మధ్యప్రాచ్యానికి చెందిన వ్యాపారులు “కాఫీ” ని మొఘల్ సామ్రాజ్యానికి పరిచయం చేశారు, అయితే బ్రిటీష్ వారు “టీ” ఉపఖండం ఇష్టపడే పానీయంగా మార్చారు.
భారతదేశంలో “టీ” నిస్సందేహంగా జాతీయ ప్రజాదరణ పొందిన పానీయం. భారత ఉపఖండంలో “టీ” యొక్క అద్భుతమైన ప్రజాదరణ రెండు శతాబ్దాల కంటే పూర్వoది మరియు ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలన ఫలితంగా మాత్రమే వచ్చింది.
ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ బ్రిటీష్ వారు రాకముందు, భారతీయులు ఎక్కువుగా
ఇష్టపడే పానీయం “కాఫీ”.
సూఫీ సన్యాసులు మరియు వ్యాపారస్తులుSufis and merchants:
కాఫీ, 15వ శతాబ్దంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుండి యెమెన్‌కు తీసుకురాబడింది మరియు తరువాత 16వ శతాబ్దం నాటికి ఉత్తరాన ప్రాచ్య దేశాల్లోనికి మరియు తరువాత యూరప్‌కు వ్యాపించింది.
కాఫీ తూర్పు వైపు కూడా వ్యాపించింది మరియు భారతదేశంలోని మొఘల్ శ్రేష్టులు దీనిని తమ ఎంపిక పానీయంగా స్వీకరించారు.
మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానంలో హిందూ మరియు ముస్లిం ప్రభువులు కాఫీ తాగేవారు. ఎడ్వర్డ్ టెర్రీ అనే చరిత్రకారుడు, జహంగీర్ ఆస్థాన సభ్యులు కాఫీ "ఆత్మలను ఉత్తేజపరుస్తుందని, జీర్ణక్రియకు సహాయపడుతుందని మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుందని" విశ్వసించారని పేర్కొన్నాడు
మొఘల్ సామ్రాజ్యంతో బలమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్న అరబ్ మరియు టర్కిక్ వ్యాపారులు కాఫీ గింజలను భారత ఉపఖండానికి తీసుకువచ్చారు. వారు కాఫీ మాత్రమే కాకుండా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, పర్షియా మరియు టర్కీ నుండి పట్టు, పొగాకు, పత్తి, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు మరియు మరిన్ని ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.
కాఫీ ఆరోగ్యకరమైన పానీయం, సామాజిక చలనశీలతకు సూచిక మరియు ఢిల్లీ యొక్క ఉన్నత సామాజిక జీవితంలో అంతర్భాగంగా పరిగణించబడింది.
షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని అధిరోహించే సమయానికి, భారతీయ సమాజంలో కాఫీ పట్ల ఆసక్తి విపరీతంగా పెరిగింది. జహంగీర్ కుమారుడు షాజహాన్ సింహాసనాన్ని అధిరోహించే సమయానికి (1628–1658), కాఫీ పట్ల ఆసక్తి భారతీయ సమాజమంతా వ్యాపించింది
1638లో యూరోపియన్ యాత్రికుడు, జర్మన్ సాహసికుడు జోహన్ ఆల్బ్రెచ్ట్ డి మాండెల్స్లో, తన “ది వాయేజెస్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ జె ఆల్బర్ట్ డి మాండెల్స్లో” అనే పేరుతో రాసిన జ్ఞాపకంలో, వేడిని ఎదుర్కోవడానికి మరియు తనను తాను చల్లగా ఉంచుకోవడానికి కహ్వా (కాఫీ) తాగినట్లు వివరించాడు.
“ట్రావెల్స్ ఇన్ ది మొగల్ ఎంపైర్” (1656–1668) అనే గ్రంధం లో ఫ్రాంకోయిస్ బెర్నియర్, అనే ఫ్రెంచ్ వైద్యుడు, టర్కీ నుండి పెద్ద మొత్తంలో కాఫీని ఫ్రాన్స్ దిగుమతి చేసుకున్నదని పేర్కొన్నాడు.
