18 June 2023

భారత దేశ చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వ వికాసం లో అమీర్ ఖుస్రో నుండి నేటి వరకు భారతీయ ముస్లిముల సహకారం Contribution of Indian Muslims in the history, culture and heritage development of India from Amir Khusro to present day

 

భారత దేశానికి వచ్చిన సూఫీ సాధువులలో  అత్యంత ప్రముఖమైన పేరు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మేరీ, ఖ్వాజా మొయినుద్దీన్, చిస్తియా తరికాకి చెందిన గొప్ప సాధువు, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సుమారు 850 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, అజ్మీర్ వద్ద చిస్తియా తరీకాను స్థాపించాడు. చిస్తియా తరీకాకి చెందిన సూఫీ సన్యాసి సమాధి లేకుండా మొత్తం భారత ఉపఖండంలో (భారతదేశం-పాకిస్తాన్-బంగ్లాదేశ్) ఏ జిల్లా లేదా రాష్ట్రం ఉండదు.

మహమూద్ గజ్నవితో పాటు వచ్చిన ప్రముఖ చరిత్రకారుడు అల్బెరూని కితాబుల్ హింద్ అనే పుస్తకాన్ని రచించాడు, దీనిని భారతదేశం యొక్క మొదటి డాక్యుమెంట్ వివరణ అని పిలుస్తారు. ఇందులో, అల్బెరూని భారతదేశం యొక్క నాగరికత, సంస్కృతి మరియు జీవన పరిస్థితులను మరియు దాని ప్రజలను విపరీతంగా ప్రశంసించాడు.

సూఫీ సెయింట్ ఖవాజా అమీర్ ఖుస్రో ని 'హిందూస్థానీయత్' పితామహుడు అనడంలో అతిశయోక్తి లేదు. గత 800 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, సంస్కృతి మరియు నాగరికతను సుసంపన్నం చేసిన ఘనత ఎవరికైనా ఉంటే, అందులో హజ్రత్ అబుల్ హసన్ యామినుద్దీన్ ఖుస్రో పేరు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది

ప్రజలు అమీర్ ఖుస్రో, ను అమీర్ ఖుస్రో డెహ్ల్వీ మరియు టుటీ-ఎ-హింద్ Tuti-e-Hind అని ముద్దుగా పిలుచుకుంటారు. అమీర్ ఖుస్రో తనను తాను 'టర్క్ హిందుస్తానియం హిందావి గోయల్ జవాబ్' అని పిలిచాడు, అంటే నేను టర్క్ హిందుస్తానీని మరియు హిందీ మాట్లాడటం నాకు తెలుసు అని అర్ధం. అమీర్ ఖుస్రో ఈ ఉపఖండానికి హిందుస్థాన్ అనే కొత్త మరియు చాలా అందమైన పేరు పెట్టారు. అమీర్ ఖుస్రో చే హింద్వి అని పిలిచే భాషలో ఈ రోజు మనం ఉర్దూ అని పిలుస్తున్న భాష కూడా ఉంది.

1970లో, ప్రముఖ ఉర్దూ కవి జాన్ నిసార్ అక్తర్ “హిందూస్తాన్ హమారా” అనే  ఉర్దూ కవితా సంకలనాన్ని వెలువరించారు. పుస్తకం యొక్క పరిచయంలో, జాన్ నిసార్ అక్తర్ ఇలా వ్రాశాడు: 'ఖారీ బోలి Khari Boli' లో అమీర్ ఖుస్రో యొక్క అరబిక్, పర్షియన్ మరియు టర్కిష్ పదాల మిశ్రమం' ను మొదట “రేఖ్తా” అని పిలిచారు మరియు దానిని హిందీ లేదా హిందావి అని పిలిచారు  మరియు తర్వాత ఉర్దూ అని పిలిచారు.' (హిందూస్థాన్ హమారా).

