3 July 2020

ఇస్లాంలో మహిళల స్థానం/స్థితి The status of women in Islam


చరిత్రలో స్త్రీలను చెడుగా భావించే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, గ్రీకు పురాణాలలో పండోర అన్ని చెడులకు మూలం. క్రైస్తవ ధర్మం లో, ఆడమ్ కోసం సాతానుకు తలుపులు తెరిచిన స్త్రీలు దుర్మార్గులు మరియు పాశ్చాత్య తత్వవేత్తలైన అరిస్టాటిల్, నీట్చే Nietzsche మరియు ఇతరుల ఆలోచనలలో ఇవి కనిపిస్తాయి.

ముస్లిం ధర్మం ప్రకారం స్త్రీ-పురుషులు సమానమైనప్పటికి ముస్లిం మహిళల పట్ల ముస్లిం సమాజం లో చిన్న చూపు మరియు వివక్షత ప్రబలంగా ఉంది. పవిత్రత మరియు ధర్మం విశ్వాసులందరి కర్తవ్యంగా ఉన్నప్పుడు, ‘పవిత్రతమరియు హిజాబ్అనే అంశం తరచూ పక్షపాతంతో మహిళలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకొని వాడబడినవి. ముస్లిం మహిళలపై వివక్షను సమర్థించడానికి మరియు ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి కొందరు ధర్మాన్ని దుర్వినియోగం చేసారు.

పూర్వపు అరేబియా వాసుల దురాచరం మరియు  మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ఇస్లాం స్త్రీని రక్షించింది. ఇస్లాం ఆమెకు వ్యక్తిగత ఆస్తి. మానవ హక్కులను ఇచ్చింది. అల్లాహ్ విశ్వాసులను   దయ మరియు సమానత్వం ప్రాతిపదికన స్త్రీలతో  జీవించండిఅని ఆజ్ఞాపించాడు. స్త్రీకి విద్య, వారసత్వం, వివాహం, వేరు, ఆస్తి, లింగ న్యాయం, సమానత్వం, గౌరవం మరియు భద్రత హక్కు ఉంది.

ఇస్లామిక్ చట్టం ప్రకారం వివాహంలో, ఆడ, మగ ఇద్దరికీ ఒకరిపై ఒకరు హక్కులు ఉంటాయి. పురుషులు మహిళల సంరక్షకులు, మరియు మహిళలు భర్త యొక్క ధర్మకర్త. వివాహం అనేది దృడమైన పునాదులపై ఆధారపడి ఉండాలి, వ్యక్తిత్వ ఘర్షణలను నివారించడానికి భాగస్వాముల యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అవసరాల మధ్య సమతుల్యత కలిగి ఉండాలి.. మహిళల సంరక్షకత్వం పురుషుల బాధ్యత మరియు విధి. ఇస్లాం దృష్టిలో పురుషుడు మరియు స్త్రీ పరస్పర సహాయకులు. ఇద్దరికి  విశ్వాసం, మానవ గౌరవం, న్యాయం, ధర్మం మరియు ప్రతిఫలం వంటి ప్రాథమిక అంశాలు వర్తించును. పౌర మరియు క్రిమినల్ లా ఇద్దరికీ సమానం గా వర్తిస్తుంది.

ముహమ్మద్ (స) స్త్రీలకు పురుషుల పాత్రను అతివ్యాప్తి చేయకుండా overlappingసమాజంలో చురుకైన పాత్ర పోషించడానికి అధికారం ఇచ్చారు ఇస్లామిక్ కార్యక్రమాలు మరియు ప్రార్థనలలో పాల్గొనాలని స్త్రీలను ఆయన కోరారు మరియు మహిళా విద్య కోసం వారంలో కొన్ని రోజులు కేటాయించారు. మహిళలు ముహమ్మద్‌(స)ను కలవవచ్చు, మాట్లాడవచ్చు  మరియు సహాయం మరియు సలహాలను పొందవచ్చు. ఇస్లామిక్ చట్టానికి వారు బాధ్యత వహిస్తున్నందున (పురుషులు చేసినట్లు) ప్రతిజ్ఞ చేయమని మహిళలను ఆయన కోరారు. పిల్లలను పెంచే పనికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, మహిళలు మత, సామాజిక మరియు రాజకీయ జీవితంలో కూడా  పాల్గొనవచ్చు.

ఖురాన్ విశ్వాస మహిళల గురించి గౌరవప్రదంగా ప్రస్తావించింది. ప్రవక్తల జీవితాలలో మరియు దైవిక ప్రణాళిక నెరవేర్చడంలో మహిళలు అద్భుతమైన పాత్రలు పోషించారు. మరియం (యేసు తల్లి), అల్లాహ్ పట్ల విశ్వాసం , పవిత్రత మరియు చిత్తశుద్ధికి పేరుగాంచినది.  అల్లాహ్ దయ మరియు రక్షణ పొందినది. దివ్య ఖురాన్ లోని ఒక మొత్తం అధ్యాయానికి మరియం అని పేరు పెట్టారు. హాజర్ యొక్క అసాధారణ సంకల్ప శక్తి మరియు సఫా నుండి మార్వాకు ఆమె తీసిన  పరుగు ఉమ్రా మరియు హజ్లలో యాత్రికులకు  తప్పనిసరి మతపరమైన కర్మ. జంజం నీరు  ఆమె గొప్ప ధైర్యం మరియు అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసం యొక్క ఫలితం.

