10 November 2015

ఇస్లాంయొక్క నాలుగు ప్రముఖ మహిళా రత్నాలు



ప్రవక్త (స) నేల మీద నాలుగు గీతలు  గీసారు. అవి ఏమిటని తన సహచరులను ప్రశ్నించగా వారు దైవం,దైవ ప్రవక్త కే బాగా తెలుసు అని సమాధానమిచ్చారు. అంతట ప్రవక్త  (స) “స్వర్గంలోని మహిళలలో ఉత్తములు ఎవరనగా వారు  ఖదీజా బిన్తె ఖువయ్లిడ్, ఫాతిమా బిన్తె ముహమ్మద్, ఆసియా బిన్తె మజాహిం (ఫారో భార్య) మరియు మర్యం బిన్తె ఇమ్రాన్ అని సమాధానం ఇచ్చారు”.- ముస్నాద్ -ఇమాం అహ్మద్ 2663.
సహీహ్
ప్రవక్త (స) ప్రకారం “ప్రపంచం లోని ఉత్తమ మహిళలు మర్యం బిన్తె ఇమ్రాన్,ఖదీజా బిన్తె ఖువయ్లిడ్,, ఫాతిమా బిన్తె ముహమ్మద్, ఆసియా బిన్తె మజాహిం (ఫారో భార్య)”–తిర్మిజి
حسبك من نساء العالمين مريم ابنة عمران وخديجة بنت خويلد وفاطمة بنت محمد وآسية امرأة فرعون 

వారిలో గల అంత ప్రత్యేకత ఏమిటి? వారు ఎందుకు ప్రపంచంలోని ఉత్తమ మహిళలు గా కిర్తిoపబడుతున్నారు?
ఈ నలుగురు మహిళా రత్నాలలో రెండు లక్షణాలు ప్రముఖంగా ఉన్నవి.
1. బలమైన పునాది, అల్లాహ్ అందు బలమైన ఇమాన్ (విశ్వాసం ) మరియు యకీన్.
హృదయం నందు ఎ విధమైన అపనమ్మకం లేకపోవడమే యకీన్. నమ్మినదానిలో విశ్వాసం ఉంచడం మరియు ఇహసాన్(అల్లాహ్ అoదు పరిపూర్ణ విశ్వాసం ఉంచడం) సాదించుట.
2. వారు ఆదర్శ ఇల్లాలు మరియు ఆదర్శ  మాత గా ఉన్నారు.
ఇప్పుడు వారు ఎందుకు అంత మహానత సాధించారో తెలుసు కొందాము.

ఆసియా బింతె మజాహిం (ఫారో యొక్క భార్య) 



 ఆసియా మరియు మర్యం  అల్లాహ్ యొక్క ప్రవక్తలను(అంబియా) పెంచారు. ముసా  Musa (عليه و سلمమరియు ఈసా Eesa (عليه و سلم) లను.

ఆసియా (ఫారో యొక్క భార్య) తన భర్త యొక్క దుర్మార్గపు నీడ లో అల్లాహ్ ను ప్రార్ధించినది. ఆమె అందరి కన్నా ఉన్నతుడు మరియు రక్షకుడు అయిన  అల్లాహ్ యందు పరిపూర్ణ విశ్వాసముంచినది. ఈ వార్తా  ఫిరోన్ కి తెల్సినప్పుడు ఆమెను శిక్షించినాడు మరియు ఆమెను తీవ్రముగా శిక్షించమని తన భటులను ఆదేశించినాడు. వారు ఆమెను మిట్ట మద్యానపు వేడిలో చేతులు, కాళ్ళు కట్టివేసి  బయటకు తీసుకువెళ్ళి శిక్షించసాగిరి. ఆమె అల్లాహ్ ను ఈ విధంగా వేడుకొనెను. “ఓ! అల్లాహ్ నాకు స్వర్గం లో నివాసం కల్పించు మరియు ఫిరోన్ చేసే చెడ్డ పనుల నుండి నన్ను రక్షించు మరియు ఈ అవిశ్వాసులనుండి  నుండి రక్షించు” అని ప్రార్ధించ సాగెను.-తహ్రీం 66/11
ఆమె ప్రార్ధన  పలితంగా ఆకాశం తెరవబడి ఆమె ఇల్లు స్వర్గం లో కన్పించినది. ఆమె మందహాసం చేసినది. ఇది చూసిన భటులు ఏమి? ఈమె హింసించి నప్పటికి నవ్వుతున్నది అని ఆశ్చర్యపడసాగిరి!. అంతట ఒక పెద్ద బండ రాయిని ఆమె పై వేయమని ఫారో ఆజ్ఞాపించెను. రాయి తిసురాక ముందే అల్లాహ్ ఆమె ఆత్మ ను తీసుకు వెళ్ళెను. విశ్వాసులైన స్త్రీ/పురుషులకు ఆమె ఒక ఉదాహరణగా నిల్చినది.

