అమెరికా
తో ఇస్లాం కు పరిచయం కొలంబస్ అమెరికాను కనుగొనక పూర్వమే ప్రారంభమైనది. కొలంబస్
పోర్చగీసు ముస్లిం నావికులు వ్రాసిన పుస్తకం
సహాయం తో అమెరికాను కనుగొన్నాడు అనటానికి
ఆధారాలు ఉన్నాయి.14వ శతాబ్ధం లో
ఆఫ్రికా లోని సెనెగల్-జాంబియా ప్రాంతానికి చెంది,స్పెయిన్ నుండి
వెలివేయబడిన “మూర్లు” కరేబియన్, మెక్సికో జలసంధి ప్రాంతాలలో
స్థిర నివాసం ఏర్పర్చుకొన్నారు. 16వ శతాబ్ధం లో ఇస్తఫాన్ అనే ముస్లిం స్పానిష్
గైడ్ సహాయం తో స్పెయిన్ వారు నూతనప్రపంచం(new world) ముఖ్యం
గా ఆరిజోనా,న్యూ మెక్సికో ప్రాంతాలను జయించినారు.
అమెరికా
స్వాతంత్ర్యం పొందక పూర్వమే అమెరికా లో ముస్లిం లు ఉన్నారు.. మొదట్లో ఆఫ్రికా నుండి అమెరికా కు తీసుకు రాబడిన బానిసలలో
10% మంది ముస్లింలు. అమెరికాకు వలస వచ్చిన మొదటి ముస్లింలలో ఆఫ్రికా కు చెందిన నల్లజాతి బానిసలే అధికులు. అమెరికా విప్లవ పోరాటం లో పాల్గొని పేరు సంపాదించిన ముస్లిం మతస్తులలో సలీం పూర్ (Salem Poor,)యూసఫ్ బెన్ అలీ, బంపేట్ ముహమద్,ఫ్రాన్సిస్ సబా,జోసఫ్ సబా చెప్పుకోదగిన వారు.1777
లో అమెరికా ను స్వతంత్ర దేశం గా మొరాకో గుర్తించినది. మొదటినుండి
అమెరికా లో ముస్లిం లకు మతస్వాతంత్రం ప్రసాదించబడినది.1805 లోనే అమెరికా
ప్రెసిడెంట్ థామస్ జఫర్ సన్ అద్యక్ష భవనం వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు ఇచ్చినారు. ఇస్లాం స్వీకరించిన తొలి ప్రముఖ
ఆంగ్లో-అమెరికన్ లలో అలెక్సాండర్ రస్సెల్ వెబ్ ముఖ్యుడు ఇతడు 1893 లో జరిగిన
ప్రపంచమతాల పార్లమెంట్ లో ఇస్లాం కు ప్రాతినిద్యం వహించినాడు.
19 శతాబ్ధాపు ద్వితీయార్ధం లో అనేక మంది ముస్లింలు అమెరికా వలస వచ్చిరి. వీరిలో చాలా మంది అమెరికాలోనే స్థిరపడిపోయినారు. వీరు ప్రపంచంలోని వివిద ప్రాంతాలనుండి వచ్చిన ముస్లిం లతో కలసి అమెరికా లోని అనేక భాగాలలోని పట్టణాలలో, పల్లెలలో స్థిర నివాస సమూహాలను ఏర్పర్చసాగినారు. 20 వ శతాబ్ధాపు ద్వితీయార్ధం లో అరబ్ ప్రాంతాలనుండియే కాక, దక్షిణ ఆసియా ,ఆగ్నేయ ఆసియా, టర్కీ,ఇరాన్, ఆఫ్రికా లోని అనేక ఇతర ప్రాంతాలనుండి అధిక విద్యాబ్యాసము, ఆర్థిక శక్తి కలిగిన వారు అమెరికా వలస వచ్చిరి. వీరే కాక ఇటీవల అస్థిరతకు లోనుఐన అనేక అరబ్ ప్రాంతాలనుండి కూడా ముస్లిం శరణార్ధులు అమెరికా వలస వచ్చిరి
అమెరికా లో ఇస్లాం స్వీకరించిన వారిలో 64%
