31 May 2021

రహమతుల్లా కైరనావి 1818-1891 Rahmatullah Kairanawi1818-1891

 


రహమతుల్లా కైరనావి رحمة الله الكيرواني  Rahmatullah Kairanawi లేదా రహమత్ అల్లాహ్ కైరానావా (రహమతుల్లా కైరన్వి లేదా అల్-కైరానావి లేదా షేక్ రహమత్ కైరానావి లేదా రహమతుల్లా ఇబ్న్ హలీల్ అల్-ఉత్మానీ అల్-కైరనావి లేదా అల్-హిందీ),(1818-1891) 1818లో  కైరానా, బ్రిటిష్ ఇండియాలో జన్మించినాడు. ఇతడు సున్నీ- షాఫి పండితుడు మరియు రచయిత. అతని ప్రసిద్ద రచన ఇజార్ ఉల్-హక్.

 

కైరానావి 1818 లో మొఘల్ ఇండియాలోని ముజఫర్ నగర్ లోని కైరానాలో జన్మించాడు. అతను మూడవ ఖలీఫ్, ఉత్మాన్ ఇబ్న్ అఫాన్ యొక్క వారసుడు, అతని కుటుంబ సంపదలో కొంత భాగం, (కైరానాలో పెద్ద ఆస్తి), అక్బర్ ది గ్రేట్ చేత మంజూరు చేయబడింది. చాలా మంది కైరానావి కుటుంబ సభ్యులు మేధావులు మరియు ఉన్నత పదవులు అలంకరించారు. రహమతుల్లా యొక్క 8వ ముత్తాత అయిన షేక్ హకీమ్ అబ్దుల్ కరీం అక్బర్ చక్రవర్తి వైద్యుడు.

 

కైరాన్వి 6 సంవత్సరాల వయస్సులో సాంప్రదాయ ఇస్లామిక్ విద్యను పొందడం ప్రారంభించాడు, ఖురాన్ ను 12 ఏళ్ళకు వల్లే వేసాడు. అతను అరబిక్ మరియు పెర్షియన్ భాషలను కూడా నేర్చుకున్నాడు. తరువాత అతను డిల్లి కి వెళ్లి అక్కడ గణితం మరియు వైద్యంతో సహా వివిధ విభాగాలను అభ్యసించాడు. ముఫ్తీ మరియు షరియా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, కరియానాలో ఒక మత పాఠశాలను స్థాపించారు

ఇస్లామిక్ సాంఘిక సంస్కరణ వాది. కైరాన్వి,  క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా చర్చ అందు ప్రధాన ఆసక్తి చూపేవాడు. ఇతను బ్రిటిష్ మిషనరీ కార్ల్ గాట్లీబ్ ఫాండర్‌ తో ఆగ్రా లో జరిపిన చర్చ మిక్కిలి ప్రసిద్ది గాంచినది.

1837 లో, చర్చ్ మిషన్ సొసైటీ ఉత్తర భారతదేశంలోని ఆగ్రాకు కార్ల్ గాట్లీబ్ ఫాండర్‌ను మిషనరీ గా నియమించింది. అక్కడ అతను 1854 లో ప్రముఖ ఇస్లామిక్ పండితులతో ప్రసిద్ధ బహిరంగ చర్చలో పాల్గొన్నాడు.  గాట్లీబ్ ఫాండర్‌ కు  ప్రధాన ముస్లిం డిబేటర్ కైరానావి, ఇతనికి ఇంగ్లీష్ మాట్లాడే ముహమ్మద్ వాజర్ ఖాన్ మరియు ఇస్లామిక్ రచయిత ఇమాద్ ఉద్-దిన్ లాహిజ్ సహాయం చేశారు. కైరానావి ఇటీవలి యూరోపియన్ వేదాంతపరంగా విమర్శనాత్మక రచనల నుండి తన వాదనలు వినిపించాడు. కార్ల్ గాట్లీబ్ ఫాండర్‌ వాదనకు ప్రధాన మూలం అపోక్రిఫాల్ పదహారవ శతాబ్దపు బర్నబాస్ సువార్త, ఇది ప్రామాణికమైనదిగా అతడు భావించాడు..

