26 September 2016

విలువల ఆధారిత పెంపకం (Value-Based Parenting)





భారతదేశ  పిల్లలకు  వేల సంవత్సరాలు గా బొదిస్తున్న నైతిక విలువలు ఏమై పోయినవి? తల్లిదండ్రులు, తాతలు, అన్నలు-అక్కలు, మరియు కుటుంబం సభ్యులు మరియు ముఖ్యంగా   పెద్దల పట్ల చూపే గౌరవవిలువలు, మర్యాద, నిస్వార్ధo, సహాయం, ప్రేమ మరియు వినయం, దయ, మొదలగు సద్గుణాలు ఎమైపొయినవి?

అంతర్గత శాంతి, ఇతరులతో మంచి ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్వహించడానికి మరియు అనవసరమైన వివాదాలు నివారించడానికి కావసిన సుగుణాలు ఈ నాడు పిల్లలలో లోపించినవి. అంతర్గత శాంతి మరియు సహకార భావన మొదలగు మంచి లక్షణాలను మరియు  మంచి విలువలు పాటించడం నేడు మనము పిల్లలకు  ప్రారంభ వయస్సు నుండి నేర్పుట తప్పని సరి అయింది.

చిన్న పిల్లలకు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను నేర్పే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ  కనుమరుగవడంతో తరచుగా వారి జీవితాల్లో చాలా ముఖ్యమైన అవసరం అయిన వ్యక్తిత్వ వికాసంను  పూరించడానికి ఎవరు లేరు. ప్రస్తుత తల్లిదండ్రుల తరం, వారి తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నత విద్య అబ్యసించి మరియు మంచి ఉద్యోగాలను చేస్తూ   అదృష్టంవంతులై  ఉన్నారు. వారు తమ  పిల్లలు అడిగిన  వస్తువులను అందించేoదుకు సిద్దం గా ఉన్నారు.

నేడు తల్లిదండ్రులు తమ  పనిలో తాము మునిగి ఉన్నారు  మరియు వారి పిల్లలపై  మీడియా ప్రభావం ఎక్కువ ఉన్నది. దాని ప్రభావంతో  - చెడు భాష, తక్కువ మరియు  రెచ్చగొట్టే దుస్తులు,  లైంగిక సూచనాత్మక నృత్య కార్యక్రమాలు, హింసాత్మక వీడియోలు, సినిమాలు మరియు పాటలు, డ్రగ్స్  మొదలైన వాటికి పిల్లలు  ప్రభావితం అవుతున్నారు మరియు   అనైతిక పనులు నేడు  పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది.

తమ పిల్లల  మీద  తల్లిదండ్రులకు  పర్యవేక్షణ లేదు. వారు ఎ పనులను చేస్తున్నారు? వారి స్నేహితులు ఎలాంటివారు? వారు తమ సమయాన్ని ఎక్కడ గడుపు తున్నారు? అనే దాని పై తల్లితండ్రులకు సరిఅయిన పర్యవేక్షణ  లేదు. ప్రస్తుతరం పిల్లలకు టీవీ, వీడియో గేమ్స్ మరియు సాంఘిక మీడియా కాలక్షేప సాధనాలు అయినవి. తల్లితండ్రుల పర్యవేక్షణ పూర్తిగా కోరబడిన కాలం లో పిల్లలు సహజంగా అవాoఛనియమైన పనులకు, అనైతిక విలువలకు, చెడు సావాసాలకు   అలవాటు బడుతున్నారు.

మొత్తం 30 సంవత్సరాలకు పై బడిన నా అధ్యాపక వృత్తి మరియు విద్యార్ధుల కౌన్సిలర్ గా విద్యార్ధులలో నైతిక విలువలు సన్నగిల్లటం కొన్నిసంవత్సరాలుగా గమనిస్తున్నాను. ప్రస్తుత తరం విద్యార్ధుల తల్లితండ్రులకు నేను విద్య బోధించాను. అద్యాపకుని మాట జవదాటటము, పెద్దలను అగౌరవ పరచటము, పరుష శబ్దాలను, అశ్లీల పదాలను వాడటము ఆనాటి విద్యార్ధులలో అనగా   నేటి విద్యార్ధుల తల్లితండ్రులలో నేను గమనించలేదు.

నేటి తరం విద్యార్ధుల తల్లితండ్రులను వారి పిల్లల అనాగరిక ప్రవర్తన మరియు విద్యాస్థితి గురించి వివరించడానికి పిలిచినప్పుడు వారి నుంచి వచ్చే సమాధానం కడు నిరాశజనకం గా ఉంటుంది. కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను మందలించలేక ఉపాద్యాయునితో “మా పిల్లలను వదిలి వేయండి, వాడి ఇష్టం వచ్చినట్లు చేయనియండి, వాడు సంతోషం గా ఉండనీయండి” అనే సమాధానo ఇస్తున్నారు.
   
ఈ మాటలు విద్య,వినయం, శీలం, క్రమశిక్షణ నేర్చిన ఆ నాటి తరం  విద్యార్ధులు అనగా నేటి విద్యార్ధుల తల్లితండ్రుల నోటి వెంట రావడము మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వారు ఎందుకు తమ పిల్లల చెడు ప్రవర్తనను సహించు చున్నారు? తమ మౌనం తమ పిల్లల భవిషత్తును  పాడు చేస్తుంది అని తెలిసి కూడా ఎందుకు సహించు చున్నారు?

