1 July 2020



The Koran or Qur'an (652)







మీ ఇస్లామిక్ జ్ఞానమును  పరిక్షించుకోండి.

దివ్య ఖురాన్ క్విజ్
1.   “ఖురాన్”  అర్ధమును వివరించుము?
2.  దివ్య “ఖురాన్” మొదట ఎక్కడ అవతరించినది.
3.  దివ్య “ఖురాన్” అవతరణ జరిగిన రాత్రి
4.  దివ్య “ఖురాన్” ను  అవతరింప చేసినది?
5.  ఎవరి ద్వారా ఖురాన్ అవతరించబడినది?
6.  ఎవరి పైనా ఖురాన్ అవతరించినది?
7.  ఖురాన్ రక్షణ భారం ఎవరిపైనా ఉన్నది?
8.  దివ్య ఖురాన్ అద్యయనానికి ముందు పాటించవలసిన నియమాలు ఏమిటి?
9.  అధికంగా చదవబడుతున్న గ్రంధము?
10.దివ్య ఖురాన్ ముఖ్యాంశము?
11.దివ్య ఖురాన్ గల ఇతర పేర్లు ఏమిటి?
12. దివ్య ఖురాన్ లోని మక్కి సూరాలు ఎన్ని?
13. దివ్య ఖురాన్ లో ఎన్ని మదని సూరాలు కలవు?
14. దివ్య ఖురాన్ లో ఎన్ని మంజిల్స్ కలవు?   
15. దివ్య ఖురాన్ లో ఎన్ని పారాలు లేదా జుజ్ కలవు?
16. దివ్య ఖురాన్ లో ఎన్ని సూరాలు కలవు?
17. దివ్య ఖురాన్ లో ఎన్ని రుకులు కలవు?
18. దివ్య ఖురాన్ లో ఎన్ని ఆయతులు కలవు?
19. దివ్య ఖురాన్ లో ఎన్నిసార్లు అల్లాహ్ అనే శబ్దం వచ్చును?
20. దివ్య ఖురాన్ లో ఎన్ని రకాల ఆయతులు కలవు?
21. దివ్య ఖురాన్ ను అబ్యసించిన మొదటి హాఫిజ్ ఎవరు?
22. మొహమ్మద్ ప్రవక్త(స) మరణించేనాటికి ఎంతమంది హఫిజులు కలరు?
23. దివ్య ఖురాన్ లోని ఎన్ని ఆయతులలో సద్జా ప్రస్తావన కలదు.
24. సజ్దా గురించిన మొదటి ప్రస్తావన దివ్య ఖురాన్ లోని ఎన్నో పార మరియు సురా లో కలదు?
25. దివ్య ఖురాన్ లో ఎన్నిసార్లు సలాత్ లేదా నమాజ్ ప్రస్తావించబడినది.

