న ఒక నిరాధారభావన మాత్రమే. నిజానికి ఉన్నత కులాలు,వర్గాలవారే వోట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. లేని ఎడల బి‌జే‌పి పట్టణాలలోని ఉన్నత కులాల హిందువులలో ఏవిధంగా తన పట్టును సాధించగలుగు తుంది? మీరు గమనించిన ఉన్నత కులాల వారే తమ వొట్లను మూకుమ్ముడిగా  ఒకే అబ్యర్ధి కి/ఒకే పార్టీ కి  వేయటం జరుగుతుంది
సెక్యులర్-మతతత్వ శక్తుల మద్య వివాదం మనదేశానికే కాదు ఎల్లలను దాటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినది. యూరప్ లోని ఒక దేశం లో నివసించే బిన్న జాతి/సంస్కృతి కల ప్రజలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీ జాతి/సంస్కతి  పట్ల విధేయతను, మెజారిటీ సంస్కృతిని అలవర్చుకోవలసిఉంటుంధి. క్రమంగా యూరప్  బిన్న సంస్కృతుల మద్య చర్చలను ప్రోత్సహించటానికి బహుళ సంస్కృతి విధానం(multiculturalism) నుంచి బహుత్వం (pluralism) కు మారుతుంది. అదేవిదంగా భారత దేశం లో కూడా ముఖ్యం గా మత సంబంధమైన అల్పసంఖ్యాకులతో (ముస్లింలతో )చర్చలకు అనకూల వాతావరణము ఏర్పరచవలసి ఉంటుంది. వారి భావనలను ఆలకించవలసి ఉంటుంది.ముస్లింల సమస్యలతో పాటు సమాజం లోని బిన్న వర్గాల సమస్యలను మెజారిటీ వర్గం ఆలకించవలసి ఉంటుంది.
క్రమంగా భారత దేశంలోని మతశక్తులు తమ రూపురేఖలను మార్చుకొంటున్నాయి.కులతత్వం భాగా పెరిగిపోతుంది,కులము ఒక నిచ్చెన లాగా ఉంది పైన పీడితుడు క్రింద పీడితులు ఉంటున్నారు. కులతత్వం బాగా వృద్ధిచెంది నిచ్చెన లోని  కింద్రి మెట్ల పై ఉన్న పీడితులను ఇంకా పీడించడము జరుగుతుంది.ఆగ్ర కులాలవారు దళితులను అవకాశ వాదులుగాను ముస్లింలను ఇతరులుగా,బయటవారుగా,తీవ్రవాదులుగా  చిత్రీకరించడము జరుగు తుంది. బహాజన సమాజము నిర్మించడంలో విఫలము చెందడం భారత దేశ సెక్యులర్ తత్వానికి ఒక అడ్డంకి గా తయారు అయినది.ముస్లింలు కోరుకొనే వాంఛించే సమ న్యాయం అనే భావనను తిరిగి వారిపైకే ప్రయోగించి అందరి అబివృద్ధి, అందరికీ విద్య,అందరికీ ఉపాధి,అందరికీ న్యాయం, “సబ్ కా సాత్-సబ్ కా వికాస్”అనే నినాదాలను ఇస్తున్నారు. దీనిని లౌకిక శక్తులు గమనించాలి,జాగ్రత పడాలి.


























ప్రపంచాన్ని అబ్బురపరచిన 20 ముస్లిం ఆవిష్కరణలు


       ఆధునిక ప్రపంచ చరిత్రల్లో ముస్లిం యుగoను  ఒక ముఖ్యమైన ఘట్టం గా పేర్కొన వచ్చును.అరబ్బులు మొదటి నుంచి వ్యాపార వేత్తలు. మక్కా ప్రపంచ వాణిజ్య పటం లో కీలకమైన స్థానం లో ఉంది,  క్రీ.స.570 లో మక్కా లో  జరిగిన మహమ్మద్ ప్రవక్త (స) జననం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుత సంఘటన.అది ప్రపంచ గతినే మార్చివేసింధి.  క్రీ.స. 630 నాటికి మక్కా ముస్లింల వశం అయినది. 631 నాటికి సంపూర్ణ అరేబియా ముస్లింల పాదాక్రాంతం అయినది.

