15 June 2023

బాబా ఖరక్ సింగ్

 

భారత స్వాతంత్ర్య పోరాటంలో నా వెన్నులో తుపాకి గుండు తగిలి చనిపోతే నన్ను 'గురువుల శిష్యుడు'గా పరిగణించవద్దు మరియు సిక్కు ఆచారాల ప్రకారం నా మృతదేహాన్ని దహనం చేయవద్దు.  ఎందుకంటే నేను 'గురువుల శిష్యుడు'గా వెన్ను పై కాదు ఛాతీపై గుండు తగిలి మరణించాలి” - బాబా ఖరక్ సింగ్

బాబా ఖరక్ సింగ్ మన స్వాతంత్ర్య పోరాటంలో అజ్ఞాత వీరుడు. బాబా ఖరక్ సింగ్ పేరు మనలో చాలా మందికి తెలియదు. దేశ స్వాతంత్య్రం కోసం 13 సార్లు జైలుకు వెళ్లి మొత్తం 20 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బాబా ఖరక్ సింగ్ 1912లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు, అయితే 1919 నాటి జలియన్‌వాలాబాగ్ ఊచకోత మరియు పంజాబ్‌లో మార్షల్ లా కింద జరిగిన సంఘటనలు  బాబా ఖరక్ సింగ్ ను సిక్కు రాజకీయాల కేంద్రబిందువుగా   తీసుకువచ్చాయి.

బాబా ఖరక్ సింగ్ 1921లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC)యొక్క  మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బాబా ఖరక్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'కీస్ మోర్చా'कीज मोर्चा Keys Morcha 'గా పిలువబడే ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. గోల్డెన్ టెంపుల్ యొక్క తోష్ ఖానాToshakhana (treasury) తాళాలను(అమృతసర్‌లోని బ్రిటీష్ డిప్యూటీ కమీషనర్ స్వాధీనం చేసుకున్న గోల్డెన్ టెంపుల్ యొక్క తోషాఖానా (ఖజానా) తాళాలను తిరిగి ఇవ్వమని కోరుతూ సిక్కుల చేసిన నిరసన) తిరిగి పొందడానికి సిక్కులు చేసిన ఆందోళన ఇది. ఈ సమయంలో బాబా ఖరక్ సింగ్ కూడా జైలుకు వెళ్లవలసి వచ్చింది కానీ బాబా ఖరక్ సింగ్ ఎన్నడు బ్రిటిష్ వారి ముందు తలవంచలేదు.

ఒక్కసారి కాదు,అనేక సార్లు  అన్యాయం, సామ్రాజ్యవాదానికి’ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి బాబా ఖరక్ సింగ్ జైలుకెళ్లారు. బాబా ఖరక్ సింగ్ దేశద్రోహ ప్రసంగాలు లేదా తన కర్మాగారంలో క్రుపాణ్कृपाणें తయారు చేయడం వంటి నేరాలకు అనేకసార్లు జైలుకు వెళ్ళారు.

బాబా ఖరక్ సింగ్ ను సుదూర డేరా ఘాజీ ఖాన్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జైలుకు పంపారు, అక్కడ జైలు అధికారులు సిక్కులు నల్లటి తలపాగాలు మరియు సిక్కుయేతరులు  గాంధీ టోపీలు ధరించడాన్ని నిషేధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయం ఒక ఉద్యమానికి దారితీసింది. దీనిలో ఖైదీలు నిషేధం ఎత్తివేయబడే వరకు తమ పై వస్త్రాలను విడిచిపెట్టారు మరియు సిక్కులు కచ్చరా कछहरा  kachahira (underpants), హిందువులు ధోతీ మాత్రమే ధరించారు. ఇది గాంధీజీ పౌర ధిక్కార ఉద్యమానికి కొత్త కోణాన్ని జోడించింది. జూన్ 4, 1927న వారి శిక్షాకాలం (ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు రెండుసార్లు పొడిగించబడింది) తర్వాత వారు విడుదలయ్యే వరకు ఆందోళనకారులు చాలా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ bare-backed పై భాగం లో వస్త్రం లేకుండా  ఉన్నారు.

1928-29 సమయంలో, (కాంగ్రెస్ పార్టీ దానిని ఉపసంహరించుకునే వరకు), వలసరాజ్య హోదాను అంగీకరించిన నెహ్రూ కమిటీ నివేదికను బాబా ఖరక్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బాబా ఖరక్ సింగ్ చురుకుగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు  మరియు అనేకసార్లు జైలుకు వెళ్ళారు.

6, అక్టోబర్ 1963న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు బాబా ఖరక్ సింగ్ 95 ఏళ్ల వయస్సు లో ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

 

No comments:

Post a Comment