26. దివ్య ఖురాన్ లో ఎన్నిసార్లు దానధర్మాలు గురించిన ప్రస్థావన కలదు .
27. దివ్య ఖురాన్ లో ఎన్ని సార్లు మహమ్మద్ ప్రవక్తను యా-ఐయు-హాన్-నబి అని ప్రస్తావించబడినది.
28. దివ్య ఖురాన్ లో మొహమ్మద్ ప్రవక్త (స)ను అహ్మద్ గా ప్రస్తావించబడిన సురా ఏది?
29. దివ్య ఖురాన్ లో రసూల్-ఉల్లః అనే పేరు ఎన్నిసార్లు ప్రస్తావించబడినది.
30. దివ్య ఖురాన్ లో ఎ ప్రవక్త పేరు ఎక్కువ సార్లు ప్రస్తావించబడి చర్చించబడినది?
31.దివ్య ఖురాన్ యొక్క లేఖకులు (కాతిబే-వహి) ఎంతమంది?
32.   దివ్య ఖురాన్ ఆయతులను లెక్కించిన మొదటి వ్యక్తి ఎవరు?
33. ఎవరి సలహా పై అబూ బకర్ దివ్య ఖురాన్ క్రోడికరణకు పూనుకోనేను?      
34. రాతపూర్వకంగా దివ్య ఖురాన్ క్రోడికరణకు ఆజ్ఞ ఇచ్చినది?        
35. ఖురైషి తెగ పద్దతిలో దివ్య ఖురాన్ కంటస్థమును ఎవరు అమోదించిరి? 
36. ఉస్మాన్ కాలం లో క్రోడికరించబడిన దివ్య ఖురాన్ కాపిలలో ఎన్ని ఇంకా మిగిలి ఉన్నాయి?
37. మొహమ్మద్ ప్రవక్త(స) కంటస్థం చేసిన ఎ సురాని విని హజ్రత్ జబీర్ బిన్ ముత్లిం ఇస్లాం స్వీకరించెను?
38. ప్రవక్త (స) కంటస్థం చేసిన ఏ సురా విని ఇస్లాం కు శత్రువు ఐన ఉత్బ సజ్దా లోనికి వెళ్ళెను?
39.దివ్య ఖురాన్ ప్రకారం మొదటిది అతి ప్రాచినమైన మస్జిద్ ఏది?
40. దివ్య ఖురాన్ ప్రకారం మానవులు ఎన్ని విధాలుగా విభజించబడిరి?       
41. అల్లాహ్ ద్వారా దివ్య ఖురాన్ లో వచ్చేతరాల కోసం  ఎవరి శరిరం హెచ్చరిక గా  ఉంచబడినది?
42. అల్లాహ్ ద్వారా ఫిరోన్ శరిరం తో బాటు వచ్చే తరాల కోసం హెచ్చరికగా ఏది ఉంచబడినది?
43.  నోహ్  నావ పతనం తరువాత దివ్య ఖురాన్ లో విశ్రాంతి ప్రదేశం గా ఏది చూపబడినది.
44. దివ్య ఖురాన్ లో మహమ్మద్ ప్రవక్త (స) తో పాటు వారి ఎసహచరుని గురించి ప్రస్తావించ బడినది?
45.మొహమ్మద్ ప్రవక్త (స) యొక్క ఎ బంధువు పేరు దివ్య ఖురాన్ లో ప్రస్తావించబడినది?