8నుంచి 13 శతాబ్ధాల మద్య కాలం లో  ముస్లిం సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా, మద్య ప్రాచ్యం, మద్య ఆసియా,స్పెయిన్ నుంచి చైనా సరిహద్దులవరకు విస్తరించి. ఒక నూతన  ముస్లిం ప్రపంచాన్ని ఏర్పడినది.. అరబ్బీ ముస్లిం సామ్రాజ్య అధికార భాష అయినది. వర్తకము,వాణిజ్యము,దౌత్య సంబంధాలు, విజ్ఞాన శాస్త్రాలు అన్నీ అరబ్బీబాష  లోనే నిర్వహించబడేవి. బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం )  గా బాగ్దాద్ విరాజిల్లినది., డెమాస్కుస్,అలెక్సాండ్రీయ,ఫేజ్,కార్దోభా,పాలేర్మో,బస్రా  ముస్లిం విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లినవి.

           పాశ్చాత్య  పండితుడు విల్ డూరంట్  అబిప్రాయం లో 700-1200 వరకు  ఐదు శతాబ్దాల పాటు శాస్త్ర విజ్ఞానము,టెక్నాలజీ, తత్వశాస్త్రం, సాహిత్యము,సుపరిపాలన,వంటి విషయాలలో ఇస్లాం ప్రపంచాన్నిఎలింది.

సుమారు 500 సంవత్సరాల పాటు ప్రపంచ చరిత్ర లో ముస్లిం యుగం సువర్ణాక్షరాలతో లిఖించబడినది . ఈ కాలంలోనే శాస్త్ర విజ్ఞాన రంగములో అనేక నూతన ఆవిష్కరణలు సాధించబడి శాస్త్ర విజ్ఞానము సామాన్యులకు అందుబాటులోనికి వచ్చినది. నిజ జీవితం లో మనము ఉపయోగించే అనేక వస్తువులను ఉదా: కాఫీ నుంచి చెక్కుల వరకు, మూడు రకాలతో కూడిన భోజనం(సూప్+మాంసం+ఫలం)(Three Course Meal) మొదలగు వాటినన్నింటిని కనుగొన్నఘనత ముస్లింలకు లబించును ఈ కాలంలో ముస్లింలచే ఆవిష్కరించబడి ప్రపంచాన్ని అబ్బురపరచిన కొన్ని ఆవిష్కరణలను పరిశీలిద్దాము.

