1 November 2017

హరూన్ మరియు మామున్ ఇస్లామిక్ స్వర్ణ యుగo లో పరిపాలకులు


ఇస్లామిక్ నాగరికత తూర్పు మరియు పశ్చిమం నుండి కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచినది. ముస్లింలు ఈ ఆలోచనలను తీసుకున్నారు మరియు వాటిని ఇస్లామికరించారు. అందులో ఇస్లామిక్ కళ, వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్, మ్యూజిక్, తత్వశాస్త్రం మరియు నైతికశాస్త్రం ఉన్నాయి.  ఫిక్హ్ ప్రక్రియ మరియు సామాజిక సమస్యలకు దాని ఉపయోగం చాలా కాలంగా అమలులో ఉంది.

హారూన్ అల్-రషీద్ (ఆంగ్లము : Hārūn al-Rashīd) (అరబ్బీ మరియు పర్షియన్ : هارون الرشيد ); ఇంకనూ హారూన్ అర్-రషీద్హారూన్ అల్-రాషిద్హారూన్ రషీద్ అని కూడా పలుకుతారు.ఇతను 786 లో ఇరవై రెండు ఏళ్ళ యువకుడిగా సింహాసనాన్ని అధిష్టించాడు.వెంటనే అంతర్గత తిరుగుబాటులు మరియు బాహ్య దాడిని ఎదుర్కొన్నాడు. ఆఫ్రికాలో ప్రాంతీయ తిరుగుబాటులు అణిచివేయబడ్డాయి.ఈజిప్ట్ లోని  క్వైస్ మరియు క్వజాల నుండి గిరిజన తిరుగుబాట్లు మరియు అలావిస్ నుండి సెక్టారియన్ తిరుగుబాట్లు నియంత్రించబడ్డాయి. బైజాంటైన్స్ సంధికి  అంగికరించి కప్పం కట్టసాగరు.

తదుపరి 23 సంవత్సరాలు అతను అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు చైనా,భారతదేశం మరియు బైజాంటియమ్ సరిహద్దులతో కూడిన ఒక విశాలమైన మహా సామ్రాజ్యాన్ని పాలించాడు. అతని సామ్రాజ్యం లో ఆలోచనలు కాంటినెంటల్ విభేదాలు లేకుoడా అంతటా స్వేచ్ఛగా ప్రవహిoచ సాగాయి. అతని హురాన్ సామ్రాజ్యం ఒక అద్భుతమైన నాగరికత యొక్క ప్రతిబింబం. ఇతను 786 నుండి 809 వరకు పాలించాడు, ఇతని కాలంలో శాస్త్రీయ, సాంస్కృతిక మరియు ధార్మిక విషయాలు ఉత్థాన దశలో వుండేవి. ఇతడి దూరదృష్టివలన కళలు, సంగీతం మున్నగునవి అభివృద్ధి చెందాయి. ఇతను ఓ పెద్ద గ్రంథాలయం బైతుల్ హిక్మాను స్థాపించాడు.
ప్రఖ్యాతమైన వెయ్యిన్నొక్క రాత్రులు అరేబియన్ నైట్స్ గ్రంధం  ఇతడి ప్రాశస్తాన్ని కొనియాడుతూ వ్రాయబడింది. హారూన్ రషీద్ కాలంలో బాగ్దాదు బాగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలూ అభివృద్ధికి నోచుకున్నాయి. ఖలీఫాల రాజధానిగా మారడంతో నిర్మాణాలు, కళలూ, జీవనశైలీ, అత్యాధునిక శాస్త్రాలు జీవం పోసుకున్నాయి.
అది ఇస్లాం యొక్క స్వర్ణయుగం. అతని సామ్రాజ్య గొప్పతనం మానవ మేధాశక్తి, మరియు నూతన ఆలోచనల ఆవిష్కారం గా ఉంది. సామ్రాజ్యం వృద్ధి చెందడంతోదానికి   సంప్రదాయ గ్రీకు, భారతీయ, జొరాస్ట్రియన్, బౌద్ధ మరియు హిందూ నాగరికతల నుండి వచ్చిన ఆలోచనలతో సంబంధం ఏర్పడింది. అల్ మన్సూర్ కాలం లో ప్రారంభమైన  శాస్త్ర గ్రంథాల అనువాదం హరున్ మరియు మమున్ కాలం లో ఊపు అందుకొన్నది.

