8 June 2023

ఈద్ ఇ సూరి: హైదరాబాద్‌లో '' కుతుబ్ షాహీ” చేపల సంప్రదాయం Eid e Soori: A ‘fishy’ Qutb Shahi tradition in Hyderabad

 

ప్రతి సంవత్సరం వేసవి ముగింపు మరియు రుతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తూ “మిరాగ్ లగ్న” లేదా "మృగశిర కార్తి" ను గ్రెగోరియన్ క్యాలెండర్లో జూన్ 8లేదా పర్షియన్ నెల ఖోర్దాద్ 18వ రోజున  జరుపుకుంటారు..

మిరాగ్ రోజున నగరం అంతటా చెదురుమదురు జల్లులు లేదా వర్షం కురుస్తుందని నమ్ముతారు

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు  సమృద్ధిగా కల చేపలను తినడo ఆరోగ్యకరమైన సంప్రదాయం గా భావించబడుతుంది మరియు చేపలను తినడo వర్షాకాలంలో వచ్చే వెక్టర్-బర్న్ వ్యాధులతో పోరాడే శక్తిగా భావించబడుతుంది. “మిరాగ్ లగ్న” లేదా "మృగశిర కార్తి" రోజున హైదరాబాదీలు చేపలను తింటారు.  

"మృగశిర కార్తి" రోజున ఆస్తమా బాధితుల శ్వాసకోశ సమస్యలకు అమృతం అని చెప్పుకునే "చేప మందు " ఇవ్వడం 175 ఏళ్ల సంప్రదాయంగా నిర్వహించబడుతుంది.నాంపల్లిలో బత్తిని గౌడ్ కుటుంబీకులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో  'చేప మందు’ ను స్వీకరించడానికి ప్రజలు లైన్లలో నిరీక్షిస్తూ ఉంటారు.  

తారీఖ్ ఇ కుతుబ్ షాహీ ప్రకారం, 1009 హిజ్రీలో హైదరాబాద్ వ్యవస్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా యూమ్-ఎ-మిరాగ్‌ని “ఈద్-ఎ-సూరి అంటే స్కార్లెట్ పండుగ”ను  జాతీయ పండుగ స్థాయికి పెంచారు.

మహమ్మద్ కులి కుతుబ్ షాహీ మిరాగ్ ను స్వాగతిస్తూ ఒక కవిత (sonnet)  ఇలా వ్రాశాడు:

“Garja mirag khushiyan soun; singhar aao sakhiyan,
Padta hai megh phui phui; choli bhigao sakhiyan

గర్జా మిరగ్ ఖుషియన్ సౌన్ ; సింగార్ ఆవో సఖియాన్,

పడ్తా హై మేఘ్ ఫుయ్ ఫుయ్; చోలీ భిగావో శిఖియాన్!

“Mirag thunders with delight, come gracefully o’ beauties
The rain falls softly, come dampen your dresses o’ beauties

“మిరాగ్ సంతోషంతో ఉరుముతుంది, భామల్లారా సింగారించుకొని రండి

చిరు జల్లు కురుస్తుంది, అందమైన భామల్లారా వర్షం లో మీ దుస్తులను తడపoడి"

డెక్కన్ ఆర్కైవ్ జూన్ 8,న ‘ఈద్-ఈ-సూరి నైట్ వాక్‌’ను నిర్వహిoచినది. ఈద్-ఈ-సూరి నైట్ వాక్‌’నడక యొక్క ప్రధాన ఆకర్షణ “మచ్లీలి కమాన్ లో  ఎండు చేపలు.” 

No comments:

Post a Comment