ప్రపంచానికి ఒక బిడ్డను పరిచయం చేసేటప్పుడు, తల్లిదండ్రులు మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన, బాధ్యతగల  పౌరులుగా వారిని పెంచాలి మరియు ఆ బాధ్యత చాలా చిన్న వయస్సు నుండి ప్రారంభం చేయాలి. పిల్లలకి అందరు పెద్దల పట్ల, అలాగే వారి స్నేహితుల పట్ల మర్యాద గా ప్రవర్తించటం నేర్పాలి. ముందు స్కూల్ లో వారి ఉపాధ్యాయులు, సహ విద్యార్ధులు తరువాత జీవితంలో వారి యజమానులు, సహచరులు, జీవిత భాగస్వాములు మరియు సమాజం పట్ల ఆదరంగా, ప్రేమతో  ప్రవర్తించడం నేర్పాలి. పిల్లలు తమ తల్లిదండ్రుల నిజమైన వారసత్వానికి చిహ్నాలు కాబట్టి వారిలో మంచి విలువలు అభివృద్ధి చేయాలి. అది తమ కుటుంభ వారసత్వాన్ని తమ తల్లితండ్రుల కిర్తిప్రతిస్థలు పెంపొందించేదిగా ఉండాలి.

ఒక మంచి పిల్లల పెంపకం కు  షరతులు లేని  ప్రేమ, సమయం, ఓర్పు మరియు సరిఅయిన మార్గదర్శకత్వం కావలి.  డబ్బు మరియు విలాస వస్తువులు కాదు. పిల్లలు తమ తలితండ్రుల ప్రేమ, సమయం మరియు మార్గదర్సకత్వం కోరుకొంటున్నారు.  డబ్బు మరియు వస్తువులు రావచ్చు పోవచ్చు కాని జీవితాంతం నిలిచిఉండేవి మంచి విలువలు మరియు క్యారెక్టర్ (చరిత్ర).
తల్లితండ్రులతో ఆనందం తో గడిపిన వారాంతాపు సెలవు దినాలు, తల్లితండ్రుల నేర్పిన సరియిన మార్గం, పిల్లల మనస్సులో కొన్ని జీవిత పాఠాలు నేర్పుతుంది.    ఆ ఆనందకరమైన క్షణాలను, అనుభూతులను, సుఖదుఖాలను,  ఆహ్లాదకరమైన పరిస్థితులను విద్యార్ధులు ఎన్నటికి మరవలేరు వాటినుంచి కొత్తకొత్త జీవిత పాఠాలను నేర్చుకొంటారు.


ఈ వ్యాసం చదివిన వారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఎ విధంగా పెంచుతున్నారో విశ్లేషించమని  ప్రార్ధిస్తున్నాను. వారు తమ సమయం మరియు దృష్టిని పిల్లలకి పూర్తిగా కేటాయిస్తున్నారా? నిస్వార్థoగా ఉండటం, ఇతరుల భాదలను పంచుకోవటం మున్నగు మంచి లక్షణాలను తమ పిల్లలకు బోధిస్తున్నారా? వారికీ  కావలసినది అందిస్తున్నారా? మంచిది కాని దానికి వద్దు అనడం నేర్పిస్తున్నారా? ప్రతిది తమకే లబించాలి అనేది కాకుండా వంతుల వారిగా పొందటం నేర్పుతున్నారా?  వైఫల్యం మరియు నిరాశ ను ఎదుర్కోవటం ఎలానో నేర్పుతున్నారా? జీవితం లో ఎదురు అయ్యే అటుపోటులను తట్టుకోవడం నేర్పుతున్నారా? కష్టాలలో మన:శాంతి కోల్పోకుండా ఉండటం, వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం నేర్పుతున్నారా?  గమనించండి.

కాబట్టి  మీ పిల్లలు  మరియు సమాజం కు మేలు చేయండి.  మీ పిల్లలను మంచివారిగా  పెంచి ప్రయోజకులుగా తీర్చిద్దిద్దండి. సమాజానికి అవసరమైన మంచి నాగరికులుగా తిర్చిదిద్దండి. మీ పేరు ప్రతిస్థలను  పెంచి సమాజం లోని ఇతరులకు ఆదర్సనియులుగా  ఒక బహుమతిగా రూపొందించండి. 


25 September 2016

ఇంగ్లాండ్ మర్చిపోయిన ముస్లిం చరిత్ర (England’s Forgotten Muslim History)


బ్రిటన్ మునుపెన్నడూ లేనంతగా విభజించబడింది. యూరోప్ ను  నిర్లక్షం చేసి ఇంగ్లాండ్ పాలకురాలు తన ద్రుష్టి ని  తూర్పు వర్తకం పై పెట్టుకుంది. అది  16 వ శతాబ్దపు చరిత్రలో  బ్రిటన్ మరియు ఆ నాటి అత్యంత ప్రసిద్ధ చక్రవర్తిని  క్వీన్ ఎలిజబెత్ I సమయం ను వివరిస్తుంది. ఆ కాలంలో ఎలిజబెత్ ఇంగ్లాండ్ తన విదేశీ మరియు ఆర్థిక విధానాలతో ఇస్లామిక్ ప్రపంచంతో  ఒక సన్నిహిత సంబంధాన్ని నడిపింది.

1558 లో సింహాసనాన్నిఅధిష్టించిన కాలం నుండి ఎలిజబెత్ రాణి ఇరాన్, టర్కీ మరియు మొరాకో లోని ముస్లిం పాలకులతో దౌత్య వాణిజ్య మరియు సైనిక సంబంధాలను వృద్ది చేసుకోంది. 1570 లో ప్రొటెస్టంట్ ఇంగ్లాండ్ కాథలిక్ విశ్వాసం వైపునకు తిరిగి రాదు అని   స్పష్టం అయిన తరువాత, పోప్ ఎలిజబెత్ ను బహిష్కరించినాడు మరియు ఆమె పాలన తొలగించుటకు పిలుపునిచ్చాడు. వెంటనే కాథలిక్ స్పెయిన్  ఆమెకు  వ్యతిరేకంగా ముట్టడి ప్రారంభిoచినది మరియు యుద్ధం అనివార్యం గా కనపడింది. ఆంగ్ల వ్యాపారులు స్పానిష్ నెదర్లాండ్స్ యొక్క మార్కెట్ల నుండి బహిష్కరింప బడినారు. కొత్తగా ఏర్పాటైన ప్రొటెస్టంట్ ఆంగ్ల దేశం కు ఆర్థిక మరియు రాజకీయ ఒంటరితనం  వెన్నాడినది.

