11 May 2022

పులిట్జర్ ప్రైజ్ చరిత్ర; మరియు దానిని గెలుచుకున్న భారతీయులు A Brief history of the Pulitzer Prize; and the Indians who have won it

 

1847లో హంగరీలోని మాకోలో మగార్-యూదు మూలానికి చెందిన సంపన్న కుటుంబంలో జన్మించిన "అలసిపోని జర్నలిస్టు" జోసెఫ్ పులిట్జర్ పేరు మీద పులిట్జర్ అవార్డు స్థాపించబడినది.

జోసెఫ్ పులిట్జర్ తన వీలునామాలో, పులిట్జర్ జర్నలిజం స్కూల్ స్థాపన కోసం కొలంబియా విశ్వవిద్యాలయానికి $2,000,000 విరాళాన్ని అందించాడు, 1911లో జోసెఫ్ పులిట్జర్ మరణం తర్వాత, మొదటి పులిట్జర్ బహుమతులు జూన్, 1917లో అందించబడ్డాయి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు అత్యంత గౌరవనీయమైన అవార్డు, పులిట్జర్‌ను అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం, పులిట్జర్ ప్రైజ్ బోర్డ్ సిఫార్సుపై ప్రదానం చేస్తుంది.

Ø2022 సంవత్సరం పులిట్జర్‌ అవార్డును నలుగురు భారతీయ ఫోటోగ్రాఫర్‌ల బృందం గెలుచుకొన్నది.


Reuters photographers Adnan Abidi, Sanna Irshad Mattoo, Amit Dave and Danish Siddiqui

 


Ø భారతదేశంలోని కోవిడ్-19 సంక్షోభాన్ని కవరేజ్ చేసినందుకు రాయిటర్స్ వార్తా సంస్థ కు చెందిన నలుగురు భారతీయ ఫోటోగ్రాఫర్‌ల బృందం - హత్యకు గురైన ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ, అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ మరియు అమిత్ డేవ్ ఫీచర్ ఫోటోగ్రఫీకి 2022 పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు.

 

గతంలో పులిట్జర్‌ను గెలుచుకున్న భారతీయులు:

Ø అమెరికాలోని గదర్ పార్టీ సభ్యుడు, ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ గోవింద్ బెహారీ లాల్, 1937లో జర్నలిజం లో  పులిట్జర్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన  గోవింద్ బెహారీ లాల్ 1969లో పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు.

Ø 2003లో, ముంబైలో జన్మించిన గీతా ఆనంద్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కార్పొరేట్ అవినీతిపై నివేదించినందుకు పులిట్జర్ బహుమతిని గెలుచుకున్న బృందంలో భాగంగా ఉన్నారు.

2016లో, లాస్ ఏంజెల్స్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ అయిన ఇండియన్-అమెరికన్ సంఘమిత్ర కలిత పులిట్జర్‌ను గెలుచుకున్నారు.

Ø 2000లో, లండన్‌లో జన్మించిన భారతీయ-అమెరికన్ రచయిత్రి ఝుంపా లాహిరి తన తొలి కథా సంకలనం “ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మలాడీస్‌ Interpreter of Maladies” కి ఫిక్షన్‌ విభాగం లో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. 

Ø 2011లో, సిద్ధార్థ ముఖర్జీ (ఇండియన్-అమెరికన్ ఫిజిషియన్, బయాలజిస్ట్ మరియు రచయిత) “ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్: ఎ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్‌”లో క్యాన్సర్‌ని డీమిస్టిఫికేషన్ చేసినందుకు జనరల్ నాన్-ఫిక్షన్ విభాగం లో పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు.

Ø ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో, 2021 జూలై 16న మరణించిన  సిద్ధిఖీ - రోహింగ్యా శరణార్థుల సంక్షోభానికి సంబంధించిన చిత్రాలకుగాను  2018లో పులిట్జర్ అవార్డును అందుకున్నారు.