ఆఫ్రికన్-అమెరికన్లు, 27% తెల్లజాతీయులు,6% హిస్పానికులు, 3% ఇతరులు. 20 వ శతాబ్ధాపు మద్య భాగం లో చెప్పుకోదగిన సంఖ్యలో ఆఫ్రికన్-అమెరికన్ లు “నేషన్ ఆఫ్ ఇస్లాం” (Nation of Islam) అనే సంస్థ ద్వారా ఇస్లామిక్ అస్తిత్వాన్ని పొందినారు. ‘ది నేషన్ ఆఫ్ ఇస్లాం’ సంస్థ 1930 లో వాలాస్ డి. ఫర్డ్ ద్వారా స్థాపించబడినది. వీరు నల్ల జాతీయుల అస్తిత్వాన్ని,కాపాడటానికి, నల్ల జాతీయుల ఆర్థికాభి వృద్ధికి పాటుపడినారు.. దీనితో పాటు ఇస్లామిక్ సొసైటి ఆఫ్ నార్త్ అమెరికా(ISNA ),అమెరికన్ ముస్లిం మిషన్ (AMM),ముస్లిం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (MET)అమెరికన్ ముస్లిం కౌన్సిల్(AMC), ముస్లిం స్టూడెంట్ అస్సోషియేషన్ (యునైటెడ్ స్టేట్స్)(MSA(US), వంటి సంస్థలు అమెరికా లోని ముస్లింల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాయి.
మొత్తం అమెరికా దేశ జనాభాలో ముస్లింల శాతం 3% కన్నా తక్కువగానే ఉంది.అమెరికా లోఉన్న మొత్తం ముస్లింలలో సున్నిలు 50%, షియాలు20% ఉండగా , డ్రుజ్,అహమ్మదియాలు,సూఫీలు వంటి ఇతర శాఖల వారు కూడా కలరు. అరబ్ ముస్లింలు ల లో అధికులు
సున్నిలు, దక్షీణ ఆసియా ముస్లింలలో ఆదికసంఖ్యాకులు సున్నిలు. ఇరాన్ ముస్లింలలో
అధికులు షియాలు, ఆఫ్రికన్-అమెరికన్ ముస్లింలలో అధికులు
సున్నిలు కలరు.ముస్లిం అస్తిత్వాన్ని,సంఖ్యను, జాతీయ,ప్రాంతీయ స్థాయి లలో కాపాడటానికి అనేక ముస్లిం సంస్థలు కృషి చేస్తున్నాయి. ముస్లిం మసీదులు, ఇస్లామిక్ సెంటర్లు,ముస్లిం స్కూళ్ళ నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగింది.
అమెరికా ముస్లిం జనాభా పై బిన్నాభిప్రాయాలు కలవు. 2మిలియన్ల
నుండి 10 మిలియన్ల వరకు, ఇంకా అంతకన్నా అధికం గా ఉండవచ్చు
అని కొందరి అంచనా .ప్రతి సంవత్సరం అమెరికా లో ముస్లిం ల జనాభా 6% వృద్ధి రేటును
కలిగి ఉంది. అమెరికా మొత్తం జనాభాలో ముస్లిం ల శాతం 2.11%
లేదా వీరి సంఖ్య దాదాపు 61 లక్షల వరకు ఉంటుంది (2013). అమెరికా లోని మొత్తం ముస్లిం లలో దక్షిణ ఆసియా కు చెందిన వారు 34%, అరబ్బులు
26%,ఆఫ్రికన్ అమెరికన్లు
25%, ఇతరులు
15% కలరు. 20 శతాబ్ధం లో అమెరికా లో ముస్లిం ల జనసంఖ్య భాగా పెరిగింది దీనికి ప్రధాన కారణము ముస్లిం లలో అధిక జననాల రేటు మరియు అరబ్, దక్షిణ ఆసియా ప్రాంతాలనుండి ముస్లిం లు అధిక సంఖ్యలో అమెరికాకు వలస రావడమని చెప్పవచ్చును.
