19 June 2023

జిర్యాబ్ లేదా బ్లాక్ బర్డ్ గా పిలువబడే అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ(789-857)

 

క్రీ.శ. 789లో జన్మించిన జిర్యాబ్ ఇస్లామిక్ సంస్కృతిలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. జిర్యాబ్  సాంప్రదాయ స్పానిష్ సంగీతానికి పునాది వేయడంలో ఒంటరిగా పనిచేసినప్పటికీ యూరోపియన్ చరిత్రలో అనామకంగా ఉన్నాడు. జిర్యాబ్ ఉన్నత విద్యావంతుడు, ఉత్తర ఆఫ్రికా బానిస.

జిర్యాబ్ అనే మారుపేరు గల  అబుల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ 822ADలో కోర్డోబా కోర్ట్‌లో చీఫ్ ఎంటర్‌టైనర్. జిర్యాబ్ మధ్యయుగ సంగీతం, జీవనశైలి, ఫ్యాషన్, కేశాలంకరణ, ఫర్నిచర్ మరియు టేబుల్‌వేర్లలో విప్లవాత్మక మార్పులు చేశాడు. జిర్యాబ్ కార్డోబా ప్రజలు ఆహరం తినే విధానం, సాంఘికీకరణ మరియు విశ్రాంతి తీసుకునే విధానాన్ని మార్చాడు.

ప్రసిద్ద బాగ్దాద్ ఖలీఫా  అల్-మామున్ కాలంలో జీవించిన సంగీతకారుడు ఇషాక్ అల్-మౌసిలి (767–850), ప్రసిద్ధ సంగీతకారుడిగా ప్రసిద్ధి చెoదాడు. ఇషాక్ అల్-మౌసిలి 'ఉద్' అని పిలవబడే లుట్/వీణ ఆకారపు సంగీత వాయిద్యం వాయించడం లో ప్రసిద్ది చెందాడని తరువాత ఆ సంగీత పరికరం ఐరోపాలో లుట్/వీణగా పిలవబడుతుందని చరిత్రకారులు చెప్పారు.

అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ లేదా జిర్యాబ్ (789-857) అనే బహుముఖ ప్రతిభావంతుడైన కళాకారుడు ఇషాక్ అల్-మౌసిలీ యొక్క ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందాడు. అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ లేదా జిర్యాబ్ 'ఉద్' వాయించడంలో చాలా నేర్పరి.  

అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీలేదా జిర్యాబ్ అబ్బాసిద్ ఖలీఫ్ అల్-మామున్ (d. 833) పాలనలో బాగ్దాద్‌ను విడిచిపెట్టాడు మరియు దక్షిణ ఐబీరియన్ ద్వీపకల్పంలోని కార్డోబాకు వెళ్లాడు. అక్కడ అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ ఉమయ్యద్ రాజవంశానికి చెందిన అబ్ద్ అర్-రెహ్మాన్II (822-52)  ఆస్థానంలో ఆస్థాన సంగీతకారుడిగా నియమించబడ్డాడు. కార్డోబాలో, జిర్యాబ్ 200 బంగారు దీనార్ల నెలవారీ జీతంతో కార్డోబా కోర్ట్ ఎంటర్‌టైనర్‌గా మారాడు. కార్డోబా పాలకుడు జిర్యాబ్‌ను అండలూసియా భూభాగంలో సాంస్కృతిక మంత్రిగా నియమించాడు.

జిర్యాబ్ అనగా అరబిక్‌లో నల్లగా పాడే పక్షి పేరు. పర్షియన్‌లో బంగారు వేటగాడు లేదా బంగారు తవ్వేవాడు, మరియు స్పానిష్‌లో పజారో నీగ్రో లేదా బ్లాక్‌బర్డ్ అని పిలుస్తారు.

అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ లేదా జిర్యాబ్  చర్మం చాలా నల్లగా ఉంటుంది, కానీ స్వరం చాలా శ్రావ్యంగా మరియు మంత్రముగ్ధులను చేస్తుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, జిర్యాబ్ నిజంగా బహుముఖ కళాకారుడు. సంగీతంలో, వీణ (అల్-ఉద్)ని మొదటిసారిగా పరిచయం చేశాడు, అది తర్వాత స్పానిష్ గిటార్‌గా మారింది. స్పానిష్ గిటార్‌కి ఐదవ బాస్ స్ట్రింగ్ జోడించబడింది మరియు డేగ యొక్క క్విల్ చెక్క ప్లెక్ట్రమ్‌ను భర్తీ చేయబడింది. జిర్యాబ్, ఆకాలపు ప్రముఖ పండితుడు ఆల్-కిండితో పాటు ఘనత పొందాడు.

జిర్యాబ్ యొక్క మొదటి కృషి  సంగీత పాఠశాలను స్థాపించడం. బాగ్దాద్‌లోని సంగీత సంరక్షణాలయం వలె కాకుండా, కార్డోబాలోని సంగీత పాఠశాల, సంగీత శైలులు మరియు వాయిద్యాలలో ప్రయోగాలను ప్రోత్సహించింది. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం జిర్యాబ్‌ను "స్పానిష్-ఇస్లామిక్ సంగీత సంప్రదాయం యొక్క స్థాపకుడు"గా పేర్కొన్నది.

జిర్యాబ్, నుబా (లేదా నౌబా) స్వరపరిచారు, ఇది ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని శాస్త్రీయ సంగీతo లో మిళితమైన  ఒక ప్రత్యేకమైన అండలూసియన్-అరబిక్ సంగీతం. లిబియా, ట్యునీషియా మరియు తూర్పు అల్జీరియాలో, నుబాను ‘మలుఫ్’ అని పిలుస్తారు. జిర్యాబ్ 24 రకాల నుబాలను సృష్టించాడు. నుబా రూపాలు స్పానిష్ క్రైస్తవ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి మరియు మధ్యయుగ ఐరోపాలో సంగీతం యొక్క పురోగతిలో చాలా ప్రభావం చూపాయి

సంగీతాన్ని వినిపించడమే కాకుండా, జిర్యాబ్ కార్డోబా, టేబుల్ మర్యాదలు మరియు హెయిర్ స్టైల్స్‌ మరియు దుస్తుల ప్రమాణాలను కూడా పరిచయం చేశాడు.

జిర్యాబ్ యొక్క ఆవిష్కరణకు ముందు, స్పెయిన్‌లో భోజనాల విషయం చాలా సరళమైనది మరియు ఆనాగరికంగా ఉండేది. చెక్క బల్ల మీద ప్లేట్లు అస్తవ్యస్తంగా పేర్చేవారు. టేబుల్ మర్యాదలు లేవు. ఆస్పరాగస్ వంటి కొత్త పండ్లు మరియు కూరగాయలను పరిచయం చేయడం ద్వారా జిరియాబ్ నూతన "డైనింగ్ టేబుల్ కల్చర్ "ని ప్రదర్శించాడు.

జిర్యాబ్ త్రీ కోర్స్ మీల్స్-అపిటైజర్, ప్రధాన వంటకం మరియు డెజర్ట్ పరిచయం చేసాడు. ఈ ఆచారం ఐబీరియన్ ద్వీపకల్పంలో వేగంగా వ్యాపించింది. మిగిలిన ఐరోపా మరియు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది. యూరోపియన్ డైనింగ్ సంస్కృతిలో మూడు-కోర్సుల మీల్స్ సంప్రదాయం నేటికీ మనుగడలో ఉంది.

జిర్యాబ్ ఒక ప్రారంభ టూత్‌పేస్ట్‌ను కనుగొన్నట్లు చెబుతారు. ఈ టూత్‌పేస్ట్ యొక్క ఖచ్చితమైన పదార్థాలు తెలియవు, అయితే ఇది "ఉపయోగంగా మరియు రుచికి ఆహ్లాదకరంగా" ఉన్నట్లు నివేదించబడింది. జిర్యాబ్ అండర్ ఆర్మ్ డియోడరెంట్స్ మరియు "మెడ, చెవులు మరియు కనుబొమ్మలను కనబడే కొత్త చిన్న కేశాలంకరణ", మరియు పురుషులకు షేవింగ్‌ను కూడా పరిచయం చేశాడు.