46. దివ్య ఖురాన్ లో ఎ ప్రవక్త(స)  పేరు తల్లి పేరుతో కలిపి ప్రస్తావించబడినది? అతను ఎవరు?
47. పోరాటం జరపకుండానే విజయం సాధించిన ఒప్పందం పేరు ఏమిటి?
48. దివ్య ఖురాన్ లో సైతాన్ కూ గల మారు పేర్లు ఏమిటి?
49. దివ్య ఖురాన్ లో ఇబ్లీస్ ను ఎవర్గం లో చేర్చినారు?
50. బనీ ఇష్రాయిల్ ప్రజలకు,ముస్లిం లతో పాటు  అల్లాహ్ ద్వారా నిర్ణయించబడిన ఆరాధనలు మరియు ప్రార్ధనలు ఏమిటి?
51. దివ్య ఖురాన్ లో తరచుగా హెచ్చరించబడిన రోజు ఏది?
52. దివ్య ఖురాన్ ప్రకారం  అల్లాహ్ చే ఆదరించబడిన వారు అల్లాహ్ చే ఆదరణ పొందిన వారు ఎవరు?
53. ఏ ముస్లిమేతరుల పవిత్ర గ్రంధం లో దివ్య ఖురాన్ తరచుగా ప్రస్తావించబడినది.?
54.ఎ సంవత్సరం లో అచ్చులు (vowels) దివ్య ఖురాన్ లో చేర్చబడినవి?
55. దివ్య ఖురాన్ మొదట అబ్యసించినది ఎవరు?      
56. దివ్య ఖురాన్ మొదట ఎక్కడ భోధించబడినది?
57. అల్లాహ్ చేత ఎంపిక చేయబడిన ఉన్నతమైన,పవిత్ర వ్యక్తులను దివ్య ఖురాన్ లో ఏమని పిలువ బడినారు?
58. దివ్య ఖురాన్ ప్రకారం మానవుడు ఏవిధంగా రుపొండాలి?
59. వ్యక్తి ఔనత్యమును కొలవడానికి దివ్య ఖురాన్ ప్రకారం కొలబద్ద ఏది?
60. చెడు కు మూలకారణం దివ్య ఖురాన్ ప్రకారం ఏది?       
61. దివ్య ఖురాన్ లో ఎ రెండురకాల ఆయతులు కన్పించును.
62. దివ్య ఖురాన్ లో అన్నింటికన్నా పెద్ద సురా ఏది?
63. దివ్య ఖురాన్ లో అన్నింటికన్నా చిన్న సురా ఏది?
64. మొహమ్మద్ ప్రవక్త (స) పై  దైవ దూత జిబ్రీల్ ద్వారా ఎ వయస్సులో   దివ్య ఖురాన్ అవతరించబడినది.
65.మక్కా లో మొహమ్మద్ ప్రవక్త(స) పై  ఎన్ని సంవత్సరాల పాటు  వహి అవతిరించ బడినది.
66. మదీనా  లో మొహమ్మద్ ప్రవక్త(స) పై  ఎన్ని సంవత్సరాల పాటు  వహి అవతిరించ బడినది.
67. దివ్య ఖురాన్ లోని మొదటి సురా ఎక్కడ అవతరించబడినది.
68.  దివ్య ఖురాన్ లోని చివరి సురా ఎక్కడ అవతరించబడినది.
69. దివ్య ఖురాన్ పూర్తిగా అవతరించుటకు ఎంతకాలం పట్టినది?
70.  దివ్య ఖురాన్ లోని ఎ సురా ను సలాత్ (నమాజ్) లో ప్రతి రకాత్ లో తప్పనిసరిగా చదవవలయును?
71. అల్లాహ్ దివ్య ఖురాన్ లోని ఎ సురా ను దువా(ప్రార్ధన) గా ప్రకటించెను?
72.  దివ్య ఖురాన్ ప్రారంభం లో అల్-ఫాతిహ సురా ఉండుటకు ప్రధాన కారణం?
73. దివ్య ఖురాన్ లో పూర్తిగా మరియు మొదటిగా అవతరించిన సురా ఏది?
74. దివ్య ఖురాన్ లో వ్యక్తిగత నామం తో సంబోదించబడిన ఏకైక మహిళ.
75.  దివ్య ఖురాన్ లోని ఎ సూరాలో ఎక్కువ ఆదేశాలు కలవు?       
76.ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు జిబ్రాయిల్ (అలైహిస్-సలాం) రెండవసారి ఎప్పుడు, ఎక్కడ కలుసుకున్నారు?   
77) మొదటి మరియు రెండవ వహిల  మధ్య విరామం ఏమిటి?
78) బిస్మిల్లాతో ప్రారంభమయ్యే సూరా (అధ్యాయం) ఏది?
79) ఖురాన్ యొక్క ఏ  సూరా లో బిస్మిల్లా రెండుసార్లు పునరావృతమవుతుంది?
      సూరా-అల్ నమ్ల్(al naml)
80) దివ్య ఖురాన్ లోని ఎన్ని సూరాల  (అధ్యాయం) లో వేర్వేరు ప్రవక్తల పేర్లు ఉన్నాయి
81) ఖురాన్ లోని ఏ భాగంలో మీరు 'అయత్-ఉల్-కుర్సీ'  ను కనుగొన్నారు?    
82) దివ్య ఖురాన్లో అల్లాహ్ యొక్క ఎన్ని వేర్వేరు పేర్లు ప్రస్తావించబడ్డాయి?
83) దివ్య ఖురాన్లో తగిన గౌరవంతో పేర్లు ప్రస్తావించబడిన ముగ్గురు ప్రవక్తలు కానివారు ఎవరు
84) ఆ సమయంలో అబూబకర్ (రజిల్లాహు అన్హు) ఎంతమంది సహచరులు దివ్య ఖురాన్ ను పుస్తక రూపంలో సంకలనం చేశారు?     
85) ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు పూర్తిగా కంఠస్థం చేసిన ఏకైక పుస్తకం ఏది?    
86) ఖురాన్ లోని కొన్ని ఆయాత్ (శ్లోకాలు) విన్న జిన్లు ఒకరికొకరు ఏమి చెప్పారు?
87) ఆంగ్లంలో ఖురాన్ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన అనువాదాలు ఏవి?
88) పవిత్ర ఖురాన్ ప్రపంచంలోని ఎన్ని భాషలలోకి అనువదించబడింది?
89) పవిత్ర ఖురాన్ ఉర్దూలోకి మొదటి అనువాదకుడు ఎవరు?
90) ఖురాన్ ప్రకారం 'తీర్పు రోజు'లో మన పరిస్థితి ఏమిటి?
91) ఖురాన్లో ప్రస్తావించిన ప్రవక్త ఎవరు, అతని మూడు తరాల వారు  ప్రవక్తలు ?      
92) పాత నియమ నిబంధనలన్నింటినీ రద్దు చేసిన పుస్తకం ఏది?      
93) ఆస్తి మరియు సంపద గురించి ఖురాన్ ఏమి చెబుతుంది?
94) ఖురాన్ ప్రకారం "ఖాతమున్ నబియీన్" (ప్రవక్తలలో చివరివాడు) ఎవరు?     
95) ప్రపంచం యొక్క ఆరంభం మరియు ముగింపు గురించి స్పష్టంగా చెప్పే పుస్తకం పేరు ఏమిటి?       
96) ఖురాన్లో మక్కా నగరానికి ఏ ఇతర పేరు పెట్టబడింది
97) ఖురాన్ ప్రకారం మదీనా నగరానికి ఏ ఇతర పేరు పెట్టబడింది?
98) ఖురాన్ ప్రకారం ఎవరి తరాన్ని "బని ఇస్రాయిల్" అని పిలుస్తారు?
99) ఖురాన్లో పేర్కొన్న మసీదులు ఏవి?
100) ఖురాన్లో ఏ దేవదూతల పేరు ప్రస్తావించబడింది?
      



