ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యం గా రాష్ట్ర విభజన జరిగిన తరువాత అన్నీ రాజకీయ పక్షాలు తమ
దృష్టిని ముస్లిం మైనారిటీ ల పట్ల కేంద్రీకరించినవి. రాష్ట్రం లో ముస్లింల జనాభా దాదాపు 12% వరకు
ఉంది. ముస్లింలు ప్రధానంగా హైదరాబాద్, కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, నెల్లూరు,గుంటూర్, ప్రకాశం, కృష్ణ జిల్లాలలో అదికంగా కనిపిస్తారు.
రాయల సీమ,తెలంగాణ ప్రాంతం లో ముస్లింలు, అధికంగా ఉన్నారు. హైదరాబాద్ లో 40% పైగా ముస్లిం జనసంఖ్య ఉంది. పాతబస్తీ
లో 90% వరకు ముస్లిం లు ఉన్నారు. అన్నీ తెలంగాణ జిల్లాలలో కూడా ముస్లింలు తగినంత
సంఖ్య లో ఉన్నారు.
ఇక దక్షిణ కోస్తా ప్రాంతానికి వస్తే ముస్లింల జనాభా 5-6% కన్నా ఎక్కు వ లేదు.
వీరిలో 95% మంది చేతి వృతులు మీద ఆధార పడిన వారు. ఆక్షరాస్యత అదికంగా లేదు.
గోదావరి జిల్లాలలోనూ, ఉత్తర ఆంధ్రా లో వీరి సంఖ్య అతి
స్వల్పము.ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృతి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది.
గత2009 అస్సెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం 11 మంది ముస్లిం రాష్ట్ర శాసన
సబ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనారు. 11మండి రాష్ట్ర శాసన సబ్యులలో 3గురు
కాంగ్రెస్ కు,7గురు ఎంఐఎం కు, ఒకరు
టిడిపి కి ప్రాతినిద్యం వహించగా, ఒక్క పార్లమెంట్ సబ్యుడు
ఎంఐఎం కు ప్రాతినిద్యం వహించినారు.
తెలంగాణ,ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ/పార్లమెంట్ కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు
జరగబోతున్నాయి.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే 2014 శాసనసభ/పార్లమెంట్ ఎన్నికలలో ముస్లింలు
నిర్ణయాత్మక పాత్ర వహించబోతున్నారు. అబ్యర్ధుల
గెలుపు ను నిర్ణయించడం లో వీరి ఓటింగ్, ప్రభావాన్ని
కల్గించగలదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రం లో దాదాపు 40-50 రాష్ట్ర శాసనసభనియోజక వర్గాలలో మరియు 15 పార్లమెంటరీ
నియోజక వర్గాలలో ముస్లింలు నిర్ణయాత్మక శక్తి గా ఉన్నారు.
తెలంగాణ ప్రాంతం
లోని ముస్లింలు సంప్రదాయకం గా మొదటి నుంచి కాంగ్రెస్ కు వోట్ బ్యాంక్ గా ఉన్నారు.
పాత బస్తి లో ఎంఐఎం హవా కొనసాగుతూనే ఉంది.
ఎన్‌టి రామా రావు
సమయం లో తెలంగాణ లోని ముస్లింలు తెలుగు దేశం కు పూర్తి మద్దతు ప్రకటించినారు. ఎన్‌టిఆర్
అనంతరం చంద్ర బాబు హయం లో ముస్లిం లు తెలుగు దేశం కు కొంతవరకు దూరం అయినారు. గత
ఎన్నికలలో టిడిపి బిజేపి వైపు మొగ్గు చూపటాన్ని వీరు హర్షించలేదు. ప్రస్తుతం బిజేపి కి టిడిపి,
మద్దతు ప్రకటిస్తున్న వార్తల నేపద్యం లో ముస్లింలు టిడిపి వైపు ఎంత మొగ్గు
చూపుతారనే సంశయం ఉంది పైగా మోడి బూచి ఉండనే ఉంది.
తెలంగాణ ఏర్పాటును
ముస్లింలు హర్షించినా టిఆర్‌ఎస్ వైపు
అనుమానం గానే ఉన్నారు. టిఆర్‌ఎస్ లో ముఖ్యమైన ముస్లిం నాయకులు ఎవరు లేరు పైగా కేసిఆర్
ఎన్నికల తరువాత ఎన్‌డిఏ వైపు మొగ్గు చూపుతాడెమో అన్న అనుమానం వారిలో ఉంది?
మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్
ముస్లిం అబ్యర్ధి ఓటమిని వారు మరచిలేక పోతున్నారు.
ఇక ఎంఐఎం పాత
బస్తి నుంచి తన రాజకీయ పరిధి ని పెంచుకోవాలని చూస్తుంది,
ముస్లింలు అధికంగా ఉన్న రాయలసీమ, కోస్తా లో కొన్ని నియోజక
వర్గాలలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది.
కాంగ్రెస్స్ తెలంగాణ సాధకునిగా,
మైనారిటి ల రక్షకునిగా, షబ్బీర్ అలీ లాంటి మైనారిటీ నాయకులను
ప్రొజెక్టు చేస్తూ మైనారిటీ లలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకోవాలని
ప్రయాత్నిస్తుంది.
ఆంధ్ర ప్రాంతం లో
మొదటినుంచి కాంగ్రెస్స్ కు ముస్లిం లు అనుకూలంగానే ఉన్నారు.
ఎన్‌టిఆర్ హయాంలో
ముస్లిం ల నుంచి తగినంత మంది ముస్లింలు
తెలుగు దేశం వైపుకు మరలారు. ఎన్‌టిఆర్ కూడా ముస్లింలను బాగానే అదరించినారు. చంద్ర
బాబు హయం లో ముస్లిం లు తెలుగు దేశం పట్ల కొంత అసహనం ప్రదర్శించిన కోస్తా
ముస్లింలలో చెప్పుకోదగిన సంఖ్యలో టిడిపి వోటర్లు, క్యాడర్ ఉంది.
ప్రస్తుతం సీమాంద్ర
ప్రాంతం ముస్లింలలో వైసిపి గాలి బాగా వీస్తున్నది. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన
సంక్షేమ ఫదకాలు మైనారిటీ లలో బాగా పాపులర్ అయినాయి. వైసిపి పట్ల ముస్లింలు అధిక
సంఖ్యలో మద్దతు ప్రకటిస్తున్న ఇటీవల జగన్, మోడి కి మద్దతు పలకటం వారికి
మింగుడు పడటం లేదు? వైసిపి ని ఎంతవరకు నమ్మవచ్చో,అది చివరకు ఎన్‌డిఏ కి మద్దతు
పలుకు తుందేమో అన్న అనుమానం వారిలో ఉంది!
ఈవిధంగా తెలంగాణ,
సీమాంద్రప్రదేశ్ లోని ముస్లింలు ఒకే రకం గా ఓటు చేసి స్థితిలో లేరు వేరు వేరు
ప్రాధాన్యతలను కలిగి ఉన్నారు అయితే ఉమ్మడిగా బిజేపి /మోడి భయం వీరిని వెన్నాడుతూనే
ఉంది.
No comments:
Post a Comment