16 June 2023

మ్యాంగో మెజీషియన్ కలీముల్లాఖాన్ Mango Magician Kalimulla Khan

 

ఒకే  మామిడి కాయలో  రెండు వేర్వేరు తొక్కలు మరియు రెండు వేర్వేరు గుజ్జు పొరలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో రుచితో ఉన్నాయి. అలాంటి మామిడి పండు నిజంగా ఉండదు. అది అసాధ్యం! అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలీముల్లాఖాన్ దీన్ని సాధ్యం చేశాడు. కలీముల్లాఖాన్ కు మామిడి మాంత్రికుడు అనే మారుపేరు కలదు మరియు నిజంగా కలీముల్లాఖాన్ సార్ధక నామధేయుడు.

 

ప్రతి వేసవి సీజన్ లో మనం అందరం  తియ్యని మామిడి పండ్లను వీలైనన్ని ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తాము. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలీముల్లాఖాన్ మాత్రం మామిడిపండ్లు, వాటి పెంపకం, అభివృద్ధి మరియు సంరక్షణ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. కలీముల్లాఖాన్ ఒక మామిడి తత్వవేత్త మరియు మామిడి జీవితాలు, మానవ జీవితాలను పోలి ఉండే విధానాన్ని గురించి చెప్పగలడు. కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్ టైమ్స్ కూడా ఈ అసాధారణ వ్యక్తి కలీముల్లాఖాన్ గురించి ఒక వ్యాసం రాసింది.

కలీముల్లాఖాన్ కు గల మారుపేర్లు “మామిడి మనిషి మరియు మామిడి మాంత్రికుడు Mango Man and the Mango Magician. లక్నో సమీపంలోని మలిహాబాద్‌కు చెందిన కలీముల్లాఖాన్ ఏడో తరగతి డ్రాపౌట్, కలీముల్లాఖాన్ వివిధ రకాల మామిడి పళ్లను పండించే వ్యక్తిగా విజయవంతమైన శిఖరాలకు చేరుకున్నాడు. కలీముల్లాఖాన్ నైపుణ్యాలు మరియు కృషికి 2008లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు లభించింది.

కలీముల్లాఖాన్ స్వస్థలం యూ.పి. లోని మలిహాబాద్ మామిడి పండ్లకి ప్రసిద్ధి. చౌసా, లాంగ్డా, సఫేదా మరియు దస్సేరి వంటి వందల రకాల మామిడి పండ్లను ఈ ప్రాంతంలోని తోటల నుండి పండిస్తారు మరియు ఎగుమతి చేస్తారు. కలీముల్లాఖాన్ మలిహాబాద్ జిల్లా లో  మామిడి పరిశ్రమ అభివృద్ధికి పాటుపడినాడు. కలీముల్లాఖాన్ తోట లోని అద్భుతమైన మామిడి చెట్లను చూడటానికి మరియు పండించిన అద్భుతమైన మామిడి పండ్లను రుచి చూడటానికి చాలా దూరం నుండి ప్రజలు కలీముల్లాఖాన్ తోటకి వస్తారు

సుమారు 200 సంవత్సరాల క్రితం, అప్పటి ఔద్ నవాబు సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా ఉన్న నవాబ్ ఫకర్ ముహమ్మద్ ఖాన్ గోయా మలిహాబాద్‌లోని నేల మరియు వాతావరణం పట్ల ఆకర్షితుడై  ఇక్కడ మామిడి పండించడానికి ఔద్ నవాబ్ నుండి అనుమతిని పొందాడు మరియు మలిహాబాద్‌లో మొదటి మామిడి తోటను స్థాపించాడు. ఫకర్ ముహమ్మద్ ఖాన్ గోయా మునిమనవడు ప్రసిద్ధ ఉర్దూ కవి జోష్ మలిహబాది తరువాత పాకిస్తాన్‌లో స్థిరపడ్డాడు.

ప్రస్తుతం మలిహబాద్ ప్రాంతం నుండి విశేష రకాల మామిడిని పండించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది కలీముల్లా ఖాన్. అంటుకట్టే పద్దతిలో  ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, కలీముల్లా ఖాన్ అనేక కొత్త రకాల కొత్త మామిడి పండ్లను అభివృద్ధి చేసాడు, వాటిలో కొన్నింటికి కలీముల్లా ఖాన్,  క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరియు రాజకీయ నాయకుడు అఖిలేష్ యాదవ్ వంటి ప్రముఖుల పేర్లను పెట్టాడు.

 “నేను 1957 నుండి నా కుటుంబ వ్యాపారాన్ని చూస్తున్నాను. మా కుటుంబం 150 సంవత్సరాలకు పైగా మామిడి పండించడంలో నిమగ్నమై ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం ఒకే చెట్టుకు  వివిధ రకాల మామిడి పండ్లను బహుళ అంటుకట్టు ప్రక్రియ ద్వారా పండించే ప్రయోగాలు చేశాను" అని కలీముల్లా ఖాన్ NDTV ఇంటర్వ్యూ లో చెప్పారు.

కలీముల్లా ఖాన్ ఒక చెట్టును చూపిస్తూ ఇలా అన్నాడు: ఇది ఒక్క చెట్టు కాదు. ఇది మొత్తం మామిడి తోట. దీని కొమ్మలపై 300 రకాల మామిడి పండ్లు పెరుగుతాయి. రెండు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే, ఈ చెట్టుపై ఉన్న రెండు మామిడికాయలు ఒకేలా ఉండవు’’ అని అన్నారు. కలీముల్లా ఖాన్ నిజంగా మామిడి మాంత్రికుడు మరియు మనం అతని అద్భుతమైన విన్యాసాలను మాత్రమె ప్రశంసించగలము.

 

No comments:

Post a Comment