16 July 2026

హలీమా ఖాతున్ - ఉత్తర 24 పరగణాల సుందర్‌బన్స్ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త Halima Khatun- A social Worker from Sundarbans of North 24 Parganas

 

 

ఉత్తర 24 పరగణాల సుందర్‌బన్స్ లోని 'ఉత్తర మహమూద్‌పూర్' ప్రాంతంలో, హలీమా ఖాతున్ వేలాది మంది మహిళల విముక్తికి ఒక ఆశాకిరణంగా ప్రతీకగా నిలిచారు.నిరుపేద బీడీ కార్మికుల కుటుంబంలో జన్మించిన హలీమా, మహిళల నిస్సహాయత—బాల్య వివాహాలు, విద్య లేకపోవడం మరియు కనీస హక్కులకు కూడా నోచుకోని జీవితాలను గమనించారు.

కోల్‌కతాలో చదువుకొన్న హలీమా 2009లో ‘యాక్షన్ ఎయిడ్ ఇండియా' (ActionAid India) సంస్థలో చేరి, గ్రామాలలో పర్యటిస్తూ  మహిళల సమస్యలను అర్ధo చేసుకొని గ్రామీణ మహిళల కు తమ హక్కుల పై అవగాహన కల్పించారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా హలీమ అవిశ్రాంత పోరాటం జరిపారు, పోలిసుల సహాయం తో అనేక బాల్య వివాహాలను అరికట్టారు. హలీమ జరిపిన సామాజిక సేవ పలితంగా ఎంతోమంది బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లగలిగారు మరియు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాన్ని పొందగలిగారు.

హలీమా ఖాతున్ కృషి ఫలితంగా 'హస్నాబాద్-హింగల్‌గంజ్ ముస్లిం మహిళా సంఘం' ఏర్పాటైంది; అక్కడ వేలాది మంది మహిళలు తమ హక్కుల గురించి చర్చించడానికి ఒకచోట చేరుతున్నారు,  ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, విద్య మరియు ఆరోగ్య సేవలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

హలీమా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. కొన్నిసార్లు ప్రాణహానిని కూడా ఎదుర్కొన్నారు. అయిన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పైగా, ప్రతి అడ్డంకిని తన బలంగా మార్చుకున్నారు.

నేడు, సుందర్‌బన్స్ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో మార్పు గాలులు వీస్తున్నాయి. మహిళలు  నిరసన తెలపడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం మరియు తమకు దక్కాల్సిన స్థానాన్ని దక్కించుకోవడం నేర్చుకున్నారు. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హలీమా ఖాతున్; తన జీవితాన్ని మాత్రమే కాకుండా, వేలాది మంది ఇతరుల జీవిత గమనాన్ని కూడా హలీమా ఖాతున్ మార్చివేసింది.



 

No comments:

Post a Comment