23 June 2023

జన్నా/స్వర్గం యొక్క ద్వారాలు (మీకు వాటి పేర్లు తెలుసా?) Doors of Jannah ( Do you Know there names?)

 

జన్నా (స్వర్గం) యొక్క వర్ణనలతో పాటు, స్వర్గo  ఎనిమిది "తలుపులు" లేదా "ద్వారాలు" కలిగి ఉన్నట్లు ఇస్లాం వివరిస్తుంది. ప్రతి ఒక్క ద్వారానికి ఒక పేరు ఉంది మరియు దాని ద్వారా అనుమతించబడే వ్యక్తుల రకాలను కూడావివరిస్తుంది.

కొందరు ఇస్లామిక్ పండితులు ప్రధాన ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత, ఈ తలుపులు జన్నా/స్వర్గం  లోపల కనిపిస్తాయి అని అంటారు. ఈ తలుపుల యొక్క ఖచ్చితమైన స్వభావం తెలియదు, కానీ అవి దివ్య ఖురాన్‌లో పేర్కొనబడ్డాయి మరియు వాటి పేర్లు ప్రవక్త ముహమ్మద్(స)వివరించారు.

నమ్మండి! మా       ఆయతులను తిరస్కరించిన వారి కొరకు వాటిపట్ల తలబిరుసుతనం ప్రదర్శించిన వారి కొరకు ఆకాశద్వారాలు ఎంతమాత్రం తెరవబడవు.సూది రంద్రం గుండా ఒంటె పోవటం ఎంత అసంభవమో, వారు స్వర్గం లోకి పోవటం కూడా అంతే అసంభవం. అపరాధులకు మావద్ద ఇటువంటి ప్రతిపలమే లబిస్తుంది.  (దివ్య ఖురాన్ 7:40)

తమ ప్రభువు పట్ల అవిదేయతకు దూరంగా ఉన్న వారిని, బృందాలు, బృందాలుగా స్వర్గం వైపుకు తీసుకుపోవటం జరుగుతుంది. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు, దాని తలపులు ముందుగానే తెరవబడి ఉంటాయి. దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు,” మీకు శాంతి కలుగు గాక! మీరు చక్కగా ప్రవర్తించారు. ప్రవేశించండి ఇందులోకి, శాశ్వతంగా ఉండేటందుకు.’ (దివ్య ఖురాన్ 39:73)

ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పినట్లు ఉబాదా వివరించాడు: భాగస్వాములు లేని అల్లాహ్‌కు తప్ప మరెవరికీ ఆరాధించబడే హక్కు లేదని మరియు ముహమ్మద్(స) అల్లాహ్ యొక్క దాసుడు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని మరియు యేసు(స) అల్లాహ్ యొక్క దాసుడు మరియు  అల్లాహ్ యొక్క ప్రవక్త అని ఎవరైనా సాక్ష్యమిస్తే మరియు మరియం కి అల్లాహ్ తన ద్వారా సృష్టించబడిన ఆత్మను ప్రసాదించాడు అని, స్వర్గం, నరకం నిజం అని సాక్షం ఇస్తాడో అల్లాహ్ అతనిని తనకు  నచ్చిన ఎనిమిది ద్వారాలలో దేనినైనా ద్వారా అయినా అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశపెడతాడు.

ప్రవక్త(స) ఇలా అన్నారు అని అబూ హురైరా పేర్కొన్నారు.: ఎవరైతే అల్లాహ్ మార్గంలో రెండు వస్తువులను ఖర్చు చేస్తారో వారు స్వర్గం యొక్క ద్వారం నుండి పిలవబడతారు మరియు 'ఓ అల్లాహ్ దాసుడా, ఇక్కడ శ్రేయస్సు ఉంది!' అని సంబోధించబడతారు. ప్రార్థనలు చేసిన వారు ప్రార్థన ద్వారం నుండి పిలవబడతారు  మరియు జిహాద్‌లో పాల్గొన్న వారు జిహాద్ ద్వారం నుండి పిలవబడతారు మరియు ఉపవాసాలు పాటించే వారు అర్-రయ్యాన్ ద్వారం నుండి పిలవబడతారు మరియు దానధర్మాలు చేసిన వారు దాతృత్వ ద్వారం నుండి పిలవబడతారు.

