భారత దేశము లోని
ముస్లింల సామాజిక,ఆర్ధిక,విద్యా స్థితిగతులను పరిశీలించటానికి కేంద్ర
ప్రభుత్వం చే నియమింపబడిన సచార్ కమిటీ 1990 దశకానికి సంబందించిన జాతీయ గణాంకాలను
ఆదారంగా తన నివేదికను రూపొందించినది. ఆ నివేదికల్లో భారత దేశంలోని ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలకన్న,మానవాభివృద్ధికి సంబందించి సామాజిక,ఆర్ధిక,విద్యా సూచికలలో క్రింది స్థానంలో
ఉన్నారు మరియు వారి పరిస్థితి ఎస్‌సి,ఎస్‌టి ల కన్నా ఆధమంగా
ఉన్నదన్న విషయం స్పష్టం అయినది.
అయితే ఐహెచ్‌డిఆర్
నివేదిక 2011 ప్రకారం గత దశాబ్ధం లో అనగా 2001నుంచి 2011 వరకు గల 10 సంవత్సరాల
కాలంలో ముస్లింల స్థితిగతులను పరిశీలించిన క్రమంగా ముస్లిం ల స్థితి గతులు మెరుగు చెంది అవి దేశ సామాజిక,ఆర్ధిక,విద్యా సరాసరి సూచికలతో
సరిసమానంగా ఉన్నాయని గణాంకాలు
చెపుతున్నాయి. సగటు తలసరి వినియోగ ఖర్చు,నిరుద్యోగ శాతం,బాలకార్మికుల శాతం,శిశు/పిల్లల మరణాల శాతం,పునరుత్పత్తి రేట్, పిల్లల టికాకరణ(ఇమ్మునైజేషన్)మరుగు దొడ్డి సదుపాయం,
అక్షరాస్యతా మొదలగు వాటి విషయంలో ముస్లింల సూచికలు మిగతా దేశ ప్రజల సూచికలతో
సమానంగా ఉన్నాయి.
సచార్ కమిటీ నివేదిక
ప్రకారం ముస్లింలలో బరువు తక్కువ గా పుట్టే పిల్లల సరాసరి శాతం 1998-99 నాటికి 48.3%
ఉండి దేశ సరాసరి శాతం47% గా కన్నా
ఎక్కువుగా ఉంది. కానీ 2000దశకం లో అది ముస్లిం పిల్లలలో 6.5% తగ్గింది, దేశ సరాసరి శాతం 4.5% కు తగ్గినది. అనగా 2005-06 నాటికి ముస్లింలలో బరువు
తక్కువ గా పుట్టే పిల్లల సరాసరి శాతం41.8% కు తగ్గినధి దేశ
సరాసరి శాతం 42.5% కు తగ్గింది.
శిశుమరణాలు,5సంవత్సరాలలోపు
పిల్లలలో మరణాల శాతం క్రమంగా తగ్గుతుంది.1992-99 వరకు జాతీయ సరాసరి సూచికకు
ముస్లిం పిల్లల సరాసరి సూచికకు మద్య వ్యత్యాసo అధికంగా ఉండేది, కానీ 1998-2006 మద్య ఈ వ్యత్యాసం జాతీయ సరాసరితో సమానంగా ఉంది అనగా
ముస్లింలలో శిశుమారణాలు,5సంవత్సరాలలోపు పిల్లల మరణాలు
తగ్గినవి.
అదేవిధంగా
ముస్లింలలో విద్యాభివృద్ధి పెరిగి, వారిలో అక్షరాస్యతా శాతం దేశ
అక్షరాస్యతా శాతం కు దగ్గిరగా ఉంది. 2001 నాటికి గ్రామీణ ప్రాంతాలలో ముస్లింలలో
అక్షరాస్యతా శాతం దేశ అక్షరాస్యతా శాతం కన్నా 6% తక్కువుగా,
పట్టణ ప్రాంతాలలో 10% తక్కువుగా ఉండేదిది. కానీ 2007-2008 నాటికి అది గ్రామీణ
ప్రాంతాలలో 3,5%,పట్టణ ప్రాంతాలలో 8.5% శాతం వ్యత్యాసం కు
తగ్గిపోయినది. అయినప్పటికి 2008 నాటికి
ముస్లింల అక్షరాస్యతా శాతం దేశ అక్షరాస్యతా శాతం కన్నా తక్కువుగానే ఉంది. 2011-12నేషనల్
సాంపుల్ సర్వే నివేదిక ప్రకారం దేశప్రజలలో అనగా 7సంవత్సరాలు ఆపైన ఉన్నవారిలో
అక్షరాస్యులు 75% కాగా అది ముస్లింలలో 72% గా ఉంది.
