25 June 2023

దావూదీ బోహ్రాస్

 

దావూదీ బోహ్రాలు లేదా బోహ్రాలు ఇస్లాం యొక్క షియా-ఇస్మాలీ శాఖలోని ఒక మతపరమైన తెగ. దావూదీ బోహ్రాలు అత్యధిక సంఖ్యలో భారతదేశం, పాకిస్తాన్, యెమెన్, తూర్పు ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్నారు. దావూదీ బోహ్రాలు ఐరోపా, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా మరియు ఆస్ట్రేలియా అంతటా విస్తరించి ఉన్నారు. ప్రపంచవ్యాప్తం గా దావూదీ బోహ్రాలు 2 మిలియన్ల వరకు ఉండవచ్చని అంచనా. బోహ్రాల మూలాలు ఈజిప్టులో ఉన్నాయి.

 

సాధారణంగా, పశ్చిమ భారతదేశంలో నివసిస్తున్న ముస్తలీMusta'li శాఖకు చెందిన షియా  ఇస్మాయిల్ ముస్లిముల ను బోహ్రా, లేదా బోహోరా అని కూడా ఉచ్ఛరిస్తారు. బొహ్ర అనే పేరు ఒక గుజరాతీ పదం  వహౌరౌ నుంచి ఆవిర్భవించినది. వహౌరౌ అనగా "వాణిజ్యం" అని అర్థం. బోహ్రాలు సాధారణంగా వ్యాపారులు, వ్యాపారవేత్తలు మరియు వ్యవస్థాపకులు. బోహ్రాలలో మెజారిటీ షియా వ్యాపార వర్గానికి చెందిన వారు కాగా  మైనారిటీ వారు  సున్నీ రైతులు.

ఈజిప్టులో ఆవిర్భవించి, ఆ తర్వాత యెమెన్‌లో  మతపరమైన కేంద్రాన్ని స్తాపించిన   ముస్తలీ విభాగం (ఇస్మాయిల్) 11వ శతాబ్దపు మిషనరీల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టినది. 1539 తరువాత, ముస్తలీ విభాగం(ఇస్మాయిల్) భారతీయ సమాజం లో చాలా పెద్దదిగా పెరిగి తమ శాఖ యొక్క స్థానం యెమెన్ నుండి భారతదేశంలోని సిధ్‌పూర్‌కు మార్చబడింది.

1588లో బోహ్రా కమ్యూనిటీ లో దావూద్  ఇబ్న్ కుత్బ్ షాʾūd ibn Qub Shāh మరియు సులైమాన్ Sulaymān అనుచరుల మధ్య చీలిక ఏర్పడింది దావూద్  ఇబ్న్ కుత్బ్ షాʾūd ibn Qub Shāh మరియు సులైమాన్ Sulaymān-ఇద్దరు బొహ్ర సంఘ నాయకత్వానికి పోటిపడినారు .

దావూద్  మరియు సులైమాన్ అనుచరులు అప్పటి నుండి బోహ్రాస్‌లోని రెండు ప్రధాన సమూహాలుగా మిగిలిపోయారు కాని వీరి మద్య  ఎటువంటి ముఖ్యమైన సైద్దాంతిక/పిడివాదdogmatic భేదాలు లేవు. ఒకరు దాయీ లేదా నాయకుడు బొంబాయిలో నివసిస్తున్న దావూదీ ʾūdīs బొహ్ర సంఘ నాయకుడు కాగా మరొకరు యెమెన్‌లోని సులేమానీల Sulaymānī  నాయకుడు.

దావూదీ బోహ్రాలు ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించే సమాజంగా ప్రసిద్ధి చెందార. దావూదీ బోహ్రాలు దివ్య  ఖురాన్ పఠించడం, ఐదు రోజువారీ ప్రార్థనలు పాటించడం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం, హజ్ మరియు ఉమ్రా తీర్థయాత్రలు చేయడం మరియు జకాత్ ఇవ్వడం చేస్తారు. దావూదీ బోహ్రాలు వ్యాపార విధానాన్ని  మరియు ఆధునికశైలి జీవనవిధానాన్ని కలిగి ఉంటారు.

దావూదీ బోహ్రాలు తైయెబి, ముస్తాలీTaiyebiMusta'liIsma'ili, ఇస్మాయిలీ, షియా ఇస్లాం యొక్క ఉప తెగకు చెందినవారు.. బోహ్రాలు ఫాతిమిడ్ ఇమామ్‌లకు చెందిన వారు  మరియు ముహమ్మద్(స) కుటుంబం పట్ల వారి విశ్వాసo ప్రధానమైనది.