1.కాఫీ ని కనుగొనుట :
ఖాలిద్ అనే అరబ్ దక్షిణ యుధోపియా లోని  కుఫా ప్రాంతం లో  తన గొర్రెలను మేపుతున్నప్పుడు అవి కొన్ని రకాల బెర్రిలు లాంటి పళ్ళ ను తిన్నతరువాత ఉత్సాహం గా ఉండటం గమనించినాడు. ఆ బెర్రి పళ్లను వేడి నీటి లో బాగా మరిగించినప్పుడు తయారైన ద్రవమే కాఫీ. మెల్లగా కాఫీ గింజలు యుధోపియా నుంచి యెమన్ చేరినవి. అక్కడ వాటిని సూఫీ సన్యాసులు ఎక్కువుగా వాడే వారు..15వ శతాబ్ధ అంతానికి కాఫీ మక్కా,,టర్కీ లగుండా ప్రయాణించి1645 నాటికి  వెనిస్  చేరింది. 1650 లో ఇంగ్లాండ్ రాజధాని లండన్  లోని లొంబర్డ్ వీధిలో మొదటి “కాఫీ హౌస్” ను “పస్కుయ రోసీ” అనే టర్కీ వ్యక్తి ప్రారంబించినాడు. కాఫీ అనే ఇంగ్లిష్ పదం, అరబిక్ లోని కహ్వ,టర్కిష్ లోని  కఃవే,ఇటాలియన్ లోని కఫ్ఫే పదాలనుంచి పుట్టింది.
2. కెమెరాను  కనుగొనుట :
కనుల నుంచి బయటకు ప్రసరించే కిరణాల వలన మనము చూడగలుగు తున్నామని ప్రాచీన గ్రీకులు నమ్మారు. కానీ వెలుతురు కంటి నుండి బయటకు ప్రసరించడం కాదు  కంటిలోనికి ప్రవేశించుట వలన మనము చూడగలుగుతున్నామని శాస్త్రియము గా నిరూపించిన ఘనత 10వ శతాబ్ధాపు గణిత వేత్త,ఖగోళ పరిశోధకుడు, బౌతీక శాస్త్ర వేత్త ఇబ్న్-అల్-హైతమ్ కు దక్కుతుంది. మూసిన కిటికీ రెక్కలలోని చిన్న రంద్రము గుండా కాంతి లోనికి ప్రవేశించుట చూసిన  ఇబ్న్-అల్-హైతమ్ దాని ప్రేరణతో  మొదటి పిన్-హోల్ కెమెరాను తయారు చేసినాడు.  డార్క్ రూమ్ ను (అరబ్బీ పదం కమరా అనగా చీకటి గది అని అర్థం)  తయారు చేసినది కూడా ఇతనే, ఇతని కాలం లోనే బౌతిక శాస్త్రం తాత్విక దృక్పదంనుంచి పరిశోదనా  దృక్పధం వైపునకు మరలింది,
3.చదరంగం:
చదరంగం ను కనుగొనినది మొదట భారతీయులే కానీ దానిని ప్రస్తుత రూపం లో అబివృద్ధి చేసినది పర్షియా లో. ఆతరువాత మూర్ల(moors) ద్వారా స్పెయిన్ కు అక్కడనుండి జపాన్ వరకు వ్యాపించినది. రూక్ అనే పదం ఫార్శి పదం రూఖ్ నుంచి అనగా రధం నుంచి ఆవిర్భవించినది.
4. ఎగిరే యంత్రం-విమాన ఆవిష్కారం
రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయటానికి వేయి సంవత్సరాల పూర్వం, ముస్లిం కవి, ఖగోళ వేత్త,సంగీతకారుడు మరియు ఇంజనీర్ ఐనా అబ్బాస్-ఇబ్న్-ఫిర్నాస్ ఎగిరే యంత్రాన్ని కనుగొనటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 852 అతను వదులైన గుడ్డ తో చేయబడిన చెక్కను కట్టుకొని కర్దోబా పెద్దమసీదు మినారు నుండి క్రిందకు దూకినాడు. పక్షి వలే ప్రయాణించాలనుకొన్నాడు. కానీ ప్రయత్నం సఫలం కాలేదు. క్రిందకు దూకినప్పుడు వదులైన గుడ్డ పారాచూట్ లాగా పనిచేసినది స్వల్ప దెబ్బలతో బయటపడినాడు.875 లో 70 ఏళ్ల వయస్సులో సిల్క్ వస్త్రాలలతో కూడిన మెషీన్ ,పక్షి ఈకలు కట్టుకొని కొండ నుంచి క్రిందకు దూకినాడు. 10 నిమిషాల పాటు కొంతదూరం గాలిలో ప్రయాణించి  క్రింద పడినాడు. తను వాడిన మెషీన్ కు తోక లేనందువలన పడటం జరిగిందని నిర్ధారించాడు.  ప్రస్తుత బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నకు  చంద్రునిలోని ఒక బిలం (crater) నకు అతని గౌరవార్ధం అతని పేరు పెట్టడం జరిగింది.    