అమెరికన్ ముస్లిం లలో 65%
మండి మొదటి తరం వలసవాదులు, 35% అమెరికా లో జన్మించినారు. వలసవాదులలో 37% అరబ్ ప్రాంతాలనుండి, 27% సౌత్ ఆసియన్ దేశాలనుండి, 8% యూరప్ నుండి, 6%సబ్-సహారా ప్రాంతాలనుని వలస వచ్చినారు. అమెరికన్ ముస్లిం లలో 80%
మంది అమెరికా పౌరులు, ప్రతి 5గురు
అమెరికన్ ముస్లిం లలో ఒకరు ముస్లిం మతం స్వీకరించిన వారు.
అమెరికా లోని రాష్ట్రాలలో మిచిగాన్ రాష్ట్రం లో ముస్లిం లు అధిక సంఖ్యలో కలరు.ఆతరువాత న్యూ యార్క్,
కాలిఫోర్నియా,మేరి లాండ్, వర్గీనియా ,న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో కూడా
అధికంగానే కలరు.అమెరికా ముస్లిం లలో 55% మంది
నగరాలలో, 44% సబర్బన్ ప్రాంతాలలో 1% మండి రూరల్
ప్రాంతాలలో నివసిస్తున్నారు.
న్యూ యార్క్ సిటి లో ముస్లిం లు అధికంగా నివసిస్తున్నారు, అక్కడి
ప్రతి 10 మంది పబ్లిక్ స్కూల్ పిల్లలలో
ఒకరు ముస్లిం ఆతరువాత లాస్ ఎంగెల్స్ ,చికాగొ,హుస్టన్,గ్రేటర్ డెట్రైట్,మిచిగన్
లోని దేయర్ బోర్న్,హంట్రామక్ ప్రాంతాలలో ముస్లిం లు అంధికంగా
కలరు. డెట్రైట్ లో అధికంగా అరబ్-ముస్లింలు కలరు. డియర్ బోర్న్ మిచిగాన్ లో అరబ్-అమెరికన్లు
అధికంగా కలరు.వాషింగ్టన్ డిసి లో 24% మంది ఇరానీ ముస్లింలు, లాస్
ఏంజెల్ లో 38% ఇరానీ ముస్లింలు, ఫిలడెల్ఫియా లో 54% ఆఫ్రికన్
అమెరికన్ ముస్లింలు, ఫిలడెల్ఫియా మెట్రో ఏరియా లో 82% మండి నేటివ్ బోర్న్
ముస్లింలు (native born Muslims),న్యూ జెర్సీ లో 62% నేటివ్ బోర్న్
ముస్లింలు (native born Muslims),కలరు. టెక్సాస్ లో అమెరికన్ పౌరసత్వం
చట్టప్రకారంగా (Naturalized Citizenship)పొందిన ముస్లింలు 58% కలరు. లాస్ ఆంగిల్స్ లో అమెరికన్ ముస్లిం స్త్రీలు
అధికంగా 78% కలరు. ఒహియా లో 46% మండి ఆఫ్రికన్ ముస్లిం లు,
టెక్సాస్ లో 43% మండి సౌత్ ఆసియా ముస్లింలు, ఫ్లోరిడా లో
హిస్పానిక్ ముస్లిం లు అధికం గా కలరు.పేటర్ సన్,న్యూ జెర్సీ మాసాచూట్స్ ప్రాంతం ముస్లిం వలసవాదులకు ఇష్టమైన ప్రదేశం గా పరిగణించబడు చున్నది .
అమెరికన్ ముస్లిం లు అమెరికన్ఇంగ్లిష్, అరబిక్,పర్షియన్,బంగ్లా,సింధి, పంజాబీ, ఉర్దు,కుర్డు,బోస్నియన్, పస్తో,చైనీస్,స్పానిష్,టర్కిష్, అల్బేనియన్ వంటి వివిధ రకాల బాషలు మాట్లాడు తారు.
