భారత స్వాతంత్ర పోరాటం లో
ముస్లింలు చేసిన త్యాగాలు మరువరానివి మరియు స్వాతంత్ర పోరాటం లో వారి పాత్ర ఉద్దేశపూర్వకంగా
దాచబడింది. సత్యాన్ని తెలుసుకోవటానికి భారత చరిత్రను మరో సారి పరిశీలిద్దాం.
ప్రతి భారతీయుడు అసంఖ్యాక వాస్తవాలను తెలుసుకోవాలి మరియు మన పిల్లలకు నిజం నేర్పించాలి!
ప్రతి భారతీయుడు అసంఖ్యాక వాస్తవాలను తెలుసుకోవాలి మరియు మన పిల్లలకు నిజం నేర్పించాలి!
Ø డిల్లి లోని
ఇండియా గేట్ పై 95300 స్వాతంత్ర్య
సమరయోధుల పేర్లు ఉన్నాయి, అందులో 61945 ముస్లిం పేర్లు ఉన్నాయి అనగా స్వాతంత్ర పోరాట యోధులలో 65% మంది ముస్లింలు ఉన్నారు.
Ø 1780 లలో మరియు
1790 లో వాస్తవానికి మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం ప్రారంభించినది హైదర్ ఆలీ
మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్. వారు 1780 మరియు 1790లో బ్రిటీష్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా స్వదేశీ రాకెట్లు
మరియు ఫిరంగులు ఉపయోగించారు.
Ø బ్రిటీష్
పాలకుడు సర్ హెన్రీ లారెన్స్ ను కాల్చి జూన్
30, 1857 న చినాత్
వద్ద నిర్ణయాత్మక యుద్ధం లో
బ్రిటీష్ సైన్యాన్ని ఓడించిన మొదటి స్వాతంత్ర్య పోరాట వీర వనిత బేగం హజ్రత్ మహల్ అని ఎంతమందికి తెలుసు?
బ్రిటీష్ సైన్యాన్ని ఓడించిన మొదటి స్వాతంత్ర్య పోరాట వీర వనిత బేగం హజ్రత్ మహల్ అని ఎంతమందికి తెలుసు?
Ø "ప్రధమ
భారత స్వాతంత్ర్య పోరాట సంగ్రామ నాయకుడు” మౌలావి
అమాదుల్లాహ్ షా – ఆ పోరాటంలో అనేకమంది తన అనుచరులతో
షహీద్ అయినాడు.
Ø అష్ఫాకుల్లా
ఖాన్ బ్రిటీష్ రాజ్ కు వ్యతిరేకంగా
కుట్రపన్నినందుకు 27 సంవత్సరాల వయసులో ఉరితీయబడ్డాడు.
Ø భారత
స్వాతంత్ర్యోద్యమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రస్ యొక్క సీనియర్ నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక ముస్లిం
పండితుడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన 'మద్యం
దుకాణాల' పై నిరసన పికటింగ్ లో పాల్గొన్న 19 మందిలో 10 మంది ముస్లింలు ఉన్నారు.
Ø 1857 మొదటి
భారత స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న చివరి మొఘుల్ చక్రవర్తి బహదుర్ షా బర్మా లోని
మండలే లో ఆజీవన కారాగారవాసం అనుభవించి అక్కడే
మరణించారు మరియు సమాధి చేయబడ్డారు. భారత
ప్రధాని రాజీవ్ గాంధీ బహదూర్ షా యొక్క సమాధి వద్ద శ్రధాంజలి ఘటిస్తూ "మీకు (బహదూర్ షా) భారతదేశంలో భూమి లేనప్పటికీ, మీ పేరు
సజీవంగా భారతీయుల హృదయాలలో నిలచిఉంది. మీ జ్ఞాపకార్థం
మరియు భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర యుద్ధం కోసం అంజలి ఘటిస్తున్నాను.
Ø ఇండియన్
నేషనల్ ఆర్మీ (INA) లో షా నవాజ్ ఖాన్ ఒక సైనికుడు, ఒక రాజకీయ
నాయకుడు, ప్రధాన
అధికారి మరియు కమాండర్,.
Ø నేతాజీ
మంత్రివర్గం లో 19 మంత్రులు ఉన్నారు
అందులో 5గురు ముస్లింలు.
Ø అబ్దుల్
కలాం ఆజాద్, జిన్నా, బీహార్
నవాబ్ మొదలగువారు సంపూర్ణ స్వరాజ్యం కోసం పధకం రచించారు.
Ø ICS
అధికారిణి సురైయ తయాబ్జీ (ముస్లిం మహిళ) ప్రస్తుత భారత జాతీయ జెండాని
రూపొందించినది.
Ø ముస్లింలు
స్వతంత్ర పోరాటంలో తమ మస్జిడ్లను ఉపయోగించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఒక మసీదులో భారతీయల
స్వతంత్రం గురించి ఒక ఇమామ్
ప్రసంగిస్తున్నప్పుడు, బ్రిటీష్ సైన్యం ఆ మస్జిద్లోని అందరు ముస్లింలను కాల్చివేసింది - ఇప్పటికీ మీరు ఆ
మస్జిద్ యొక్క గోడలపై ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల యొక్క ఎండిన రక్తాన్ని చూస్తారు.
