అల్-సబీ తబీట్ ఇబ్న్ ఖుర్రా అల్-హర్రాని (836 -901) ఒక ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రస్తుత టర్కీలో జన్మించాడు. ఖగోళ శాస్త్రంపై క్లాసిక్ గ్రీక్ రచనలను అనువదించడo లో ప్రసిద్ధి చెందాడు మరియు సున్నితమైన సంఖ్యలను (amicable number) కనుగొనటానికి ఒక సమీకరణoను కనుగొన్నాడు. అతను మాండేన్ వైద్యుడు, అతను లాటిన్ లో తేబిట్ గా పిలువబడ్డాడు. థాబిట్ సబియన్(sabian) మతపరమైన శాఖ సభ్యుడు.
హెలెనిస్టిక్ సంస్కృతి మరియు నక్షత్రాల
అన్యమత ఆరాధన సంప్రదాయంలో అతడు నేర్పరి. ఈ నేపథ్యం మరియు ముఖ్యంగా గ్రీకు మరియు
అరబిక్ భాషలలో అతని పరిజ్ఞానం బాగ్దాద్
లోని ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందిన పండితులైన బాను ముసా వారి అంతరంగికులలో ఆతనిని దగ్గిరచేసింది. థాబిట్ ప్రతిభను గుర్తించిన అతని కుటుంబ సభ్యుడు,
గణిత శాస్త్రవేత్త
ముహమ్మద్ ఇబ్న్ మూసా ఇబ్న్ షకీర్ అతనిని భాను ముసా అంతరంగిక వలయం లో చేర్చాడు. అతను
బాగ్దాద్ లో పనిచేశాడు మరియు అతను గణితం, ఖగోళశాస్త్రం, మెకానిక్స్, మెడిసిన్ మరియు తత్వశాస్త్రం లో
ప్రముఖ రచనలు చేసాడు.
థాబిట్ విస్తృత శ్రేణి లో అనేక గ్రంథాలు రచించినాడు. కొన్ని అతని స్థానిక సిరియన్ బాషలో వ్రాసినప్పటికీ, చాలా వరకు అరబిక్ లో రచింపబడ్డాయి. థాబిట్ త్రిబాషవేత్త, ఇది అతనిని 9 వ శతాబ్దపు బాగ్దాద్ యొక్క అనువాద
ఉద్యమంలో కీలక పాత్ర పోషించటానికి ఒక నైపుణ్యం ప్రసాదించినది. అతను సిరియక్ మరియు గ్రీకు భాషలను అరబిక్ లోకి అనువదించినాడు మరియు హెలెనిస్టిక్ మరియు గ్రీక్ రచనల యొక్క
అరబిక్ రూపాలను అనువదించాడు.. తబీట్ యొక్క అరబిక్ అనువాదాల్లో అనేక ముఖ్యమైన
పురాతన రచనల యొక్క అసలు రూపాలు కలవు.
మధ్యయుగ ఖగోళ సిద్ధాంతం (astronomical theory of the trepidation of the equinoxes) ను థాబిట్ సృష్టించాడు. దీనిపై మధ్యయుగ లో అనేకమంది ఖగోళ
శాస్త్రజ్ఞులు మద్య చర్చలు జరిగాయి. కోపెర్నికస్ ప్రకారం థాబిట్ సoవత్సరం ను 365 రోజులు,
6 గంటలు, 9 నిమిషాలు మరియు 12 సెకన్లు గా కొలిచాడు. ( లోపంError of 2 సెకన్లు). కోపెర్నికస్ థాబిట్ లాటిన్ రచన
ఆధారంగా ఈ వాదన చేసాడు. థాబిట్ సూర్యుని
పై తన పరిశీలనలను ప్రచురించాడు.
మెకానిక్స్ మరియు భౌతిక శాస్త్ర రంగాల్లో మరియు అతను స్టాటిక్స్ స్థాపకుడిగా
గుర్తింపు పొందాడు. అతను వస్తువుల,
కిరణాల మరియు లీవర్ల
యొక్క సమతౌల్య పరిస్థితిని గమనించాడు.
తాబిత్ తాత్విక మరియు విశ్వోద్భవ శాస్త్ర
అంశాలపై రాశాడు. అరిస్టాటిల్ యొక్క కాస్మోస్ యొక్క కొన్ని మూల సూత్రాలను ప్రశ్నించాడు. సారo(Essence
is immobile) లోకదలిక లేదు అన్న అరిస్టాటిల్ భావాలను నిరాకరించాడు. రోజెన్ఫ్లేడ్ మరియు గ్రెగోరియన్
ప్రకారం తాబిత్ గణితం లో చలన భావనను
(use of motion) ప్రవేశ
పెట్టాడు. థాబిట్ స్టాటిక్స్ అండ్ మెకానిక్స్ లో ఆర్కిమెడియన్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన
గ్రంథాలను రాశాడు. ఈ రచనలే కాక అతను అనువాద పాఠశాలను స్థాపించాడు మరియు గ్రీకు నుండి అరబిక్
లోనికి పెద్ద సంఖ్యలో పుస్తకాల అనువాదాన్ని
పర్యవేక్షిస్తున్నాడు. థాబిట్ యొక్క రచనల లో అనేకo మనుగడలో ఉన్నాయి, కొన్ని లేవు.
గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం మరియు వైద్యశాస్త్రం
పై అతని చాలా పుస్తకాలు కలవు. అతని పుస్తకాలు అరబిక్ మరియు సిరియాక్ బాష లో కలవు.
మధ్య యుగంలో అతని పుస్తకాల్లో కొన్ని గ్రెమాడ్ ఆఫ్
క్రీమోనా ద్వారా లాటిన్ లోకి అనువదించబడ్డాయి. ఇటీవలి శతాబ్దాలలో అతని అనేక
పుస్తకాలు యూరోపియన్ భాషలలోకి అనువదించబడ్డాయి మరియు ప్రచురించబడ్డాయి. తాలిట్
యొక్క ప్రయత్నాలు టోటెమిక్ ఖగోళశాస్త్రం యొక్క పరిశోధన మరియు సంస్కరణలో నిరంతర పని
కోసం ఒక పునాదిని అందించింది. ఇస్లామిక్ సంస్కృతిలో ఖగోళ శాస్త్రం వంటి విజ్ఞాన
శాస్త్రాలు వృద్ధి చెందడానికి ఆయన జీవితం గట్టి ఉదాహరణ.
No comments:
Post a Comment