అమెరికాలోని విబిన్న మత
గ్రూపులలోఅమెరికన్ ముస్లింలు ఆధిక విద్యావంతులు వీరీలో 40% మంది పట్టబద్రులు. ఆసియన్ అమెరికన్ ముస్లిం
లలో 57% మండి, వైట్ అమెరికన్ ముస్లిం లలో 51% మండి
పట్టబద్రులు. అమెరికా
లోని ముస్లిం కుటుంబాలలో 2/3 కుటుంబాలు సం.నికి 50 వేల డాలర్లు, ¼ వంతు కుటుంబాల సం.నికి 1లక్ష డాలర్ల్ల వంతున సంపాదిస్తున్నారు. ఆఫ్రికన్ ముస్లింలు తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారు.44%
మంది ఆసియన్ అమెరికన్ ముస్లింలు,34% మండి వైట్ అమెరికన్
ముస్లింలు అధిక ఆధాయన్ని కలిగి ఉన్నారు. అమెరికా లోని పాకిస్తానీ
ముస్లింలు బాగా చదువుకొన్నవారు మరియు ధనవంతులు. వీరిలో చాలా మంది డాక్టర్లు,సైంట్రిస్టులు,ఇంజనీర్లు, ఫైనాన్షియల్
అనలిస్టులు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు.అమెరికా
లో క్యాబ్ (టాక్సీ) డ్రైవర్లు గా సోమాలియాకు చెందిన వారు ఉంటారు. మద్య
ప్రాచ్యం నుండి వచ్చిన ముస్లిం
విద్యార్ధులు ఎక్కువుగా అమెరికా లో కనిపిస్తారు.అమెరికన్ ముస్లిం ల వినియోగ శక్తి సంవత్సరానికి $170-$200 బిలియన్ డాలర్ల వరకు ఉంది
అమెరికన్ ముస్లిం లలో 60% మంది యువకులు 18-39స. మద్య వయస్సుకలిగి ఉన్నారు.
అమెరికన్ ముస్లింలలో 43% స్త్రీలు పట్టబద్రులు. అమెరికన్ ముస్లిం స్త్రీలు, అమెరికన్
పురుష ముస్లిం లతో సమానంగా పని లో వేతనం పొందుతున్నారు. అమెరికన్ ముస్లిం
స్త్రీలలో 82% మండి, పురుషులలో 78% మతం పట్ల ఆసక్తి కలిగిన
వారు. వీరు సాధారణంగా వారానికి ఒకసారి మసీదు కు వెళ్తుంటారు.
అమెరికాలో
2011 నాటికి
2106 మసీదులు కలవు. న్యూ యార్క్,కాలిఫోర్నియా,టెక్సాస్,ఫ్లోరిడా,ఇల్లినాయిస్,న్యూ జెర్సీ మొదలు 6 రాష్ట్రాలలో మసీదులు అధికం గా కలవు. 1915 లో అమెరికాలో తొలి మసీదు అల్బేనియా ముస్లింలచే
నిర్మించబడినది.కాలిఫోర్నియా లో అధికంగా మసీదులు
కలవు. అమెరికా లో అతిపెద్ద మసీదు “ది ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ అమెరికా” డియర్ బోర్న్
మిచిగాన్ లో షియా ల చే నిర్మించబడినది. 2001
లో అమెరికా ఇస్లామిక్ సంస్కృతి ని తెలిపే “ఇంటర్నేషనల్ మ్యూజీయమ్ ఆఫ్ ముస్లిం కల్చర్” జాక్సన్,మిస్సిసిపీలో ప్రారంభం అయినది. “అమెరికా ఇస్లామిక్ హెరిటేజ్ మ్యూజీయమ్” వాషింగ్టన్ డిసి లో 2011 లో ప్రారింభించబడినది.
