22 March 2014

భారత దేశం లో ఎన్నికల విశేషాలు




భారత దేశము ప్రపంచములో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లో ఎన్నికలను ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు. ఎన్నిక లను నిర్వహించడానికి రాజ్యాంగబడ్డం గా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి  కల ఎన్నికల సంఘం ఏర్పాటు అయినది. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి నేటివరకు మొత్తం 15 సార్లు లోక్ సభ కు ఎన్నికలను నిర్వహించడం జరిగింది. 2014 లో 16వ లోక్ సభ కు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది.2014 లోక్ సభ ఎన్నికలలో 81.46 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు.543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగును. 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగును. దేశవ్యాప్తం గా 9,30,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడినవి. దాదాపు 1కోటి 10 లక్షల మంది ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ సందర్భం గా భారత దేశం లో ఎన్నికలకు సంబందించిన కొన్ని విశేషాలను పరిశీలించుదాము.
భారత దేశం లో ఎన్నికల విశేషాలు
·       జమ్ము-కాశ్మీర్ లోని హబ్బాకాదల్ నియజకవర్గం లో పోలింగ్ శాతం కనిష్టం గా 11.62% ఉండగా, మణిపుర్ లోని హీరోక్ నియోజకవర్గం లో అత్యధికంగా 96.02% వోట్లు పోలు అయినావి.
·       రాష్ట్ర శాసన సభలకు చెంది యూ‌పి లోని సాహిబాబాద్ నియోజకవర్గం లో అత్యధికంగా  676637 మంది వోటర్లు ఉండగా,  సిక్కిం లోని సంఘ నియోజక వర్గం లో 3058 మంది  వోటర్లు ఉన్నారు.
·       యూ‌పి లో అత్యధికంగా 403 రాష్ట్ర అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, కనిష్టం గా పాండుచ్చేరి లో 30 అసెంబ్లి నియోజక వర్గాలు ఉన్నాయి.
·       యూ‌పి లోని సదర్ నియోజక వర్గానికి చెందిన ఎస్‌పి కి చెందిన ఎం‌ఎల్‌ఏ అరుణ్ కుమార్ అందరిలోకి అత్యంత పిన్న వయస్కుడు అనగా  జనవరి 2012 నాటికి అతని వయస్సు 25 సంవత్సరాలు.
·       కర్ణాటక బీదర్ నుంచి రామచంద్ర వీరప్ప 94 సంవత్సరాల వయస్సు లో ఎన్నికలలో విజయం సాదించాడు. 
·       ఎన్నికలలో ఈ‌వి‌ఎం లను మొదటిసారిగా కేరళలో వాడటం జరిగింది. ఒక ఈ‌వి‌ఎం లో 64 మంది వరకు అబ్యర్ధులకు గుర్తులు కల్పించవచ్చు.
·       కాండిడేట్ అనే పదానికి లాటిన్ భాషలో తెలుపు దుస్తులు దరించినవాడు అని అర్థం.
·       1996 లో తమిళనాడు లోని మోదౌరిచి నియజక వర్గం  నుంచి 1033 అబ్యర్ధులు పోటీ చేసినారు.బ్యాలెట్ పేపర్ ను బుక్లెట్ రూపం లో ముద్రించతమైనది.
·       అరుణాచల్ ప్రదేశ్ లోని బొందిల జిల్లాలోని ఒక నియోజక వర్గం లో కేవలం 3గురు మాత్రమే వోట్ చేసినారు.
·       1950 వ దశకం లో జరిగిన ఎన్నికలలో ఒకే బాలట్ బాక్స్ కాకుండా  ప్రతి పార్టీ  అబ్యర్ధికి ఒక రంగు బాలట్ బాక్స్ చొప్పున వివిద రంగుల బాలట్ బాక్స్ లను వాడేవారు.
·       ఎం‌పి లోని రాజనందగావ్ నుంచి తండ్రి-తల్లి-కుమారుడు వివిధ ఎన్నిక లలో ఎన్నికైనారు.
·       1957 సాదారణ ఎన్నికలలో గరిష్టం గా  62.2% వోట్లు పోలు అయినాయి.1967 సాదారణ ఎన్నికలలో కనిష్టం గా  33% వోట్లు పొలుఐనాయి.
·       ఏరియా ప్రకారం రాజస్తాన్ లోని బార్మర్ నియోజక వర్గం గరిష్టం గా  71601.24 స్క్వేర్ కిలోమేటర్ల వైశాల్యాన్ని కలిగిఉంది.
·        ఏరియా ప్రకారం ముంబై సౌత్ నియోజక వర్గం కనిష్టం గా  13.73 స్క్వేర్ కిలోమేటర్ల వైశాల్యాన్ని కలిగిఉంది.
·       గుజరాత్ లోని గిర్ అడవులలోని బనేజ్ గ్రామం లోని  ఒకే ఒక్క వోటర్ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయబడినది.
·       అందరి కన్నా అత్యధిక వోట్లు 855543  సాదించినది ఔటర్ డిల్లీ నుంచి సజ్జన్ కుమార్. తక్కువ వోట్లు సాదించినది చాందిని చౌక్ నుంచి అశోక్ కుమార్ 45.
·       మొదటిసారిగా  వోటర్లకు లోక్ సభ ఎన్నికలలో  NOTA (none of the above)ఆప్షన్ ఇవ్వబడినది
·        




No comments:

Post a Comment