2.మర్యుం బిన్తె ఇమరాన్ (రజి)
మర్యం( رضي الله عنه)అల్లాహ్ ను పరిపూర్ణమైన విశ్వాసం తో ఆరాధించినది.
దైవ దూతలు మర్యం తో ఇలా అన్నారు:”మర్యం! అల్లాహ్ నిన్ను ఎన్నుకొన్నాడు. నీకు పరిశుద్దతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళలoదరిపై నీకు ప్రాధాన్యం ఇచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకొన్నాడు” దివ్య ఖురాన్ 3:42. 

ఈసా ప్రవక్తను జన్మనిచ్చె గౌరవమును అల్లాహ్ మర్యం కు ప్రసాదించినాడు. ఆదర్శ ముస్లిం మహిళా గౌరవం ను అల్లాహ్ మర్యం కు ఇచ్చాడు. 

దైవ దూతలు ఇలా అన్నారు: మర్యం! అల్లాహ్ తన ఒక ఆజ్ఞ కు సంభందించిన శుభవార్త నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసిహా. అతను మర్యం కుమారుడు. ఇతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడౌతాడు. అల్లాహ్ సామిప్యం  పొందిన దాసులలోని వాడుగా పరిగణిoపబడుతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు,ఇంకా అతను ఒక సత్పురుషుడుడౌతాడు” అది విన్న మర్యం ఇలా అన్నారు: “ప్రభూ! నాకు శిశువు ఏలా జన్మిస్తుంది? నన్ను ఎ పురుషుడు చేతితోనైనా తాకలేదే!” సమాధనం  లబించినది : “ అలానే జరుగుతుంది. అల్లాహ్ తానూ కోరినదాన్ని సృష్టిస్తాడు. ఆయన్న ఒక పనిని చెయ్యాలని నిర్ణయిoచినప్పుడు, కేవలం దానిని “అయిపో” అంటాడు. అంతే, అది అయిపోతుంది.” (దైవ దూతలు ఇంకా ఇలా అన్నారు” “అల్లాహ్ అతనికి గ్రంధాన్ని, దివ్య జ్ఞానాన్ని, భోదిస్తాడు. తౌరత్,ఇంజిల్ గ్రంధాల  జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా అతనిని ఇస్రాయిల్ సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. “ ప్రవక్తగా ఇస్రాయిల్ సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు)”నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోనికి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞ తో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞ తో పుట్టుగుడ్డుని,కుష్టురోగిని బాగు చేస్తాను. అయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో మీకు  తెల్పుతాను. మీరు  విశ్వసించేవారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలం లో ఉన్న తౌరాత్ గ్రందోపదేశాలను దృవపరచటానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేదించబడిన (హరమ్) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చెయ్యటానికి కుడా వచ్చాను.చూడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకు వచ్చాను.కనుక అల్లహ కు బయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే, కనుక మీరు అయన దాస్యాన్నే చేయండి. ఇదే రుజు మార్గం.–దివ్య ఖురాన్ 3:45-51.
మరియు తన శీలాన్ని కాపాడుకొన్న ఆ మహిళను కూడా (అనుగ్రహిoచాము). మేము ఆమెలో మా ఆత్మ నుండి ఊదాము. ఆమెను, ఆమె కుమారుణ్ణి సర్వ ప్రపంచానికి ఒక సూచనగా చేసాము.-దివ్య ఖురాన్ 21:91.
మర్యం ఆ మగ శిశువును గర్భం లో దాల్చింది. గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్లిపొయింది.తరువాత ప్రసవ వేదన పడుతూ ఆమె ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు 
చేరింది. ఆమె ఇలా వాపొయింది.”అయ్యో! నేను ఇంతకూ ముందే మరణించి ఉంటె, నామ రూపాలు లేకుండా నశించి ఉంటె ఎంత బాగుండేది! అప్పుడు దైవ దూత కాళ్ళవైపు
నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు. “ భాదపడకు. నీ ప్రభువు నీకు దిగువ భాగం లో ఒక సెలయేరును సృజిoచాడు.నీవు ఈ చెట్టు మొదలు కొంచం ఊపు. నీపై స్వచ్చమైన తాజా ఖర్జూరపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్ళను చల్లబర్చుకో.తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే, అతనికి, నేను కరుణామయుని కోసం ఉపవాసము ఉంటానని మొక్కుకొన్నాను. కనుక ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను” అని  చెప్పు.
తరువాత అమె ఆ బాలుణ్ణి తీసుకోని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు” మర్యం! నీవు పెద్ద పాపమే చేసావు. ఓ హరూన్ సోదరి! నీ తండ్రి కూడా చెడ్డ మనిషికాడే; నీ తల్లి కూడా నీతిబ్యాహ్యమైన నడత గల స్త్రి కాదే!” మర్యం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు,” ఊయలలోని ఈ పసిపిల్లవానితో మేము ఎం మాట్లాడము?అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు, “ నేను అల్లాహ్ దాసుణ్ణి. అయన నాకు గ్రంధాన్ని ఇచ్చ్హాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, ఆయన నన్ను శుభవంతుని చేసాడు. నేను జీవించి ఉన్నంత కాలం నమాజును, జకాతును పాటించు అని అజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నేరవేర్చేవానిగా నన్ను చేసాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హృదయునుగాను చేయ లేదు. నేను పుట్టిన రోజునా, నేను మరణించేరోజునా, బ్రతికoపబడి లేవబడే రోజునా నాకు శాంతి కలుగుతుంది”. –దివ్య ఖురాన్ 19:22-33.