అమెరికా ముస్లిం లలో అధిక
శాతం మంది రాజకీయంగా ఉదారవాదులు.70% అమెరికన్ ముస్లింలు డెమొక్రాటిక్ కి
అనుకూలంగా ఉంటారు.అమెరికన్ యంగ్ ముస్లిం లలో కేవలం 51% మంది వోటు రిజిస్టర్
చేసుకొంటున్నారు. కీత్ ఎల్లిసన్ అమెరికా తొలి ముస్లిం కాంగ్రెస్ సబ్యుడు. ఆతరువాత ఆంద్రె
కార్సన్ ఇండియానా నుంచి కాంగ్రెస్ మన్ గా ఎన్నికైనారు.2008 అమెరికా అద్యక్ష ఎన్నికలలో బరాక్ –ఒబామాకు
అమెరికన్ ముస్లిం లు 67-90% వరకు ఓటు చేసినారు. బరాక్ ఒబామా పూర్తి పేరు బరాక్
హుసైన్ ఒబామా.(బారక్ అనగా ఆశ్విరదింపబడిన వాడు అని అరబిక్ అర్థం, హుస్సైన్
ప్రవక్త మనుమని పేరు, ఒబామా అనగా పార్సి లో నేను నీ తో
ఉన్నాను అని అర్థం) ఇతని తండ్రి కీన్యా దేశ ముస్లిం,తల్లి
అమెరికన్ వనిత. 2005 నాటికి అమెరికా రక్షణ
దళాలలో దాదాపు 15000
మంది ముస్లిం లు పని
చేస్తున్నారు. అనేక అమెరికా విమానాశ్రయాలలో ముస్లిం ల సౌకర్యార్ధం వజూఖానాలు, ప్రార్ధన మందిరాలు నిర్మించబడినవి.
9/11. దాడుల తరువాత అమెరికన్ ముస్లిం లు కొంత అవహేళనను,హింసను,వ్యతిరకతను వివక్షతను,ఎదుర్కొన్నప్పటికి ప్రస్తుత
పరిస్థితులు శాంతి యుతంగానే ఉన్నాయని చెప్పవచ్చును. అనేక మంది ఇస్లాం ను అర్థం
చేసుకోవటానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు ముస్లింలపై పరిశోధనలు జరిపినాయి. అమెరికా లోని ముస్లిం లపై అనేక
సర్వే లు, ఒపీనియన్ పోల్ల్స్ నిర్వహించడం జరగడం జరిగింది. ప్రస్తుతం అమెరికా లో బహుముఖంగా
విస్తరిస్తున్న(fast growing) మతం గా
ఇస్లాం ను చెప్పవచ్చును. నల్లజాతి ప్రాంతాలలో,కారాగారాలలో,హిస్పానిక్ ప్రజలలో ఇస్లాం
విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. బ్లాక్ అమెరికన్
ముస్లిం ఇమాములు నల్ల జాతి వారు
ఉన్న ప్రాంతాలలో క్రైమ్ రేటు తగ్గించటం లో విజయం సాదించారు.
వివిధ రంగాలలో ప్రముఖ
అమెరికన్ ముస్లింలు
ఆర్ట్:
శిరీన్ నేషత్: ఇరానియన్-అమెరికన్
విజివల్ ఆర్టిస్ట్,ఫిల్మ్
డైరెక్టర్.
షాజియా సికందర్: పాకిస్తానీ అమెరికన్ ఆర్టిస్ట్, జీనియస్ అవార్డ్ విజేత
బిజినెస్:
మహమ్మద్ ఆ ఎల్ ఎరియన్ : PIMCO కంపనీ CEO మరియు $ ట్రిలియన్
విలువైన గ్లోబల్ ఆస్తుల మేనేజర్
జావేద్ కరీం: యు ట్యూబ్ సహ వ్యవస్థాపకుడు
ఫిల్మ్
నబిల్ అబౌ-హర్బ్:
ఫిల్మ్ మేకర్, “అరబ్ ఇన్ అమెరికా” ఫిల్మ్
రైటర్/డైరక్టర్
శోహ్రా అఘాషూ: ఇరాన్ లో పుట్టిన అకాడమీ అవార్డ్ కి నామినేటెడ్ చేయబడిన నటి.
