-
ప్రపంచ చరిత్ర పరిశిలించిన ప్రపంచం లోని అన్ని దేశాలలో వాటి స్థాపకులు / పాలకులు ప్రకటించిన కొన్ని
చట్టాల ప్రకారం రాజ్యాంగాలు అమలు చేయబడ్డాయి. కాలానుగుణంగా హమ్మురాబి రుపొందిoచిన
లిఖిత సూత్రాల నుండి నేటి రాజ్యాంగాల వరకు ఒప్పందాలు (treaties) గణనీయంగా మార్పు చెందాయి.
అనేక మంది చరిత్రకారులు ఆంగ్ల మాగ్న కార్టాను (English Magna Carta) మొదటి లిఖిత రాజ్యాంగo గా పరిగణించారు. కాని 20 వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ ముస్లిం పరిశోధకులు మరియు పండితుడు అయిన డాక్టర్
ముహమ్మద్ హమీదుల్లాహ్ యొక్క పరిశోధన ప్రకారం, మదీనా చార్టర్
(మితక్-ఉల్-మదీనా) Charter of Madina (Mithaq-ul-Madina) మానవజాతి రచించిన మొదటి లిఖిత రాజ్యాంగం. 1787 నాటి అమెరికన్ రాజ్యాంగం మరియు 1215 నాటి ఆంగ్ల మాగ్న కార్టా కన్నా మదీనా
చార్టర్ ప్రాచినమైనది.
మదీనా యొక్క చార్టర్ యొక్క పూర్వ చరిత్ర:
ముహమ్మద్ ప్రవక్త (స) అల్లాహ్ యొక్క సందేశాన్ని13 ఏళ్ల పాటు
మక్కాలో ప్రతిపక్షం ను ఎదుర్కొంటూ ప్రచారం
చేసారు. ముహమ్మద్ ప్రవక్త (స)622 A.D. లో యాత్రీబ్ యొక్క అరబ్ తెగల నుండి ఆహ్వానాన్ని పొందిన తరువాత తన అనుచరులతో కలిసి
యాత్రీబ్ (మదీనా) కు వెళ్ళారు.
ఆ సమయంలో, యాత్రీబ్ ఒక బహుళజాతి జనాభాతో వివిధ మతాల
ప్రజలతో కూడిన బహుళ సమాజం. అక్కడి గిరిజనులు నిరంతర కలహాల్లో నిమగ్నమయ్యారు మరియు వివాదాలు
తరచుగా తరాల తరబడి జరిగేవి. అక్కడ అవ్స్
మరియు ఖజ్జరాజుల (Aws and Khazraj) మధ్య విభజింపబడిన అరబ్ పన్నెండు
తెగలు మరియు బాను నజీర్, బాను ఖురైజా మరియు బాని ఖైనుకా (Banu Nazeer, Banu Quraiza and Bani Qainuqa).క్రింద విభజింపబడిన పది యూదు జాతులు ఉన్నాయి.
మదీనాలో నిరంతర అస్థిరత వలన చివరికి అక్కడి నివాసితులు శాంతి కోరుకొన్నారు. వారు
ఒక ప్రముఖ గిరిజన అధినేత, అబ్దుల్లా ఇబ్న్ ఉబే బిన్ సలూల్ (Abdullah ibn Ubay bin Salool) తమ నేతగా శాంతి
మరియు సామరస్యాన్ని సాధించటానికి అంగీకరించారు. ఈ సమయంలో, ప్రవక్త ముహమ్మద్ (SAW) మదీనా వచ్చారు. ప్రవక్త(స)ను గౌరవప్రదమైన, నిజాయితీగల
మరియు విశ్వసనీయ వ్యక్తిగా భావించినందున, మదీనా ప్రజలు త్వరలోనే
మదినా కు అధిపతిగా ఆయనను కోరుకొన్నారు.
మదీనా చార్టర్ యొక్క సృష్టి (Creation of the
Charter)
మదీనాలో ఒక ప్రధాన పాత్ర పోషించిన తర్వాత, ముహమ్మద్ (స) కొన్ని
ముఖ్యమైన అవసరాలని గుర్తించారు:
·
స్థానిక జనాభా యొక్క హక్కులు మరియు బాధ్యతలను నిర్ణయించడం మరియు మక్కా నుండి
వచ్చిన వలసదారుల హక్కులు మరియు బాధ్యతలను నిర్ణయించడం
·
మదీనా యూదుల తో శాంతి మరియు సామరస్యాన్ని సాధించడానికి వారితో ఒప్పందాలు
చేసుకోవడం
·
దండయాత్రల నుంచి నగరాన్ని రక్షించడానికి వ్యూహాన్ని మరియు ప్రణాళికను రూపొందిoచడం.
·
వలసవచ్చినవారికి జీవనోపాధి కోసం వనరులను అందుబాటులో ఉంచడం.
మదీనాలో ఒక బలమైన కేంద్రీకృత ప్రభుత్వo మరియు
మదీనాలోని అంతరంగిక సంక్షోబాన్ని నివారిoచడానికి ఒక చార్టర్(రాజ్యాంగం) రుపొందించవలసిన అవసరం
ఏర్పడినది. చార్టర్ ఇబ్న్ ఇషాక్ మరియు అబూ ఉబాయిద్ పండితులచే రూపొందించ బడినది.