Ø అద్నాన్ అబిది 2019-20 హాంకాంగ్ నిరసనలను కవర్ చేసిన రాయిటర్స్ బృందంలో సబ్యుడిగా బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ విభాగంలో 2020 పులిట్జర్‌ గెలిచాడు..

Ø 2020లో, అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన చన్నీ ఆనంద్, ముఖ్తార్ ఖాన్ మరియు దార్ యాసిన్ ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో పులిట్జర్‌ను గెలుచుకున్నారు,

 

 

 

2 May 2022

ముస్లింలలో కులo

 

గత రెండు దశాబ్దాలుగా, ముస్లింలలో కులంపై చర్చలు నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతున్నాయి. అనేక సంఘటనలు దీనికి దోహదపడ్డాయి: ముస్లిం సంస్థలపై మండల్ రాజకీయాల ప్రభావం మరియు మహారాష్ట్ర, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌ లోని అట్టడుగు కులాల ముస్లిం సమూహాలు, “పస్మండ” (“వదలి వేయబడిన వారు”) బ్యానర్‌తో ఏకం కావడం. ; UPA ప్రభుత్వం ద్వారా సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికల కమీషన్; మరియు ముస్లింలలో విద్యాపరమైన స్కాలర్‌షిప్ పెరుగుదల మొదలగునవి.

ముస్లింలు కూడా కులం ద్వారా ప్రభావితమయ్యారనే అవగాహన చాలా విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంది: భారతదేశంలోని చాలా మంది ముస్లింలు వెనుకబడిన కులాలకు చెందినవారని పండితులు ఎత్తి చూపారు.

ఇంతియాజ్ అహ్మద్ మరియు ఖలీద్ అన్సారీ ఈ సంఖ్యను 85 శాతంగా పేర్కొన్నారు - ఈ సంఖ్య ఖచ్చితంగా తక్కువ సామాజిక-ఆర్థిక సూచికలతో సహా అనేక "ముస్లిం సమస్యలను" ఎత్తి చూపుతుంది,

అయితే, సరిఅయిన డేటా లేకపోవడం వల్ల ముస్లిం కులం మరియు వారి సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనంపై సమగ్ర అధ్యయనాలు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం కుల సమూహాల నిష్పత్తికి సంబంధించి నమ్మదగిన నూతన  డేటా లేదు.

1871 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 19 శాతం ఉన్నత కులాలు మరియు 81 శాతం దిగువ కుల ముస్లింల నిష్పత్తిని సూచిస్తుంది. అయితే, సచార్ కమిటీ నివేదిక NSSO డేటా ఆధారంగా ముస్లిం జనాభాలో 40 శాతం తక్కువ కులాల ముస్లింల సంఖ్యను పేర్కొంది. మండల్ కమీషన్ నివేదిక కూడా 52 శాతం గా మాత్రమే (అది దళిత ముస్లిం జనాభాను లెక్కించనప్పటికీ) పేర్కొంది.

స్వాతంత్ర్యం తర్వాత (షెడ్యూల్డ్ కులాలు మినహా) జనాభా గణనలో కులాల గణన నిలిపివేయడం భారతదేశం అంతటా ఉన్న సంఘాలు మరియు కులాల స్థితిపై అవగాహనను ప్రభావితం చేసింది. కానీ ముస్లింల విషయంలో - కులం ఉనికిని రాజ్యం మరియు ఉన్నత (elite)ముస్లిం ప్రతినిధులు  తిరస్కరించినారు. కుల గణన లేకపోవడం వల్ల ముస్లింలను అర్థం చేసుకోవడానికి- వారి పేదరికం, విద్యాపరమైన వెనుకబాటుతనం మరియు వృత్తిపరమైన అనిశ్చితిని  తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది 

ఉదాహరణకు, 1983 నాటి గోపాల్ సింగ్ కమిటీ నివేదిక, ముస్లిములలో పేదరికాన్ని పరిశీలించడానికి నియమించబడింది, "కళలు మరియు చేతివృత్తులలో చాలా ప్రతిభను కలిగి ఉన్న" ముస్లిం కళాకారులు ఇప్పటికీ భూమిలేనివారు, పేదలు మరియు దోపిడీకి గురవుతున్నారనే వాస్తవం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంలో, ఈ సంవత్సరం ప్రచురించబడిన రెండు అధ్యయనాలు ముస్లింలలో కులాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి వెలువరించిన కొన్ని గణాంకాలు  స్వాగతించదగినవి.