1992-93 నాటికి
15-49 సవత్సరాలలోపు ఉండే స్త్రీలలో పునర్వుత్పాదను రేట్ ముస్లిం స్త్రీలలో అధికంగా
ఉండి,దేశ స్త్రీల సరాసరి పునరుత్పాదన రేట్ కన్నా 0.7% అధికంగా ఉండేది. 1998-99 నాటికి ఈ వ్యత్యాసం 1% కు పెరిగింది.
కానీ 2006 నాటికి ముస్లిం స్త్రీలలో పునరుత్పాదన రేట్ కేవలం .5% కు పెరిగి 3.09గా
ఉంది. 2006 లో జాతీయ స్త్రీల పునర్ ఉత్పాదన రేట్ 2.6% గా ఉంది. అనగా కేవలం ముస్లిం
స్త్రీలలో .49%పెరుగుదల గానే ఉంది. కాబట్టి కొంత మంది ఆరోపించినట్లు ముస్లిం ల జన
సంఖ్యా విపరీతం గా పెరగటం జరగదు. దేశ జనాభాలో 2001 జనాభా లెక్కల ప్రకారం
ఉన్నట్లు ముస్లిం జనాభా శాతం 13.4%కన్నా
పెరగదు.
అంతిమంగా
చెప్పేదిఏమిటంటే జాతీయ మనవాభివృద్ధి సూచికలలో ముస్లింలు,ఇతరులకు
మద్య ఉన్న వ్యత్యాసం క్రమంగా తగ్గుతుంది ముస్లింల పురోభివృద్ధి జరుగుతుంది.
సామాజికాభివృద్ధి సూచికలలో ముస్లింల స్థితి క్రమంగా ఎస్‌సి,ఎస్‌టి
ల కన్నామెరుగు ఆవుతుంది. కానీ శిశుమరణాలు,5సంవత్సరాలలోపు
పిల్లల మరణాలు,మరుగుదొడ్డి సౌకర్యం,తక్కువ
బరువు తో పుట్టే పిల్లలు మొదలగు సూచికల
విషయాలలో ముస్లిం ల పరిస్థితి జాతీయ సరాసరుల కన్నా తక్కువుగా ఉన్నాయి. అన్నీ
వర్గాలలో సగటు తలసరి వినియోగ ఖర్చు పెరుగుతుంది, పేదరికం
తగ్గుతుంది. కానీ ముస్లింలలో పట్టణ ప్రాంతాలలోముస్లింల తలసరి వినియోగ ఖర్చు మిగాతా
వర్గాలకన్న బిన్నoగా
ఉంది, గ్రామీణ ప్రాంతాలలో ముస్లింల తలసరి వినియోగ ఖర్చు
ఇతరవర్గాలతో సమంగా ఉంది. స్త్రీల పోషకాహార లేమి విషయంలో ముస్లిం స్త్రీలు పట్టణ
ప్రాంతాలలో మిగతా వారికన్న బిన్నం గా అధిక పోషకాహార లేమితో బాధ పడుతున్నారు.
అదేవిధంగా మానవాభివృద్ధి
సూచికలపై ప్రణాళికా సంఘం క్రింద పనిచేసే ఐఏఎంఆర్ సంస్థ ప్రచురిన గణాంకాల
ప్రకారం భారత దేశంలోని పేద రాష్ట్రాలలో (బీమారు రాష్ట్రాలు)నివశిస్తున్న ముస్లింలు
మానవాభివృద్ధి సూచికలలో ఇతర బలహీన వర్గాల వారికన్నా మెరుగైన స్థానం లో ఉన్నారు.
భారత దేశం లోని ఎనిమిది పేద రాష్ట్రాలు ఐనా బిహార్,ఛత్తీస్
ఘడ్,మద్యప్రదేశ్,ఒరిస్సా,రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్
రాష్ట్రాలు దేశ జనాభాలోని, 44% ముస్లిం లను కలిగి ఉన్నాయి.
సామాజిక అబివృద్ధి- మానవాభివృద్ధి సూచిక 2011 నివేదిక ప్రకారం.జమ్ము-కాశ్మీర్, ఆంధ్ర ప్రదేశ్ లోని ముస్లింలు ఆరోగ్య సూచిక ల విషయం లో వారి
రాష్ట్రాలలోని హిందువుల కన్నా, యూపి,ఎంపి,బిహార్, గుజరాత్ లోని హిందువుల కన్నా మెరుగుగా
ఉన్నారు..