జిర్యాబ్ అనేక కొత్త వంటకాలను రూపొందించాడు. జిర్యాబ్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆస్పరాగస్ వంటకం సృషించాడు. అలాగే, జిర్యాబ్ ఆ సమయంలో ఉపయోగించిన మట్టి పాత్రలు, రాగి, బంగారం లేదా వెండి త్రాగే పాత్రలకు బదులుగా గాజు లేదా క్రిస్టల్‌తో చేసిన డ్రింకింగ్ గ్లాస్‌ను పరిచయం చేశాడు.

జిరియాబ్ మీల్స్ టేబుల్ పై టేబుల్‌క్లాత్‌లను ప్రవేశపెట్టారు, వాటిపై ఫ్లవర్ వాజ్‌లను ఉంచారు. జిర్యాబ్ టూత్‌పిక్‌ను కూడా పరిచయం చేస్తూ సూప్ బౌల్స్/గిన్నెలను/లాడిల్‌ను రూపొందించాడు.

జిర్యాబ్ కార్డోబా ప్రజలకు  ప్రతి సీజన్‌కు మరియు సందర్భానికి తగిన దుస్తులను పరిచయం చేసాడు. వసంత ఋతువులో, ప్రజలను  ముదురు రంగుల దుస్తులను ధరించమని, వేసవిలో తెల్లని బట్టలు ధరించమని మరియు శీతాకాలంలో, ఉన్ని దుస్తులను ధరించమని ప్రోత్సహిoచాడు. జిర్యాబ్ కార్డోబా ప్రజలకు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వేర్వేరు దుస్తులను సూచించాడు.కార్డోబా సమాజానికి తమను తాము ఎలా చూసుకోవాలో కూడా నేర్పించాడు.

జిర్యాబ్ కి 10,000 కంటే ఎక్కువ పాటలు  హృదయపూర్వకంగా తెలుసు మరియు జిర్యాబ్ తన కాలం లోని అత్యుత్తమ సంగీతకారుడు మరియు గాయకుడు. జిర్యాబ్ ఈస్ట్ యొక్క ఉద్వేగభరితమైన పాటలు, సంగీతం మరియు నృత్యాలను ఐబీరియన్ ద్వీపకల్పంలోకి ప్రవేశపెట్టాడు, ఇది తరువాతి శతాబ్దాలలో, జిప్సీ వినోదం ద్వారా ప్రభావితమై, ప్రసిద్ధ స్పానిష్ ఫ్లేమెన్కో flamenco గా పరిణామం చెందింది.

జిర్యాబ్ కోర్డోబాలోని కోర్టును విప్లవాత్మకంగా మార్చాడు మరియు దానిని తన  కాలపు ఫ్యాషన్ రాజధానిగా చేసాడు. కొత్త బట్టలు, శైలులు, ఆహారాలు, పరిశుభ్రత ఉత్పత్తులు లేదా సంగీతాన్ని పరిచయం చేసి, జిర్యాబ్ అల్-అండలూసియన్ సంస్కృతిని శాశ్వతంగా మార్చేశాడు.

 జిర్యాబ్ యొక్క సంగీత రచనలు అద్భుతమైనవి అవి క్లాసిక్ స్పానిష్ సంగీతానికి ప్రారంభ పునాదిని వేస్తున్నాయి. జిర్యాబ్ సంగీతం మరియు శైలిని అధిగమించాడు మరియు 8వ మరియు 9వ శతాబ్దాల ఐబీరియాలో విప్లవాత్మక సాంస్కృతిక వ్యక్తిగా మారాడు.

జిర్యాబ్ ప్రవేశపెట్టిన ఫ్యాషన్, టేబుల్ మర్యాదలు యూరప్ ప్రజలను నాగరిక ప్రజలుగా మార్చాయి, డిన్నర్ టేబుల్ వద్ద ఆహారాన్ని భుజించడం,  సంగీత కళ అనేవి ఇస్లామిక్ స్వర్ణ యుగ నాగరికత యొక్క చిహ్నాలు.

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment