10 October 2024

హర్యానాలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ముస్లిం అబ్యర్దులు భారీ విజయం సాధించారు All Five Muslims from Congress Win Big in Haryana

 



న్యూఢిల్లీ –

90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది.  వీరంతా పెద్ద మెజార్టీతో విజయాలు సాధించారు.

విజయం పొందిన ముస్లిం అభ్యర్థులు:

1. మామమ్ ఖాన్:

ఫిరోజ్‌పూర్ జార్కా నియోజకవర్గ౦ నుండి కాంగ్రెస్ అబ్యర్ది  మామమ్ ఖాన్ 98,441 ఓట్ల మెజారిటీ తో భారీ విజయాన్ని సాధించినారు.  భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి నసీమ్ అహ్మద్ 32,056 ఓట్లను మాత్రమే సాధించగలిగారు.

2.అఫ్తాబ్ అహ్మద్:

నుహ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అఫ్తాబ్ అహ్మద్ మొత్తం 91,833ఓట్లు సాధించగా  సమీప ప్రత్యర్థి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD)కి చెందిన తాహిర్ హుస్సేన్ 44,870 ఓట్లను సాధించినారు.  

3. ముహమ్మద్ ఇలియాస్:

పన్హానాలో కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ ఇలియాస్ 31,916 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇలియాస్ 85,300 ఓట్లు సాధించగా, అతని సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి రైస్ ఖాన్ 53,384 ఓట్లు సాధించారు. బీజేపీ కి చెందిన ముహమ్మద్ ఎజాజ్ ఖాన్ కు కేవలం 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి.

4.ముహమ్మద్ ఇజ్రాయెల్:

హతాన్‌లో, కాంగ్రెస్‌కు చెందిన ముహమ్మద్ ఇజ్రాయెల్ సమీప బీజేపీ ప్రత్యర్థి మనోజ్ కుమార్‌ను 32,396 ఓట్ల తేడాతో ఓడించినారు..

5.అక్రమ్‌ఖాన్‌:

జగధారి నుంచి అక్రమ్‌ఖాన్‌ విజయం పొందారు. అక్రమ్‌ఖాన్‌ కు 67,403 ఓట్లు రాగా బిజెపి ప్రత్యర్థి కన్వర్ పాల్‌ కు 60,535 ఓట్లు లబించాయి. గతంలో అక్రమ్‌ఖాన్‌ డిప్యూటీ స్పీకర్‌గా, హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన నారు.

మొత్తం ఐదుగురు కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే కాకుండా గణనీయమైన తేడాతో విజయం సాధించారు.

INLD యొక్క తాహిర్ హుస్సేన్, BJP యొక్క నసీమ్ అహ్మద్ మరియు స్వతంత్ర అభ్యర్థి Rais Khan మొదలగు కాంగ్రెస్ కు చెందని ముస్లిం అభ్యర్థులు అందరు ఓడిపోయారు. హర్యానాలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థుల 100% స్ట్రైక్ రేట్ హర్యానా రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటన.

 

-ది క్లారియన్ సౌజన్యం తో 

No comments:

Post a Comment