బేగం సుల్తాన్ మీర్ కలకత్తాలో ఒక సంప్రదాయ ముస్లిం
కుటుంబంలో జన్మించినారు. 1920లో, బేగం సుల్తాన్ మీర్ బెంగాల్, బీహార్, ఒడిశా మరియు అస్సాం నుండి గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం
మహిళగా నిలిచారు. తరువాత, బేగం సుల్తాన్ మీర్ న్యాయశాస్త్రం అభ్యసించిన మొదటి భారతీయ ముస్లిం మహిళ(1922)
అయ్యారు.
వివాహం తర్వాత, బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ చెన్నైకి మారారు, అక్కడ బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్
అనేక మహిళా సంస్థలలో చురుకుగా పాల్గొన్నారు. బేగం సుల్తాన్
మీర్ అమీరుద్దీన్ AIWCలో ఒక ప్రముఖ వ్యక్తి మరియు మహిళల ఓటు హక్కు కోసం గళం
విప్పారు. బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ ఆల్ ఇండియా ఉమెన్స్
కాన్ఫరెన్స్‌లో చాలా చురుకైన సభ్యురాలు మరియు శ్రీమతి మార్గరెట్ కజిన్‌తో కలిసి తమిళనాడు
శాఖను పునర్వ్యవస్థీకరించడంలో విశేష కృషి చేశారు.”
1920వ దశకంలో, బేగం అమీరుద్దీన్ మద్రాసు మునిసిపాలిటీ ప్రవేశపెడుతున్న
నిర్బంధ విద్య పథకం నుండి ముస్లిం బాలికలను మినహాయించడాన్ని తీవ్రంగా
వ్యతిరేకించారు, మరియు ఆ విషయంలో
గట్టిగా కృషి చేశారు, చివరికి బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్
ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్
రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ ఒక మహిళా క్లబ్‌ను
స్థాపించారు మరియు మహిళా సదస్సులను నిర్వహించారు
బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్
మద్రాస్ విశ్వవిద్యాలయం సెనేట్‌లో పనిచేశారు,
బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్
వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు,
M.B.E. బిరుదుతో
సత్కరించబడ్డారు మరియు స్వతంత్ర భారతదేశంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.
బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ విద్యలో చాలా వెనుకబడి ఉందని భావించిన సేలంలో ఒక విద్యా
సేవా లీగ్ Education Service
League ను స్థాపించారు
మరియు ఆ పట్టణంలో బాలురు, బాలికలు ఇద్దరికీ నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకున్నారు. బేగం
సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ తమిళనాడు మహిళా సదస్సుకు అధ్యక్షురాలిగా మరియు 1933లో సేలంలో జరిగిన మొదటి ఉపాధ్యాయ నిర్వాహకుల
Teacher
Managers' సదస్సుకు కూడా
అధ్యక్షురాలిగా ఉన్నారు.
.బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ 1930లలో బహుభార్యత్వం మరియు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని గట్టిగా
వాదించారు. ఈ ఆచారాలు ఇస్లాం యొక్క నిజమైన స్ఫూర్తికి అనుగుణంగా లేవని మరియు
మహిళలకు అపారమైన బాధను కలిగిస్తున్నాయని వాదించారు బేగం అమీరుద్దీన్ బహుభార్యత్వంపై
చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ, ఇలా అన్నారు, హిజ్రా మూడవ శతాబ్దంలోనే ముతాజిలైట్ న్యాయ పండితులు ఖురాన్
ఏకభార్యత్వాన్ని నిర్దేశిస్తుందని మరియు ఇస్లాంలో బహుభార్యత్వం చట్టవిరుద్ధమని
భావించారని తెలుస్తుంది. బహుభార్యత్వం అనే అన్యాయమైన ఆచారం వల్ల ముస్లిం మహిళలు
ఎదుర్కొంటున్న కష్టాలు మరియు దుఃఖాలు ఖచ్చితంగా చట్టం చేయవలసిన అవసరాన్ని కల్పిస్తున్నాయనే
వాస్తవాన్ని కాదనలేము.”
బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ ఒక మార్గదర్శక జర్నలిస్ట్ మరియు స్త్రీవాది,
భారతీయ వార్తాపత్రికలో మొదటిసారిగా కాలమ్ రాశారు.1937లో ముస్లిం రివ్యూ (లక్నో)లో ప్రచురితమైన బేగం అమీరుద్దీన్
రాసిన 'ఇస్లాంలో మహిళల హోదా' అనే వ్యాసం భారతదేశంలోనే కాకుండా ఐరోపాలో కూడా
చర్చనీయాంశంగా మారింది.
బేగం అమీరుద్దీన్ ముఖ్యంగా ముస్లిం
మహిళల హక్కులపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. బేగం అమీరుద్దీన్
సమావేశాలలో మరియు బహిరంగ సభలలో ముస్లిం మహిళల హక్కులను ప్రస్తావించేవారు. 1940లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC)
ప్రచురించిన 'రోష్ని' అనే త్రైమాసిక పత్రికలో ప్రచురితమైన 'ముస్లిం మహిళల చట్టపరమైన హోదా'
అనే ఒక వ్యాసంలో బేగం అమీరుద్దీన్ ముస్లిం మహిళల చట్టపరమైన
హోదా మరియు వారికి అవసరమైన సంస్కరణల గురించి చర్చించారు. "
బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ తిరుచిరాపల్లి (తిరుచునాపల్లి) మసీదు లో
ముస్లిం స్త్రీల హక్కులపై ప్రసంగించారు. మొదటిసారిగా,
వేలాది మంది ముస్లిం మహిళలు తమ 'చాదర్‌లు' కప్పుకుని ప్రసంగం వినడానికి బయటకు రావడం జరిగింది..
సమావేశమైన మహిళలు ప్రత్యేకంగా తమను ఉద్దేశించి ప్రసంగించమని బేగంను కోరారు. దానిపై
'రోష్ని' పత్రికలో “మసీదులో
ప్రసంగించిన ముస్లిం మహిళా” అనే పేరు తో సంపాదకీయం రావడం కూడా జరిగింది.
బేగం అమీరుద్దీన్ మద్రాస్‌లోని ముస్లిం పట్టణ నియోజకవర్గం
Muslim
Urban Constituency of Madras నుండి విభజనకు
ముందు భారతదేశంలో శాసనసభ స్థానం ను గెలుచుకుంది.
ఎమ్మెల్యేగా బేగం అమీరుద్దీన్ మార్చి 1947లో మద్రాస్ శాసనసభలో జ్యుడీషియల్ క్లర్క్‌లు మరియు
క్లినిషియన్‌లు వంటి అనేక ప్రభుత్వ పదవుల నుండి మహిళల నియామాకనికి ఉన్న
చట్టబద్ధమైన అడ్డంకిని తొలగించాలని కోరారు.
బేగం అమీరుద్దీన్ విభజన అనంతరం పాకిస్తాన్‌కు వెళ్లింది,
అక్కడ ఆమె జర్నలిజం మరియు సాహిత్యంలో మార్గదర్శకురాలిగా
మారింది.
1955లో, బేగం అమీరుద్దీన్ కైరోలోని అల్-అజార్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన మొదటి మహిళ
మరియు అంతర్జాతీయ పత్రికా ప్రతినిధులతో కలసి పనిచేశారు.
బేగం అమీరుద్దీన్ 2000లో మరణించినారు.
No comments:
Post a Comment