ఖురాన్ లో షెబా రాణి బిల్కిస్ ప్రస్తావన తెలివితేటలు మరియు ప్రజాస్వామ్య పాలనకు ప్రసిద్ది గాoచినది. ముసా జీవితంలో నలుగురు మహిళలు (తల్లి, సోదరి, భార్య మరియు రాణి ఆసియా) ప్రధాన పాత్ర వహించారు. వీరు అల్లాహ్ పట్ల విశ్వాసం కు మారుపేరుగా నిలిచారు. ప్రమాదం ఎదుర్కొంటున్నప్పుడు ధైర్యం; అల్లాహ్ ప్రేమ పట్ల చిత్తశుద్ధి; తీర్పు యొక్క జ్ఞానం; నిర్ణయం తీసుకునే శక్తి; మరియు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచారు. ఈషా (ర) మహిళల గౌరవం మరియు జీవిత భాగస్వామిని  యొక్క గౌరవం  కు పర్యాయపదం.

సూరా నిసా వివాహం, విడాకులు, వారసత్వం, మహర్,మహిళల స్థితి మరియు హక్కులపై ఒక వివరణాత్మక అధ్యాయం. ఖురాన్ తల్లి యొక్క ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విశ్వాసపు స్త్రీలు అల్లాహ్‌కు ఎంత విలువైనవారో సూచించుతుంది.  దివ్య ఖురాన్‌లో ఇవి స్త్రీల గురించి సూక్ష్మమైన మరియు శక్తివంతమైన ప్రస్తావనలు.

ప్రవక్త భార్యలు విశ్వాసుల తల్లి అయిన  వీరు  గొప్ప గౌరవం మరియు పండిత జ్ఞానం ఉన్న మహిళలు. ఈషా (ర) 44 సంవత్సరాలు ముహమ్మద్(స) సందేశం వ్యాప్తికి దోహదపడింది. ఆమె 2,210 హదీసులను వివరించింది. ఇస్లామిక్ పరిజ్ఞానంలో హఫ్సా (ర) కు అధికారం ఉంది, ఆమె 60 హదీసులు ను వివరించింది మరియు పవిత్ర ఖురాన్ యొక్క మొదటి చేతితో వ్రాసిన కాపీని ఇచ్చింది. మరియు ఉత్మాన్ నాయకుడైనప్పుడు అతను దివ్య ఖురాన్ వచనాన్ని ప్రామాణీకరించడానికి హఫ్సా కాపీని ఉపయోగించాడు.ఖాదీజా (ర) స్వతంత్రమయిన  మరియు గౌరవప్రదమైన మహిళ మరియు  బలమైన నమ్మకమున్న  మరియు ధర్మబద్ధమైన ముస్లిం వనిత.

మొహమ్మద్ ప్రవక్త (స) మొదటి ప్రకటనను Revelation, ఆందోళన  మరియు భయంతో స్వీకరించినప్పుడు, అతను వెంటనే తన భార్య వద్దకు వచ్చాడు మరియు ఆమె అతనిని ఓదార్చి, దైర్యం ఇచ్చి అతని తరుపున  నిలబడిన మొదటి వ్యక్తి. ఆమె అతనితో దేవుని మార్గాన్ని అనుసరించింది. ఉమ్మే  సలామా రాజకీయ క్రియాశీలత, చట్ట తయారీకి  సంభందించిన 378 హదీసులను వివరించారు. ముస్లిం స్త్రీలలో నుసేబా, సఫియా, ఖవ్లా వంటి యోధులు ఉన్నారు మరియు యుద్ధభూమిలో ఫాతిమా మరియు ఉమ్మే  అతియా మానవతా సేవలు అందించారు..

అల్లాహ్ ఇచ్చిన గౌరవనీయమైన హోదాను కలిగి ఉండటానికి ముస్లిం మహిళలు ఖురాన్ మరియు ప్రవచనాత్మక సంప్రదాయాలను అనుసరించాలి.

రిఫెరెన్స్:

·       దివ్య ఖురాన్
·ఇస్లామిక్ జీవన విధానంలో మహిళల సాధికారత, అరబ్ న్యూస్ https://www.arabnews.com/islam-persspect/news/896806
·       
ఖాన్, మౌలానా వాహిద్దీద్దీన్. ఉమెన్ రైట్ ఇన్ ఇస్లామిక్ షరియా, గుడ్వర్డ్ బుక్స్ 2015, ది ఇస్లామిక్ సెంటర్, న్యూ డిల్లి.
·       
సయీద్, అస్మా. మహిళలు మరియు ఇస్లాంలో మత జ్ఞానం యొక్క ప్రసారం. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్.
·       
సహి బుఖారీ


No comments:

Post a Comment