దక్కనీ అస్థిత్వంలేదా విశిష్టత Deccani Identity
కహత్ ముసాఫిర్, ఉత్తర్ కా, జో షాహ్రోన్
షహ్రోన్ ఘూమా,
డిల్లీ దేఖీ, బంబై దేఖీ, కలకత్తా భీ దేఖా;
బింధ్యాచల్ కీ
గౌడ్ మే లేకిన్ దక్కన్ దేస్ హై ఐసా,
జో ఆయా ఏక్ బార్
యహన్ వో అప్నాయ్ దేస్ నా లౌతా.
(అసంఖ్యాక నగరాలను
సందర్శించిన ఉత్తరాది నుండి వచ్చిన యాత్రికుడు ఇలా చెప్పాడు,
“నేను ఢిల్లీని
చూశాను, బొంబాయిని చూశాను, కలకత్తాను కూడా చూశాను;
కానీ వింధ్యాచల
ఒడిలో, దక్కన్ దేశం అలాంటిది,
ఒకసారి ఇక్కడికి
వచ్చిన వాడు తన దేశానికి తిరిగి రాడు.”)
∼ హైదరాబాద్ దక్కన్‌లో జుబైర్ రిజ్వీ, లెహర్ లెహర్ నదియా గహ్రీ (1964)
భారత ఉపఖండంలోని
దక్షిణ మరియు ఉత్తర ప్రాంతాల మధ్య భేదం గురించిన ఆలోచన యొక్క తొలి మూలాలు రామాయణం
మరియు మహాభారతం (మరియు బహుశా వేదాలలో) గ్రంధాలు మరియు కథలలో ఉన్నాయి. రామాయణం
మరియు మహాభారతం రెండింటిలోనూ అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలకు దక్షిణాన నివసించాడని చెప్పబడింది, ఇది ఉత్తరం మరియు దక్షిణాల మధ్య సరిహద్దుగా
గుర్తించబడింది. తదనంతరం, బౌద్ధ, జైన మరియు అనేక
వైదిక తాత్విక సంప్రదాయాలకు చెందిన గ్రంథాలు మరియు మౌఖిక సంప్రదాయాలలో దక్షిణ
మరియు ఉత్తరాల మధ్య వ్యత్యాసం కొనసాగుతుంది మరియు పునరుద్ఘాటించబడుతుంది.
నిశ్చయంగా, గత ఒక సహస్రాబ్దిలో దక్కన్ పీఠభూమి, తన ప్రత్యేక సామాజిక-సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని
కాపాడుకొంటూ వచ్చింది. మధ్యయుగ కాలంలో అది మంచి అవకాశాల కోసం వలస వచ్చినవారిని
ఆకర్షించింది, వారు దక్కన్ భూమి యొక్క సంస్కృతితో చాలా వరకు
కలిసిపోయారు. దక్షిణ భారత ఆలయ కళ మరియు వాస్తుశిల్పం యొక్క ప్రభావాలు స్పష్టంగా
కనిపించే దక్కనీ సుల్తానేట్‌ల వాస్తుశిల్పంలో చూడవచ్చు.
కార్వాన్‌లోని
టోలీ మసీదు కాకతీయన్-విజయనగర వాస్తుశిల్పం ప్రభావాలను కలిగి ఉంది. మినార్‌లు కలష్
(కుండ) నుండి ఉద్భవించాయి మరియు మినార్‌పై బాల్కనీలు 13వ శతాబ్దానికి చెందిన వరంగల్‌లో తరచుగా కనిపించే
కార్బెల్‌లచే సప్పోర్ట్ ఇవ్వబడ్డాయి.