స్వాతంత్ర పోరాటం లో దక్షిణ భారత ముస్లింల పాత్ర కుడా మరువరానిది.
చిరస్మరణియమైనది.
Ø ఎం.కె.ఎ.ఎ.అమీర్
హంజా ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) కోసం అనేక మిలియన్ రూపాయలు విరాళంగా ఇచ్చారు, అతను ఇండియన్
నేషనల్ ఆర్మీ ఆజాద్ గ్రంథాలయాన్ని స్థాపించారు. వారి కుటుంబం నేడు పేదరికం లో తమిళనాడులోని
రామానాధపురం వద్ద అద్దె ఇంటిలో నివసిస్తున్నది.
Ø మేమోన్
అబ్దుల్ హబీబ్ యూసఫ్ మార్ఫని తన సంపద మొత్తం రూ. 1 కోట్లను ఇండియన్ నేషనల్ ఆర్మీకి విరాళంగా
ఇచ్చాడు - ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.
Ø తమిళనాడులో
ఇస్మాల్ సాహెబ్ మరియు మరుద
నయాగం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
7 సంవత్సరాలు పోరాడారు. మరియు వారు బ్రిటిష్
వారి పాలిటి సింహ స్వప్నం గా మారారు.
Ø భారతీయ
స్వాతంత్ర సంగ్రామం లో వెస్ట్ ఇండియన్ కంపెనీకి వ్యతిరేకంగా ఓడ లో ప్రయాణించిన
తొలి సెయిలర్ వి.ఓ.సి. (కప్పలోటియ తమిజ్జన్) అని మనకు తెలుసు, కాని, ఆ ఓడను విరాళంగా
ఇచ్చినది ఫక్కీర్ ముహమ్మద్ రాథెర్ అని ఎంత మందికి తెలుసు!
Ø VOC ను అరెస్టు
చేసినప్పుడు, VOC ను విడుదల చేయడానికి నిరసన ప్రదర్శన చేసిన ముహమ్మద్ యాసీన్ను బ్రిటీష్
పోలీసులు కాల్చి చంపారు.
Ø తిరుప్పూర్
కుమరన్ ("కోడి కాట కుమరన్") భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.
కుమారన్తో పాటు మరో 7 మంది ముస్లింలను అబ్దుల్ లతీఫ్, అక్బర్ అలీ, మొహిదీన్
ఖాన్, అబ్దుల్
రహీం, వూవు షాహీబ్, అబ్దుల్
లతీఫ్ మరియు షేక్ బాబా షహబ్ బ్రిటిష్ పోలిస్ అరెస్టు చేశారు
Ø ముస్లిం
మహిళ, బీవీమా భారతీయ
స్వాతంత్ర్య పోరాటానికి 30 లక్షల రూపాయలు విరాళం గా ఇచ్చారు.
ముస్లింలు భారతదేశాన్ని 800 ఏళ్లకు పైగా పాలించారు మరియు బ్రిటీష్, డచ్ & ఫ్రెంచ్
వారిలాగా వారు భారతదేశ సంపదను దొంగిలించలేదు.ముస్లింలు
ఇక్కడ నివసించారు, ఇక్కడ పరిపాలించారు మరియు ఇక్కడ మరణించారు. వారు రూపొందించిన సాహిత్యo, నిర్మాణ
శాస్త్రం, న్యాయ మరియు
రాజకీయ నిర్మాణం, ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థ భారతదేశంను ఒక ఏకీకృత & నాగరిక
దేశం వలె అభివృద్ధి చేసింది.
ప్రఖ్యాత
రచయిత అయిన కుష్వంత్ సింగ్ అభిప్రాయం లో : "భారత స్వాతంత్ర్య ఉద్యమం ముస్లింల రక్తంతో వ్రాయబడింది, స్వాతంత్ర్య
పోరాటంలో వారి పాత్ర అధికం మరియు మరుపురానిది.
మీకు తెలిసిన ప్రతి భారతీయుడికి ఇది
పూర్తిగా చదివి వినిపించండి .
భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన ముస్లింల త్యాగంపై వేలకొద్దీ పుస్తకాలు వ్రాయగలము
అయితే దురదృష్టవశాత్తు కొందరు తమ సంకుచిత ప్రయోజనాల కోసం ఈ నిజాన్ని
దాచిపెట్టినారు మరియు భారత చరిత్ర పుస్తకంలో ముస్లింల చరిత్ర తప్పుగా రచింపబడినది.
వాస్తవానికి వక్రీకరించిన చరిత్ర, ఓట్లు వోట్ల కోసం ప్రజలను విభజించడానికి తిరిగి
వ్రాయబడుతుంది. దుష్ట రాజకీయనాయకుల దుష్ట పన్నాగాలకు లోనుకాకుండా ఒక బలమైన & ప్రగతిశీల రాజ్యం
కోసం అందరు భారతీయ పౌరులను సమైక్య
పరచవలసిన అవసరం నేడు ఉంది.