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 నాటి భారతీయ తిరుగుబాటు లో కైరాన్వి వ్యక్తిగతంగా పాల్గొన్నాడు.  బ్రిటిష్ వారిపై జరిగిన సాయుధ తిరుగుబాట్ల తరువాత, కైరానావానీ ఆస్తి ఇంపీరియల్ బ్రిటిష్ రాజ్ చేత జప్తు చేయబడింది. కైరాన్వి తన ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టి (తరువాత వేలం వేయబడింది), మరియు బొంబాయిలో ఓడలో ఎక్కవలసి వచ్చింది. యెమెన్‌లోని మోచా నౌకాశ్రయానికి చేరుకున్న కైరాన్వి మక్కాకు పాదయాత్ర చేసాడు, ఈ ప్రయాణానికి రెండు సంవత్సరాలు పట్టింది.

కైరనావి అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో పుస్తకాలు రాశారు.ఇతని ప్రధాన రచన:ఇజార్ ఉల్-హక్ (నిజం బయటపడింది Izhar ul-Haq (Truth Revealed): ఆరు సంపుటాలలో మొదట అరబిక్‌లో వ్రాయబడిన ఇజార్ ఉల్-హక్ పుస్తకం తరువాత ఉర్దూలోకి, మరియు ఉర్దూ నుండి టా-హా ప్రచురించిన సంక్షిప్త ఆంగ్ల వెర్షన్ లోకి అనువదించబడింది. ఇస్లాం పట్ల క్రైస్తవ విమర్శలకు స్పందించడం ఈ పుస్తకం లక్ష్యం. బైబిల్ యొక్క లోపాలు మరియు వైరుధ్యాలను తెలుసుకోవడానికి పాశ్చాత్య పండితుల రచనలను ఉపయోగించిన మొదటి ముస్లిం పుస్తకం ఇది. ఇందులో బైబిల్, క్రిస్టియన్ మరియు ఇతర వనరులను ఉపయోగించి ట్రినిటీ సిద్ధాంతం చాలెంజ్ చేయబడినది, ఈ కృషిలో అల్-కైరానావా అలీ తబారా, ఇబ్న్ హజ్మ్ లేదా ఇబ్న్ తైమియా రచనలను విస్తృతంగా ఉపయోగించినాడు.

మదర్సా సవ్లాటియాMadrasah as-Sawlatiyah:

మక్కాలో నివసిస్తున్నప్పుడు, కైరనావి అక్కడ మదర్సా-సావ్లాటియా అనే ధార్మిక పాఠశాలను స్థాపించారు. రహమతుల్లా కైరనావిని మసీదు-ఎ-హరామ్‌లో లెక్చరర్‌గా షేక్-ఉల్-ఉలామా (ప్రముఖ పండితుడు) షేక్ అహ్మద్ దహ్లాన్ అస్-షఫీ నియమించారు. కైరనావి బోధన ప్రారంభించాడు. కొంతమంది భారతీయ ముస్లిం వలసదారులు , ధనవంతుల సహాయం తో  కైరనావి ఇస్లామిక్ శాస్త్రాలను బోధించడానికి ఒక ప్రామాణికమైన ఇస్లామిక్ లా స్కూల్ 1874 A.D లో  స్థాపించాడు. మదరసా కు ప్రధాన సహకారి కలకత్తాకు చెందిన సావ్లాట్-ఉన్-నిసా అనే మహిళ. ఆమె  పేరు మీద మదర్సా పేరు పెట్టబడింది. మదర్సా ఇప్పటికీ ఉనికిలో ఉంది మరియు మదర్సా అస్-సవ్లాటియా పూర్వ విద్యార్థులు  ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

 

కైరన్వి 1891 లో (22 రంజాన్ 1308 AH) మక్కాలో మరణించాడు మరియు జన్నాత్ అల్ ముల్లాలో ఖననం చేయబడ్డాడు.


