26 July 2020

విరామ సమయంలో చదవడానికి 10 ఇస్లామిక్ మరియు ప్రేరణ పుస్తకాలు 10 Islamic and Motivational Books to Read in Free Time


విరామ సమయాన్ని ఆస్వాదించడానికి అద్భుతమైన మార్గాలలో ఒకటి ఇస్లామిక్ మరియు ప్రేరణ పుస్తకాలను అద్యయనం. ఇది వాస్తవం. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
మీ జీవితానికి కొత్త అవకాశాలను తెరిచే కొన్ని ఉత్తమ ఇస్లామిక్ మరియు ప్రేరణ పుస్తకాలను మీతో పంచుకుంటున్నాను.


1.పవిత్ర ఖురాన్ The Holy Quran:
పవిత్ర ఖురాన్ మానవాళికి పూర్తి మార్గదర్శి అనడంలో సందేహం లేదు. పవిత్ర ఖురాన్ చదవడం మరియు దానిని ఆచరించడం ద్వారా ప్రతిఫలాలతో పాటు హృదయాలకు శాంతి లభిస్తుంది. జీవితంలో శాంతి మరియు ప్రశాంతత కొరకు పవిత్ర ఖురాన్ ను క్రమం తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి.
”సర్వమానవులకు ఇదొక సందేశం. వారిని హెచ్చరించాలని, యదార్ధంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్దిఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడినది.” పవిత్ర ఖురాన్ 14:52.
ప్రవక్త(స) ఇలా అంటాడు, “ఖురాన్ మీకు లేదా మీకు  వ్యతిరేకంగా రుజువు.

2.  మీ హృదయాన్ని తిరిగి పొందండి- యాస్మిన్ మొగాహెడ్ Reclaim your heart by Yasmin Mogahed:

జీవితాంతం మీ హృదయ ప్రయాణం గురించి తెలుసుకోవడానికి పుస్తకం మంచి ఆధారం. జీవిత పతనాలను ఎలా ఎదుర్కోవాలో ఇది నేర్పుతుంది. మీరు మంచిగా మారడానికి మరియు సంస్కరించుకోటానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.

3. మీ హృదయాన్ని పునరుద్ధరించండి - నౌమాన్ అలీ ఖాన్ Revive your heart by Nouman Ali Khan:
ఆధ్యాత్మిక పునరుద్ధరణకు పిలుపునిచ్చే మరియు జీవితo పై  సానుకూల ప్రభావాన్ని చూపే గొప్ప పుస్తకాల్లో ఇది ఒకటి. పుస్తక విషయం చాలా సరళమైనది మరియు మనల్ని మార్చడానికి ప్రోత్సహిస్తుంది.

4. గడిచిన  ఇస్లామిక్ చరిత్ర Lost Islamic History:
ఇస్లామిక్ పూర్వ అరేబియా ప్రారంభం నుండి నేటి ముస్లిం స్థానం వరకు ఇస్లామిక్ చరిత్రను పుస్తకం అద్భుతంగా అందిస్తుంది. పుస్తకంలో ఇస్లాంలో జరిగిన అన్ని ప్రధాన సంఘటనల సంక్షిప్త చరిత్ర ఉంది. ఇది చరిత్ర ప్రియులకు చదవడానికి విలువైనది.

5. శరీరం మరియు ఆత్మను నయం చేయడం- అమీరా అయాద్ Healing body and soul by Amira Ayad:
మీ శరీరం, మనస్సు మరియు ఆత్మను ఎలా చూసుకోవాలో మరియు వాటిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో  పేర్కొనే ఐదు అధ్యాయాలుగా విభజించబడిన మంచి పుస్తకం గా ఇది పరిగణించబడుతుంది.

6. ముహమ్మద్: ప్రారంభ మూలాల ఆధారంగా అతని జీవితం-మార్టిన్ లింగ్స్ Muhammad: His Life Based on the Earliest Sources by Martin Lings:
1983 లో మార్టిన్ లింగ్స్ రాసిన ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్ర, ఈ పుస్తకం    మనకు ముహమ్మద్ () జీవితానికి సంబంధించిన వివరణాత్మక కోణాన్ని ఇస్తుంది. ఇoదులో  ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క జీవితానికి సంబంధించిన సమగ్రమైన మరియు అధికారిక వివరాలు కలవు.

7. విచార పడకండి-ఐద్ ఇబ్న్ అబ్దుల్లా అల్-కర్నిDon’t Be Sad by Aidh Ibn Abdullah al-Qarni:
జీవితంలో విచారంతో బాధపడుతున్న ప్రజలందరూ తప్పక చదవవలసిన పుస్తకం. ఆచరణాత్మక మరియు సంతృప్తికరమైన ఇస్లామిక్ దృక్పథంతో జీవితంలో  దుఖాన్ని ఎలా భర్తీ చేయాలో తెలుపుతుంది.. ఇస్లామిక్ మార్గంలో ఈ ప్రపంచంలోని పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కోవటo  మనకు బోధిస్తుంది.

8.  ఖురాన్ మార్గం -ఖుర్రామ్ మురాద్ The way to the Quran by Khurram Murad

దివ్య  ఖురాన్ ను అర్థం చేసుకోవడానికి గొప్ప చిట్కాలను ఇస్తుంది మరియు ఖురాన్ తో సంబంధం మరియు బంధాన్ని పెంచమని ప్రోత్సహిస్తుంది. ఇది అద్భుతమైన అంశాలను, పవిత్ర ఖురాన్ యొక్క అర్ధాన్ని మరియు అవగాహనను పొందటానికి నేర్చుకునే పద్ధతులను తెలుపుతుంది.

9. హృదయ శుద్దీకరణ: హృదయం యొక్క ఆధ్యాత్మిక వ్యాధుల సంకేతాలు, లక్షణాలు మరియు నివారణలు- షేక్ అల్-మావ్లుద్ మరియు షేక్ హంజా యూసుఫ్ Purification of the Heart: Signs, Symptoms and Cures of the Spiritual Diseases of the Heart by Shaykh al-Mawlud and Shaykh Hamza Yusuf:

ఈ పుస్తకం హృదయ ఆధ్యాత్మిక శుద్దీకరణ వంటి పురాతన మతపరమైన బావనలగురించి సమగ్ర వివరణ ఇస్తుంది. దీనిని చదవటం ద్వారా ప్రస్తుత కాలం లోని ప్రజలు  తగిన వ్యాఖ్యానంతో ముస్లిం సంప్రదాయాన్ని అర్థం చేసుకోవచ్చు

10. మరణం మరియు మరణానంతర జీవితం-అబూ హమీద్ అల్-గజాలిThe Remembrance of Death and the Afterlife by Abu Hamid al-Ghazali:
ఈ పుస్తకం అల్-గజాలి యొక్క “రివైవల్ ఆఫ్ ది రిలిజియస్ సైన్సెస్(ఇహ్యా ఉలం అల్-దిన్) యొక్క మొదటి ఆంగ్ల అనువాదం. మరణం మరియు రాబోయే జీవితాన్ని వివరించే ముస్లిం ఆధ్యాత్మికత యొక్క గొప్ప కృషిగా పరిగణించబడుతుంది

ఇవి కొన్ని ఇస్లామిక్ మరియు ప్రేరణాత్మక పుస్తకాలు. వీటిని మీరు అనుసరించవచ్చు మరియు చదవవచ్చు. ఖచ్చితంగా, ఈ పుస్తకాలు మీకు శాంతిని, క్రొత్త అవకాశాలను ఇస్తాయి.


No comments:

Post a Comment