సామాజిక జీవితపు శ్రేష్టత లో అంతర్భాగంగా మరియు వేడిని నివారించడం లో కాఫీ ఉపయోగంతో పాటు, కాఫీ భారత ఉపఖండంలోని సన్యాసుల కోసం మతపరమైన ఉద్దేశ్యాన్ని కూడా కలిగి ఉంది.
మధ్యప్రాచ్యం మరియు మధ్య ఆసియాలోని సూఫీలవలే భారతదేశంలోని సూఫీలు కూడా తాము రాత్రిపూట చేసే ధిక్ర్ (దేవుని స్మరణ) ముందు కాఫీని సేవిస్తారు.
బాబా బుధన్ అనే సూఫీ సన్యాసి 1670లో మక్కా నుండి తిరిగి వస్తూ, చిక్‌మగళూరు అనే ప్రదేశంలో తానూ మక్కా నుండి తన వస్త్రాల మడతలలో దాచి తెచ్చిన ఏడు కాఫీ విత్తనాల గింజలను నాటినాడు. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బాబా బుధన్‌గిరి కొండ మరియు పర్వత శ్రేణి ఉంది. కర్ణాటక కాఫీ ఉత్పత్తికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది అలాగే సూఫీ సెయింట్‌కు అంకితం చేసిన మందిరాన్ని కలిగి ఉంది.
ఇండియన్ కాఫీ బోర్డు ప్రకారం మరొక సూఫీ సెయింట్ ‘మొచైన్’ యెమెన్‌కు వెళ్లి నిషేధం ఉన్నప్పటికీ అక్కడనుండి కాఫీ బీన్స్‌లను రహస్యంగా భారత దేశానికి తరలించినాడు.
అలెప్పో, కైరో మరియు ఇస్తాంబుల్ వంటి నగరాలలో కాఫీ కేఫ్ సంస్కృతి ఆవిర్భవించినది. ఆదేసమయం లో మొఘల్ కాలం లో షాజహానాబాద్ లో "ఖహ్వాఖానాస్" లేదా కాఫీ హౌస్ లు ఆవిర్భవించినవి.
“స్పిల్లింగ్ ది బీన్స్: ది ఇస్లామిక్ హిస్టరీ ఆఫ్ కాఫీ”లో, నేహా వర్మనీ అరబ్ సెరాయ్ "స్టికీ స్వీట్ కాఫీ” తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది అని పేర్కొన్నది.అరబ్ సెరాయ్ దాని జిగట తీపి కాఫీకి ప్రసిద్ధి చెందింది.
1560లో మొఘల్ చక్రవర్తి హుమాయున్ భార్య హమిదా బానుచే ప్రారంభించబడిన సెరాయ్, నేటికీ డిల్లి లో యునెస్కో వారసత్వ ప్రదేశంలో భాగంగా ఉంది.మక్కా తీర్థయాత్రలో హమిదా బాను తో పాల్గొన్న అరబ్ మత పండితులు సెరాయ్ ను సత్రంగా ఉపయోగించారని మరియు మొఘలుల కోసం పనిచేస్తున్న మధ్యప్రాచ్యం నుండి వచ్చిన హస్తకళాకారులను ఉంచడానికి కూడా సెరాయ్ ను ఉపయోగించారని చరిత్రకారులు పేర్కొన్నారు.
చరిత్రకారుడు స్టీఫెన్ బ్లేక్ తన 1991 నాటి “షాజానాబాద్: ది సావరిన్ సిటీ ఇన్ మొఘల్ ఇండియా 1639–1739 Shahjhanabad: The Sovereign City in Mughal India 1639-1739 ”లో కాఫీ హౌస్‌లను కవులు, కథకులు, వక్తలు సమావేశమయ్యే ప్రదేశాలుగా అభివర్ణించారు. బ్లేక్ ఈ కాఫీ హౌస్ లలో కవితా పఠనాలు, కథలు చర్చలు మరియు బోర్డ్ గేమ్‌లు వంటి కార్యకలాపాలు ఉండేవని వివరించాడు. ఇస్ఫాహాన్ మరియు ఇస్తాంబుల్ వంటి నగరాల మాదిరిగానే షాజానాబాద్‌లోని కాఫీ హౌస్‌లు వినియోగ సంస్కృతి మరియు అభివృద్ధి చెందుతున్న ఆహార సంస్కృతి పెరుగుదలను వేగవంతం చేశాయి. కాఫీహౌస్ అనేది ప్రజలచే సృష్టించబడిన మరియు రూపొందించబడిన సామాజిక స్థలం గా మారింది.
1740-1756 వరకు బెంగాల్‌ను పాలించిన బెంగాల్ నవాబ్ నాజిమ్ అయిన అలీవర్ది ఖాన్ కాఫీని ఎక్కువగా ఇష్టపడేవారు.అలీవర్ది ఖాన్ పాలకుడిగా పేరుగాంచిన, కాఫీ మరియు ఆహారం అతని జీవితంలో రెండు అతిపెద్ద ఆనందాలు. ఆ కాలంలోని ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన సయ్యద్ ఘోలం హుస్సేన్ ఖాన్ రాసిన “సెయిర్ ముతాఖేరిన్ లేదా ది రివ్యూ ఆఫ్ మోడరన్ టైమ్స్ Seir Mutaqherin or the Review of Modern Times,” లో బెంగాల్ నవాబ్ అలీవర్ది ఖాన్ అత్యుత్తమ కాఫీ గింజలను ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి దిగుమతి చేసుకున్నాడు మరియు వాటిని తన రాజధాని ముర్షిదాబాద్‌కు తీసుకువచ్చాడు అని పేర్కొన్నాడు.
అలీవర్ది ఖాన్ కాఫీ గింజలు దిగుమతి చేసుకోవడమే కాకుండా తన వంటగది సిబ్బంది కూడా పర్షియా, టర్కీ మరియు మధ్య ఆసియా వంటి దేశాలనుండి నుండి వచ్చారు. అలీవర్ది ఖాన్ వ్యక్తిగతంగా తన బారిస్టాస్ (ఖహ్వాచి-బాషి)ని ఎంపిక చేసుకున్నాడు మరియు వారు తమవెంట తమ ప్రత్యేక కాఫీ తయారీ పరికరాలను తీసుకువచ్చారు.
మొఘల్ కాఫీ సంస్కృతి పూర్వ-వలసవాద బెంగాల్ లో కనీసం 1757 వరకు కొనసాగింది. సిరాజ్ ఉద్-దౌలా కాలం లో బెంగాల్ యొక్క అదృష్టంతో పాటుగా ఆస్థాన కాఫీ సంస్కృతి వేగంగా క్షిణిoచినది.
1757లో నిర్ణయాత్మక ప్లాసీ యుద్ధంలో బెంగాల్ ఓడిపోయినప్పుడు, ఈస్టిండియా కంపెనీ బెంగాల్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది మరియు ప్రజల వినియోగం నుండి నెమ్మదిగా కాఫీ అదృశ్యమైంది
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెరుగుదల భారత ఉపఖండం లో కాఫీ సంస్కృతికి ముగింపు పలికింది.
భారతదేశం తేయాకు వ్యవసాయం:
17వ శతాబ్దం చివరలో టీ పట్ల బ్రిటన్ ఆసక్తి పెరిగింది మరియు చైనా దాని ప్రధాన సరఫరాదారు.19వ శతాబ్దం నుండి భారతదేశం తేయాకు వ్యవసాయం చేపట్టింది. క్రమంగా భారత దేశం లో బ్రిటిష్ వారి పరిపాలన కాలం లో టీ వినియోగం పెరుగుతోంది.సారవంతమైన నేలలు మరియు అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో, భారతదేశం తేయాకు సాగుకు సరైన ప్రదేశం.