సమాధానములు


1. అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' ,'మాటిమాటికి చదివే' గ్రంథం అని అర్ధము.
2.హిరా పర్వత గుహ లో
3.లైలతుల్-ఖద్ర్ రాత్రి.
4.అల్లాహ్ ద్వారా ఖురాన్ అవతరించబడినది.
5.దైవ దూత జిబ్రెయిల్ ద్వారా అవతరించబడినది.
6.అంతిమ ప్రవక్త మొహమ్మద్ (స)పైన
7.సర్వేశ్వరుడైన “అల్లాహ్” పై
8.వజూ చేసుకొని పరిశుబ్రం గా ఉండవలయును.
9.దివ్య ఖురాన్ .
10. మానవుడు.(రబ్బాని)
11. అల్-ఫుర్ఖాన్, అల్-కితాబ్, అల్-జిక్ర్,అల్-నూర్, అల్-హుదా.
12.    86.
13.    28.
14.    7.
15.    30.
16.    114.
17.    540
18.    6666
19.  2698.
20.  10
21.    మొహమ్మద్ ప్రవక్త (స).
22.    22.
23. 14.
24. 9 వ పారా, 7సురా(అల్ అరాఫ్), 206 ఆయత్.
25. 700 సార్లు.
26. 150
27. 11 సార్లు.
28.    28వ పారా, అస్ సఫ్  సూరా, ఆరోవ ఆయత్ లో
29. ముహమ్మద్ (స)-4 సార్లు, అహ్మద్ (స)-ఒక సారి
30.  మూసా
31.ఐదుగురు-అబూబకర్, ఉస్మాన్, అలీ, జైద్ బిన్ హరిత్ మరియు  అబ్దుల్లా బిన్ మసూద్.
32.   అయేషా
33. ఉమర్ ఫారూక్.
34.    అబూ బకర్
35. ఉస్మాన్
36. రెండు –ఒకటి -తాష్కెంట్ లోను రెండోవది-ఇస్తాంబుల్ లోను.
37. తూర్ సురా
38. హం-మీం-సురా లోని మొదటి ఐదు ఆయతులు
39.కాబా
40. రెండు- విశ్వాసులు, అవిశ్వాసులు.
41. ఫిరౌన్(ఫారో)
42. నోహ్ ఆర్క్(నావ)
43.  జుడి గుహ
44. జైద్ బిన్ హరిత్.
45.అబూ లహబ్