మొదటిది, జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో ఛవీ తివారీ, శ్రీనివాస్ గోలీ, మహ్మద్ జాహిద్ సిద్ధిఖీ మరియు ప్రదీప్ S. సాల్వే ఇటీవల ప్రచురించిన పేపర్‌లో UPలోని 7,000 గృహాలను హిందూ మరియు ముస్లిం కులాలలోని ఉపకులంలో భూమి యాజమాన్యం(ల్యాండ్ హోల్డింగ్), పేదరికం, ఉపాధి, విద్య మరియు ఆరోగ్య సూచికలతో  పోల్చారు.

ముస్లింలలో 76 శాతం మంది అట్టడుగు కులాల వారు మరియు మొత్తం ముస్లిం జనాభాలో 24 శాతం దళిత ముస్లింలు ఉన్నారని అధ్యయనం అంచనా వేసింది. సామాజిక వివక్షత కు గురిఅవుతున్న దళిత ముస్లిలు  దళిత క్రైస్తవులతో పాటు షెడ్యూల్డ్ కుల హోదా కింద ఎటువంటి రక్షణను పొందలేదు.

అగ్ర కులాలు మరియు అట్టడుగు కులాల ముస్లింలకు సూచికలలో తేడాను అధ్యయనం పునరుద్ఘాటిస్తుంది. దళిత మరియు OBC ముస్లింలలో గ్రామీణ పేదరికం వరుసగా 53 శాతం మరియు 42 శాతం, అగ్ర కులాల (సాధారణ) ముస్లింలలో 31 శాతం ఉంది.

భూమిలేని కుటుంబాల వాటా దళిత ముస్లింలలో 80 శాతం కాగా అగ్రవర్ణ ముస్లింలలో 44 శాతం. దళిత మరియు OBC ముస్లింలు బ్యాంకుల నుండి రుణాలు వంటి అధికారిక ఆర్థిక సేవల నుండి రెండు రెట్లు ఎక్కువ లేమిని/ మినహాయింపును exclusion ఎదుర్కొంటున్నారు.

ఉన్నత కులాలు మరియు దిగువ కులాల ముస్లింల మధ్య సామాజిక-ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని మరియు అది మునుపటి అధ్యయనాలు అంచనా వేసిన దాని కంటే తక్కువ కులాల ముస్లింలలో అధిక శాతం ఉన్నట్లు అధ్యయనం సూచిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, సామాజిక-ఆర్థిక సూచికల పటంలో హిందూ అగ్రవర్ణాలతో పోలిస్తే అగ్రవర్ణ ముస్లింలు ఇప్పటికీ గణనీయమైన ప్రతికూలత disadvantage లో ఉన్నారని కూడా అధ్యయనం పునరుద్ఘాటించింది. ఉదాహరణకు, అగ్ర కులాల హిందువులకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిష్పత్తి 14 శాతం కాగా, ముస్లిం అగ్ర కులాల్లో అదే 31 శాతంగా ఉంది. పట్టణ పేదరికం, భూమి మరియు సంపద హోల్డింగ్‌లో కూడా ఇదే విధమైన అసమానత కనిపిస్తుంది. మొత్తంమీద, దేశంలోని ఇతర సమూహాలతో పోలిస్తే అగ్రవర్ణ హిందువులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.

