త్వరలో మనదేశం లో 16వ లోక్ సభ కు 2014 లో సార్వత్రిక ఎన్నికలు జరగ పోతున్నాయి.. ఇటువంటి పరిస్తుతులలో 15 వ లోక్ సభ లో ఎంతమంది ముస్లిం సబ్యులు కలరో ఒకసారి పరిశీలించుదాము.
భారత దేశాజనాభాలో ముస్లింల శాతం 15-20% వరకు ఉంది.వారి జనాభా నిష్పత్తి ప్రకారం అయితే లోక్ సభలో ఉండ వలసిన ముస్లిం సబ్యుల సంఖ్య 72.
కానీ ప్రస్తుత లోక్ సభ అనగా 15 వ లోక్ సభ లోని మొత్తం ముస్లిం సబ్యుల సంఖ్య 30. ముస్లిం లోక్ సభ సబ్యులలో ప్రముఖులు
సలాఉద్దీన్ ఒవైసీ, సల్మాన్ ఖుర్షీద్,మహమ్మద్
అజరుద్దీన్, E. అహ్మెద్, షానవాజ్ హుస్సైన్, ఫరూక్ అబ్దుల్లా, మహమ్మద్ హమీదుల్లా సయీద్ ముఖ్యులు.
పార్టీల వారీగా చూస్తే వీరిలో 11మండి కాంగ్రెస్స్-ఐ కు, నేషనల్
కాన్ఫరెన్సు కు 4గురు, బి.ఎస్.పి. కు 4 గురు, తృణమూల్ కాంగ్రెస్స్ కు 3, ముస్లిం లీగ్ కు ఇరువురు, ఎం.ఐ.ఎం.కు ఒకరు, అస్సామ్ యునైటెడ్ డెమోక్రెటిక్
ఫ్రంట్ కు ఒకరు, జనతా దాల్ యునైటెడ్ కు 1, డి.ఎం.క.కు ఒకరు, సిపిఐఎం కు ఒకరు, బి.జే.పి.కు ఒకరు మొత్తం 30 మంది కలరు.
ఇక రాష్ట్రాల వారీగా పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్
నుండి ఒకరు, అస్సామ్ నుంచి ఇద్దరు,
బీహార్ నుంచి ముగ్గురు, జమ్ము-కాశ్మీర్ నుంచి నలుగురు, కేరళ నుంచి 3గురు, తమిళ నాడు నుంచి రెండు, యూ.పి. నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి 7గురు, లక్షద్వీపాలనుంచి ఒకరు మొత్తం 30 మంది ఎన్నికైనారు.
15 వ లోక్ సభ లోని మొత్తం 30 మంది లోక్ సభ ముస్లిం సబ్యులలో 27 మంది పురుషులు, 3 స్త్రీలు కలరు. 15 వ లోక్ సభ లో ఎన్నికైన మహిళా ముస్లిం సబ్యలు వరుసగా
తబసుమ్ బేగమ్(యూ.పి.-బి.ఎస్.పి.),కైసర్
జహాన్(యూ.పి.-బి.ఎస్.పి),మౌసమ్ నూర్(పశ్చిమ బెంగాల్
-కాంగ్రెస్-ఐ)
వీరి ముగ్గురులో మౌసమ్ అత్యంత చిన్న
వయసును అనగా కేవలం 27 సం. ల వయసును కలిగినది మరియు ముగ్గురులో ఆమె అంత్యంత అధిక
విద్యావంతురాలు. ఆమె ఎల్‌ఎల్‌బి కలకత్తా
విశ్వవిద్యాలయము నుండి పూర్తిచేసినది. ఆమె
బెంగాల్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ ఘని ఖాన్ చౌదరి
కుటుంబం నుండి వచ్చినది. తబసుమ్ (39స.లు)10వ తరగతి, కైసర్
జహాన్(35 స. లు ) 8వ తరగతి వరకు చదివిరి.
ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభలలో ముస్లిం
స్త్రీ సబ్యుల సంఖ్య 3 సార్లు మాత్రమే 3కు చేరింది. విచారకరమైన విషయం ఏమిటంటే
ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య ఎప్పుడు 3 కు మించలేదు.
6,8,15
వ లోక్ సభ లలో ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య అత్యధికంగా 3
మాత్రమే.
1,4,5,9,10,12 లోక్ సభలలో అసలు ముస్లిం మహిళా
లోక్ సభ సబ్యులే లేరు.
2,3,7
లోక్ సభలలో ఇరువురు చొప్పున ముస్లిం మహిళా సబ్యులు ఎన్నికైనారు.
11,13,14
లోక్ సభలలో ఒకరు
చొప్పున ముస్లిం మహిళా సబ్యులు
ఎన్నికైనారు
ఇంతవరకు
ఏర్పడిన 15 లోక్ సభ లలో మహిళా సబ్యుల సంఖ్య 549 కాగా
అందులో ముస్లిం మహిళా సభ్యుల సంఖ్య 18 మాత్రమే.
ప్రస్తుత
రాజ్య సభలో ఒక నామినటెడ్ సబ్యునితో సహ20 మండి ముస్లిం సబ్యులు కలరు.వీరిలో యూపి
నుంచి 4+1నామినటెడ్ సబ్యుడు,బిహార్ నుంచ్2,మహారాస్త్ర నుంచి2,అస్సామ్ నుంచి 1,జమ్ము-కాశ్మీర్ నుంచి 3,రాజస్తాన్ నుంచి1,డిల్లీ నుంచి 1, మద్య ప్రదేశ్ నుంచి 1.వెస్ట్
బెంగాల్ నుంచి 1,తమిళనాడు నుంచి 1,
ఆంద్రప్రదేశ్ నుంచి 1, ఛత్తీస్గర్ నుంచి 1 మొత్తం 20 మంది
కలరు.
పార్టీ
ల వారీగా ఇండిపెండెంట్ ఒకరు, నామినేటెడ్ సబ్యుడు ఒకరు, కాంగ్రెస్స్ నుంచి 7, జేడి(యూ) నుంచి 2, బిఎస్‌పి నుంచి 3, బిజేపి నుంచి 1, డిఎంకే నుంచి 1, ఎస్‌పి నుంచి 1, తృణమూల్ కాంగ్రెస్స్ నుంచి 1,ఎన్‌సిపి నుంచి ఒకరు, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒకరు ఎన్నికైనారు.
వీరిలో
నుంచి పురుషులు 17 మంది కాగా ముగ్గురు మాత్రమే
ముస్లిం మహిళా సభ్యులు, వీరు మోహిషినా కిద్వాయి (కాంగ్రెస్-ఐ)న నజ్నీన్
ఫారూఖ్ (కాంగ్-ఐ) హెజ్మా నఫ్తుల్ల బి.జే.పి. కు చెందినవారు.రాజ్య సభ
ఎక్స్-అఫ్ఫిషియో ఛైర్మన్ గా ఉపరాష్ట్ర పతి శ్రీ హమీదుల్ అన్సారీ
వ్యవహరించును.
ప్రభుత్వ వెబ్
సైట్స్ అంధించిన వివరాల ప్రకారము అందరూ ముస్లిం లోక్ సభ సబ్యులు తమకు కేటాయించిన
ఎంపిఎల్‌ఏడి (ఎంపీలాడ్) నిధులు పూర్తిగా
ఖర్చు చేయలేదు. యూపి కు చెందిన షఫికూర్ రహ్మాన్ మాత్రం తమ నిధులను పూర్తిగా ఖర్చు
పెట్టిరి.. 16 మండి ముస్లిం లోక్ సభ సబ్యులు తమకు ఒక్కకరికి వ్యక్తిగతం గా కేటాయించిన 12 కోట్ల నిధులలో 4-7 కోట్ల వరకు
నిధులను ఖర్చు చేయలేదు.
No comments:
Post a Comment