హారూన్ బైత్ ఉల్ హిక్మా (జ్ఞానం యొక్క ఇల్లు) అనువాదం యొక్క పాఠశాలను స్థాపించాడు మరియు జ్ఞానులతో సానిహిత్యం పెంచుకొన్నాడు.   అతని పరిపాలన అసాధారణమైన పరిపాలనా సామర్థ్యాలు గల బెర్ముసైడ్స్ వజీర్ల చేతిలో ఉంది. అతని ఆస్థానం లో గొప్ప న్యాయశాస్త్రవేత్తలు,  వైద్యులు, కవులు, సంగీతకారులు, తర్కవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, రచయితలు, శాస్త్రవేత్తలు, సాహిత్య మరియు సాంస్కృతిక  వేత్తలు మరియు ఫిఖ్ యొక్క పండితులు ఉన్నారు. రసాయన  శాస్త్రాన్ని కనుగొన్న ఇబ్న్ హేయాన్ (815) అతని ఆస్థాన శాస్త్రవేత్త. అనువాదంలో పాలుపంచుకున్న పండితులు ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, జొరాస్ట్రియన్లు మరియు హిందువులు. వారిని అతడు పోషించాడు.

 గ్రీస్ నుండి సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, గాలెన్, హిప్పోక్రాటిక్స్, ఆర్కిమెడిస్, యుక్లిడ్, టోలెమి, డెమాస్తెనెస్ మరియు పైథాగోరస్ రచనలు వచ్చాయి. బ్రహ్మగుప్తా యొక్క సిద్ధాంతo, భారతీయ సంఖ్యలు, సున్నా మరియు ఆయుర్వేద ఔషధం మొదలగు భావనలతో భారతదేశం నుండి ఒక ప్రతినిధి బృందం వచ్చింది. చైనా  నుండి రసవాద శాస్త్రం మరియు కాగితం, పట్టు మరియు కుండల సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. జొరాస్ట్రియన్లు పరిపాలనవ్యవసాయం మరియు నీటిపారుదల శాఖలలో ప్రతిభను తీసుకువచ్చారు. ముస్లింలు ఈ వనరుల నుండి నేర్చుకున్నారు మరియు ప్రపంచానికి ఆల్జీబ్రా, కెమిస్ట్రీ, సోషియాలజీ మరియు ఇన్ఫినిటీ భావనలను అందించారు.

ముస్లింలకు ఇతర నాగరికతలతో పరిచయం ఏర్పర్చుకోవాలనే కోరిక కలిగింది.  ముస్లింలు ఇతర నాగరికతలతో పరిచయం పెంచుకొన్నారు మరియు వాటిని తమలో అన్వయిoచు  కొన్నారు. దివ్య ఖురాన్ ప్రతి ముస్లిం స్త్రీ-పురుషుడిని జ్ఞానం కోసం  ఆహ్వానిస్తుంది.  ఈ కాలంలోనే  క్లాసికల్ ఇస్లామిక్ నాగరికత, హకీమ్ (అర్ధం, జ్ఞానం ఉన్న  వ్యక్తి) యొక్క ఆవిర్భావం చూస్తాం. హకీం యొక్క అన్వేషణ కేవలం జ్ఞానం కాదు, సృష్టి యొక్క మరియు దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించే అంతర సంబంధాలపై ఆధారపడే ముఖ్యమైన ఐక్యత యొక్క పరిపూర్ణత.
హారూన్ సాహిత్యానికి పెద్ద పీట వేశాడుకవిత్వం మరియు సంగీతం బాగా వర్థిల్లాయి. తాను స్వయంగా పండితుడు మరియు కవి. తన దర్బారులో సాహితీవేత్తలూ, పండితులూ ఎల్లప్పుడూ గౌరవాలు పొందేవారు. ఇతర దేశాల రాయబారులు, వర్తకులు, యాత్రికులూ, తరచూ ఇతని దర్బారును సందర్శించేవారు. ఇలా ప్రపంచం మొత్తం ఇతడి పేరు ప్రాకింది. చరిత్రకారుల  తరాబీ  ప్రకారం, హారూన్ రషీద్ కు, వైద్యం చేయడానికి వైద్యులు భారతదేశం నుండి వచ్చేవారు. హారూన్ అన్ని దేశాల వారితో చైనాతో సత్సంబంధాలు కలిగివుండే వాడు.
అత్-తరాబీ ప్రకారం, హారూన్, ధార్మికుడూ, దానవంతుడూ, ఉదాత్తుడూ, కవులను పోషించినవాడూ, ధార్మికంగా జరుగు విమర్శలనూ జగడాలనూ పరిసమాప్తి చేసినవాడు. ఇతడు న్యాయపరిపాలకుడు.హారూన్ రషీద్ కాలం రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఉచ్ఛదశకు చేరుకుంది. అరేబియన్ నైట్స్  ఇతని కాలంలో ఇబ్నె కసీర్ వ్రాయబడింది. దీని అనేక కథలలో హారూన్ రషీద్ కేంద్రబిందువు.దీనితో ఇతను అందరికీ ఆదర్శవంతుడిగా మారాడు. సైనిక పరంగా, మేథోపరంగానూ పేరుప్రఖ్యాతులు గడించాడు.  
హరూన్ ప్రారంభించినది అతని కుమారుడు మామున్ పూర్తి చేయాలని కోరుకున్నాడు. మమున్ వైద్యం, ఫిక్హ్, తర్కశాస్త్రంలో  పండితుడు మరియు ఖుర్ఆన్ లో  హఫీజ్. అతను కాన్స్టాంటినోపుల్ మరియు భారతీయ మరియు చైనీస్ ఆస్థానాలకు ప్రతినిధులను పంపించాడు. శాస్త్రీయ పుస్తకాలు మరియు పండితులను తన ఆస్థానానికి  పంపాలని కోరినాడు. అతను అనువాదకులని ప్రోత్సహించాడు మరియు వారికి గొప్ప ప్రతిఫలాలను ఇచ్చాడు. ఇస్లాం యొక్క మొదటి తత్వవేత్త, అల్ కింది (d. 873), ఈ సమయంలో ఇరాక్ లో  పనిచేశారు.ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు అల్ ఖ్వారిజ్మి (డి 863) మమున్ ఆస్థానం లో  పనిచేశారు

అల్ ఖర్విజ్మి గణిత సమస్యలను పరిష్కరిస్తున్న పునరావృత పద్దతికి ప్రసిద్ధి చెందారు, ఇది నేటికి కూడా ఉపయోగించబడుతుంది మరియు అల్గారిథమ్స్ గా పిలవబడుతుంది. . అతను బాగ్దాద్ లో  కొంతకాలం చదువుకున్నాడు మరియు భారతదేశానికి ప్రయాణించాడని కూడా తెలుస్తుంది.  అల్ ఖర్విజ్మి అనే పదం నుంచి  అల్జీబ్రా అనే పదాన్ని (అరబిక్ పదమైన jbrనుండి, గుణించడం అని అర్ధం) కనుగొన్నారు. భారతీయ సంఖ్యా వ్యవస్థను ముస్లిం ప్రపంచానికి పరిచయం చేసింది (యూరప్ కు  ప్రయాణించి, "అరబిక్" సంఖ్యా వ్యవస్థగా మారింది).  గణితంలో దశాంశ వాడకాన్ని ఉపయోగించడం మరియు ఖగోళశాస్త్రంలో అనుభావిక పద్ధతి (కొలత ఆధారంగా జ్ఞానం) కనుగొన్నారు. భూగోళ శాస్త్రం మరియు ఖగోళశాస్త్రంపై అనేక పుస్తకాలు రాశారు మరియు ఒక ఆర్క్ నుండి మరొక యార్క్ యొక్క దూరం యొక్క కొలతలో సహకరించాడు. విజ్ఞానశాస్త్రం మరియు ఇంజనీరింగ్ యొక్క ప్రతి విభాగంలో "అల్గారిథమ్స్" ను ఉపయోగించడం ద్వారా ఈ 
నాటికి  అల్ ఖర్విజ్మి పేరును ప్రపంచం గుర్తింస్తుంది.

హునున్ మరియు మమూన్ల సమయంలో విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు నడిపించి మేధో వికాసం  మరియు ఇస్లామిక్ నాగరికత ఐదు వందల సంవత్సరాలు ముందుకు దారితీసింది. బాగ్దాద్ యొక్క అనువాద పాఠశాలలు (బైతుల్ హిక్మా)  వైద్యుడు అల్ రజి ( 925), చరిత్రకారుడు అల్ మసూడి ( 956), వైద్యుడు అబూ ఆలీ సిన ( 1037), భౌతిక శాస్త్రవేత్త అల్ హజెన్ (1039), చరిత్రకారుడు అల్ బరునీ ( 1051), గణితవేత్త ఒమర్ ఖయాయం (.1132) మరియు తత్వవేత్త ఇబ్న్ రష్ద్ (1198)రచనల వికాసానికి తోడ్పడినవి. 

ఇస్లామిక్ చరిత్రలో హరూన్ మరియు మమున్ల సాదించిన విజయాలతో ముస్లింలు గర్వపడతారు. ఆ నాటి ముస్లిం శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలు తమ మేదోవికాసం తో విజ్ఞాన ప్రగతి సాదించారు ప్రపంచ విజ్ఞాన చరిత్ర లో శాశ్వత కీర్తి గడించారు.  హరున్ మరియు మమున్ల కాలం  హేతువు/వివేచనకు  (reason)కు ప్రసిద్ది చెందినది.






No comments:

Post a Comment