దావూదీ బొహ్ర సమూహం మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పటికి గుజరాత్‌లోని సూరత్‌ను వారి స్వస్థలంగా పరిగణిస్తారు. మీడియా నివేదికల ప్రకారం భారతదేశంలో దావూది బోహ్రా జనాభా 500,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది, మరో 10 లక్షల మంది వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

భారత దేశం లోని దావూదీ బోహ్రాలకు అల్-దాయి అల్-ముత్లాక్ al-Dai al-Mutlaq (అపరిమిత మిషనరీ) అని పిలువబడే వారి నాయకుడు మార్గనిర్దేశం చేస్తారు. అల్-దాయి అల్-ముత్లాక్ al-Dai al-Mutlaq మొదట యెమెన్ నుండి మరియు తరువాత గత 450 సంవత్సరాలుగా భారతదేశం నుండి పనిచేశాడు.

భారతదేశంలో, 5వ శతాబ్దం నుండి దావూదీ బొహ్ర అనుచరుల యొక్క గణనీయమైన సంఘం ఉనికిలో ఉంది.దావూదీ  కమ్యూనిటీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌గా చెప్పుకునే thedawoodibohras.com ప్రకారం, దాయీ సయ్యద్నా దావూద్ బిన్ కుతుబ్షా Dai Syedna Dawood bin Qutubshah  యొక్క అధికారాన్ని అక్బర్ చక్రవర్తి 27వ దాయిdai గా గుర్తించిన తర్వాత ఈ పేరు వచ్చింది.

దావూదీ బోహ్రాలు ఫాతిమీ ఇస్మాయిలీ తయ్యిబీ ఆలోచనా పాఠశాలకు కట్టుబడి ఉన్నారు. దావూదీ బోహ్రా తెగ యొక్క సాంస్కృతిక వారసత్వం ఈజిప్ట్ కు చెందిన ఫాతిమిడ్ ఇమామ్‌ల సంప్రదాయాలలో కనిపిస్తుంది; దావూదీ బోహ్రాలు ప్రవక్త(స) కుమార్తె ఫాతిమా(ర) ద్వారా ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్(స) యొక్క ప్రత్యక్ష వారసులు. ఫాతిమిడ్‌లు 10వ మరియు 11వ శతాబ్దం CE మధ్య ఉత్తర ఆఫ్రికాను పాలించారు.

దావూదీ బోహ్రాలు తమ ప్రగతిశీల దృక్పథానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, వారు స్త్రీ జననేంద్రియ వికృతీకరణ female genital mutilation ఆచారాన్ని పాటిస్తారు. UN దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించింది, అయినప్పటికీ భారతదేశంలో ఇది అమలులో ఉంది అని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

 

దావూదీ బోహ్రా సమాజం యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శి, సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు.

USలోని దావూది బోహ్రా కమ్యూనిటీ వెబ్‌పేజీ ప్రకారం, దావూదీ బోహ్రాలకు చెందినా దాదాపు 5,000 కుటుంబాలు US అంతటా ఉండాయి.

 ఈజిప్టులోని అల్-హకీమ్ మస్జిద్ Al-Hakim Mosque తో సహా అనేక పుణ్యక్షేత్రాలు మరియు చారిత్రాత్మక మసీదుల పునరుద్ధరణకు భారత దావూదీ బోహ్రా సమాజానికి చెందిన ఆధ్యాత్మిక నాయకుడు 53వ సుల్తాన్ ముఫద్దల్ సైఫుద్దీన్ “అల్-దాయి అల్-ముత్లాక్‌” గణనీయమైన కృషి చేసినాడు.

కైరోలోని అల్-హకీమ్ మసీదు దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహకారంతో ఈజిప్టు ప్రభుత్వంచే పునరుద్ధరించబడింది మరియు ప్రజల కోసం  తిరిగి తెరవబడింది.

అల్-హకీమ్ మసీదు దావూదీ బోహ్రా సంఘం సహాయంతో మరమ్మతులు చేయబడిన 11వ శతాబ్దపు మసీదు.

 

kaiరోలోని దావూదీ బోహ్రా కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశం అయిన అల్-హకీమ్ మసీదు కోసం దావూదీ బోహ్రాస్ ఇస్మాయిలీ షియా వర్గం స్థానిక కరెన్సీలో సుమారు 85 మిలియన్లను విరాళంగా ఇచ్చింది.

 

 

No comments:

Post a Comment