అమీర్ ఖుస్రో ఈ భాషకు కొత్త రూపు ఇచ్చాడు. ఒకవైపు, తన కవిత్వంలో పర్షియన్ భాషను ఉపయోగిస్తూనే, అమీర్ ఖుస్రో ఇలా వ్రాశాడు- 'జెహలే మిస్కిన్ మకున్ తగఫుల్ దురాయే నైనా బనాయే బతియాన్, సఖి పియా కో జో మెయిన్ నహీ దేఖ్నా తో కైసే కరే కరూన్ అంధేరీ రాతియాన్. 'Jehale miskin makun tagaful duraye naina banaye batiyaan, sakhi piya ko jo main nahi dekhna to kaise kare karoon andheri ratiyan." " ఈ ప్రసిద్ధ బాలీవుడ్ పాటలో పర్షియన్, హింద్వీ మరియు ఉర్దూ ఉన్నాయి. 

మరోవైపు, 'చాప్ తిలక్ సబ్ లే లి రి మోసే నైనా మిలై కే' మరియు 'బహుత్ కఠిన్ హై దగర్ పంఘట్ కీ'Chaap tilak sab le li ri mose naina milai ke' and 'Bahut kathin hai dagar panghat ki'. ' వంటి కవితలను రచించడానికి అమీర్ ఖుస్రో అవధి మరియు బ్రజ్‌భాషను ఉపయోగించాడు. 

అమీర్ ఖుస్రో భారతీయ శాస్త్రీయ సంగీతానికి సితార్ మరియు తబలా అనే రెండు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అమీర్ ఖుస్రో పర్షియన్ మరియు హిందీలో గజల్, మస్నవి, కట, రుబాయి, దోబైటి Dobaiti, మరియు తారక్కీ బంద్ వంటి శైలులలో కవిత్వాన్ని రచించాడు. అంతేకాకుండా, అమీర్ ఖుస్రో అసంఖ్యాకమైన ద్విపదలు, పాటలు, సూక్తులు, డూ-సుఖ్నే do-sukhne, చిక్కులు riddles, తరానా మొదలైన వాటిని వ్రాసాడు. హజ్రత్ అమీర్ ఖుస్రో ని  – సూఫీలకు పర్యాయపదంగా మారిన ప్రత్యేకమైన సంగీత రూపాన్ని (ఖవ్వాలి) అందించినందుకు 'బాబా-ఎ-ఖవ్వాలి' అని కూడా పిలుస్తారు.

అమీర్ ఖుస్రో భారతదేశాన్ని, ముఖ్యంగా రాజధాని ఢిల్లీని ప్రశంసించారు. అమీర్ ఖుస్రో అవధ్ గురించి వ్రాశాడు- 'వహ్ క్యా షాదాబ్ సర్జమీన్ యే అవధ్ కి... 'Wah kya shadab sarjameen ye Awadh ki...  " ప్రపంచంలోని పండ్లు మరియు పువ్వులు ఇక్కడ ఉన్నాయి; ప్రజలు చక్కగా మాట్లాడతారు; మంచి మరియు అందమైన వ్యక్తులు ఉన్నారు. భూమి సంతోషంగా ఉంది, భూస్వామి ధనవంతుడు. నేను అవధ్ నుండి వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు, కానీ ఢిల్లీ నా దేశం, నా నగరం, ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం.

మధ్య ఆసియా కాకుండా, ముస్లింలు అయిన టర్కిష్, ఆఫ్ఘన్ మరియు మంగోల్ ఆక్రమణదారులు భారతదేశానికి వచ్చి తమ పాలనను స్థాపించారు. ఉదాహరణకు, ఖిల్జీ రాజవంశం, గులాం రాజవంశం, సయ్యద్ రాజవంశం, టర్క్స్, ఆఫ్ఘన్లు మరియు మొఘలులు అందరూ ఇక్కడ తమ పాలనను స్థాపించారు. వారు ఈ దేశం యొక్క నాగరికతను మరియు సంస్కృతిని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేసారు. బట్టలు, ఆహారం, భాష మరియు జీవనంతో పాటు, కుతుబ్ మినార్, ఎర్రకోట, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ, జర్నైలీ రోడ్ (పెషావర్ నుండి కలకత్తా వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్) మరియు వివిధ సమాధులు ఈ దేశ సంస్కృతిని సుసంపన్నం చేయడానికి వివిధ మార్గాల్లో దోహదపడ్డాయి.

