22 March 2014

2009-14 మద్యకాలం లో 15 వ లోక్ సభ విధి నిర్వహణ తీరుతెన్నులు


:

2009-14 సంవత్సరాల మద్య కాలం లో 15వ లోక సభ తన పదవి కాలాన్ని  ప్రధాన విధి ఐన బిల్లుల ఆమోదం కన్నాతరచూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలగటం తోనే ముగించినది.15వ  లోక్ సభ విధినిర్వహణకు అంతరాయం కలిగించిన అంశాలలో 2జి స్కామ్,బొగ్గు క్షేత్రాల కేటాయింపు, రిటైల్ రంగంలో ఎఫ్‌డి‌ఐ లకు అనుమతి,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం మొదలగు నవి ముఖ్యమైనవి. 15వ లోక్ సభ, మునుపటి  లోక్ సభలు ఆమోదించిన బిల్లులకన్నా తక్కువ బిల్లులను ఆమోదించినప్పటికి ఆమోదించిన బిల్లులలో విద్యా హక్కు (ఆర్‌ఈ‌ఏ)భూ సేకరణ ,ఆహార భద్రత, కంపనీబిల్లు  మరియు సివిల్ లియాబిలిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ బిల్లులు ముఖ్యమైనవిగా చెప్పవచ్చును.

2009-14 మద్యకాలం లో  15 వ లోక్ సభ 
విధి నిర్వ
హణ -తీరుతెన్నులు- ఒక విశ్లేషణ

Ø  గత 5సంవత్సరాల కాలం లో (2009-14) 15వ లోక్ సభ ఉత్పాదకత 61% గా ఉంది. ఇది లోక్ సభ గత 50సంవత్సరాల చరిత్రలో అత్యంత కనిష్టం. 13వ లోక్ సభ 91% ఉత్పాదకతను, 14 వ లోక్ సభ 87% ఉత్పాదకతను కలిగి ఉంది.
Ø  15వ లోక్ సభ తన నిర్ధారిత 356 సిట్టింగ్స్ లో 345 సిట్టింగ్స్ పూర్తి చేసింది
Ø  2009 బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ 162 గంటలు పనిచేసింది నిర్ధారిత సమయం కన్నా 4 గంటలు అదనంగా పనిచేసినది.
Ø  మొత్తం 15వ  లోక్ సభ  నిర్ధారిత 2070 పని గంటలలో 1330.9 గంటల ఉత్పాదక పనిగంటల పని  జరిగినది. కొన్ని సమావేశాలు తుడుచిపెట్టుకొని పోయినాయి.2010 శీతాకాల సమావేశాలలో నిర్ధారిత 138 గంటలలో 7.62గంటల ఉత్పాదక పని జరిగింది. 2012 వర్షా కాల సమావేశాలలో 21%, 2013 బుడ్జెట్ సమావేశాలలో 49% ఉత్పాదక పని జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ 67% ఉత్పాదకతను సాదించినది. రాజ్య సభ నిర్ధారిత 1785 గంటలలో 1198.38 గంటలు ఉత్పాదక పని జరిగింది.  2010రాజ్య సభ శీతాకాల సమావేశాలలో కేవలం 2% ఉత్పాదక పని జరిగింది
Ø  15 వ లోక్ సభ మొదటి 5 సమావేశాలు సగటున 81% విధులను  నిర్వహించగా, 2010 శీతాకాల సమావేశాల తరువాత(2జి స్పెక్ట్రమ్ పై జే‌పి‌సి కమిటీని వేయమని)  సగటున 52% మాత్రమే విధులను  నిర్వహించినది. రాజ్య సభ 55% విధులను  నిర్వహించినది.
Ø  మొత్తం మీద  తనకు నిర్దేశించిన నిర్ణీత సమయం లో తరచూ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కు అంతరాయం కలుగుట వలన లోక్ సభ 61%, రాజ్య సభ 67% తమ విధి నిర్వహణ ను పూర్తి చేసినాయి.
Ø  15వ లోక్ సభ (2009-14) తన  ఐదు సంవత్సరాల పదవి కాలం లో తన ముందుకు వచ్చిన 328 బిల్లులలో 179 బిల్లులను చర్చించి ఆమోదించినది. ఐదు సంవత్సరాల పదవీకాలం లో మిగతా లోక్ సభలు ఆమోదించినదాని కన్నా ఇది చాలా తక్కువ. 13వ లోక్ సభ 297 బిల్లులను, 14వ లోక్ సభ 248 బిల్లులను ఆమోదించినవి.
Ø  15 వ లోక్ సభ ముందుకు వచ్చిన 228 సాధారణ బిల్లులలో, చర్చ జరగనందున 68 బిల్లులు మురిగి పోయినాయి వాటిలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డైరెక్ట్ టాక్స్ కోడ్,మైక్రో ఫీనాన్స్ బిల్లు ముఖ్యమైనవి.
Ø  15వ లోక సభ 2010 శీతాకాల సమావేశాలలో  కనిష్టం గా 11.2%,2011 శీతాకాల సమావేశాలలో గరిష్టం గా 39.53% శాసనాల రూపొందనకు ఖర్చు చేయడం జరిగింది.
Ø  ఆర్ధిక బిల్లులపై 81.35% నిర్ధారిత సమయం ఖర్చు చేయడం జరిగింది. 

