29 July 2020

నువ్వు ఒంటరి వాడివి కావు You are not Alone


ఒంటరితనం మరియు భయం అనిపించినప్పుడు, మరియం(అ) ను ఊహించుకోండి? ఆమె తన చేతుల్లో శిశువు ప్రవక్త ఇసా(అ)  తో నడుస్తూ, ప్రజలు తనపై చేసిన నిందలను, వారు తన పట్ల అబద్దపు ఆరోపణలు చేస్తూ, తన పట్ల ప్రవర్తించిన తీరును   భాదతో సహిస్తూ ఆమె పడిన వేదనను గుర్తుకు తెచ్చుకోండి? కాని చివరకు అల్లాహ్ ఆమె పై ఉన్న నిందలను తొలగించి సమస్త మానవాళికి ఆమెను  ఒక ఉదాహరణగా నిలిపాడు.

తన తండ్రి పట్ల తనపట్ల చూపుతున్న  ప్రత్యేక ప్రేమ పట్ల ఈర్ష్య  తో  తన సోదరులు తనను హింసించి బావిలో పడవేసిన ప్రవక్త యూసుఫ్(అ) ను గుర్తుంచుకోండి. కాని చివరికి, అల్లాహ్ అతన్ని నాయకుడిని చేసాడు మరియు  ఈ రోజు వరకు మనం అతని అడుగుజాడలు అనుసరిస్తున్నాము.


ప్రవక్త ఇబ్రహీం (అ)  తన సందేశాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రజలు అతన్ని అగ్నిలో పడవేసిన ఉదంతాన్ని  గుర్తుంచుకోండి. కానీ చివరికి, అల్లాహ్ అతన్ని ప్రశంసనీయుడిగా మార్చాడు


తన ధార్మిక విశ్వాసాల మీద స్థిరంగా నిలబడటం వలన ప్రవక్త నుహ్ (అ) పట్ల ప్రజలు ఎగతాళితో ప్రవర్తించిన తీరును గుర్తుకు తెచ్చుకోండి. కానీ చివరికి, అతని స్థిరత్వం ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారింది..


విశ్వాస ప్రజలారా – గుర్తుoచుకొండి పరిస్థితులు అనుకూలిoచనప్పుడు, మనం వేదనతో, బయంతో ఉన్నప్పుడు మనం ఒంటిరిగా లేము. ప్రవక్తలు  మనకు స్పూర్తిదాయకం.


అన్ని దారులు మూసుకు పోయినప్పుడు భయం, వేదన, తప్పుడు ఆరొపణలు   మన మార్గాన్ని అడుకొంటునప్పుడు ప్రవక్త ముసా(అ) చెప్పిన మాటలను గుర్తుంచుకోండి, “నిజమే, నా ప్రభూ నాతో ఉన్నాడు; అతను నాకు మార్గనిర్దేశం చేస్తాడు.

మీరు ఒంటరిగా లేరు. మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. అల్లాహ్ ఆకాశానికి, భూమికి వెలుగు. చీకటి సమయాల్లో అల్లాహ్ కాంతి కంటే ప్రకాశవంతమైన కాంతి ఏమిటి?

No comments:

Post a Comment