5.సోప్ (సబ్బు)/షాంపూ లను  తయారుచేయుట :

వజూ చేయుట, స్నానము చేయుట ముస్లిం లకు తప్పనిసరి.అరబ్బులు విజిటబుల్ అయిల్.సోడియం హైడ్రాక్సైడ్ మరియు సుగంధభరిత నూనెలను కలిపి సబ్బు/షాంపూ తయారు చేసేవారు. యూరప్ వాసులకు స్నానం చేయుట తెలియదు. క్రూసేడ్లు జరిగిన కాలంలో క్రైస్తవులు,  ముస్లింలనుండి సబ్బు/షాంపూ చేయటం నేర్చుకొన్నారు. ఇంగ్లాండ్ కు షాంపూను పరిచయం చేసింది ఒక ముస్లిం. అతను “మహమూద్ ఇండియన్ వాపర్ బాత్స్” అనే పేరుతో 1759 లో బ్రైటన్ సముద్రతీరంలో షాప్ ప్రారంభం చేసినాడు . అతను king జార్జ్ IV,మరియు కింగ్ విలియం IV  కు షాంపూ సర్జన్ గా నియమింప బడినాడు.  

6.ఆధునిక రసాయనిక శాస్త్రం
ఆధునిక రసాయన శాస్త్ర పితామహునిగా పిలవబడే జాబిర్-ఇబ్న్ –హయ్యన్ క్రీస్తు శకం 800 లో ద్రవాలను వేరుచేయు డిస్టిలేషన్ ప్రక్రియను కనుగొన్నాడు. ఆధునిక రసాయనిక ప్రయోగ శాలలలో వాడే అనేక పరికరాలను,సల్ఫురిక్,నైట్రిక్ ఆసిడ్ లను కనుగొన్నాడు. రోజ్ వాటర్, ఇతర సుగంధ ద్రవాలను కనుగొన్నాడు. 
 7.మెకానికల్ యంత్రాల ఆవిష్కరణ.
అల్-జజరి అనే పేరుగల ముస్లిం ఇంజనీర్ ఇరిగేషన్ కు అవసరమైన నీటిని తోడి పోసే యంత్రాన్ని కనుగొన్నాడు. 1206 అతను మెకానికల్ యంత్రాలపైనా రాసిన పుస్తకం లో  అనేక మెకానికల్ యంత్రాల  గురించిన వివరాలు కలవు. వాల్వులు,పిస్టన్స్,మెకానికల్ క్లాక్స్, కాంబినేషన్ లాక్ ను కనుగొన్నాడు. రోబోటిక్స్ పితామహునిగా పేరుగాంచినాడు.
 8.క్విల్ట్ ల (బొంతల ) తయారీ.
క్విల్ట్ లను తెలుగులో బొంతలు అని పిలిచేదరు. రెండు దుప్పట్ల మద్య దూది లేదా పాత గుడ్డలను (insulating material) ఉంచి కుడతారు, క్రూసేడ్ యుద్ధాలలో ముస్లిం సైనికులు వీటిని శరీరానికి కవచా లుగా వాడేవారు. క్రైస్తవులు బరువుతో కూడిన ఇనప కవచాలు వాడేవారు. క్రైస్తవులు తక్కువ బరువు తో ఎక్కువ రక్షణ ఇచ్చే క్విల్ట్ ల తయారిని ముస్లింల వద్ద నెర్చుకొని బ్రిటన్,హాలెండ్ లోని చలి వాతావరణాన్ని ఎదుర్కోవటానికి వాడేవారు.

9. ఆర్చిటెక్చర్
యూరోపియన్ లు తమ గోతిక్ చర్చల నిర్మాణం లో ఉపయోగించిన పాయింటెడ్ ఆర్చ్ ముస్లింఆర్కిటెక్చర్ నుండి గ్రహించినారు. అదేవిధంగా రిబ్బెడ్ వాల్టింగ్,రోజ్ విండోస్, డోమ్ బిల్డింగ్ నిర్మాణాలను ముస్లింలనుండి గ్రహించారు. యూరోపియన్ కాజీల్ లు ముస్లిం నిర్మాణాలను అనుకరించినవి, 5వ హెన్రి కాజీల్ ను ఆర్కిటెక్ట్ చేసినది ఒక ముస్లిం.