ఒకటి కంటే ఎక్కువ ద్వారాల ద్వారా జన్నాలోకి ప్రవేశించే అధికారాన్ని పొందిన వారికి ఏమి జరుగుతుంది? అని ఆశ్చర్యం కలగడం సహజం:

అబూ బకర్‌(ర) ఆ ప్రశ్నను  ముహమ్మద్ ప్రవక్త(స)ను ఆత్రంగా అడిగారు: "ఈ అన్ని ద్వారాల నుండి ఎవరైనా పిలవబడతారా?"

ప్రవక్త(స) అబూ బకర్‌(ర)కి జవాబిచ్చారు, “అవును. మరియు మీరు వారిలో ఒకరు అవుతారని నేను ఆశిస్తున్నాను.

జన్నా యొక్క ఎనిమిది తలుపుల జాబితా:

1 బాబ్ అస్-సలాత్ Baab As-Salaat:

సమయపాలన పాటించేవారు మరియు తమ ప్రార్థనలలో (సలాత్) ద్రుష్టి పెట్టినవారికి ఈ ద్వారం ద్వారా ప్రవేశం ఇవ్వబడుతుంది

2 బాబ్ అల్-జిహాద్ Baab Al-Jihad:

జిహాద్ లో మరణించిన వారికి ఈ ద్వారం ద్వారా ప్రవేశం కల్పించబడుతుంది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మరియు రక్షణాత్మక యుద్ధాల్లో మాత్రమే పాల్గొనాలని ఖురాన్ ముస్లింలకు పిలుపునిస్తుందని గమనించండి. "అణచివేతకు పాల్పడే వారితో  తప్ప ఇతరులతో శత్రుత్వం వద్దు" (ఖురాన్ 2:193).

3 బాబ్ అస్-సదఖా Baab As-Sadaqah:

తరచుగా దానధర్మాలు (సదఖా) చేసేవారు ఈ ద్వారం ద్వారా జన్నాలోకి ప్రవేశిస్తారు.

4 బాబ్ అర్-రయ్యాన్ Baab Ar-Rayyaan:

నిరంతరం ఉపవాసం పాటించే వారికి (ముఖ్యంగా రంజాన్ సమయంలో) ఈ ద్వారం ద్వారా ప్రవేశం కల్పించబడుతుంది

5 బాబ్ అల్-హజ్ Baab Al-Hajj:

హజ్ యాత్రను చేసే వారు ఈ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు

6 బాబ్ అల్-కాజిమీన్ అల్-గైజ్ వాల్ ఆఫినా అనిన్ నాస్ Baab Al-Kaazimeen Al-Ghaiz Wal Aafina Anin Naas:

ఈ తలుపు తమ కోపాన్ని అదుపులో ఉంచుకొని ఇతరులను క్షమించే వారి కోసం ప్రత్యేకించబడింది 

7. బాబ్ అల్-ఇమాన్ Baab Al-Iman:

అల్లాహ్‌పై చిత్తశుద్ధితో విశ్వాసం ఉన్నవారు మరియు అల్లాహ్ ఆదేశాలను అనుసరించడానికి కృషి చేసే వ్యక్తుల ప్రవేశం కోసం ఈ తలుపు ప్రత్యేకించబడింది

8 బాబ్ అల్-ధికర్ Baab Al-Dhikr:

నిరంతరం అల్లాహ్ (ధికర్) స్మరణ చేసేవారు ఈ ద్వారం గుండా అనుమతించబడతారు.


స్వర్గం యొక్క ఈ "ద్వారాల" పేర్లు ప్రతి ఒక్కటి ఒక ఆధ్యాత్మిక అభ్యాసాన్ని వివరిస్తాయి. వాటిని ఒకరి జీవితంలో చేర్చడానికి మనం కృషి చేయాలి.

 

No comments:

Post a Comment