యోగేంద్ర శుక్లా (1896–1960) ఒక భారతీయ జాతీయవాది, విప్లవకారుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు; వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన కార్యకలాపాల కారణంగా యోగేంద్ర శుక్లా 'కాలా పాని' అని పిలువబడే అండమాన్ సెల్యులార్ జైలు(1932 మరియు 1937 మధ్య) తో సహా తన జీవితం లోని ¼ వంతు కాలం దాదాపు 17 ఏళ్లపాటు బ్రిటిష్ జైళ్లలో గడిపారు
"షేర్-ఎ-బీహార్" (బీహార్ సింహం)గా ప్రసిద్ధి చెందిన యోగేంద్ర శుక్లా 'హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్' (HSRA) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బసవన్ సింగ్ (సిన్హా)తో కలిసి, బీహార్‌లో 'కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ'ని స్థాపించడంలో కూడా యోగేంద్ర శుక్లా కీలక పాత్ర పోషించారు.
యోగేంద్ర శుక్లా మరియు ఆయన మేనల్లుడు బైకుంఠ
శుక్లా (15 మే 1907 – 14 మే 1934) బెంగాల్ ప్రెసిడెన్సీలోని ముజఫర్‌పూర్
జిల్లా (ప్రస్తుతం బీహార్‌లోని వైశాలి జిల్లా) జలాల్‌పూర్ గ్రామానికి చెందినవారు. యోగేంద్ర
శుక్లా భూమిహార్ కుటుంబంలో జన్మించారు.
బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌లలో విప్లవోద్యమ
ప్రముఖ నాయకుడిగా ఉన్న యోగేంద్ర శుక్లా తన సాహసోపేత చర్యలకు ప్రసిద్ధి చెందారు
మరియు విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్, బటుకేశ్వర్
దత్‌లకు సన్నిహిత సహచరుడిగా ఉంటూ, వారి
శిక్షణలో కూడా పాలుపంచుకున్నారు. తన జీవితకాలంలో, విప్లవాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు యోగేంద్ర శుక్లా పదహారున్నర
సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. భారతదేశంలోని వివిధ జైళ్లలో అనుభవించిన
తీవ్రమైన హింస కారణంగా యోగేంద్ర శుక్లా ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. మరణించే సమయానికి, యోగేంద్ర శుక్లా అనారోగ్యంతో బాధపడుతూ, తన దృష్టిని (చూపును) కోల్పోయి
ఉన్నారు.
అండమాన్ (కాలా పాని) దీవులలోని సెల్యులార్
జైలుకు తరలించే ఉద్దేశంతో అక్టోబర్ 1932లో, గవర్నర్-ఇన్-కౌన్సిల్ ఆదేశాల మేరకు, జ్యుడీషియల్ సెక్రటరీ ఎ.సి. డేవిస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్
(CID) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)ని విప్లవకారులైన ఖైదీల జాబితాను
రూపొందించమని కోరారు. యోగేంద్ర శుక్లా, బసావన్
సింగ్ (సిన్హా), శ్యామ్‌దేవ్ నారాయణ్ అలియాస్ రామ్
సింగ్, ఈశ్వర్ దయాళ్ సింగ్, కేదార్ మణి శుక్లా, మోహిత్ చంద్ర అధికారి మరియు రామ్
ప్రతాప్ సింగ్ వంటి పలువురి పేర్లను DIG (CID) సూచించారు.
యోగేంద్ర శుక్లా, కేదార్ మణి శుక్లా మరియు శ్యామ్‌దేవ్ నారాయణ్‌లను 1932 డిసెంబర్‌లో అండమాన్ దీవులకు
తరలించారు. యోగేంద్ర శుక్లా చేసిన 46 రోజుల నిరాహార దీక్ష పలితంగా యోగేంద్ర
శుక్లా ను కాలాపానీ సెల్యులార్ జైలు నుండి హజారీబాగ్ సెంట్రల్ జైలుకు మార్చడం జరిగింది. 1937లో బీహార్‌లో శ్రీ కృష్ణ సిన్హా మొదటి
కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆయన రాజకీయ ఖైదీల సమస్యపై గట్టిగా నిలబడ్డారు. పలితంగా 1938 మార్చిలో యోగేంద్ర శుక్లా మరియు ఇతర
రాజకీయ ఖైదీలు, జైలు నుండి విడుదలయ్యారు
విడుదలైన తర్వాత యోగేంద్ర శుక్లా ఇండియన్
నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు మరియు ముజఫర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ
ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. యోగేంద్ర
శుక్లా 1938లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు, కానీ
తరువాత జయప్రకాష్ నారాయణ్ సూచన మేరకు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు. స్వామి సహజానంద సరస్వతి స్థానంలో ఆల్
ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే, 1940లో అరెస్టు అయ్యారు.
1942
ఆగస్టులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, స్వాతంత్ర్యం కోసం రహస్య ఉద్యమాన్ని
చేపట్టే ఉద్దేశంతో యోగేంద్ర శుక్లా, జయప్రకాష్
నారాయణ్, సూరజ్ నారాయణ్ సింగ్, గులాబ్ చంద్ గుప్తా, రామనందన్ మిశ్రా మరియు శాలిగ్రామ్
సింగ్‌లతో కలిసి హజారీబాగ్ సెంట్రల్ జైలు గోడను ఎక్కి తప్పించుకున్నారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ అనారోగ్యంతో
ఉండటంతో, యోగేంద్ర శుక్లా, జయప్రకాష్ నారాయణ్ ను తన భుజాలపై మోసుకుంటూ
సుమారు 124 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయ వరకు
నడిచారు.
యోగేంద్ర శుక్లా ను అరెస్టు చేసిన వారికి రూ. 5000 బహుమతిని బ్రిటిష్ ప్రభుత్వం
ప్రకటించింది. యోగేంద్ర శుక్లా 1942
డిసెంబర్ 7న ముజఫర్‌పూర్‌లో అరెస్టు అయ్యారు. శుక్లా తన అరెస్టుకు ఒక రోజు ముందు
ముజఫర్‌పూర్ జైలు నుండి నలుగురు ఖైదీలు తప్పించుకోవడంలో సహాయపడ్డారని ప్రభుత్వం
భావించింది.వారు సూరజ్‌దేవ్ సింగ్, రామ్
బాబు కల్వార్, బ్రహ్మానంద గుప్తా మరియు గణేష్ రాయ్.
యోగేంద్ర శుక్లాను బక్సర్ జైలులో ఉంచారు, అక్కడ
యోగేంద్ర శుక్లా కు మూడేళ్లపాటు కాళ్లకు సంకెళ్లు (బార్ ఫెట్టర్స్) వేసి ఉంచారు. 1944 మార్చిలో, యోగేంద్ర శుక్లా బక్సర్ జైలులో నిరాహార
దీక్షను ప్రారంభించారు.
యోగేంద్ర శుక్లా 1946 ఏప్రిల్‌లో విడుదలయ్యారు. 1958లో, ప్రజా
సోషలిస్ట్ పార్టీ తరపున బీహార్ శాసనమండలి సభ్యుడిగా నామినేట్ అయ్యారు మరియు 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1960లో, సుదీర్ఘకాలం
పాటు జైలు జీవితం గడపడం వల్ల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. యోగేంద్ర శుక్లా 1960 నవంబర్ 19న మరణించారు.
భారత ప్రభుత్వం యోగేంద్ర శుక్లా గౌరవార్థం ఒక
స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
No comments:
Post a Comment