.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం గులాం ముహియుద్దిన్.
అతనిని అందరు ఆప్యాయంగా మౌలానా ఆజాద్
అని పిలిచేవారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య
నాయకులలో ఒకరు. అతను ప్రఖ్యాత
పండితుడు మరియు కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్ మరియు బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.
అతని పేరు సూచించినట్లు అతను వాదనలో
రారాజు మరియు వాదనా పటిమలో మేటి. అతను తన
కలం పేరు ఆజాద్ గా స్వీకరించినాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరం లో నవంబర్ 11, 1888 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్
(ఆఫ్గనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన
వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల వంశం నుండి
వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్ మరియు షేక్ మహ్మద్ జహీర్ వత్రి మరియు అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్
ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో
భారతదేశం నుండి మక్కా వచ్చి అక్కడే
స్థిరపడ్డారు. 1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ
ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట అరబిక్ మరియు పెర్షియన్
నేర్చుకున్నాడు తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం మరియు బీజగణితం అబ్యసించి నాడు. స్వీయ అధ్యయనం ద్వారా (ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలు
నేర్చుకున్నాడు.
ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసినాడు.. అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలను లో మరియు అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి చూపినారు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్గనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా మరియు టర్కీ సందర్శించారు. ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటo సల్పుతున్న నిర్వాసిత విప్లవకారులను కలుసుకున్నారు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్ మరియు సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా రూపాంతరం చెందిoచాయి.
విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి
ఇద్దరు ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా
తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల
లోపల, మౌలానా అబుల్
కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయం లో విప్లవ వాదులు ముస్లింలను విప్లవ
వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క
స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా
ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన
సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించారు.
1912 లో మౌలానా అబుల్
కలాం ఆజాద్ ఉర్దూ లో ‘అల్ హిలాల్’ వార
పత్రిక ముస్లింలు మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల పలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత
హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత
కుదుర్చటం లో ఒక ముఖ్యమైన పాత్ర
పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక
విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”
ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో
నిషేదిoచినది. ఆజాద్ భారతీయ జాతీయవాదం మరియు హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో
పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు. 1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు మరియు రాంచి లో ఆజాద్
ను నిర్భందించారు ఆతరువాత మొదటి ప్రపంచ
యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీ లో
బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా
ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.
మౌలానా అబుల్
కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత
జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించినాడు. ఇతడు ఢిల్లీ
కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యారు. మౌలానా ఆజాద్
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంగా పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం
ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు మరియు 1946 వరకు ఆ
పదవి లో ఉన్నారు. అతను విభజన కు వ్యతిరేకి . విభజన అతని కలలను నాశనం
చేసింది. హిందువులు మరియు ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట
అతని కల ను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య మంత్రి (స్వతంత్ర భారతదేశం లో మొదటి
విద్యాశాఖ మంత్రి) గా 1947 నుండి 1958 వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
మంత్రివర్గంలో సేవలందించారు. మౌలానా
అబుల్ కలాం ఆజాద్ ఫిబ్రవరి 22, 1958 న స్ట్రోక్ తో మరణించారు. అతను దేశానికి తన అమూల్యమైన
సహకారం,సేవలు
అందించారు. అబుల్ కలాం ఆజాద్ కి మరణానంతరం 1992 లో భారతదేశం యొక్క అత్యున్నత
పౌర పురస్కారo భారతరత్న లభించింది.
|
|
3 November 2015
మౌలానా అబుల్ కలాం ఆజాద్( స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి 1947 నుండి 1958 వరకు)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment