·
-
వేలకొలది
సంవత్సరాలుగా మహిళలు తమ సమాజాలు మరియు చరిత్ర పై చెరగని ముద్ర వేసారు. ముస్లిం నాగరికత
వికాసం లో విభిన్నమైన విశ్వాసాల
నుండి మరియు నేపథ్యాల నుండి వచ్చిన అసాధారణమైన స్త్రీలు వారి సమాజాలను అభివృద్ధి
చేయటానికి పురుషులతో కలిసి పనిచేశారు. వారి అభివృద్ధి, ఆకర్షణీయమైన నేపద్యం నేటి
యువతీ-యువకులకు మరియు స్త్రీ-పురుషులకు మార్గనిర్దేశం చేస్తాయి.
ఆ సమయంలో మహిళలు
అన్ని రంగాలలో పాల్గొన్నారు. ఫాతిమా అల్-ఫిహిరి విద్యా మరియు సాంస్కృతిక రంగాలలో
రాణించగా, సుతాయా అల్-మహమలి గణిత
శాస్త్రంలో దిట్టగా భావింపబడనది. వైద్య రంగం, పరిపాలన మరియు నిర్వహణ,
తత్వశాస్త్రం
మరియు కళలు వంటి రంగాలలో ప్రముఖులైన ఇతర మహిళలు ఉన్నారు. ఇతరులు ముఖ్యమైన రాజకీయ పాత్రలు
పోషించారు ఉదా:కు లబనా అఫ్ కార్డోబా 10 వ శతాబ్దం (స్పెయిన్), లో, 11 వ శతాబ్దం (ఈజిప్ట్)
యొక్క సిట్ అల్-ముల్క్, 12 వ శతాబ్దం (టర్కీ) యొక్క
మెలికే మామా హాటన్ (టర్కీ), రజియా 13 వ శతాబ్దానికి చెందిన
సుల్తానా (భారతదేశం) వారిలో కొందరు.
ఈ అసాధారణ మహిళలకి
కృతజ్ఞతలు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా నూతన
పరిశోధనలు పలితంగా ఆ కాలంలోని ఎక్కువమంది మహిళారత్నాలు వెలుగు
లోనికి వస్తారని ఆశించుదాము.
ఆ అద్భుతమైన
స్త్రీలలో కొంతమందిని కలుద్దాం
1.ఫాతిమా
అల్-ఫిహిరి (FATIMA AL-FIHRI):9 వ శతాబ్దం
ఫాతిమా
అల్-ఫిహిరి తన కాలం నాటి నాగరికత మరియు
సంస్కృతక వికాసం లో గొప్ప పాత్ర
పోషించింది. క్వైరవాన్ ట్యునీషియా నుండి ఫెజ్ కు
ఆమె మరియు ఆమె తండ్రి మొహమేద్ అల్-ఫిహ్రితో వలసవెళ్లారు.
విద్యావంతులైన కుటుంబంలో తన సోదరితో పాటు ఆమె పెరిగారు మరియు ఫిఖ్ (ఇస్లామిక్ న్యాయ
మీమాంస) మరియు హదీసులు నేర్చుకుంది. ఫాతిమా తన తండ్రి నుండి గణనీయమైన డబ్బును
వారసత్వంగా పొందింది, దానిని ఆమె ఒక మసీదును నిర్మించటానికి ఉపయోగించింది.
859 సంవత్సరంలో స్థాపించబడిన
ఖరవయ్యిన్ మసీదు పురాతనమైనది మరియు బహుశా ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం గా ఉంది.
ఇస్లామిక్ అధ్యయనాలు, ఖగోళ శాస్త్రం, భాషలు మరియు విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం కోసం
ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అక్కడకు వచ్చేవారు. అరబిక్ సంఖ్యలు ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఐరోపాలో ప్రసిద్ధి చెందాయి
మరియు ఉపయోగించబడ్డాయి. విద్య మరియు
నాగరికత అభివృద్దిలో మహిళల పాత్రకు ఫాతిమా అల్-ఫిహిరి ముఖ్యమైన ఉదాహరణ.
2.అల్-ఇజ్లియా
మరియు ఆస్ట్రోలాబి( AL-IJLIYA
AL-ASTRULABI):10 వ శతాబ్దం
అస్త్రోలబెస్ (astrolabes) తయారీ లో అలెప్పో (సిరియా) కు
చెందిన మహిళ “మరియం ఆల్-ఆస్ట్రాలైబియా అల్-ఇజ్లియా (అల్-అజ్లియా బింట్
అల్-అజలీ అల్-అష్టర్లాబి) ప్రసిద్ది
చెందినది. ఈమె తన తండ్రి వృత్తిని అనుసరించి, ఉత్తర సిరియాలో శక్తివంతమైన హమ్దానిద్ పాలకుడు అయిన సేఫ్ అల్-దఃలా (Sayf
al-Dawlah 333 H / 944 CE-357/967) యొక్క ఆస్థానం లో నియమించబడ్డారు.
హమ్దానిద్ పాలకులు 10వ శతాబ్దం లో బైజాంటైన్
సామ్రాజ్యం తో ఉత్తర సిరియా సరిహద్దును కాపాడెవారు.
3.సూతత అల్
మహ్మాలి (SUTAYTA AL-MAHMALI):10 వ శతాబ్దం
తన తండ్రితో సహా
పలువురు పండితులు సూతాయ కు విద్య నేర్పించారు మరియు పండితురాలుగా తీర్చిదిద్దారు. ఆమె 377H
/ 987CE సంవత్సరంలో
మరణించింది. సుత్తాయే అరబిక్ సాహిత్యం, హదీసులు మరియు న్యాయ
శాస్త్రం మరియు గణితశాస్త్రం వంటి అనేక శాస్త్రాలు అబ్యసించినది మరియు వాటిలో
నిపుణురాలు. ఆమె హిసాబ్ (గణిత శాస్త్రం) మరియు ఫరాహిద్(successoral calculations) లో దిట్ట. ఇతర గణిత శాస్త్రజ్ఞులు ఉదహరించిన సమీకరణాలకు
పరిష్కారాలను కనుగొన్నది మరియు బీజగణితంలో ప్రసిద్ది చెందినది. గణిత శాస్త్రంలో తన
కాలంనాటి ప్రముఖ పండితురాలు.
4.జైనాబ్ అల్
షాదా (ZAYNAB AL SHAHDA):12 వ శతాబ్దం
జైనాబ్ ప్రముఖ ఇస్లామిక్ క్యాలిగ్రాఫర్ మరియు ఆమె
తన హుస్న్ -ఐ కత్ (husn-I
khatt) తో పాటు, ఫిక్హ్ (ఇస్లామిక్ చట్టం) మరియు హదీథులలో ప్రసిద్ధి చెందినది.
ఆమె అత్యంత ప్రశంసలు పొందింది మరియు చివరి అబ్బాసిద్ ఖలీఫా అయిన యాకుట్ యొక్క గురువుగా నియమించబడింది. ముసా
ప్యాలెస్ లో ఆమె కాలిగ్రాపర్. ఆమె ఒక
తెలివైన, ఉపాధ్యాయురాలు మరియు అనేక మంది ఆమె అధ్యయనంలో ఇజ్మా (ijaza) అందుకునే అవకాశాన్ని
పొందారు. అబ్బాసిద్ ఖలీఫా అల్ ముక్తాఫిబిలాతో ఆమె సానిహిత్యం కారణంగా సిగాత్ అల్-దావల (Siqat
al-Dawla) గా పేరుగాంచినది. ఆమె విజ్ఞాన
శాస్త్రo, సాహిత్యాలను అధ్యయనం
చేస్తూ తన సమయాన్ని గడిపారు.
5.జీర్వర్ నీస్బీ
సుల్తాన్ GEVHER NESIBE SULTAN
13TH CENTURY:13 వ శతాబ్దం
13TH CENTURY:13 వ శతాబ్దం
గౌర్వర్ నెస్బి
సుల్తాన్ (Gevher
Nesibe Sultan) "13 వ శతాబ్దపు రామ్
సుల్తానేట్ యువరాణి మరియు కిలిజ్ అర్స్లాన్ II యొక్క కుమార్తె మరియు కఖ్ఖ్రావ్ I యొక్క సోదరి (daughter
of Kilij Arslan II and sister of Kaykhusraw I). ఆమె పేరుమీద టర్కీలోని కైసేరీలోని ఒక ఆసుపత్రి, వైద్య విద్య
కోసం ఒక స్కూల్, మదరసా మరియు మస్జిద్ తో కూడిన మేద్రేసే నిర్మాణం జరిగింది. ఇది
సెల్యుక్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రముఖ స్మారక కట్టడాల్లో ఒకటిగా
పరిగణించబడింది.