46. ఈసా. వీరు ఇబ్న్ మర్యం (son of maryam) పేరుతో దివ్య ఖురాన్ లో పిలువబడిరి.
47. హుదైబియా ఒప్పందం
48. ఇబ్లీస్  మరియు అష్-షైతాన్.
49. జిన్నాతుల వర్గం
50. సలాత్ మరియు జకాత్ (అల-బకరా: 43)
51. యౌమల్ కియమాత్ (ఆఖరి రోజు /లెక్కల రోజు)
52. మొహమ్మద్ ప్రవక్త (స) సహచరులు.
53. సిక్కుల పవిత్ర గ్రంధం –గ్రంద్ సాహెబ్
54.హిజ్రీ శకం 43 వ సంవత్సరం.
55.   ఆస్-హబుస్ సుఫ్ఫః
56.    మస్జిద్ –ఎ-నబవి.
57. నబి (ప్రవక్తలు) రసూల్ (సందేశకులు.
58.విశ్వాసి(మోమిన్)      
59. తక్వా    (కరుణ) 
60. ఆల్కహాల్ (సారాయి/మధిర)

61. ముహకమాత్ మరియు ముహషబిహాత్.
62. అల్ బఖర సురా
63. అల్ కౌసర్ సురా .
64.    40 సంవత్సరాలు.
65.    13 సంవత్సరములు.
66.    10 సంవత్సరములు.
67. మక్కా లో     
68.  మదీనా లో
69. 22 సంవత్సరాల, 5 నెలల, 14 రోజులు.
70.  అల్-ఫాతిహ సురా
71. అల్-ఫాతిహ సురా.
72.  అల్-ఫాతిహ సురా దివ్య ఖురాన్ కు ఆత్మ వంటిది.
73. అల్-ఫాతిహ సురా.
74. మర్యం
75.    సురా బఖర.
76.      18 వ రంజాన్ శుక్రవారం, హీరా గుహలో.
77)      2 సంవత్సరాలు ఆరు నెలలు.
78)      సూరా-అల్-తౌబా లేదా బరాత్.
79). సూరా-అల్ నమ్ల్(al naml)
80)      6 సూరహ్స్ (అధ్యాయాలు):
      ఎ) సురా అల్ యూనస్. బి) సురా అల్-హుద్. సి) సురా అల్ యూసఫ్.
      d) సురా అల్ ఇబ్రహీం. ఇ) సురా అల్ నుహ్. f) సురా అల్ మొహమ్మద్.
     
81)      మూడవ భాగం ప్రారంభంలో. (అధ్యాయం 2-255)
     
82) 99.

83)      లుక్మాన్, ఈజిప్టుకు చెందిన అజీజ్ మరియు జుల్కర్నైన్.
     
84)      75 మంది సహచరులు.
     
85)      అల్ ఖురాన్.
     
86)      సరైన మార్గాన్ని చూపించే ఒక ప్రత్యేకమైన ఉపన్యాసం మేము విన్నాము, వాస్తవానికి మేము దానిని నమ్ముతాము.
     
87)      అనువాదం ముహమ్మద్ మర్మాడ్యూక్ పిక్తాల్ మరియు అల్లామా యూసుఫ్ అలీ.  
88)      దాదాపు 103 భాషలు.
     
89)      మౌలానా షా రఫియుద్దీన్ ముహద్దీస్ డెహ్లవి.
     
90)      అందరూ ఆందోళన స్థితిలో ఉంటారు.

91       ఇబ్రహీం (అలైహిస్-సలాం).
     
92)       అల్ ఖురాన్.
     
93)       అవి ఒకరి విశ్వాసం యొక్క పరీక్షలు.
     
94)       ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)
     
95)       అల్ ఖురాన్.
     
96)       బక్కా మరియు బలాదుల్ అమీన్. (Bakkah and Baladul Ameen)
     
97). యాత్రిబ్ (Yathrib)

98.  ఇస్రాయెల్ అని కూడా పిలువబడే ప్రవక్త యాకూబ్ (అలైహిస్ సలాం) యొక్క తరం.   




              

   








No comments:

Post a Comment