మ్యూజిక్ :
అహమద్ జమాల్: జాజ్ పియనిస్ట్
ఐస్ క్యూబ్ : నిర్మాత, రాపర్
జెర్మైనే జాక్సన్ : గాయని,బాస్ గిటారిస్ట్
యూసుఫ్ లతీఫ్ : జాజ్ మ్యూజిషియన్ అండ్ గ్రామీ అవార్డ్ విజేత
టెలివిజన్:
మర బ్రోక్ అకిల్: నిర్మాత,స్క్రీన్ ప్లే
రైటర్
రిజ్వాన్ మంజి : నటుడు
ఏసయ్య ముస్తఫా: నటుడు
మెఃమెట్ ఒజ్ : టాక్ షో హోస్ట్,
సూపర్ మోడల్:
ఈమాన్: సూపర్ మోడల్
రీమా ఫైక్ : మిస్ యూఎస్ఏ 2010
రాజకీయాలు:
కీత్ ఎలిసొన్: తొలి ముస్లిం కాంగ్రెస్ మన్ (మిన్నసోటా రాష్ట్రం)
ఆంద్రె కార్సన్: ఇండియానా కాంగ్రెస్ మన్
సి.జాక్ ఎల్లిస్: మాకోన్ (జార్జియా) మాజీ మేయర్
జాల్మయ్ ఖలీల్ జాద్ : ఐక్య రాజ్య సమితి లో మాజీ అమెరికా రాయబారి, ఇరాక్ మరియు అఫ్ఘానిస్తాన్ లో
మాజీ అమెరికా రాయబారి.
ఫరా పండిత్: ముస్లిం విషయాలలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా
కు సలహాదారు.
జేమ్స్ యీ: అమెరికా ఆర్మీ లో కేప్టైన్ ర్యాంక్ కలిగిన
మాజీ ఆర్మీ మత చాప్లిన్
మత ప్రచారకులు:
షుఐబ్ వెబ్ : ముస్లిం ఉపన్యాసకుడు
వారిత్ దీన్ మహమ్మద్: అమెరికన్ సొసైటి ఆఫ్
ముస్లింస్ నాయకుడు
యూసుఫ్ ఎస్టేస్: ముస్లిం
మత ప్రచారకుడు.
ఖాలిద్ లతీఫ్ న్యూ
యార్క్ యూనివర్సిటీ ముస్లిం చాప్లిన్
సైన్స్:
ఫజ్లుర్ ఖాన్: స్ట్రక్చరల్ ఇంజినిర్ , సేయర్ టవర్, జాన్ హాన్ కాక్ సెంటర్ డిజైనర్
అయూబ్ కే ఒమ్మయ; న్యూరో సర్జన్
అహ్మెద్ జేవైల్: రసాయనిక శాస్త్రం లో నోబుల్ ప్రైజ్ విజేత
స్పొర్ట్స్:
మహమ్మద్ అలీ,హాసిమ్ రహ్మాన్, మైక్ టైసన్ : బాక్సింగ్,
కరీం అబ్దుల్ జబ్బార్,మహమ్మద్
అబ్దుల్ రవూఫ్; బాస్కెట్ బాల్
హమ్జా అబ్దుల్లా,హుసైన్ అబ్దుల్లా: నేషనల్ పుట్ బాల్ లీగ్
రచనా వ్యాసంగం:
రేజ అస్లాన్ : రచయిత
మోనా ఏతవి: కాలమిస్ట్
యహ్యా ఎమ్రిక్క్: గ్రంధ రచయిత
ఫరిద్ జకారియా: రచయిత,కామెంటేటర్,సిఎన్ఎన్ ఫరిద్ జకారియా జిపిఎస్ ప్రోగ్రాం ప్రయోక్త
1.
వికీపీడియా
2.
Wiki
islam
3.
ముస్లిం డెమోగ్రాఫిక్స్ – ఫరిద్ సెంజై ఎస్సియూ, కాలిఫోర్నియా
4.
ఫ్రంట్ లైన్
5.
ఆక్స్ ఫర్డ్ ఇస్లామిక్ ఆన్ లైన్ స్టడీస్
6.
The Future of the Global Muslim Population – Pew Research Religion
& Public Life Project –US Special