23 May 2021

అబూ ముహమ్మద్ అల్-హసన్ అల్-హమ్దానీ. 893-945 Abu Muhammad al-Hasan al-Hamdani893-945



 

అబూ ముహమ్మద్ అల్-హసన్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-హమ్దానీ (893-945 AD; అరబిక్: أبو محمد الحسن أحمد يعقوب الهمداني) ఒక అరబ్ ముస్లిం భూగోళ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, కవి, వ్యాకరణవేత్త, చరిత్రకారుడు,  ఖగోళ శాస్త్రవేత్త మరియు ఫిలోలజిస్ట్. అల్-హమ్దానీ పశ్చిమ 'అమ్రాన్, యెమెన్ కు చెందిన బాను హమ్దాన్ తెగ వాసి. అల్-హమ్దానీ అబ్బాసిడ్ కాలిఫేట్ యొక్క చివరి కాలంలో ఇస్లామిక్ స్వర్ణ యుగ ఉత్తమ పండితులలో ఒకడు.

 అల్-హమ్దానీ జీవిత చరిత్ర వివరాలు చాలా తక్కువగా లబిస్తున్నాయి. అల్-హమ్దానీ వ్యాకరణవేత్తగా ఎంతో పేరు పొందాడు, చాలా కవితలు రాశాడు, ఖగోళ పట్టికలను సంకలనం చేశాడు మరియు అరేబియా యొక్క ప్రాచీన చరిత్ర మరియు భౌగోళిక అధ్యయనం కోసం తన జీవితంలో ఎక్కువ భాగం అంకితం చేసినట్లు చెబుతారు.

అల్-హమ్దానీ పుట్టకముందే అతని కుటుంబం అల్-మరాషి (المراشي) లో నివసించింది. అక్కడినుండి వారు సనా (صنعاء) కు వెళ్లారు, అక్కడ 893 వ సంవత్సరంలో అల్-హమ్దానీ జన్మించారు. అతని తండ్రి ఒక ప్రయాణికుడు మరియు కుఫా, బాగ్దాద్, బాస్రా, ఒమన్ మరియు ఈజిప్టులను సందర్శించారు. చిన్నతనం లోనే అల్-హమ్దానీ మక్కాకు బయలుదేరాడు, అక్కడ అతను ఆరు సంవత్సరాలకు పైగా ఉండి చదువుకున్నాడు, తరువాత అతను సాద్ Sa'dah (صعدة) కు బయలుదేరాడు. అక్కడ అతను ఖావ్లాన్ Khawlaan (خولان) పై సమాచారాన్ని సేకరించాడు.

తరువాత, అల్-హమ్దానీ తిరిగి సనాకు వెళ్లి హిమ్యార్ (حمْير) ఉన్న భూమిపై ఆసక్తి కనబరిచాడు, కాని అతని రాజకీయ అభిప్రాయాల కారణంగా రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి విడుదలైన తరువాత, అతను తన సొంత తెగ రక్షణలో జీవించడానికి రాయ్దాRaydah (ريدة) కి వెళ్ళాడు. అతను అక్కడ ఉన్నప్పుడు తన పుస్తకాలను చాలావరకు సంకలనం చేశాడు మరియు 945 లో మరణించే వరకు అక్కడే ఉన్నాడు.

 అల్-హమ్దానీ-ప్రధాన రచనలు:

·       అల్-హమ్దానీ అరేబియా ద్వీపకల్పం (సిఫాట్ జాజిరత్ ఉల్-అరబ్) Geography of the Arabian Peninsula (Sifat Jazirat ul-Arab)  అనే భౌగోళిక గ్రంధం రచిoనాడు.


·       అల్-హమ్దానీ యొక్క మరొక గొప్ప రచన పది వాల్యూమూల  ఇక్లిల్ (డయాడమ్) Iklil (the Diadem)- ఇది హిమ్యారీయుల వంశవృక్షాలు మరియు వారి రాజులు చేసిన యుద్ధాల genealogies of the Himyarites and the wars waged by their kings. గురించి వివరిస్తుంది.

 

ఇతర రచనలు:

  

·       అల్-జవరాతయన్ అల్-కటాకటైన్ al-Jawharatayn al-ʻatīqatayn - ఆ సమయంలో తెలిసిన లోహాలను వాటి భౌతిక మరియు రసాయన లక్షణాలతో పాటు చికిత్స మరియు ప్రాసెసింగ్ (బంగారం, వెండి మరియు ఉక్కు వంటివి) వివరించే పుస్తకం. అయస్కాంత క్షేత్ర ప్రవర్తనకు సమానమైన విధంగా భూమి యొక్క గురుత్వాకర్షణను వివరించిన తొలి అరబ్బులలో అతను కూడా ఒకడు.