10.సర్జికల్ పనిముట్ల తయారీ.
ఆధునిక కాలంలో సర్జరీ లో ఉపయోగించే అనేక పరికరాలను అనగా స్కాల్పెల్,బోన్ సాస్,ఫోర్సెప్స్,ఫైన్ సీజర్స్, కంటి సర్జరీ లో ఉపయోగించే పరికరాలను మొదలగు దాదాపు 200 పరికరాలను  కనుగొన్నది 10వ శతాబ్ధాపు ముస్లిం సర్జన్ అల్-జఃరవి.  గాయాలకు కుట్లు వేయడానికి,కాప్సూల్ తయారుచేయటానికి  ఉపయోగ పడే నరము తో చేసిన తీగ (catgut) ను కనుగొన్నాడు.బ్లడ్ సర్క్యులేషన్ ను విలియం హార్వే కనుగొనటానికి 300 సంవత్సరాల పూర్వమే  ఇబ్న్ నఫీస్ అనే ముస్లిం వైద్యుడు బ్లడ్ సర్క్యులేషన్ ను కనుగొన్నాడు. అనస్తీషియా, కంటిలోని శుక్లాలను బయటకు తీసే హలో నీడీల్స్ ను కనుగొన్నది ముస్లిం వైద్యులే.

11.గాలిమరలు
యూరప్ లో గాలి మరను ఉపయోగించడానికి 500 సవంత్సరాల పూర్వమే క్రీ.శ. 634 సంవత్సరములో  పర్షియా ఖలీఫా జొన్నలను దంచటానికి, ఇరిగేషన్ కు కావలసిన నీటిని తొడటానికి గాలిమరను కనుగొన్నాడు. పురాతన కాలంలో అరేబియా వాసులు  ఏడారులలో నీటిని తొడటానికి గాలి మరలను వాడేవారు

12.టీకాకరణ(INOCULATION)
జెన్నర్,పాశ్చర్ టీకాలను కనుగొనటానికి 50 సంవత్సరాలకు  పూర్వమే ముస్లింలు టీకాలను వాడేవారు. 1724 లో టర్కీ లోని ఇంగ్లీష్ రాయభారి భార్య టీకా ప్రక్రియను యూరప్ కు పరిచయం చేసింది. టర్కీ లోని పిల్లలను స్మాల్ ఫాక్స్(మశూచికం) వంటి అంటురోగాలనుండి కాపాడటానికి టీకాలు వేసేవారు.
13. ఫౌంటెన్ పెన్
చేతులు,బట్టలకు సిరామరకలు అంటని పెన్ తయారు చేయమన్న  ఈజిప్ట్ సుల్తాన్ కోరిక మేరకు 953 లో ముస్లింలచే పౌంటెన్ పెన్ తయారు చేయబడినది.
14. అంకెలు 
అంకెలను,దశాంస పద్దతిని  మొదట కనుగొన్నది భారతీయులైన వాటిని ప్రపంచానికి పరిచయం చేసింది అరబ్బులే.825 లో  ప్రముఖ ముస్లిం గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మీ మరియు అల్-కిండి తమ రచనలలో అరబిక్ అంకెలను ఉపయోగించినారు. అల్-ఖ్వారిజ్మీ పేర ఆల్జీబ్రా రూపొందినది.అరబ్బు గణిత శాస్త్రవేత్తల రచనలను 300 సంవత్సరాల తరువాత యూరప్ కు ఇటాలియన్ గణిత శాస్త్ర వేత్త ఫిబోనసి పరిచయము  చేసినాడు. ట్రిగొనమెట్రీ,అల్గొరిథ్మ్స్ ముస్లిం లనుండి నేర్చుకొన్నవే. ఆధునిక క్రిప్టో లోజీ ని(cryptology).
కనుగొన్నది అల్-కిండి.
15. త్రీ కోర్స్ మిల్  
9వశతాబ్దం లో ఇరాక్ నుంచి స్పెయిన్ కార్దోబా  కు వచ్చిన అలీ-ఇబ్న్-నఫీ (మారు పేరు బ్లాక్ బర్డ్) మూడు రకాలతో కూడిన భోజనం(సూప్+మాంసం+ఫలం)(Three Course Meal)యూరప్ వాసులకు పరిచయం చేసినాడు. క్రిస్టల్ గ్లాసెస్ ను  కూడా కనుగొన్నాడు.
16. తివాచీలు   
మద్య యుగపు ముస్లింలు తివాచిలను స్వర్గం లోని ఒక భాగం గా పరిగణించేవారు. తివాచిల నేతల లో వారు సాధించిన నైపుణ్యత యూరప్ వాసులను అబ్బుర పరచినది. ఇంగ్లాండ్ మరియు యూరప్ లో అరేబియన్ మరియు పర్షియన్ తివాచిలను ప్రవేశపెట్టినప్పుడు వాటికి విపరీతమైన ఆధరణ లబించినది.
 17. చెక్కులు
ఆధునిక చెక్కులకు మూలం అరబిక్ సాక్ అనగా తీసుకొన్న వస్తువులను   అందచేసినప్పుడు డబ్బు  చెల్లిస్తాను అన్న వ్రాతపూర్వక వాగ్ధానం. ఆ రోజులలో డబ్బుతో ప్రయాణం చేయటం  ప్రమాదం కాబట్టి ఇలా చెక్కు ఇచ్చేవారు. 9 శతాబ్ధం లో ముస్లిం వ్యాపారస్తులు  బాగ్దాద్ లోని తన బ్యాంక్ పేర తీసుకొన్న చెక్కును చైనా లో మార్చుకొనే వారు.
18. భూమి గుండ్రంగా ఉంది అన్నది మొదట ముస్లింలే  
9వ శతాబ్ధం లోనే ముస్లిం పండితులు భూమి గుండ్రం గా ఉన్నది అని గెలీలియో కన్నా 500 సంవత్సరాలకు పూర్వమే అన్నారు.  భూమి చుట్టుకొలతను ఖచ్చితంగా లెక్క వేసి చెప్పినది ముస్లింలే. 1139 లో అల్-ఇద్రీసి అనే ముస్లిం శాస్త్రవేత్త సిసిలి రాజు ఆస్థానం లో ప్రపంచాన్ని చూపే గ్లోబ్ ను ప్రదర్శించాడు.
19. గన్ పౌడర్
గన్ పౌడర్ ను మొదట కనుగొన్నది చైనీయులే దానిని వారు భాణాసంచా తయారీలో వాడేవారు. కానీ గన్ పౌడర్ ను సైనిక అవసరాలకు కనుగొన్నది ముస్లింలే. దీనిని వారు క్రూసేడ్ లలో వాడినారు. 15వ శతాబ్ధం నాటికి ముస్లిం లు రాకెట్,టోర్పెడోలను కూడా  కనుగొన్నారు.
20. విహార స్థలం గా తోట(గార్డెన్)
మద్య యుగం లో యూరప్ లోని ప్రతి ఇంటికి పెరట్లో కూరగాయల మరియు వనమూలికలతో కూడిన  తోట(GARDEN) ఉండేదిది.  కానీ  గార్డెన్ ను అందమైన, ప్రశాంతంగా ధ్యానం చేసుకొనే స్థలంగా మార్చినది ముస్లింలే. 11వ శతాబ్ధంపు ముస్లిం స్పెయిన్ లో అందమైన విహార స్థలం గా రాజు గారి తోట ( రాయల్ గార్డెన్) తయారు అయినది. కార్నషేన్,తూలిప్ మొదలగు పూలను కనుగొని పెంచినది ముస్లిం తోటలలోనే.