దీనికి ప్రతిగా ఎలిజబెత్ ఇస్లామిక్ ప్రపంచం కు  దగ్గిర అయినది. ఆ కాలం లో   స్పెయిన్ యొక్క ప్రత్యర్థి ఒట్టోమన్ సామ్రాజ్యం దాని సుల్తాన్ మురాద్ III.అతని సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా నుండి తూర్పు ఐరోపా గుండా  భారతీయ మహాసముద్రానికి విస్తరించినది.  ఒట్టోమన్లు  హంగేరి భాగాలు ఆక్రమించుకొని  దశాబ్దాలుగా హప్స్బుర్గ్స్ (Hapsburgs) తో  పోరాటం చేస్తున్నారు.  ఎలిజబెత్ రాణి కి ఒట్టోమన్   సుల్తాన్ తో సంధి స్నేహసంభoదాలు  స్పానిష్ సైనిక దళాల దూకుడు నుండి అవసరమైన ఉపశమనం అందించును మరియు  తూర్పు యొక్క  లాభదాయకమైన మార్కెట్లను ఇంగ్లీష్ వర్తకులు   పొందటం లో సహాయపడునని భావించారు. ఇంగ్లాండ్ ఒట్టోమన్లతో పాటు వారి  'ప్రత్యర్థులు అయిన పర్షియా యొక్క షా మరియు మొరాకో పాలకుడు కి దగ్గిర అయినది.

అయితే ఆ నాటి ముస్లిం సామ్రాజ్యాలు యూరోప్ లోని చిన్న దేశం అయిన ఇంగ్లాండ్ కంటే చాలా శక్తివంతమైనవి గా  ఉండేవి. ఎలిజబెత్ కొత్త వాణిజ్య పొత్తులు అన్వేషించాలని కోరుకోoది, కానీ వాటికి  ఆర్థిక సహాయం అందించ లేకపోయిoది. ఈ పరిస్థితులలో ఆమె సోదరి మేరీ ట్యూడర్ ద్వారా పరిచయం అయిన ఉమ్మడి స్టాక్ సంస్థలు ఆమెకు తోడ్పడినవి.

 షేర్-హోల్డర్స్ చే ఉమ్మడిగా నడుపబడే ఈ కంపనీలు వాణిజ్యంకు అవసరమైన పెట్టుబడులను పెట్టును మరియు  లాబాలు/నష్టాలను సమానంగా భరించును.  ఎలిజబెత్ రాణి ఉత్సాహంగా పర్షియా వర్తకం ముస్కోవే కంపెనీ కి ఇచ్చింది మరియు అది ఒట్టోమన్ సామ్రాజ్యం తో వర్తకం చేయడానికి  టర్కీ కంపనీని ఏర్పరిచినది. అలాగే ఈస్ట్ ఇండియా కంపనీ ఏర్పాటు అది చివరకు ఇండియా ను జయిoచడానికి తోడ్పడింది. 

1580 లో ఆమె ఇంగ్లీష్ వర్తకులకు ఒట్టోమన్ భూభాగం లో ఉచిత వాణిజ్య ప్రాప్తికి అనుమతిస్తూ 300 సంవత్సరాలకు వాణిజ్యపరమైన ఒప్పందాలు ఒట్టోమన్ ప్రభుత్వం తో చేసుకున్నారు. ఆమె స్పెయిన్ వ్యతిరేకంగా సైనిక మద్దతు కోరుతూ మొరాకోతో  కలిపి ఇదే రకమైన ఒప్పందాన్ని చేసుకుంది.

వర్తకం ద్వార సంపద వచ్చేకొద్దీ ఎలిజబెత్ పరస్పర వాణిజ్యం యొక్క ప్రయోజనాలను  కీర్తిస్తూ ఆమె ముస్లిం పాలకులకు లేఖలు రాయటం ప్రారంభించారు. ఆమె ఒక లేఖలో మురాద్III ను  “టర్కీ ఏకైక అత్యంత శక్తివంతమైన పాలకుడు మరియు తూర్పు సామ్రాజ్యం అత్యంత సార్వభౌమ చక్రవర్తి” అని కిర్తించినది.   కాథలిక్కుల శత్రువు అయిన ముస్లింల మద్దతు పొందటానికి తనను విగ్రహరాధకులకు  వ్యతిరేకమైన పాలకురాలు గా పేర్కొన్నది.

ఈ ఉపాయం ఫలించింది. ఇంగ్లీష్ వ్యాపారులు వేలాదిగా  సిరియా అలెప్పో, ఇరాక్ లోని మోసుల్ ప్రాంతాల వంటి సుదూర ప్రాంతాల  వరకు వర్తకం ఆరంబించారు. కాథలిక్ యూరోప్ కన్నా చాలా సురక్షితమైన వర్తక మార్గం వారికి అందుబాటులోకి వచ్చింది.

ఒట్టోమన్ అధికారులు అన్ని విశ్వాసాల ప్రజలను  స్వీకరించడం తమ  బలహీనత కాక  శక్తి యొక్క చిహ్నం గా భావించారు. కొందరు ఆంగ్లేయుల కూడా ఇస్లాంస్వీకరించారు. ఆల్జియర్స్ చీఫ్ కోశాధికారి హసన్ అగా గతం లో సామ్సన్ రౌలి  గా పరిచితుడు. కొందరు   సొంత సంకల్పము చేత అనిశ్చిత కొత్త ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని కంటే మెరుగైన ఇస్లాం మతం ను స్వీకరించారు.