1834 ఫిబ్రవరిలో, అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఈస్టిండియా కంపెనీ
యొక్క స్వంత టీ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని నియమించారు.
స్థానిక భారతీయ జనాభాలో, బ్రిటిష్ వారు తేయాకు ఆకులను పండించే కార్మికులను మాత్రమే కాకుండా టీ వినియోగదారులను కూడా కనుగొన్నారు.
తేయాకు సాగు పెరగటం తో భారతీయ అభిరుచులు టీ కు మారాయి. భారతీయులు కాఫీ హౌస్‌లను సందర్శించడంపై బ్రిటిష్ నిషేధం (యూరోపియన్లు మినహా అందరికీ నిషేధించబడింది) కూడా టీ త్రాగే సంస్కృతి పెరుగుదలకు దారితీసింది.
అయితే భారతదేశంలో కాఫీ త్రాగే సంస్కృతి పూర్తిగా నశించలేదు
భారతీయ చరిత్రకారుడు మరియు రచయిత, AR వెంకటాచలపతి 2006లో తన పుస్తకంలో ఇన్ దేస్ డేస్ దేర్ వాస్ నో కాఫీ: రైటింగ్స్ ఇన్ కల్చరల్ హిస్టరీ In Those Days There was No Coffee: Writings in Cultural History లో “కాఫీ తాగడం ఆధునికతకు సంకేతం" అని రాశారు.
20వ శతాబ్దం ప్రారంభంలో కాఫీ పట్ల ఉత్సాహం తిరిగి పెరిగింది మరియు 1890లలో “కాఫీ అనేది అలసటను దూరం చేసే అమృతం. కాఫీ శక్తిని ఇస్తుంది” అనే ప్రకటనలు దక్షిణ భారతదేశంలో వెలుబడినవి.
కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా) ఇండియన్ కాఫీ హౌస్ అనే పేరుతో మొదటి భారతీయ కాఫీ షాప్ 1876లో ప్రారంభించబడింది.
1890లలో చైన్ (గొలుసు) షాప్స్ గా మారిన ఇండియన్ కాఫీ హౌస్ భారతీయ కార్మికుల సహకార సంఘాలు నడుపుతున్న 400 కాఫీ హౌస్‌ల నెట్‌వర్క్ గా మారింది. ఇక్కడ కేవలం భారతీయ ఉత్పత్తి అయిన కాఫీ మాత్రమే లబిస్తుంది.జాతి ప్రాతిపదికన వివక్షకు గురికాకుండా ఏ భారతీయుడైనా ప్రవేశించే ప్రజల కాఫీ హౌస్‌లు ఇవి.
బెంగళూరుకు చెందిన “కాఫీ డే గ్లోబల్” ఇప్పుడు దేశంలో 500 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. “కాఫీ డే గ్లోబల్” 1996లో ప్రారంభించబడింది.
2002 లో “స్టార్‌బక్స్” భారతదేశం యొక్క అర్బన్ కాఫీ మార్కెట్‌లోకి
ప్రవేశించింది.
మూలం: మిడిల్ ఈస్ట్ ఐ.కాం, జూన్ 05, 2023
Enjoy thrilling crash games on Khelraja with fast rounds, engaging visuals, and an easy-to-use platform. Perfect for players who love quick excitement and reliable performance.
ReplyDeleteNGO Experts made our NGO DARPAN portal registration smooth and stress-free. They clearly explained each requirement, gathered documents on time, and handled the application with real professionalism. I appreciated their quick responses and transparent updates throughout the process. If you want reliable guidance and faster approval on the DARPAN portal, NGO Experts are a great choice. Highly recommend their team.
ReplyDelete