26 November 2017

యువత యొక్క ప్రాముఖ్యత(The Importance of Youth)




ముస్లిం యువత తమ  సమయం, ప్రతిభ, డబ్బు సరియిన మార్గం లో వినియోగించడం  ద్వారా ఇస్లాం వ్యాప్తి కి దోహదం చేయగలరు. వారు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటo లో  ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి మరియు జీవితంలోని అన్ని రంగాలలో ఇస్లాం ధర్మం అనుసరించాలి అనే లక్ష్యంతో పని చేయాలి. యువత ఇస్లాం గురించి జ్ఞానం సంపాదించి మరియు అల్లాహ్ ఇచ్చిన సమయం మరియు ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమ  జీవితాన్నిసార్ధకం చేసుకోవాలి.

యువ్వనం  మన జీవితంలో స్వర్ణ యుగం. యవ్వనం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఎందుకంటే వ్యక్తి మార్గం ఎంచుకోవటానికి  ఇది వేదిక. మార్గం సరైనది కావచ్చు లేదా తప్పు కావచ్చు. ఈ వయస్సులో, సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తమ పిల్లలను మార్గనిర్దేశం చేసేందుకు తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు.  విజయవంతమైన వారు తప్పు మార్గాన్ని అనుసరించనివ్వకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయం తర్వాత పిల్లలను  సరైన మార్గంలో తిరిగి తీసుకురావడం గురించి ఆలోచిoచటం  చాలా కష్టం అవుతుంది.
ప్రతి ప్రయాణం ఒక్క అడుగు తో  ప్రారంభమవుతుంది, కానీ మొదటి అడుగు తప్పు దిశలో పడినట్లయితే, పూర్తి జీవితం తప్పు మార్గంలో ఉంటుంది మరియు సరైన మార్గంలో వచ్చే అవకాసం చాలా కష్టం అవుతుంది. కొందరు యువకులు అనుభవించటానికి ఇది సరియిన సమయం మరియు కళాశాల నుండి బయటకి వచ్చిన తర్వాత సరైన మార్గం లో పయనిoచుదాము అని అనుకుంటారు కానీ సరైన మార్గానికి తిరిగి రావడం అసాధ్యం అని వారికీ  తెలియదు.
 ప్రవక్త ముహమ్మద్( స)తీర్పు దినాన అల్లాహ్ యొక్క నీడలో ఆశ్రయo పొందే  ఏడు రకాల వ్యక్తుల జాబితా ఇచ్చారు.
వారు:
1. పరిపాలకుడు
2. తన యవ్వనాన్ని దేవుని ఆరాధన మరియు సేవలో గడిపిన యువకుడు
3. మస్జిద్ కొరకు తమ హృదయం అంకితం చేసిన వ్యక్తి.
4. దేవుని కొరకు పరస్పరం ప్రేమిoచుకొనే  ఇద్దరు వ్యక్తులు
5. దేవుని భయం తో పాపము చేయని వ్యక్తి.
6. తన దాతృత్వాన్ని రహస్యంగా ప్రదర్శన లేకుండా వ్యవరించే వ్యక్తి మరియు
7. ఒంటరిగా కన్నీరుతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వ్యక్తి.
(రియాద్-మాస్-సలీహెన్, హదీసులు 376)

ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన ఈ హదీసు ద్వారా మనము ప్రవక్త (స) యవ్వనానికి  ఇచ్చిన ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సైతాను సులభంగా వ్యక్తిపై నియంత్రణ పొందటానికి   మరియు తప్పు మార్గాన్ని చూపటానికి   ఇది వేదిక. కాబట్టి ఈ దశలో వ్యక్తి మంచి కార్యక్రమాల పై అవగాహన కలిగి ఉండాలి మరియు సైతాను కి దూరంగా ఉండాలి.

ముస్లిం యువత దృష్టి కేంద్రీకరించే మూడు సాధారణ ప్రాంతాలు క్రింది విధంగా ఉన్నాయి
1. తల్లిదండ్రుల పట్ల  విధేయత మరియు గౌరవం చూపాలి.
2.సమయం ను సమర్థవంతoగా వినియోగించాలి.  (సమయం వృధా నివారించడం).
3. ఇస్లాం మతం నిషేధించబడిన వాటిని చూడటం, వినటం చేయరాదు.