పట్టు మరియు తూర్పు సుగంధ ద్రవ్యాలు ఇంగ్లీష్ ప్రభువులకు ఆనందపరిచినవి కానీ టర్క్ మరియు మొరాకో వారికి ఆంగ్ల ఉన్ని అందు  ఆసక్తి లేదు. వారికి కావలసినది అవసరమైన ఆయుధాలు. ఎలిజబెత్ పాడుపెట్టిన కాథలిక్ చర్చిల నుండి గంటలు,  మెటల్ కొల్లగొట్టి వాటినుండి మందుగుండు సామగ్రి తయారుచేసి టర్కీ కి రవాణా చేసేది.  రాణి మొరాకో కి కుడా ఆయుదాలు అందించి వారినుంచి గన్పౌడర్ లో అతి ముఖ్యమైన అంశమైన సాల్ట్ పీటర్ మరియు  మరియు చక్కెర కొనుగోలు చేసేది.

చక్కెర, పట్టు, తివాచీలు మరియు సుగంధ ద్రవ్యాలు ఇంగ్లీష్ వారిని అలరించినవి. క్యాండి ("మిఠాయి") మరియు "మణి" ( "టర్కిష్ రాయి" నుండి) పదాలు సర్వసాధారణంగా మారాయి. మొదటి మొరాకో దౌత్యాధికారి యొక్క ఆరు నెలల ఆంగ్ల  పర్యటన తర్వాత "ఒథెల్లో" షేక్స్పియర్ రాయడం ప్రారంభించినాడు.
 
ఉమ్మడి స్టాక్ కంపెనీలు  వ్యాపార పరంగా విజయం సాధించినప్పటికీ, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ బాగుపడలేదు. 1603 లో ఎలిజబెత్ మరణానంతరం, కొత్త రాజు జేమ్స్, స్పెయిన్ తో ఒక శాంతి ఒప్పందం చేసుకొని ఇంగ్లాండ్ ఒంటరితనమునకు ముగింపు పలికాడు.

ఎలిజబెత్ యొక్క ఇస్లామిక్ ప్రణాళిక ఒక కాథలిక్ దాడిని ఆపి జాయింట్ స్టాక్ పెట్టుబడికి తద్వారా వర్జీనియా కంపని ఏర్పాటుకు తుదకు   మొదటి శాశ్వత ఉత్తర అమెరికా కాలనీ ఏర్పాటుకు దారితీసింది. 

ఈ విధంగా ఇంగ్లాండ్ ఇంపీరియల్ సైనిక మరియు వాణిజ్య  కథలో ఇస్లాం ముఖ్యపాత్ర పోషించినది. నేడు ముస్లిం వ్యతిరేక రాజకీయ ఉన్నరోజులలో పాత రోజులలో ఇస్లాం ఏవిధంగా ఆంగ్ల దేశానికి సహాయ పడినదో గుర్తుకు తెచ్చుకోవటం మేలు. 

ఇస్లాంధర్మం పై మహాత్మా గాంధీ అభిప్రాయలు




ఇస్లాం అనే పదమునకు   శాంతి అని అర్థం.గాంధీజీ కి ఇస్లాం తో పరిచయం అతని చిన్నతనం లోనే జరిగింది. గుజరాత్ లో ముస్లిం వర్తక బృందాలు ఉండేవి. ముస్లింలు అతిధులుగా గాంధీ ఇంట ఆహ్వనింప బడేవారు.  అతని బాల్యం ముస్లిం పొరుగున జరిగింది. అతని కుటుంభ సబ్యులకు ముస్లింలతో మంచి సంభందాలు ఉండేవి. స్కూల్ లో అతను ఇతర మతస్తుల పిల్లలతో స్నేహం చేసి వారి ఆచార వ్యవహరముల పట్ల అదరం చూపేవాడు. 

గాంధిజీ విదేశాలలో ఉన్నతోబ్యాసం పూర్తి చేసుకొని తన స్వస్థలం కు బారిస్టర్ గా తిరిగి వచ్చినప్పుడు అతను ఒక ముస్లిం కంపనీ తరుఫున దక్షిణ ఆఫ్రికా పంపబడినాడు.  సౌత్ ఆఫ్రికా లో అనేక మంది ముస్లిం వర్తకులతోను ఇండియా తిరిగి వచ్చిన తరువాత బొంబాయి లో మరియు పోర్బందర్ లో  అనేకమంది ముస్లింలతో గాంధీకి పరిచయం ఏర్పడినది మరియు వారి ఇంట ఆతిద్యం గాంధి స్వీకరించెవాడు. దాదాపు 20సంవత్సరాల పాటు   వారి అలవాట్లు, వారు మత విశ్వాసాలతో గాంధి కి పరిచయం ఏర్పడినది.  ముస్లిం స్నేహితులు అతనిని తమ కుటుంభ సబ్యునిగా పరిగణించేవారు. వారి స్త్రీలు అతని ముందు పరదా పాటించేవారు కాదు. సౌత్ ఆఫ్రికా లో అతని అనుచరుల్లో అనేకమంది ముస్లిమ్స్ కలరు.

ఇంగ్లాండ్ లో విద్య నబ్యసించెటప్పుడు గాంధీ థామస్ కార్లైల్ యొక్క సుప్రసిద్ధ ఉపన్యాసం “ The Hero as Prophet” ను చదివాడు. ఆ వ్యాసం లో గాంధీ ప్రవక్త (స) గొప్ప తనం, అతని నిరాడంబర జీవితాన్ని గాంధీ  గమనించాడు. ప్రవక్త(స) పట్ల అతనిలో గౌరవ భావము ఏర్పడినది. అదేవిధంగా గాంధీ షిబ్లినుమని పుస్తకం “Biographips of Muslim Heroes” మరియు సయ్యద్ అమీర్ అలీ  “ఇస్లామిక్ చరిత్ర” చదివాడు. వీటి పఠనం వలన గాంధి లో ప్రవక్త(స) గొప్పతనం అర్ధమైనది.తన రచనలలో గాంధీజీ కార్లైల్, నుమాని, అమీర్ అలీ పుస్తకాలను ప్రస్తావించే వాడు.