 

·       సిఫాట్ జాజిరత్ ఉల్-అరబ్ (صفة جزيرة العرب), 'అరేబియా ద్వీపకల్పం యొక్క భౌగోళికం Sifat Jazirat ul-Arab (صفة جزيرة العرب), 'Geography/Character of the Arabian Peninsula'

 

·       కితాబ్ అల్-ఇక్లాల్ మిన్ అఖ్బర్ అల్-యమన్ వా-అన్సాబ్ ఇమియార్ (الإكليل من اليمن); అల్-యెమెన్ యొక్క ఖాతాల నుండి కిరీటాలు మరియు ఇమియార్ యొక్క వంశావళి. Kitāb al-Iklīl min akhbār al-Yaman wa-ansāb Ḥimyar (الإكليل من أخبار اليمن وأنساب حمير); Crowns from the Accounts of al-Yemen and the genealogies of Ḥimyaral-Iklīl  అల్-ఇక్లాల్ పది వాల్యూమ్లను కలిగి ఉంటుంది. కాని ఇప్పుడు నాలుగు వాల్యూమ్‌లు మాత్రమే లబ్యం.

 

·      హిస్టరీ ఆఫ్ సబా. History of Saba.

 

·       హిమ్యార్ మరియు నజ్రాన్ భాష Language of Himyar and Najran

 

 

22 May 2021

ఐకానిక్ ఇంజనీర్, దాత గంగా రామ్ Ganga Ram, iconic engineer, philanthropist


సర్ గంగా రామ్ (1851-1927) పంజాబ్‌లోని మంగటన్‌వాలాలో Mangatanwala జన్మించాడు, అది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. అతను రూర్కీలోని థామసన్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివాడు, అది నేడు భారతదేశంలో ఐఐటి-రూర్కీ.గా మారింది.  డిల్లి లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసిన తరువాత, మోంట్‌గోమేరీ జిల్లాలో బ్రిటిష్ ఇండియా  ప్రభుత్వం నుండి 50,000 ఎకరాల/200 చదరపు మైళ్ళు బంజరు భూమిని లీజుకు తీసుకున్నాడు.  బంజరు భూమికి నీటి వసతిని ని కల్పించడానికి సర్ గంగారం పంజాబ్ గుండా ప్రవహించే అనేక నదుల నుండి నీటిని ఎత్తే lift దాదాపు 1,000 కిలోమీటర్ల పొడువున కాలువలను నిర్మించాడు. ఇందుకోసం ప్రత్యెక జలవిద్యుత్ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేశారు. విస్తారమైన ఎడారిని సుక్షేత్రాలుగా మార్చాడు’. సర్ గంగారం అపారమైన సంపదను సంపాదించాడు మరియు ఆస్పత్రులు మరియు కళాశాలల నిర్మాణానికి ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. అప్పుటి  పంజాబ్ బ్రిటిష్ గవర్నర్ అతను హీరోలా గెలిచాడు మరియు సాధువులా విరాళం ఇచ్చాడు‘he won like a hero and donated like a saint’అని వ్యాఖ్యానించాడు.

 

ఇంపీరియల్ ప్రభుత్వంలో వర్క్స్ సూపరింటెండెంట్‌గా, జనరల్ పోస్ట్ ఆఫీస్, లాహోర్ మ్యూజియం, ఎచిసన్ కాలేజ్, మాయో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ (ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్), హేలీ కాలేజ్ ఆఫ్ కామర్స్, వికలాంగుల కోసం రవి రోడ్ హౌస్ మరియు హిందూ మరియు సిక్కు వితంతువుల హోం మొదలగు భవనాలను రూపకల్పన designed and built చేసి నిర్మించాడు. ఈ భవనాలు చాలా మాల్ ఆఫ్ లాహోర్ లో ఉన్నాయి.

బ్రిటిష్ ప్రభుత్వం అతనికి నైట్ హుడ్ ప్రధానం చేసింది రాయ్ బహదూర్బిరుదు లభించింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఏదైనా ఆవిష్కరణను రూపొందించిన వారికి సర్ గంగారాం 2,500 రూపాయల”మేనార్డ్-గంగారాం అవార్డు Maynard-Gangaram Award” ప్రకటించాడు.  లాహోర్ మాల్‌లోని గంగా రామ్ ట్రస్ట్ భవనం లాహోర్ నగరంలో ఒక మైలురాయి.

 

 


 


లాహోర్ జనరల్ పోస్ట్ ఆఫీస్ Lahore General Post Office

 



ఓల్డ్ బిల్డింగ్, ఎచిసన్ కాలేజ్, లాహోర్


 


మాయో స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్ట్

 



లాహోర్ మ్యూజియం

 



సర్ గంగా రామ్ హాస్పిటల్

లాహోర్ లో సర్ గంగా రామ్ హాస్పిటల్ (ఇప్పుడు 550 పడకలు) మరియు ఒక మెడికల్ కాలేజీని తన సొంత డబ్బుతో నిర్మించాడు. విభజన తరువాత మెడికల్ కాలేజీ మూసివేయబడింది, కాని గంగా రామ్ హాస్పిటల్ పనిచేయడం కొనసాగించింది మరియు దాని పేరును మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పౌర సమాజ సంస్థలు దీనిని ప్రతిఘటించాయి. తరువాత పంజాబ్ ప్రభుత్వం ఫాతిమా జిన్నా మెడికల్ కాలేజీని స్థాపించింది మరియు దానికి గంగా రామ్ ఆసుపత్రి జతచేయబడింది. అతని జ్ఞాపకార్థం మరొక  ఆసుపత్రి 1951 లో డిల్లి లో స్థాపించబడింది.

 

పంజాబ్‌లోని లియాల్‌పూర్ (ఇప్పుడు ఫైసలాబాద్) జిల్లా జరన్‌వాల్లా తహసీల్‌లో ఘోడా రైలుప్రవేశపెట్టారు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రజా రవాణా వ్యవస్థ, దీనిలో ఇరుకైన గేజ్ రైలు ట్రాక్‌లో గుర్రాలతో సాధారణ ట్రాలీలు లాగబడ్డాయి. ఇది అతను సృష్టించిన గంగాపూర్ గ్రామాన్ని బుచియానా వద్ద నిలిపివేసిన రైల్వే మార్గంతో అనుసంధానించింది. గ్రామీణ ప్రాంతం నుండి లాహోర్ రైల్వే స్టేషన్ వరకు దూరం ప్రయాణించడానికి గ్రామీణ ప్రజలు దీనిని ఉపయోగించారు. ఇది 1980 ల తరువాత పనిచేయటం లేదు కాని . ఇది 2010 లో పునరుద్ధరించబడింది. తన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పశ్చిమ పంజాబ్  ను సుందరంగా మార్చిన ఘనత గంగారాం కు దక్కుతుంది.

 

సర్ గంగా రామ్ అవిభక్త భారత దేశ గొప్ప ఆత్మ.  బ్రిటీష్ ఇండియాలో ముఖ్యంగా లాహోర్లో  అర్బన్ స్కేప్ కు సౌందర్య స్పర్శను ఇవ్వడానికి సర్ గంగారం అందించిన సహకారం మరువలేనిది

 

లాహోర్ లోని అనేక చారిత్రాత్మక, వారసత్వ భవనాలను నిర్మించిన ప్రసిద్ధ వాస్తుశిల్పి సర్ గంగా రాం  యొక్క దిగ్గజ సమాధి ఆక్రమణలను తొలగించి  పునరుద్ధరించబడిందని పాకిస్తాన్ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఇది త్వరలో ప్రజల కోసం తిరిగి తెరవబడుతుంది.

.



 

గంగా రామ్ యొక్క సమాధి The samadhi of Ganga Ram.

 

గంగా రామ్ సమాధిని తిరిగి తెరవడం లాహోర్ నగర అందానికి దోహదపడిన అసాధారణమైన ప్రతిభావంతులైన ఇంజనీర్ జ్ఞాపకార్థం ఒక చిన్న నివాళి మాత్రమే అవుతుంది, అతని అసాధారణ నైపుణ్యాలు మరియు అతని దాతృత్వం మరువ లేనివి. ఉపఖండం యొక్క మిశ్రమ వారసత్వానికి సర్ గంగారాం ఒక ప్రతిక.

-siasat సౌజన్యం తో