మొఘల్ చక్రవర్తి జహీరుద్దీన్ బాబర్ ఈ దేశంలో మొఘల్ సుల్తానేట్‌ను స్థాపించాడు. బాబర్ మనవడు జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్‌ను అక్బర్-ఎ-ఆజం (అక్బర్ ది గ్రేట్), షాహెన్‌షా అక్బర్, మహాబలి మరియు షాహెన్‌షా అని కూడా పిలుస్తారు. అక్బర్ పాలన కాలంలో (1605), మొఘల్ సామ్రాజ్యం ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని చాలా భాగాన్ని కలిగి ఉంది.

అక్బర్ ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తులలో  ఒకరిగా పరిగణించబడ్డాడు. అక్బర్‌కు హిందువులు మరియు ముస్లింల నుండి సమానమైన ప్రేమ మరియు గౌరవం లభించాయి. అక్బర్ హిందూ-ముస్లిం వర్గాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు దిన్-ఎ-ఇలాహి అనే మతాన్ని స్థాపించాడు.

అక్బర్ ఆస్థానం ఏ సమయంలోనైనా అందరికీ తెరిచి ఉండేది. అక్బర్ ఆస్థానంలో ముస్లిం పెద్దల కంటే ఎక్కువ మంది హిందూ రాజులు ఉన్నారు. అక్బర్ ప్రభావం దాదాపు మొత్తం భారత ఉపఖండంపై ఉంది. అక్బర్ పాలన దేశ కళ మరియు సంస్కృతిపై కూడా ప్రభావం చూపింది.

అక్బర్ పెయింటింగ్ వంటి లలిత కళలపై చాలా ఆసక్తిని కనబరిచాడు. అక్బర్ కోట గోడలు అందమైన పెయింటింగ్స్ మరియు నమూనాలతో నిండి ఉన్నాయి. మొఘల్ పెయింటింగ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, అక్బర్ యూరోపియన్ శైలిని కూడా స్వాగతించాడు. అక్బర్‌కి సాహిత్యంపై కూడా ఆసక్తి ఉండేది. అక్బర్ కాలం లో  అనేక సంస్కృత మాన్యుస్క్రిప్ట్‌లు మరియు గ్రంథాలు పర్షియన్‌లోకి అనువదించబడ్డాయి మరియు పర్షియన్ గ్రంథాలు సంస్కృతం మరియు హిందీలోకి అనువదించబడ్డాయి.

పెర్షియన్ సంస్కృతికి సంబంధించిన అనేక చిత్రాలను అక్బర్ కోర్టు గోడలపై చిత్రించారు. అక్బర్ మనవడు దారా షికో ఉపనిషత్తులు మరియు అనేక ఇతర మత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. దారా సోదరుడు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యం సరిహద్దులను విస్తరించాడు. అయితే, ఔరంగజేబు అనుసరించిన మతపరమైన విధానంపై చాలా విమర్శలు ఉన్నాయి. 

సుమారు 125 సంవత్సరాల మొఘలుల పాలనలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సమయంలో మీర్ తాకీ మీర్, గాలిబ్ మరియు మీర్ అనీస్ వంటి కవులు జన్మించారు, వారిని ప్రపంచవ్యాప్తంగా గౌరవంగా గుర్తుంచుకుంటారు. సారే జహాన్ సే అచ్చా హిందూస్థాన్ హమారా రాసిన అల్లామా ఇక్బాల్ తన దేశం కోసం ఇలా రాశాడు - 'దేశంలోని ప్రతి మట్టిరేణువును నేను దేవతగా భావిస్తున్నాను.'