3.ఖదీజా బిన్తె ఖువయ్లిడ్  



ఖదీజా رضي الله عنه) ఒక మంచి పత్ని. ఆమె ప్రవక్త(స) కు  ఎప్పుడు ఆసరా ఇచ్చెను. ప్రజలు విరోధించినా  ప్రవక్త(స) నమ్మిన విషయాన్నీ తను  నమ్మేను. ఆమె ప్రవక్త(స) ను సదా ప్రోత్సహించెను,విశ్వశిoచెను.   ప్రవక్త(స) అందు యకీన్ ఉంచెను. 
ఆమె విశ్వాసుల మాత గా పేరుగాoచెను. జిబ్రీల్(దైవ దూత) ద్వార ప్రవక్త (స) కు దైవవాణి వెలువరించిన తరువాత ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి ఆమె .
ఖదీజా ఇస్లాం పుట్టుక కళ్ళారా చూసేను. దాన్ని  ఆరంభ సoవత్సరాలలో అనేక కష్టాల మద్య     దానిని పెంచి పెద్ద చేసెను. ఇస్లాం ఆమె ఇంటిలో పెరిగి పెద్దదయ్యేను. ఆమె ఇల్లు  ఇస్లాం కు ఊయ్యలగా మారెను.  ఇస్లాం పెరుగుదల ఆమె ఇంటి చుట్టూ జరిగెను. ఆమె ఇల్లు దివ్య ఖురాన్ స్వస్థలం. ఆమె ఇంటి నుంచి దైవ దూత జిబ్రీల్ స్వర్గం నుంచి వహిలను 10 సంవత్సరాల పాటు  తెచ్చెను.
ఇస్లాం శత్రువులను ఎదుర్కోoటున్నపుడు (رضي اللهعنه) తన సుఖాలను విడనాడి, తన  సంపద మరియు గృహమును, తన ప్రాణo ను ఆమె ఇస్లాం మార్గంలో త్యాగం చేసినది.  ఆమె తన పతి మరియు అతని వంశం తో కలసి కష్ట-నష్టాలూ భరించినది. ముట్టడి సమయం లో ఆమె   శితాకాలం లో మరియు వేసవికాలం లో దాహం భరించినది మరియు ఎప్పుడు తన భర్త తో దానిపై ఫిర్యాదు చేయలేదు. ఆమె పుష్కలంగా ఉన్న లేకున్నా నవ్వుతూ ఉండేది  లేమి ఎన్నడు ఆమెను భాదించలేదు. ఆమె భర్త అందించిన సౌఖ్యం, ధైర్యం, బలం ఆమెను తన జీవిత చీకటి రోజులలో ముందుకు నడిచేటట్లు చేసినవి.
ప్రవక్త (స) ఆమె పట్ల తన ప్రేమ,అనురాగం, అతిశయం ఎప్పుడు చూపేవారు. ఆమె మరణం ఆయనకు భాధ,వేదన కల్గించినవి.ఇస్లాం ప్రారంభమైన 10 వ సంవత్సరం లో రమదాన్ నెల 10 రోజు 65 ఏళ్ల వయస్సు లో క్రి.శ.619 లో ఆమె పరపదించెను. ఆమె పార్ధివ దేహమును మక్కా లోని అల్-హుజున్ లో ఖననం జరిగింది.
ప్రవక్త(స) స్వయంగా ఆమె గోతిని తవ్వినారు మరియు గోతి లో దిగి కొన్ని నిమిషాలు గడిపెను. ఆమె సమాధి పై మట్టిని స్వయంగా సరిచేసారు.


 4.ఫాతిమా బిన్తె ముహమ్మద్. 