తరువాత కాలంలో ప్రసిద్ద ఇస్లాం పండితులు మౌలానా ముహమ్మద్ అలీ జుహర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీమ్ అజ్మల్ ఖాన్, జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ ముజీబ్, షేక్ అబిద్ హుస్సేన్ వంటి పండితుల సాంగత్యం వాళ్ళ గాంధీ ఇస్లాం గురించి విస్తృతంగా తెలుసుకొన్నారు.

గాంధీ ముస్లిం మిత్రులు జామియా మిలియా స్థాపించినప్పుడు గాంధీ  ప్రసిద్ద కవి అల్లమా ఇక్బాల్ ను ఆ విద్యాలయం లో దిరేక్తర్ గా చేరమని ఆహ్వానించారు. ఇది కొద్దిమందికి మాత్రమే తెలుసు. తన కుమారులలో ఒకరిని జామియా ఇస్లామీయ చదివించెను.

గాంధీజీ అల్లామా ఇక్బాల్ కవితలను ఆస్వాదించేవారు. వాటినుంచి తను  ప్రేరణ పొందేవారు. అయితే ఇక్బాల్ ఆ ఆహ్వానంను మృదువుగా తిరస్కరించెను. గాంధీ తన విద్యావిధానం “బెసిక్ ఎడ్యుకేషన్” కు జాకీర్ హుస్సిన్ ను ఇంచార్జ్ గా నియమించెను.

గాంధీ అలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం కు తన పూర్తి సహాయ సహకారములు అందించెను.  ఖిలాఫత్ ఉద్యమం మరియు శాసనుల్లంఘన ఉద్యమం సందర్భంగా గాంధీ ప్రముఖ ముస్లిం నాయకులైన అలీ సోదరులు, ఇక్బాల్, అబుల్ కలాం ఆజాద్, జాకీర్ హుస్సియన్, వంటి వారితో మంచి సంభందాలు ఏర్పడెను. ఇటువంటి ఇస్లామిక్ పండితుల పరిచయం తో ప్రవక్త(స) పట్ల గాంధీకి గౌరవం ఏర్పడినది మరియు అతనిని విశ్వ నాయకుడి గా గుర్తించెను. ప్రపంచవ్యాప్తం గా కోట్లాదిమంది ని ప్రభావితం చేసిన ప్రవక్త(స) గురించి మరింత వివరంగా గాంధీ తెలుసుకోదల్చేను.

ప్రవక్త జీవిత చరిత్ర తో పాటు గాంధీ తరచుగా దివ్య కొరాన్ చదేవే వారు. తన ప్రార్ధనలలో దివ్య ఖురాన్ లోని సురా ఫాతెహా భాగము వినిపించేవారు. గాంధీ అన్నారు : “ఎందుకు హిందువులు కొరాన్ దివ్యత్వమును విశ్వసించరు మరియు ఎందుకు భగవంతుడు ఒకడే అని నమ్మరు, ముహమ్మద్ ను అతని ప్రవక్త అని విశ్వసించరు? మన మతం సంకుచితమైనది కాదు విస్తృత మైనది” అని ప్రశ్నించేవాడు.

మహాత్మా గాంధీ దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స)జీవిత చరిత్ర అయన హదిసుల    మీద అనేక పుస్తకాలు చదివినానని  పేర్కొన్నారు. ( గాంధీ, 1949, 235) ఆయన మౌలానా సాహిబ్ యొక్క “ప్రవక్త జీవితం” మరియు “ఉస్వ-ఎ-సహాబా” చదివినాడు మరియు ఇస్లాం మతం ఇతర  మతాల ప్రార్థనా స్థలాలు నాశనం చేయమని ఎప్పుడూ చెప్పలేదని  పేర్కొన్నారు. ( గాంధీ, 1949, 139)

ప్రవక్త(స) తరచూ ఉపవాసం మరియు ప్రార్ధనలో తన జీవితం గడిపేవారు  మరియు ప్రవక్త(స) ఏనాడు సుఖమైన మరియు  విలాసవంతమైన జీవనo గడప లేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కి ఇస్లాం మతం పట్ల అపార గౌరవం ఉండేది. ( గాంధీ 1949, 94) ఇస్లాం బోధనలు  మరియు ఆచరణ లో ఇస్లాం యొక్క పద్ధతి కి మధ్య తేడా గమనించారు.గాంధీ  శాంతి మతం అని ఇస్లాం మతం భావిస్తారు.

గాంధీ అభిప్రాయం లో దివ్య ఖుర్ఆన్ లో మత మార్పిడి కి శక్తీ ఉపయోగించమని చెప్పలేదు అన్నారు. పైగా దివ్య ఖురాన్ లో ధర్మం విషయం లో ఎలాంటి బలవంతం లేదు అని చెప్పారు. ప్రవక్తలు అందరు   జీవితంలో మతం బలవంతం కాదు అని అంగీకరించడం జరిగింది. ఇస్లాం మతం దాని విస్తరణకు బలం మీద ఆధారపడాలని అనుకుంటే అది ఒక ప్రపంచ మతం హోదా ను కోల్పోవు తుంది అని  వాదించాడు. హరూన్-అల్ రషీద్, మామున్ (Mamun)రోజుల్లో ఇస్లాం మతం ప్రపంచం లో అత్యంత సహనం కల్గిన మతం గా ఉంది.