19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకసారి ఇలా అన్నారు- 'భారతదేశం ఒక అందమైన వధువు లాంటిది మరియు హిందువులు మరియు ముస్లింలు ఆమెకు రెండు కళ్ళు. ఒక్క కన్ను చెడిపోతే వధువు వికారమవుతుంది. ఆధునిక భారతదేశంలోని ముస్లింలలో సయ్యద్ అహ్మద్ ఖాన్ సృష్టించిన జాతీయ భావానికి ఇంతకంటే ఉదాహరణ లేదు.

సయ్యద్ అహ్మద్ ఖాన్ MAO కళాశాల (1875)ను అలీఘర్‌లో స్థాపించారు, అది నేడు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది.

మౌలానా మొహమ్మద్ అలీ జోహార్, మౌలానా షౌకత్ అలీ (అలీ సోదరులు), ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా హస్రత్ మోహనీ,  సైఫుద్దీన్ కిచ్లేవ్, జాకీర్ హుస్సేన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, వంటి జాతీయవాద నాయకులను ముస్లిములు అందించారు.అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, రాహి మసూమ్ రజా మరియు జావేద్ అక్తర్ వంటి కవులు మరియు రచయితలను ముస్లిములు అందించారు.

భారతీయ ముస్లింలు, భారతీయులుగా ఉన్నందుకు గర్విస్తున్నారు మరియు దేశంలోని ఇతర పౌరుల మాదిరిగానే భారతీయ ముస్లింలు కూడా భారతదేశంలోని ప్రతి మంచి మరియు చెడు అంశాలను కలిగి ఉంటారు. ఇతరులలాగే వారి  సమాజంలోను  కుల వ్యవస్థ ఉంది. 

ముస్లిములలో కూడా ఇతర మతాల మాదిరిగానే ముందడుగు, వెనుకబడిన కులాలున్నాయి. ఉదాహరణకు, అష్రఫ్ (అగ్రవర్ణం అని పిలవబడే), అజ్లాఫ్ (వెనుకబడిన-పస్మాండ), మరియు అర్జల్ (దళితుడు), కానీ దేశం కోసం త్యాగం చేయడంలో ముస్లింలలోని ఏ వర్గమూ ఎప్పుడూ వెనుకాడలేదు అనుటకు బారత దేశ చరిత్ర సాక్షి. అది 1857 నాటి స్వాతంత్ర్య పోరాటమైనా లేదా మొదటి స్వాతంత్ర్య సంగ్రామమైనా. మహాత్మా గాంధీ నాయకత్వంలోని జాతీయ ఉద్యమం అయినా, స్వతంత్ర భారతదేశంలో నేహ్రూ యుగం లో   అయినా, ముస్లింలు ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు.

పాకిస్తాన్ ఆవిర్భావ సమయంలో, దేశంలోని మెజారిటీ ముస్లింలు తమ మాతృభూమిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇండోనేషియా తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నారు.

మన దేశం యొక్క గౌరవం, సరిహద్దుల రక్షణ, పాటల సంగీతం, సినిమా, నాటకం, కళ, పెయింటింగ్, క్రీడలు, పరిశ్రమలు, వ్యవసాయం లేదా మరేదైనా నైపుణ్యంతో కూడిన పని అయినా లేదా దేశం యొక్క క్షిపణి మరియు అణు కార్యక్రమం వంటిది అయినా ప్రతిచోటా మీకు ముస్లింలు కనిపిస్తారు. మరోవైపు అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో భారతీయ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ప్రతి భారతీయ ముస్లిం, భారతీయుడిగా గర్వపడడానికి ఇదే కారణం.

No comments:

Post a Comment