ఫోటో: సిబ్ఘతుల్లా ఖాన్
దఖ్నీ భాష మరొక
సంశ్లేషణ చేయబడిన భాష, దఖ్నీ భాష మరాఠీ మరియు దక్కన్ యొక్క ఇతర
మాతృభాషల నుండి కొంత వరకు పదజాలం గ్రహించడమే కాకుండా పర్షియన్ మరియు సంస్కృతం
నుండి కొంత పదజాలం ను అరువు తెచ్చుకుంది. ఫలితంగా ఏర్పడిన సమ్మేళనం దక్కన్
సుల్తానేట్‌లు మరియు దాని నివాసులకు ఒక కొత్త గుర్తింపుగా మారింది. మొఘలులు కూడా
దక్కన్‌ను ఒక ప్రత్యేక దేశంగా పరిగణించారని నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి. ఔరంగజేబు దక్కన్
లో చాలాకాలం పాటు నివసించాడు.హిందూస్థాన్ కంటే దక్కన్ చాలా ఆకర్షణీయంగా ఉందని
మొఘల్ కవి అక్విల్ ఖాన్ అంగీకరించినాడు.
గోల్కొండ కవి టిబి
ద్విపద couplet దక్కన్ భూమిపై లోతైన ప్రేమను సూచిస్తుంది.
జిస్ కో యాద్
కర్తా నై అప్నా వతన్,
ఓ ముర్దా హై, పైరన్ హై ఉస్కా కఫన్.
(తన జాతిని
మరచిపోయేవాడు,
ఒక శవం లాంటివాడు,
శవo పై కప్పే వస్త్రం అతని సరైన
దుస్తులు.)
దక్కనీ గుర్తింపు
అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది: కొన్నిసార్లు 'విదేశీయులు' మరియు ముఖ్యంగా ఉత్తర భారతీయుల పట్ల అనుమానం. బహమనీ కాలం నాటి దఖ్నీ - అఫాకీ సంఘర్షణ
దీని ప్రారంభ రూపాల్లో ఒకటిగా గుర్తించవచ్చు. పర్షియా నుండి వచ్చిన వలసదారులను
అఫాకిస్ (గ్రహాంతరవాసులు) అని పిలుస్తారు మరియు రాయల్ కోర్ట్ పై వారి పెరుగుతున్న
ప్రభావం దఖ్నీ జనాభా ద్వారా బలంగా ఆగ్రహించబడింది, దక్కనీ జాతీయవాద భావనను స్థిరపరచడం లో విజయం
సాధించారు. ఈ సంఘర్షణ చివరికి బహమనీల అఫాకీ గ్రాండ్ వజీర్ మహమూద్ గవాన్ హత్యకు
దారితీసింది, ఇది రాజవంశం యొక్క క్షీణత మరియు చివరికి
పతనానికి దారితీసింది.
దక్కనీ జాతీయవాద భావాలు
ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్నాయని చారిత్రక కథనాలలో రుజువు చేయబడింది. నిజాంల పాలనలో, హైదరాబాద్ స్టేట్ సర్వీస్‌లోకి ఉత్తర భారతీయులను
పెద్ద ఎత్తున చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ముల్కీ-నాన్ ముల్కీ (జాతీయ-విదేశీ)
వివాదంగా అది మరోసారి ప్రత్యక్షమయ్యారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల
పునర్వ్యవస్థీకరణ తర్వాత, ఆంధ్రా నుండి స్థిరపడినవారు అవాంఛనీయమైన
నాన్-ముల్కీలుగా మారారు. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన
రాజకీయ, ఆర్థిక పోరాటానికి ఈ ధీరత్వం (దక్కనీ జాతీయవాద భావాలు)
మూలాధారం.
ప్రారంభ దఖ్నీ
రచనలలో మాతృభూమి పట్ల గర్వాన్ని ప్రదర్శించడమైనది. బీజాపూర్‌లోని
ఆస్థాన కవి మరియు దఖ్నీ ఇతిహాసం “అలీ నామా” రచయిత అయిన నుస్రతి, మొఘల్‌లపై విపరీతమైన ద్వేష భావనను
ప్రదర్శించాడు. అతను వారిని అనుమానాస్పద పిరికిపందలుగా చిత్రీకరిస్తాడు, వారు కుట్రలో రాణిస్తారు మరియు స్వల్ప లాభాల
కోసం వారి సన్నిహిత బంధువుల నుండి కూడా చివరి రక్తపు చుక్కను హరించే సామర్థ్యం
కలిగి ఉంటారు.