జూలియన్ లెవెస్క్, లారెన్స్ గౌటియర్ మరియు నికోలస్ బెలోర్గే చేసిన మరొక నూతన  అధ్యయనం గమనించదగినది. ముస్లిం నాయకులు ఆక్రమించే "సామాజిక ప్రదేశాలను" మ్యాపింగ్ చేస్తూ, తన 2000 పుస్తకం “మసావత్ కి జంగ్‌”లో, అలీ అన్వర్ బీహార్‌లోని అనేక ముస్లిం సంస్థలలో సయ్యద్‌లు మరియు షేక్‌ల అధిక ప్రాతినిధ్యాన్ని నొక్కిచెప్పారు (ఉదాహరణకు, ఆ సమయంలో, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ లోని 39 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులలో 36 మంది ఉన్నత కులస్థులు) . భారతదేశం అంతటా 164 మంది ముస్లిం నాయకులతో  ఈ అధ్యయనం  చేయడం జరిగింది. ముస్లిం నేతల్లో 70 శాతం మంది అగ్రవర్ణాలకు చెందిన వారేనని పేర్కొంది. గత 30 ఏళ్లలో ఇది మారలేదు.

ఈ రచనలు స్వాగతించదగినవి మరియు అవసరం. మతాలకు అతీతంగా భారతీయ సమాజంలో కులం ప్రాథమిక యూనిట్‌గా మిగిలిపోయిందని మరియు కుల గణన దేశంలో అధికారం, ప్రాతినిధ్యం మరియు "బుజ్జగింపు" గురించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుతుందని  రచయితలు నొక్కి చెప్పారు.


రచన: షిరీన్ ఆజం , శ్రీనివాస్ గోలి |

ఆజం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో DPhil పరిశోధకుడు మరియు మాజీ అసిస్టెంట్ ఎడిటర్, ఎకనామిక్ & పొలిటికల్ వీక్లీ మరియు గోలీ JNUలో పాపులేషన్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్.

మే 2, 2022 ఇండియన్ ఎక్స్‌ప్రెస్

 

 


27 April 2022

ముస్లిం, క్రిస్టియన్ దళితులకు రాజ్యాంగ రక్షణ కల్పన Extending constitutional protections to Muslim and Christian Dalits

 

ముస్లిం మరియు క్రిస్టియన్ దళితులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి/SC) హోదాను పొడిగించాలనే డిమాండ్ యొక్క మెరిట్‌ను పరిశీలించడానికి జాతీయ ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని తిరిగి పరిశీలించడానికి ఇటీవల వివిధ  మంత్రిత్వ శాఖల మధ్య చర్చ జరిగింది.

స్వాతంత్ర్యం తర్వాత, 1950 రాజ్యాంగ ఉత్తర్వు, 1936 నాటి భారత ప్రభుత్వ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్‌లో పేర్కొన్న జాబితాను ఉపయోగించి SCలు మరియు STలను జాబితా చేసింది. హిందూ మతం కాకుండా ఇతర మతాన్ని ప్రకటించే వ్యక్తిని షెడ్యూల్డ్ సభ్యుడుగా పరిగణించరాదని ఉత్తర్వు పేర్కొంది. హిందూ మతం తప్ప ఇతర మతాలకు కుల వ్యవస్థ లేదని భావించబడింది..

ఈ   వాదనను ఇకపై రెండు కారణాల వల్ల సమర్థించలేము.

మొదటగా, ఈ మతాలు కుల వివక్షను పాటించకూడదని భావించినప్పటికీ, 1956లో సిక్కు దళితులను చేర్చడానికి మరియు 1990లో బౌద్ధ దళితులను చేర్చడానికి ప్రెసిడెంట్ ఆర్డర్(1950 రాజ్యాంగ ఉత్తర్వు) సవరించబడింది.

