15 October 2024

మహమ్మద్ అలీ లైబ్రరీ: కోల్‌కతా Mohammed Ali Library : Kolkata

 


కోల్‌కతా:

మొహమ్మద్ అలీ లైబ్రరీ, కోల్‌కతాలోని పురాతన పబ్లిక్ లైబ్రరీలలో ఒకటి. 93 ఏళ్ల నాటి మొహమ్మద్ అలీ లైబ్రరీ గత వైభవానికి చిహ్నం.

 “మొహమ్మద్ అలీ లైబ్రరీని 1930 సంవత్సరంలో ముల్లా మహ్మద్ జాన్ ముస్లిం కమ్యూనిటీ యువకుల కోసం పఠన మందిరం స్థాపించడానికి ఏర్పాటు చేసారు. 1931లో ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు మరియు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఆలి బ్రదర్స్ లో ఒకరైన మహమ్మద్ అలీ జౌహర్ మరణించిన తరువాత, మహమ్మద్ అలీ గౌరవార్థం లైబ్రరీకి పేరు పెట్టారు. మహమ్మద్ అలీ జౌహర్ ఒక దార్శనికుడు, జామియా మిలియా ఇస్లామియా సహ వ్యవస్థాపకుల్లో ఒకరు కూడా.

మొహమ్మద్ అలీ లైబ్రరీ అరుదైన సేకరణ కలిగి ఉంది. మహాభారతం మరియు రామాయణం యొక్క ఉర్దూ అనువాదాలు మరియు ఉర్దూ వ్యంగ్య వారపత్రిక అవధ్ పంచ్ వంటి కొన్ని అరుదైన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లు కలవు. ."

చాలా మంది స్థానిక నివాసితులు మరియు పరిశోధకులు మొహమ్మద్ అలీ లైబ్రరీ లోని ఉర్దూ సాహిత్యం యొక్క నిధి శిథిలావస్థలో ఉందని మరియు లైబ్రరీ వారసత్వాన్ని మరియు దానిలో ఉన్న వేలాది అరుదైన పుస్తకాలను పరిరక్షించవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

దాదాపు శతాబ్ద కాలం నాటి మొహమ్మద్ అలీ లైబ్రరీ ని సంరక్షించే కమిటీ ప్రజల డిమాండ్ మేరకు పుస్తకాలను భద్రపరచడమే కాకుండా మొహమ్మద్ అలీ లైబ్రరీలో అనేక మార్పులు ప్రారంభించబడ్డాయి.

మొహమ్మద్ అలీ లైబ్రరీ పూర్తి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టుటకు నిర్ణయం తీసుకోబడినది. 10,00,000 బడ్జెట్‌తో లైబ్రరీకి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి అంచనా వేయబడింది మొహమ్మద్ అలీ లైబ్రరీ అత్యాధునిక లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌గా పరివర్తన చెందుతుంది. లైబ్రరీలో పుస్తకాల పునరుద్ధరణ, కేటలాగ్ చేయడం, అరుదైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది.

మొహమ్మద్ అలీ లైబ్రరీని ఎయిర్ కండిషన్డ్‌గా మార్చి మరియు యువత కోసం  పోటీ పరీక్షల కు సిద్ధం కావడానికి కావలసిన బుక్స్ అందించడం జరుగుతుంది..

మొహమ్మద్ అలీ లైబ్రరీ స్వంత వెబ్‌సైట్‌ను కలిగి ఆన్‌లైన్ సేవలను అందిస్తుందని, పాఠకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, మరియు పుస్తకాలను చదవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

 

No comments:

Post a Comment