యవ్వనంలో చాలామంది తమకు  ప్రతిదీ తెలుసు అని భావిస్తారు; కొంతమంది తమ తల్లిదండ్రుల కంటే తమకు ఎక్కువ తెలుసు అని భావిస్తారు. ఈ రకమైన వైఖరి కారణంగా వారు వారి తల్లిదండ్రుల పట్ల  అవిధేయులయ్యారు. పిల్లలు ఒక నిర్దిష్ట రంగంలో మరింత జ్ఞానాన్ని పొందువచ్చు కాని  అనుభవం లో వారు వారి తల్లిదండ్రుల కంటే తక్కువ. మన తల్లిదoడ్రులు మనకoటే ఎక్కువ జ్ఞానవoతులు, అనుభవశాలురు  అని  ఆలోచిoచి మనo వారి పట్ల  విధేయత, గౌరవo చూపాలి.

ముహమ్మద్ ప్రవక్త (స) ఇలా అన్నారు: "చాలామంది ప్రజలు కోల్పోయే రెండు దీవెనలు ఉన్నాయి: అవి ఆరోగ్యము మరియు  మంచి చేసే  సమయం కి సంభందించినవి. " (బుఖారి)
ఈ హదిసు ద్వారా అల్లాహ్ ఇచ్చిన అనేక బహుమతులలో సమయం మరియు ఆరోగ్యం అమూల్యమైన బహుమానాలు గా భావించాలి  మరియు సరైన ప్రయోజనం కోసం వాటిని వాడాలి. సూరా అల్ అస్ర్ లో అల్లాహ్ కాలపు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కానీ ఈ రోజు మనం యువత లో చాలామంది తమ సమయం వృథా  చేస్తున్నారు మరియు ఇస్లాం నిషేదించిన వాటి కొరకు తొందర పడుతున్నారు.

ఇమామ్ అలీ ఇబ్న్ అబి తాలిబ్ (రాయ్) ఇలా అన్నాడు: "రెండు  విషయాలను  ప్రజలు వాటిని కోల్పెయే వరకు వాటి గొప్పతనాన్ని గుర్తించలేరు: అవి  యవ్వనం మరియు మంచి ఆరోగ్యం."మన కోరికల మీద పూర్తి నియంత్రణ లేక  మరియు ఇస్లాం ధర్మంలో నిరాకరించబడిన మరియు నిషేధించబడిన విషయాలకు మనము ఆకర్షించబడుతున్నాము. ఇది కొంత సమయం వరకు మనకు  భౌతిక ఆనందాన్ని ఇవ్వవచ్చు కాని అది హానికారకం.

నేటి యువత ఇస్లాంకు సేవ చేయాలనే లక్ష్యం గా కలిగి ఉండాలి.  ముస్లిం యువత తమ  సమయం, ప్రతిభ, డబ్బు సరియిన మార్గం లో వినియోగించడం  ద్వారా ఇస్లాంవ్యాప్తి కి దోహదం చేయగలరు. వారు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటo లో  ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి మరియు జీవితంలోని అన్ని రంగాలలో ఇస్లాం ధర్మం అనుసరించాలి అనే లక్ష్యంతో పని చేయాలి. యువత ఇస్లాం గురించి మంచి గా జ్ఞానం గ్రహించి మరియు అల్లాహ్ ఇచ్చిన సమయం మరియు ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమ  జీవితాన్నిసార్ధకం చేసుకోవాలి.

అల్ ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "ఆయన తన ప్రవక్తను మార్గదర్శకత్వం మరియు సత్య ధర్మాన్ని ఇచ్చి పంపించాడు, అది  అన్ని ధర్మాలపై  ఆదిక్యం కలిగి ఉండేలా చేయటానికి, ఈ వాస్తవానికి  అల్లాహ్ సాక్ష్యంగా సరిపోతాడు" (అల్ ఫాతా, 48: 28)

ప్రవక్త ముహమ్మద్ (స)లక్ష్యం  ప్రతి ముస్లిం యొక్క లక్ష్యంగా ఉండాలి. కానీ నేటి యువత ఏ లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. వారు తమ  భౌతిక కోరికలను సంతృప్తిపరిచే ప్రాథమిక లక్ష్యంతో జీవిస్తున్నారు.

అల్లాహ్ ఒక్కడే మరియు ప్రతిదీ అల్లాహ్ మాత్రమే ఇవ్వగలడు అనేది  మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత మనము ప్రతిదీ అల్లాహ్ కోసం ఖర్చు చేయాలి మరియు అల్లాహ్  ను సంతృప్తి పరచటానికి కృషి చేయాలి.

ముస్లిం యువత భవిష్యత్ ఇస్లామిక్ నాయకులు, కాబట్టి దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణిక సున్నహ్ నుండి ఇస్లాం గురించి సరైన జ్ఞానం పొందాలి. సరైన దృక్పథంలో ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముస్లిం యువత పూర్తిగా ఇస్లాం ధర్మాన్ని అనుసరించడానికి అల్లాహ్ సహాయం చేస్తాడు
- అమీన్



No comments:

Post a Comment