రెండవది, ముస్లిం మరియు క్రిస్టియన్ దళితులు, హిందూ దళితుల వలె కుల వివక్షతో బాధపడుతున్నారు. వారు ప్రధానంగా దళితులు మరియు వారి ముస్లిం మరియు క్రిస్టియన్ గుర్తింపు ద్వితీయమైనది, ఇది దళితులపై జరిగిన అనేక దౌర్జన్యాల కేసులలో స్పష్టంగా కనిపిస్తుంది. కంధమాల్, కారంచేడు మరియు సుందూర్ ఊచకోతలలో మరియు కర్ణాటకలోని తుమకూరు, బెళగావి, మాండ్య మరియు బాగల్‌కోట్ నుండి ఇటీవల నమోదైన హింసాత్మక సంఘటనలలో బాధితుల్లో ఎక్కువ మంది దళిత క్రైస్తవులు.

ఈ బాధితులు క్రైస్తవులు అయినందున దాడి చేయబడలేదు  వారు క్రైస్తవ మతంలోకి మారిన "అంటరానివారు" కాబట్టి దాడి చేయబడ్డారు.  క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ, వారి సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపడలేదు. వాస్తవానికి, అది మరింత దిగజారింది.

అందుబాటులో ఉన్న కొన్ని సర్వేల ద్వారా కూడా ఇది స్పష్టమైంది.

2008లో, నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ (NCM)చే నియమించబడిన మరియు సతీష్ దేశ్‌పాండే మరియు గీతికా బాప్నా తో రూపొందించబడిన ఒక అధ్యయనం — “ముస్లిం మరియు క్రైస్తవ కమ్యూనిటీలలో దళితులు — ప్రస్తుత సామాజిక శాస్త్రీయ పరిజ్ఞానంపై స్థితి నివేదిక Dalits in the Muslim and Christian Communities — A Status Report on Current Social Scientific Knowledge”” — దళిత ముస్లింలు, వారి కమ్యూనిటీలో 8 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారు మరియు వారి సంఘంలో 23.5 శాతం ఉన్న దళిత క్రైస్తవులు భారతదేశంలోని పేదలలో అధిక ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు.

గ్రామీణ భారతదేశంలో, 39.6 శాతం దళిత ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు మరియు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 46.8 శాతం దళిత ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఈ విషయం లో దళిత క్రైస్తవులకు సంబంధించిన గణాంకాలు 30.1 మరియు 32.3 శాతంగా ఉన్నాయి.  దీనికి విరుద్ధంగా, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 29.2 శాతం ముస్లింలు మరియు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 41.4 శాతం మంది ముస్లింలు BPL గా ఉన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గ్రామీణ మరియు పట్టణ దళిత క్రైస్తవులు వరుసగా 16.2 మరియు 12.5 శాతం ఉన్నారు.

దళిత ముస్లింలు మరియు క్రైస్తవులు కొన్నిసార్లు వారిలో  చనిపోయినవారిని వేర్వేరు శ్మశానవాటికలలో ఖననం చేయవలసి వస్తుంది. గతంలో దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా చర్చిలు వేరు చేయబడ్డాయి.

మతం మారిన తర్వాత దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవుల సామాజిక మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని 2006లో సచార్ కమిషన్ నివేదిక గమనించింది. 2007లో, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక 1950 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు, ఎస్సీ హోదాను మతంతో delink/విడదీయడానికి సవరించాలని మరియు దళితులు మరియు షెడ్యూల్డ్ తెగలందరికీ మత-తటస్థ హోదా religion-neutral status ఇవ్వాలని సిఫార్సు చేసింది. 27 శాతం ఉన్న ఓబీసీ కోటాలో మైనారిటీలకు 8.4 శాతం సబ్‌కోటా, అలాగే దళిత మైనారిటీలకు షెడ్యూల్డ్ కులాల కోటాలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. 