ఇది రెండు భాగాలుగా విభజించబడింది; మొదటి భాగం ముస్లిం
వలసదారుల (ముహజిర్లు) మరియు ముస్లిం స్థానికుల (అన్సార్) నియమ నిభంధనలతో వ్యవహరిస్తుంది
మరియు రెండో భాగం మదీనాలోని యూదుల హక్కులు మరియు బాధ్యతలతో వ్యవహరిస్తుంది.
ఈ చార్టర్ 47 ఉపభాగాలు కలిగి ఉంది మరియు ఒక సార్వభౌమ
జాతీయ రాజ్యంలో ముస్లింలు, యూదులు మరియు పాగాన్లు, సాధారణ పౌరసత్వం (common citizenship) క్రింద సమాన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉంటారు..
చాలామంది చరిత్రకారులు చార్టర్ రెండు దశల్లో అభివృద్ధి చేయబడిందని అభిప్రాయపడ్డారు:
మొదటి భాగం బదర్ యుద్ధం పూర్వం వ్రాయబడినది మరియు రెండో భాగం లో యూదులతో సంబంధాలు కలవు. బదర్ యుద్ధం తరువాత ముస్లింలు మరింత బలసంపన్నులు
అయినారు.
ఈ చార్టర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు:
• చార్టర్ లో ఉన్న అన్ని పార్టీలు, అనగా ముస్లింలు, పుస్తకంలోని ప్రజలు (యూదులు మరియు క్రైస్తవులు)
మరియు అన్యమతస్థులకు మత స్వాతంత్ర్యం కలదు.
• మదీనా రాజ్యం లోని అందరు పౌరులు సమాన హక్కులు
మరియు బాధ్యతలు కలిగి ఉన్నారు మరియు అణచివేతకు వ్యతిరేకంగా రక్షించబడుతారు.
• ప్రతి తెగ మరియు గిరిజనుల మధ్య ఆర్ధిక సహాయం
యొక్క వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. విమోచన లేదా రక్త-డబ్బు(blood-money)
చెల్లించాల్సిన సమయాలలో ఉపయోగించటానికి సమాజ నిధులు ఏర్పాటు చేయబడ్డాయి
• ఒక తెగపై బయటి నుండి యుద్ధం లేదా శత్రు దాడి జరిగితే, మదీనా లోని అన్ని తెగలు (చార్టర్ యొక్క సంతకందారులు) భాదిత తెగకు
అండగా సహాయ-సహకారం అందిస్తారు.
• సంతకాదారుల మధ్య వివాదం జరిగినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ (SAW) వివాదాన్ని పరిష్కరించడానికి చివరి అధికారం
కలిగి ఉన్నారు.
• మక్కా యొక్క ఖురైషులు అన్ని సంతకందారులచే
వాణిజ్యపరంగా బహిష్కరించబడ్డారు మరియు వారు ఎటువంటి మద్దతును పొందలేరు.
మదీనా చార్టర్ యొక్క ప్రాముఖ్యత (Significance of the Charter of Madinah)
ఇది ముస్లిం చరిత్రలోనే కాదు,
ప్రపంచ రాజ్యాంగ
చరిత్రలో కూడా ఒక మైలురాయి పత్రం. ఈ చార్టర్ మదీనాలో రాజకీయ, మత మరియు సామాజిక జీవితంతో సహా జీవితంలోని అన్ని అంశాలను మార్చివేసింది. మదీనా
చార్టర్ అతి పెద్ద ఘనత మదీనా లోని అన్ని పోరాట తెగలు కలిసి ఒక రాజకీయ ఏర్పాటు
మరియు వాటిలో దీర్ఘకాల శాంతి నెలకొల్పడానికి మరియు అశాంతిని నిర్మూలించడానికి
అoగీకరించినవి. జీవితం, స్వాతంత్ర్యం, ఆస్తి మరియు అందరు
ప్రజల మత స్వాతంత్ర్యం వంటి హక్కులకు రక్షణ కల్పించింది. ఇది అందరు పౌరులకు సమాన హక్కులు మరియు బాధ్యతలు తో ఉండిన ఒక నూతన
రాజ్యం సృష్టించింది. మదీనా చార్టర్
సాంప్రదాయ గిరిజన బంధాన్ని కొత్త సాంఘిక క్రమంతో భర్తీ చేసి ఒక నూతన సాంఘిక
ఫాబ్రిక్ తో నూతన మదీనా రాజ్యం ను సృష్టించింది.
డాక్టర్
హమీదుల్లా “ది ఫస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ (The First Written Constitution)”,
"ఈ కొత్త రాజ్యాంగం ... చాలా ముఖ్యమైనది, అరేబియాకు చాలా ముఖ్యమైనది,
న్యాయం కోరే ప్రజలకు ఒక ప్రజా సంస్థ ను అందించడం ద్వారా చాలా విప్లవాత్మక మార్పు మరియు మెరుగుదల
సాధించినది. ఇది ఈ యుగపు నూతన తయారీ ఆవిష్కరణ ... గిరిజనవాదం యొక్క గందరగోళానికి అన్ని
సమయాల్లో ముగింపు తెచ్చింది మరియు ఇది ఒక విస్తృత ప్రాతినిద్య రాజ్యం ను
ఏర్పరిచినది. " అని అన్నారు.
No comments:
Post a Comment