ఈ మేద్రేసే (Medrese) నిర్మాణం 1204 లో ఆరంభమయ్యింది మరియు గెవెర్ నెస్బీ మరణం
తరువాత 1210 లో పూర్తి అయింది.ఈ కాంప్లెక్స్ పేరు గౌర్వర్
నెస్బి సుల్తాన్ యువరాణి పేరిట పెట్టబడినది. ఈ మేద్రేసే ను వివిధ రకాల పేర్లతో
పిలుస్తారు: గివెర్ నెస్బి మెడెసే, సిఫ్తే మెడెసే లేదా జియాసియే మెదెసే (Çifte Medrese). ఈ మేద్రేసే నిర్మాణం గియాత్ అల్- డీన్ కాఖుస్రావ్ I చేసాడు. మేద్రేసే "Medrese” లోపల ఉన్న సమాధి గెవెహ్ర్ నెస్బికి చెందినది.
6.క్వీన్ అమీనా ఆఫ్ జరియా Queen Amina of Zaria:16 వ శతాబ్దం
ముస్లిం నాగరికత
సమయంలో సబ్ సహరన్ ఆఫ్రికాలోని అనేక రంగాల్లో అనేకమంది
స్త్రీలు రాణించారు. వారిలో క్వీన్ అమీనా ఆఫ్ జారియా (1588-1589) ఒకరు. ఆమె 1536 లో జాజ్జౌ కింగ్డమ్ స్థాపించిన బక్వా తుర్కుకు పెద్ద కుమార్తె. 1588 మరియు 1589 మధ్య కాలంలో అమినా అధికారంలోకి వచ్చారు. ఆమె సైనిక విద్యా నిపుణురాలు. ఆమె అద్భుతమైన సైనిక వ్యూహం మరియు ఇంజనీరింగ్
నైపుణ్యాలకు ప్రసిద్ది. ఆమె ప్రసిద్ధ
జరియా గోడ నిర్మాణానికి ఘనత పొందింది.
7.లేడీ మేరీ
వర్ట్లే మోంటాగూ LADY MARY WORTLEY MONTAGU:18 వ శతాబ్దం
లేడీ మేరీ
వోర్ట్లే మాంటేగ్ ఒక ఇంగ్లీష్ కులీన రచయిత (1689-1762). టర్కీ నుండి ఆమె ముస్లిం ఓరియంట్ గురించి రాసిన ఉత్తరాలకు గుర్తుగా ఉంది.
లేడీ మేరీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, వేరియోలేషన్ మశూచి
నివారణ లో యొక్క స్థానిక అభ్యాసాన్ని గమనించినది. జెన్నర్ యొక్క వలే టీకాలు
కాకుండా కౌపాక్స్ ఉపయోగించింది. వేరియోలేషన్ చిన్నపాటి మోతాదు ఉపయోగించింది. లేడీ మేరీ, టర్కీలో ఉన్నప్పుడు తన పిల్లలకు స్థానిక టీకాలు (local
practice of variolation, the inoculation against smallpox) వేయడానికి
ప్రోత్సహించినది. ఆమె తిరిగి లండన్ తిరిగి
వచ్చి ఉత్సాహంగా ఈ విధానాన్ని ప్రోత్సహించింది. బ్రిటిష్ ఉన్నత సమాజంలో
మశూచి నివారణ విషయంలో ఈ ప్రయోగాత్మక పద్ధతిని ప్రముఖంగా ప్రచారం చేసింది. ఆమె
చేసిన ప్రయత్నాల వలన 18 వ శతాబ్దం అంతటా మశూచి రోగుల సంఖ్య తక్కువగానే
ఉండిపోయింది మరియు టీకాలు వేసే ప్రక్రియ దుష్ప్రభావాలను
తగ్గించినది.
No comments:
Post a Comment