మహాత్మా గాంధీ, ఒక ముస్లిం వలే ఒక నిరాడంబరమైన ఇస్లామిక్ జీవితాన్ని గడిపాడు.
తన కొత్త పుస్తకం "ఫెయిత్ అండ్ ఫ్రీడం, మహాత్మా గాంధీ ఇన్ హిస్టరీ లో  అంతర్జాతీయంగా ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు ఢిల్లీ లో జామియా మిల్లియా ఇస్లామియా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముషిరుల్ హసన్  మహాత్మా గాంధీ యొక్క జీవితము మరియు వారసత్వం పై ఒక రహస్యమైన విషయం - ముస్లింలతో అతని సాంగత్యంను  వివరిస్తారు: మహాత్మా గాంధీ యొక్క ముస్లింల పట్ల అభిమానం  అతని జీవితాన్ని  బలి తిసుకోంది అని చెప్పుకుంటారు ఎందుకంటే, ఒక హిందూ మతోన్మాది 1948 లో అతడిని హత్యచేసాడు.

హసన్ పుస్తకం  ముస్లింలపై  మహాత్మా గాంధీ కి ఉన్న  అపారమైన ప్రేమను  తెలియజేస్తుంది. ఒకసారి జైలులో ఆయన ఆత్రుతగా కొందరు ముస్లిం  ఖైదీలకు పాటు ఈద్ చంద్రుని  అవలోకనం కోసం తన మెడ సారించి చూసారు.  - మహాత్మా గాంధీకి  ముస్లిం నాయకులతో గొప్ప వ్యక్తిగత అవగాహన ఉంది కానీ, హసన్ ప్రకారం గాంధీ కి ఒక "పరిమిత లేదా ఒక నిర్దిష్ట అవగాహన" ఇస్లాం పట్ల కలిగి ఉండేది. ఇది దక్షిణాఫ్రికా మరియు వర్తక గుజరాతీ ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రారంభ అనుభందం  ద్వారా నిర్దేశించబడుతుంది.

దివ్య ఖురాన్ 5.48,11.118,  అద్యయాలలో  వివరించిన "సమానత్వం, సహనం, సరళత్వం" అనే భావనలు గ్రంధ ప్రజల కోసం  వివరించిన 3.64 అధ్యాయం లో కుడా ఉన్నవి.  మహాత్మా గాంధీ యొక్క విశ్వాసం మత గ్రంధాల పై ఆధారపడినది. న్యాయం, దయ మరియు ధర్మానికి సంభందించిన  మానవాళి యొక్క గొప్ప ఆలోచనలు కొన్ని మతం నుండి వచ్చినవె? అని గాంధీ  భావం. మహాత్మా గాంధీ దేశ విభజన ఆపలేకపోయాడు.అతను కొత్తగా ఏర్పాటు పాకిస్థాన్ హక్కుల కు మద్దతు తెలిపాడు. అందువలననే రొమైన్ రోల్యాండ్ గాంధీని "మొర్తల్ డెమి-గాడ్"(Mortal Demy-God) గా పిలిచాడు.

 అబ్డుల్లాః సుహ్రవర్డి రచించిన “Sayings of Muhammad” అనే గ్రంధానికి ముందు మాట రాస్తూ మహాత్మా గాంధీ ఇలా ప్రకటించారు: "మనము మన మతం లాగ ఇతర మతాలను అర్ధం చేసుకొని గౌరవించనంత కాలం ఈ భూమి మీద శాశ్వత శాంతి ఉండదు."

MJ అక్బర్ దీన్ని మరింతగా విశదీకరించారు: " మహాత్మా గాంధీ యొక్క నిబద్ధతను కేవలం   ఒక మతానికి పరిమితం చేయలేము అతని   రామ రాజ్యo లో, ప్రతి మతానికి పూర్తి స్వేచ్ఛ మరియు పూర్తి సమానత్వం ఉంది. అతని ప్రార్థన సమావేశాలు లలో భగవద్గీత, పవిత్ర ఖురాన్, బైబిల్ మరియు గురు గ్రంథ సాహెబ్ కు చోటు ఉంది”.  

గాంధీ ప్రకారం దివ్య ఖురాన్ యొక్క ఆత్మ శాంతి భోధన తో కూడినది(గాంధి1949, 263,131). ఒక మతము దాని విశ్వాసుల ప్రవర్తన పై ఆధార పడి ఉంటది. ఇస్లాం లో విశ్వాసి ప్రవర్తన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినది (గాంధి 1949, 72).
ముస్లింలను ప్రేమ తో జయంచమని గాంధీ కోరినారు.(గాంధీ, 1949, 24, 26) ముస్లింల హృదయాలను అహింసా మార్గాన క్షమా గుణం అలవారచుకోవటం ద్వార గెలవాలని అదేవిధంగా ఒకరి తప్పులను ఒకరు క్షమించాలని కోరినారు. మత విషయం లో హింస పనికి రాదని గాంధీ అభిప్రాయ పడినాడు.  (గాంధీ 1949, 47)
తప్పును ఎదిరించాలిగాని తప్పు చేసిన వానిని కాదు అనే దానిని  గాంధీ నమ్మాడు(గాంధీ,1949, 163.) జీవించు, ఇతరులను జివించనీయుము(లైవ్ అండ్ లైవ్) అనేది గాంధీ ఉద్దేశం. గాంధీ ఈ సూత్రమును దివ్య ఖురాన్ గ్రంధం నుండి అబ్యసించినాడు(గాంధీ,1949, 236) గాంధీ అభిప్రాయం లో మతము, మనుషులను కలుపును గాని విడదియదు కాబట్టి ఇస్లాం కేవలం ముస్లింలను మాత్రమే కాకా అందరు మానవుల ఐక్యతకు సహాయపడును. ప్రవక్త ముహమ్మద్ యొక్క బోధనలు కేవలము ముస్లింలకు గాక సమస్త మానవాళికి వర్తించును. బిన్నముగా పలికిన వ్యక్తి ముస్లిం కాదు అనెను (గాంధీ,  1949, 310)
మహాత్మా గాంధీ బెంగాల్ పర్యటన లో తన వెంట గీత, దివ్య ఖురాన్, బైబుల్ గ్రంధాలను తీసుకోని వెళ్ళేవారు.  (గాంధీ 1949, 500) ఇస్లాం చదివి అర్ధం చేసుకోనే హక్కు  అందరికి ఉన్నదని నమ్మినాడు. ఇస్లాం సమస్త మానవాళికి అవతరించిన గ్రంధం అని నమ్మినాడు. తానూ అన్ని మతాలకు  చెందిన వాడినని గాంధీ భావించెను.(గాంధీ, 1949, 538) తన ప్రార్ధన లలో గాంధి కురానే షరిఫ్ నుంచి కొన్ని సూక్తులను ఉల్లేకిoచే వారు. కురాన్ సూక్తులు లేకుండా తన ప్రార్ధనలు నిర్వహించే వారు కాదు. (గాంధి,1949, 584).
ప్రవక్త ముహమ్మద్(స) ను తన ప్రవక్త గా ఎందుకు భావించ రాదు అని ప్రశ్నించే వారు?  (గాంధీ 1949, 589)