ఆమె తండ్రి ఒక ప్రవక్తగా పంపబడుటకు ఐదు సంవత్సరాల ముందు ఫాతిమా జన్మించారు.ఆమె జన్మించే నాటికి  మహమ్మద్ ప్రవక్తకు(స) 35 ఏళ్లు. కాబా గృహం పునర్నిర్మించబడే  సంవత్సరంలో ఆమె జన్మించారు.  5 సంవత్సరాల వయసులో ఆమె ఒక ముస్లింగా   మారింది. ఆమె అతి పిన్న వయస్సు లో ఇస్లాం స్వీకరించెను.
ఫాతిమా అన్న  పేరు కు   అర్థం ఏమిటి? అది “ఫితం” అను పదం నుండి వచ్చింది.  అనగా చెడు మరియు చెడు నడత  నుండి రక్షించునది అని అర్ధం. ఫాతిమా కు నాలుగు ముద్దుపేర్లు కూడా కలవు. అవి జహ్రా, బతుల్, ఉమ్మె-అల్-హసన్వాల్ –హుసేన్  మరియు ఉమ్ము అబీహ.
ఆమె ప్రవక్త(స) పట్ల అనురాగం, ప్రేమ తో ఆయనే వెన్నంటే ఉండి వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండే వారు. తన బిడ్డను కాపాడుకోనేట్టు అందుకే ఆమెను ఉమ్మ్ అబీహ అని సహాబా మరియు స్నేహితులు పిలిచే వారు. ఆమె తెల్లగా ఉండి ఆమె చెక్కిళ్ళు ఎర్రగా ఉండి తన తండ్రి ను పోలిఉండేవారు. ఆమె తన తండ్రి యొక్క ప్రియమైన పుష్పం గా ఉండేవారు అందుకే ఆమెను జహరా అని కొందరు పిలిచేవారు. ఈసా ప్రవక్త  తల్లి మర్యం ను పొలి ఉండుట వలన ఆమెను బతుల్ అని పిలిచేవారు. ఆమె మర్యం లాగే మర్యాదతో ప్రార్ధన చేసిది అందువలన ఆమె బతుల్ అయినది. ప్రవక్త(స) అభిప్రాయం లో జన్నత్ లోని స్త్రీలలో మర్యం తరువాత స్థానం ఫాతిమాది.
ఫాతిమా కు యుక్త వయస్సు వచ్చిన తరువాత అనేక వివాహా సంభంధాలు వచ్చినవి.
ప్రవక్త (స) ఈ సందర్భం లో దైవాజ్ఞ కోసం ఎదురు చూడ సాగిరి. ప్రవక్త(స) ఆమె వద్ద  కు వచ్చి” ఓ! నా ప్రియ పుత్రికా! నీకు అలీ ని వివాహమాడుట సమ్మతమేనా ఆ విధముగా నాకు దైవజ్ఞ లబించినది” అని అడిగిరి. అంతట ఆమె వినమ్రతతో తల వంచెను. ఉమ్మ సల్మా కధనం ప్రకారం “ ఫాతిమా ముఖము చిరునవ్వు తో వికసించెను ఆమె మౌనమును అoగీకారముగా భావించి ప్రవక్త(స) లేచి “అల్లాహో అక్బర్” అనిరి.
ఫాతిమా  దైవభక్తి మరియు పవిత్రత,  కనికరం, అల్లాహ్అందు  స్వీయభక్తి, ఆరాధనాతనం కలిగి మేధావితనం మరియు జ్ఞానం, సంకల్పం త్యాగం మరియు ఆతిథ్యo, ఓర్పు,సహనము ఉండి మాటలలో మరియు ఆచరణలలో జ్ఞానం ప్రదర్శించేది. ఇవి అన్నియు  ఆమె తండ్రి నుండి పొందిన సుగుణములు.
ఇమాం హుసేన్ ప్రకారం వారి మాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆరాధనలలో మునిగి ఉండెడిది. ఆమె ఉదార స్వభావి , పేదల పట్ల సానుభూతి ప్రదర్శించేది. ఆమె ఇంటికి వచ్చిన ఎవరు కూడా వట్టి చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు.ఆమె తన తండ్రి గారి ప్రియ పుత్రిక మరియు ఒక విశ్వాసురాలుయిన ధర్మ పత్ని మరియు అల్లాహ్ కు బానిస.
పైన వివరించిన సుగుణముల వలన ఈ నలుగురు స్త్రీలు ప్రపంచంలో ఆదర్శ మహిళా మణులు అయినారు. వారు తమ సౌందర్యం తో కాక దైవ భక్తితో (అల్లాహ్ అందు) పేరుగాంచినారు. వారు సత్య మార్గం లో సదా చురుకుగా ఉండేవారు. జ్ఞానపరంగా అయేషా బిన్తె అబూబకర్, ఖదీజా మరియు ఫాతిమా కన్నా గొప్పది కాని ఆమె ప్రపంచంలోని నలుగురు ఉత్తమ మహిళలలో స్థానం పొందలేదు.


No comments:

Post a Comment