హైదరాబాద్
స్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటికి దక్కనీ గుర్తింపు ఈ ప్రాంతంపై గట్టి
పట్టు సాధించింది. అతని కాలంలోని కవి గ్రహీత, అసదుల్లా వాఝీ Asadullah Wajhi, కేవలం దక్కన్‌ను ప్రశంసించడంతో సంతృప్తి
చెందలేదు. ఈ మహిమాన్వితమైన భూముల్లో తన సొంత ప్రాంతమైన తెలంగాణే అత్యుత్తమమైనదని ప్రకటించాడు..
“దఖన్ సా నహీ తార్ సంసార్ మే,
పునాజ్ ఫజిలాన్ కా
హై ఇస్ థార్ మే.
దఖన్ హై నగీనా
ఆంగోతీ హై జాగ్,
అంగోతి కౌన్
హర్మత్ నాగేనా హై లాగ్;
దఖన్ ముల్క్ కౌన్
ధన్ అజాబ్ సాజ్ హై,
కే సబ్ ముల్క్
సార్ హౌర్ దఖన్ తాజ్ హై;
దఖన్ ముల్క్ భౌతీజ్
ఖాసా అహే,
తెలంగాణ ఇస్స్ కా
ఖులాసా అహే”.
“(దక్కన్‌తో పోల్చదగినది, భూమిపై ఎక్కడా లేదు;
నిజానికి, అసంఖ్యాక మేధావులకు అది జన్మనిచ్చింది.
దక్కన్ ఒక రత్నం, ప్రపంచం ఒక ఉంగరం;
మరియు నిజంగా
రత్నం దానిని విలువైనదిగా చేస్తుంది.
దక్కన్ దేశానికి
అద్భుతమైన వైభవం ఖ్యాతిని తెస్తుంది;
అన్ని ఇతర దేశాలకు
కలిపి, దక్కన్‌ను కిరీటంగా ధరించండి.
దక్కన్ -
మిరుమిట్లు గొలిపే భూమి,
మరియు నిజానికి
తెలంగాణ దాని సారాంశం.)
ముహమ్మద్ కులీ
కుతుబ్ షా సమాధి, కుతుబ్ షాహీ నెక్రోపోలిస్ Necropolis లోని సమాధిపై రాయిని ఉపయోగించినట్లు మొదటి
ఆధారాలలో ఒకటి. ఇది 1565లో విజయనగరం పతనం మరియు హంపిని కొల్లగొట్టిన
తర్వాత. ఫోటో: సిబ్ఘతుల్లా ఖాన్
దక్కన్ ప్రాంత
నివాసులు తమ జాతీయతను "దఖ్నీ"గా నొక్కిచెప్పడంతో వారి దృక్పథం ఆధునిక
కాలంలో కూడా కొనసాగింది. నగరంలోని ట్రూప్ బజార్ ప్రాంతంలో హిందుస్థానీ గల్లీ అని
పిలువబడే ఒక ప్రాంతం ఇప్పటికీ ఉంది.
17వ శతాబ్దంలో అసఫ్ జాహీలు దక్కన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న వెంటనే, వారి పాలనను మొఘలుల పాలన నుండి
వేరుచేసే ప్రక్రియ ప్రారంభమైంది. 1857లో మొఘల్ రాజవంశానికి తెర పడినప్పుడు, హైదరాబాద్ ఉత్తరాది నుండి వలసల యొక్క తరంగాన్ని చూసింది. ఇక్కడి సాధారణ
జనాభా తమ రాష్ట్రానికి ఉత్తర హిందుస్థాన్ నుండి వచ్చిన సమూహాలకు స్థలాన్ని
ఇవ్వడానికి ఇష్టపడలేదు.
1769లో నిజాం అలీఖాన్ ఔరంగాబాద్ నుండి రాజధానిని మార్చినప్పుడు, అతని ప్రభువులు మరియు ఉన్నతోద్యోగులు పెద్ద
సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వారికి చార్మినార్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని నివాసం
కోసం కేటాయించారు. వారిలో ఎక్కువ మంది మొఘల్ పరిపాలనలో భాగమైన పూర్వీకుల నుండి
వచ్చినవారు కాబట్టి, ఈ ప్రాంతం మొఘల్‌పురా అని పిలువబడింది.