Ø  15 వ లోక్ సభ వచ్చే నాటికి 37 పెండింగ్ బిల్లులు ఉండగా, రేపు వచ్చే 16 వ లోక్ సభముందు 60 పెండింగ్ బిల్లులు ఉండబోతున్నాయి. .
Ø  15 వ లోక్ సభ 116 సాధారణ బిల్లులను ఆమోదించినపటికి వాటిలో అధిక శాతం బిల్లులు తగినంత చర్చ లెకుండానే ఆమోదించడం జరిగింధి.15 వలోక సభ ఆమోదించిన బిల్లులలో 36% బిల్లులను అరగంట లోపునే చర్చించడం ఆమోదించడం జరిగింది. వీటిలో 20 బిల్లు ఐదు నిమిషాల లోపునే చర్చించడం  ఆమోదించడము  జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ లో ఆమోదించిన మొత్తం బిల్లులలో 38% బిల్లులను  రెండు గంటలకన్న  అధిక సమయం లో  చర్చించి ఆమోదించడం, కొన్ని బిల్లులను అనగా 7 బిల్లులను 5నిమిషాలలోపు చర్చించడం జరిగింది
Ø  15 వ లోక్ సభ పదవి కాలం ముగిసే నాటికి రాజ్య సభ లో పెండింగ్ లో 60 బిల్లు లలో జుడీషియల్ అప్పాయింట్మెంట్ కమిషన్ బిల్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్(అమెండ్మెంట్) బిల్, రియల్ ఎస్టేట్ బిల్, ప్రేవేన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్మెంట్)బిల్ ముఖ్య మైనవి
Ø  15వ లోక్ సభ లో క్వశ్చన్ ఆవర్ సమయం  అంతరాయాల  వలన బాగా నష్ట పోయినది. లోక్ సభ ప్రారంభము  లో మొదటి గంట ను క్వశ్చన్ అవర్ అందురు.సాధారణం గా  క్వశ్చన్ ఆవర్ సమయం లో పార్లమెంట్ సబ్యుల ప్రశ్నలకు మంత్రులు మౌఖికం గా సమాధానాలు ఇస్తారు.
Ø  చాలా సందర్భాలలో ను క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 1% కూడా పని జరగలేదు. 2010 శీతాకాల సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 0.78%సమయంలో    మరియు 2012 వర్షాకాల సమావేశాలలో 1.23%సమయం లో    ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 2009 బుడ్జెట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 19.75% సమయం లో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.   
Ø  మొత్తం లోక్ సభలో 61%, రాజ్య సభ లో 59%  క్వశ్చన్ ఆవర్ సమయం నష్టపోయినది.
Ø  15 వ లోక్ సభలో మొత్తం 6479 పశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు ,రాజ్య సభ లో 6512 ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు రావలసి ఉంది. కానీ వీటిలో లోక్ సభలో 10% ప్రశ్నలకు, రాజ్య సభ లో 12% ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు లబించినవి.
Ø  15వ లోక్ సభ మూడు సమావేశాల కాలం లో రాజ్య సభ లో ఏ మౌఖిక ప్రశ్నకు సమాధానం లబించలేదు.
Ø  గత కొద్ది కాలం గా పార్లమెంట్ బడ్జెట్ ప్రస్తావనలపై చర్చ  తక్కువ సమయం జరుగుతుంది, 15వ లోక్ సభ లో అనేక సార్లు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్ధిక ప్రతిపాదనలపై చర్చ, పరిశీలన జరగకుండానే ఆమోదించడం జరుగుతుంది. క్రిందటి 5 సంవత్సరాలలో మొత్తం ఉత్పాదక సమయంలో  బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ కు 29% లబించినది. .
Ø  2014 ఇంటీరియమ్ బడ్జెట్ ను చర్చ జరపకుండానే ఆమోదించటం జరిగింది.
Ø  2013 లో ఫీనాన్స్ బిల్లు, 16.6 లక్షల కోట్ల గ్రాంట్ల డిమాండ్ల  పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం ఆమోదించడం జరిగింది.
Ø  2011 లో 81% మరియు 2012 లో92% మొత్తం డిమాండ్ల పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం జరిగింది.
Ø  15 వ లోక్ సభ కాల పరిమితిలో 2011 లో బడ్జెట్ ను,గ్రాంట్ల డిమందులను వివిధ మంత్రిత్వ శాఖల  స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపకుండానే ఆమోదించడం  జరిగింది.







.


No comments:

Post a Comment