నిజమైన విశ్వాసి నాలుక మరియు చేతుల యందు మానవాళి సురక్షితంగా ఉండును అనే ప్రవక్త(స) హదీసు అందు మహాత్మా గాంధీ కి నమ్మకముంది. అదేవిధంగా తను కోరుకొన్నది తన సోదరుడి కి కుడా విశ్వాసి కోరును మరియు జిహాద్ అనగా ఆత్మ (అహం) ను జయిoచుట, కష్టం లో ఉన్న తోటి మానవునకు సహయపడమన్న  ప్రవక్త(స) వాక్కుల అందు  గాంధీజీ విశ్వాసం ఉంచెను. (గాంధీ,1949, 509)

గాంధీ ఖలీఫా  అలీ మరియు అతని కుమారులు హసన్ మరియు హుస్సియన్ పట్ల అమిత గౌరవం ప్రదర్శించేవాడు. నిరంకుశత్వం కు  వ్యతిరేకంగా అలీ కుమారుల  పోరాటం తనకు ప్రేరణ అని అన్నారు.
గాంధీ వివిధ మతాల మద్య పరస్పర విశ్వాసం మరియు గౌరవం కొరకు మతాంతర వివాహములను కోరుకొనెను. గాంధీ కి రాజ్య మతం లో విశ్వాసము లేదు. అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం ను కోరుకొనెను. (గాంధి,1949, 543) 



22 September 2016

సమకాలిన సమయం లో గాంధేయ విలువల ఔచిత్యం.



"మీ నమ్మకాలు,మీ ఆలోచనలు. మీ ఆలోచనలు, మీ పదాలు.మీ పదాలు, మీ చర్యలు.
మీ చర్యలు, మీ అలవాట్లు. మీ అలవాట్లు,మీ విలువలు.మీ విలువలు,మీ విధి గా మారును.” -మహాత్మా గాంధీ.

అహింస, సత్యం మరియు సామాజిక న్యాయం పై మహాత్మా మహాత్మా గాంధీ యొక్క భావాలు  ప్రపంచానికి అనుసరించవలసిన  ఒక నమూనా గా మారినివి. గతంలో భారతదేశం పాశ్చాత్య ప్రపంచo ప్రత్యేకించి ఐరోపావాసుల దృష్టి లో   సంగీతకారుల మరియు పాములను ఆడించేవారి దేశం గా ఉoడేది.

క్రమoగా మహాత్మా గాంధీ ప్రచారం చేస్తున్న విలువలు ప్రపంచ దృష్టిని ఆకర్షించినవి  మరియు హింస మరియు ద్వేషం నిండిన సమాజం లో సమానత్వo మరియు అత్యుతమ నైతిక విలువలు పెంపొందేంచేoదుకు కావలసిన నైతిక శక్తీ ని అందించినవి.

ప్రపంచదేశాలలో మారుతున్న ఈ గుర్తింపును  ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహాత్మా గాంధీని  శ్లాఘించడం  లో గుర్తించవచ్చు. 1939 లోఐన్స్టీన్ మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం 70 వ వార్షికోత్సవoలో అన్నారు: "రాబోయే తరాల వారు ఇటువంటి ఒక సాధారణ నిరాడంబర మనిషి ఒకరు ఈ భూమి మీద నడిచారు అని ప్రగాడం గా విశ్వసిస్తారు”

యువతరానికి మహాత్మా గాంధీ యొక్క సందేశం “సత్యం మరియు అహింస” అనే  రెండు ప్రధానమైన నియమాల చుట్టూ నిర్మించబడింది. అతని నినాదం "నిర్భయo గా  ఉండు" అనునది యువతకు  ఒక ప్రేరణ అయినది. అతను తన తోటి సహోదరుల కొరకు త్యాగం, కరుణ మరియు అంగీకారం అనే  విలువలను తన దేశ వాసులకు  బోధించాడు.

మహాత్మా గాంధీ సామాజిక మార్పు తీసుకురావటం లో యువ శక్తి  యొక్క ప్రాముఖ్యతను  అర్థం చేసుకోనినాడు  మరియు వారి  శక్తిసామార్ధ్యాలను అతను స్వాతంత్ర్యోద్యమo లో సమర్థవంతంగా వినియోగించుకొన్నాడు.

యువత సహజంగా తోటి మానవుల పట్ల  కారుణ్యo ప్రదర్శిస్తుంది మరియు సామాజిక మార్పు కోసం సాధన చేస్తుంది. మహాత్మా గాంధీ సాధారణ పురుషులు మరియు మహిళల నుండి  గొప్ప నాయకులను    రూపొందించాడు  మరియు హింస చూపే వారికి తన ఆదర్సలలో చోటు నివ్వలేదు. మహాత్మా గాంధీ కార్మిక గౌరవాన్ని   మరియు మానవతా  విలువలను   నొక్కి వక్కాణించారు. దురదృష్టవశాత్తు మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలు మరియు ఆలోచనలు పూర్తిగా వినియోగించబడలేదు. గాంధీతత్వాన్ని సార్వత్రికంగా అందరికి  ముఖ్యంగా  యువకులలో ప్రచారం చేయవలనసిన ఆవసరం ఉంది.