స్థానికులు ఈ వలసదారుల రాకపోకలకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.. కొత్తగా
వచ్చిన వారికి అత్యంత అవమానకరమైన హెచ్చరికలలో ఒకటి అప్పటి ఉన్నత మార్కెట్
ప్రాంతంలోని నివాసి ద్వారా వ్రాయబడింది.
“సంభాల్
కర్ చల్ అరే హిందుస్తానీ
మొఘల్‌పురా హై యే డిల్లీ నహీం హై
(హిందుస్తానీ ఇక్కడ జాగ్రత్తగా నడవండి;
ఇది మొఘల్‌పురా, మీ ఢిల్లీ కాదు)”
దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో పోల్చినప్పుడు దక్కన్ నివాసితులు తమ
ప్రాంతంలో మరింత లోతుగా పాతుకుపోయారు. సయ్యద్ మీరన్ హష్మీ, 1689లో
రచించిన యూసుఫ్ జులేఖా అనే అతని ఇతిహాసంలో,
మొఘల్‌గా మారిన తన కొత్త పోషకుడి
పర్షియన్ అభిరుచులకు అనుగుణంగా తన దఖ్నీ డిక్షన్‌ను మార్చుకోవడానికి బదులు తన
జీవనోపాధిని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
“తుఝే
చక్రి క్యా తు అప్నిచ్ బోల్,
తేరా షైర్ దఖ్నీ హై, దఖ్నిచ్ బోల్”.
(పోషకుల గురించి ఎందుకు బాధపడతారు, మీ స్వంత మాటలలో చెప్పండి;
మీ కవిత్వం దఖ్నీ, అందులో మాత్రమే మీరు చెప్పాలి.)
దక్కన్ కవి ఖాజీ మెహమూద్ బహ్రీ (మ. 1718) ఔరంగజేబు ద్వారా ఉత్తరాదిలో విలాసవంతమైన జీవితాన్ని అందించడాన్ని
తిరస్కరించాడు మరియు దక్కన్‌లో శ్రమతో కూడిన జీవితాన్ని ఇష్టపడతాము అని అన్నాడు..
దక్కన్‌తో తనకున్న బంధం నల్ మరియు దమయంతి మధ్య ఉన్నటువంటిదని అతను పేర్కొన్నాడు. అతనికి దక్కన్‌లో ఉండడం ఎంతో ఇష్టం.
“బహ్రీ
కు దఖన్ యున్ హై కే జియున్ నల్ కో దమన్ హై;
బస్ నల్ కో హై లాజియం కే దమన్ చోఆర్ నా జానా.”
(బహ్రీ మరియు దక్కన్ నల్ మరియు దమయంతికి సమానంగా ఉంటాయి,
నల్ దమయంతి నుండి విడిపోకపోవడమే మంచిది..)
గత సహస్రాబ్దిలో దక్కని గుర్తింపును సూచించే విభిన్న
మార్గాలు, దక్కన్‌కు కొత్తగా వచ్చినవారు దక్కన్ భూమి
కి అనుగుణంగా మారారని, స్థానిక ప్రకృతి దృశ్యాలతో బలమైన
అనుబంధాలను పెంచుకున్నారని,
సాంస్కృతిక పద్ధతులు మరియు గుర్తులను అవలంబించారని
సూచిస్తున్నాయి. భారతదేశ భూభాగంలో ఉత్తర-దక్షిణ వ్యత్యాసం చాలా పాతది అయినప్పటికీ, డెక్కనీ గుర్తింపు ఢిల్లీ సుల్తానేట్
పతనం సమయంలో రూపొందించబడింది. అప్పటి నుండి, ఇది ఒక రిచ్ కాంపోజిట్ ఐడెంటిటీగా పరిణామం చెందింది.
మూల రచయిత: సజ్జాద్ షాహిద్ హైదరాబాద్ మరియు
దక్కన్ చరిత్ర, సంస్కృతి, కళ మరియు వాస్తుశిల్పంపై ఆసక్తిని
కలిగి ఉన్న ప్రాక్టీస్ సివిల్ ఇంజనీర్.
తెలుగు సేత: సల్మాన్ హైదర్