మిశ్రా కమిషన్ నివేదిక మరియు మైనారిటీల జాతీయ కమిషన్ నివేదిక డిసెంబర్ 2009లో పార్లమెంట్‌లో సమర్పించబడ్డాయి. హిందూ మతం, సిక్కుమతం మరియు బౌద్ధమతాలను ప్రకటించే వారి సహచరులకు అందుబాటులో ఉన్న రాజ్యాంగ రక్షణ మరియు భద్రతలను దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు విస్తరించడానికి రెండూ అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ సిఫార్సులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు.

ప్రభుత్వాలు ఈ నివేదికలకు వ్యతిరేకంగా వాదించారు - వారు సేకరించిన అనుభావిక సాక్ష్యాలు ఉన్నప్పటికీ - దళిత ముస్లింలు మరియు క్రైస్తవులపై డేటా కొరతను ఉటంకిస్తూ మరియు తరతరాలుగా మార్పిడి రికార్డుల చెల్లుబాటును వ్యతిరేకించారు.

మండల్ కమీషన్ సిఫార్సులను అనుసరించి 20 రాష్ట్రాలు దళిత ముస్లింలు మరియు క్రైస్తవులకు OBC కేటగిరీ కింద ప్రయోజనాలను విస్తరించాయనే వాస్తవానికి  ఇది విరుద్ధం. కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రయోజనాల నుండి ముస్లిం మరియు క్రిస్టియన్ దళితులను నిరంతరం మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 16లోని సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు సామాజిక హోదా, సమాజంలో నిలబడటం, అట్టడుగున ఉంచడం, వివక్ష, హింస మరియు సామాజిక బహిష్కరణ వంటి ప్రమాణాలపై social status, standing in the community, marginalisation, discrimination, violence and social exclusion ఆధారపడి ఉంటాయి.

ఆర్డర్ 1950 నాటిది. దానిప్రకారం హిందూ దళితులు రిజర్వేషన్ ప్రయోజనాలను కలిగి ఉన్నారు. రిజర్వేషన్ సార్వత్రికమైతే, దేశంలోని హిందూ జనాభా సంఖ్య తగ్గడానికి దారితీయవచ్చు - ఇది చాలా హిందూ సంస్థలను ఆందోళనకు గురిచేస్తుంది.

సిక్కు మతం మరియు బౌద్ధమతం వంటి భారతీయ మతాలకు సంబంధించి 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వును సవరించవచ్చు, అదే నిబంధన సడలింపు "విదేశీ మతాలకు" వర్తించదు - ఇప్పుడు ఈ ముఖ్యమైన సమస్యను మతతత్వం ప్రభావితం చేస్తోందనడానికి ఇది స్పష్టమైన సూచన.

అంతేకాకుండా,దళిత క్రిస్టియన్లు మరియు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల హిందూ, సిక్కు మరియు బౌద్ధ దళితులకు పోటీ బలంగా ఉంటుంది. అందువల్ల, ఈ సమూహాలు దళిత క్రైస్తవ మరియు దళిత ముస్లిం వర్గాలకు చెందిన వారి సోదరులకు అనుకూలంగా లాబీయింగ్ చేయవు.

జనవరి 2020లో, ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. అయితే దళిత క్రిస్టియన్లు మరియు ముస్లింలకు రిజర్వేషన్ల వివాదాస్పద అంశంపై న్యాయవ్యవస్థ ఇంకా తీర్పు ఇవ్వలేదు.

 

 

ఈ వ్యాసం వ్రాసినది-క్రిస్టోఫ్ జాఫ్రెలాట్, ఫిలిప్ వర్గీస్.

జాఫ్రెలాట్ CERI-సైన్సెస్ Po/CNRS, పారిస్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో, లండన్‌లోని కింగ్స్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియన్ పాలిటిక్స్ అండ్ సోషియాలజీ ప్రొఫెసర్.

వర్గీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ & ఇంటర్నేషనల్ స్టడీస్, క్రిస్ట్ (డిమ్డ్ టు బి యూనివర్శిటీ), ఢిల్లీ

 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 26, 2022లో  ప్రచురింపబడినది.