నేడు మహాత్మా గాంధీ పేరు జాతి, ప్రాంతం మరియు మతం యొక్క పరిధులను దాటి విస్తరించి ప్రస్తుత కాల భవిష్య వాణిగా ఉద్భవించింది. అతను అహింస మరియు మానవతావాదం యొక్క చిహ్నం గా పేరుగాంచాడు.  పూర్వం బుద్ధ భగవానుడు మరియు  మహావీర జైనుడు కుడా  “అహింస” ను ప్రతిపాదించారు కాని దానిని సామాజిక మార్పు కోసం ఒక సమర్థవంతమైన సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో  మహాత్మా గాంధీ చూపారు.

తన పుస్తకం "సత్యా అన్వేషణ లో నా ప్రయోగాలు” లో మహాత్మా గాంధీ అన్నారు: "నేను ఈ ప్రపంచంలో “సత్యం” అంటూ  కొత్తదానిని  ఏమీ బోధించలేదు. సత్యం మరియు అహింసా అనునవి వృక్షాలు మరియు పర్వతాలు అంత ప్రాచీనమైనవి". అతను ప్రపంచానికి సత్యం మరియు అహింస యొక్క ప్రాముఖ్యతను చూపించటం లో విజయం పొందాడు.

మహాత్మా గాంధీ ని అధ్యయనం చేసిన ఆర్నాల్డ్ టోయిన్బి అనే ప్రసిద్ధ చరిత్రకారుడు, ఒకసారి అన్నారు: “నేను జన్మించిన తరం లో   రష్యాలో స్టాలిన్ మరియు యూరప్  లో హిట్లర్ మరియు భారతదేశం లో మహాత్మా గాంధీ జన్మించారు. వీరందరి కన్నా మానవ చరిత్రపై మహాత్మా గాంధీ యొక్క ప్రభావము ఎక్కువ అని  విశ్వాసం తో చెప్పాగలను”.

ఒకానొక సందర్భంలో, మహాత్మా గాంధీ ఇలా అన్నారు "అహింస అనునది నెమ్మదిగా వృద్ధి చెందే వృక్షం. ఇది నెమ్మదిగా కానీ తప్పనిసరిగా పెరుగుతుoది". అతను సార్వత్రిక మానవ విలువల కోసం కృషి చేసాడు మరియు అతని జీవితం 21 వ శతాబ్దంలో మనకు మార్గదర్శకం. మహాత్మా గాంధీ భారతదేశం కోసం ఒక కల గన్నాడు కాని నేడు ఆ కల  ఒక పీడకలగా  మారింది.

నేడు మనం మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఒకరకమైన సర్దుబాట్లతో కూడిన  జీవితం కొనసాగించున్నాము.  ప్రజాస్వామ్య విలువలు చెక్కుచెదరకుండా చూడవలసిన బాద్యత మన భుజస్కందాలపై ఉంది. దీని  కొరకు  మనం సామాజిక న్యాయం మరియు లింగ సమానత్వం సాదించాలి. మత సామరస్యాన్ని మరియు మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలి. మనము ఇవి  సాధించగలిగితే  మహాత్మా గాంధీ కల ను నెరవేర్చడం  లో సహాయ పడినట్లే.

మహాత్మా గాంధీ గారి వదిలి పెట్టిన అసంపూర్తి పని మన  ముందు ఉన్న  ఒక పెద్ద సవాలు. గాంధీజీ కి మార్పు కోసం  వ్యక్తి యొక్క సామర్థ్యo లో అనంత విశ్వాసం ఉంది. అతను మానవ స్వభావం రాడికల్ రియోరియంటేషన్ కలిగి ఉందని నమ్ముతాడు అందుకు కావలసింది తనను తానూ స్వయంగా విశ్లేశించుకొనే సామర్థ్యం కలిగి ఉండటమే అని నమ్ముతాడు.

ఆధ్యాత్మిక మరియు నైతిక వృద్ధి మార్గం లో మానవత్వం ను తీసుకోవాలని మహాత్మా గాంధీ తన జీవితమంతా ప్రయత్నించారు. అనేక యుగాలుగా అభివృద్ధి చెందిన మానవ  నాగరికత పురోగతి మానవ స్వభావం  మంచి కోసం మార్పు చెందగలదు అనే దానికి ఒక  సాక్ష్యం గా చెప్పవచ్చు.
సమకాలీన సంక్షోభానికి కారణాలను విశ్లేషించేప్పుడు సామాజిక రుగ్మత మరియు ప్రస్తుత హింసాత్మక విధానాల  మూలాలను జాగ్రత్తగా విశ్లేషణ చేయవలన అవసరం ఉందని గుర్తుంచుకోండి.అలాగే మన జీవిత శైలి మరియు సామాజిక ఆర్ధిక సంస్థల పునర్నిర్మాణo  రాడికల్ నైతిక విధానాల మీద ఆధార పడి ఉందని గుర్తుంచుకోండి.

మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనలకు  లక్ష్యం దిశగా మానవ సమాజం ను ముందుకు తీసుకొనివెళ్ళే  బలం ఉంది. ప్రపంచంలో పాలకులు కన్నా సామాన్య  మానవుని  ఆలోచనలు   వ్యక్తిగతంగా శక్తివంతమైనవి అని చెబుతారు.

మహాత్మా గాంధీ ప్రపంచంలోని  కూడలి వద్ద శాంతి కి చిహ్నంగా మారారు. మనం మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఈనాడు  చాలా  ఉంది. 1937 మరియు 1948 మధ్య నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేయబడిన మహాత్మా గాంధీ కి ఆ అవార్డు రాలేదు, అందుకు భగవంతునికి ధన్యవాదాలు కారణం ఆ జాబితా లో హిట్లర్ పేరు ఉండటమే.