22 March 2014

ఇండియన్ హ్యూమన్ డవలప్మెంట్ సర్వే (IHDS) నివేదిక-మహిళలకు సంబంధించిన సత్యాలు


భారత దేశ జనాభాలో స్త్రీలు 50% వరకు ఉన్నారు. వోటర్లలో కూడా దాదాపు 50% వరకు స్త్రీ వోటర్లు ఉన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర పతి వంటి ఉన్నత పదవులను స్త్రీలు అధిష్టించినారు. మహిళా సాధికారికత సాదించడానికి ప్రభుత్వపరము గా అనేక చర్యలు తీసుకొంటున్నారు. ఆర్ధిక రంగంలో సాదికారికత సాదించదానికి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టబడినవి. రాజకీయ రంగం లో సాదికారికత సాదించడానికి మహిళా రేజర్వేషన్ బిల్లును అమలులోనికి తేవడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో 50% సీట్లను కొన్ని రాష్ట్రాలలో కేటాయించడం కూడా జరిగింది. మాత -శిశు సంక్షేమానికి అనేక పధకాలు ప్రవేశ పెట్టడం జరిగింది. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి స్త్రీల అబివృద్ధి ఆశించినంతగా  లేదు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచికలలో అనగా విద్యా,వైద్య,ఉపాధి తదితర రంగాలలో స్త్రీల అభివృద్ధి ఆశించినంత లేదు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్  ఎకనామిక్ రిసర్చ్ సంస్థ నిర్వహించిన ఇండియన్ హ్యూమన్ దవలప్మెంట్ సర్వే 2005-12 వరకు నిర్వహించిన సర్వే లో వెలుబడిన ఫలితాలను ఈ క్రింది విధంగా అబివర్ణించవచ్చును.

IHDS నివేదిక ప్రకారం

§  భారత దేశం లో 18% మహిళలు ఇంటినుంచి బయటకు లేదా కిరాణా షాపు లకు కూడా స్వయంగా వెళ్లలేరు.
§  మహిళలలో 50% ఏవోరో ఒకరి తోడు లేకుండా బయటకు వెళ్లరు/స్వల్ప దూరం కూడా ప్రయాణం చేయరు.
§  వారికి లేదా వారి పిల్లలు జబ్బు పడినపుడు కేవలం 25% మంది మహిళలు  మాత్రమే స్వయంగా నిర్ణయం తీసుకోగలరు.
§  25% మహిళలకు మాత్రమే వివాహానికి పూర్వం వారికి కాబోయే భర్తలను/భాగస్వామిని  గురించిన పరిచయం ఉంది.
§  40% మహిళలకు వారి వివాహ విషయం లో స్వాతంత్ర్యం లేదు
§  80 % మహిళలకు  వైద్యుని దర్శించటానికి ఇంటివారి  అనుమతి కావలె .
§  60% మహిళలలు  తమ శిరస్సును కప్పుకొనేదరు.59% సవర్ణ  హిందు స్త్రీలు,83% ముస్లిం స్త్రీలు పరదా /గూంఘాట్ వాడేదారు. ఎక్కువగా రాజస్తాన్ లో 96% స్త్రీలు, తక్కువుగా తమిళనాడులో 6% స్త్రీలు తమ శిరస్సును కప్పుకొనేదారు.
§  25 స౦వత్సరాలు దాటిన 18% స్త్రీలకు వివాహానికి పూర్వమే తమ జీవిత భాగస్వామి తో పరిచయం ఉంది.
§  భారత దేశం లో ప్రతి కుటుంబం సరాసరి కట్నం క్రింద 333463 రూపాయిలు  ఇవ్వవలసి ఉంది. కట్నం ఖర్చు సవర్ణ హిందువులలో ఎక్కువ ఉండగా, ఆదివాసిలలో తక్కువుగా ఉంది. కేరళలో ఎక్కువ ఉండగా, అస్సామ్ లో తక్కువుగా ఉంది.
§  కట్నం క్రింద 39% మంది టి‌వి,ఫ్రిజ్,కార్ లాంటి విలాస వస్తువులను బహుమతిగా తెస్తారు. ఇది
డి ల్లి లో ఎక్కువ,కేరళలో తక్కువ.
§  సరాసరి వరుని వివాహ ఖర్చు 81952రూపాయిలు ఉండగా, వధువు వివాహ ఖర్చు 1,26,724రూపాయిలుగా ఉంది.
§  91%మంది స్త్రీల చేతిలో నగదు ఉంటుంది. వస్తువులు కొనుటలో 76% మంది స్త్రీల మాట చెల్లును.
§  19% స్త్రీల పేరు మీద ఇంటి దస్తావేజులు  ఉండును.
§  2012 నాటికి 25 సంవత్సరాలు నిండిన మహిళలలో 48% మంది కి  18 సంవత్సరాలకు లోపే వివాహాము జరిగినది. అది 2005 లో 60% వరకు ఉంది.
§  దక్షిణ భారత దేశం లోని స్త్రీలు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక లోని స్త్రీలలో 20%మండి బయటి సంబంధాలకన్న బందువులలోనే వివాహం చేసుకొంటున్నారు. కానీ సరాసరి బారత దేశం లో బయటి సంబంధాలు చేసుకోవడం పెరిగింధి.
§  మహిళలలో పునరుత్పాదన రేట్ తగ్గినది.2005 లో 3.85 ఉండగా ప్రస్తుతం అది 3.55 కు తగ్గినది
§  2005 లో గ్రామీణ ప్రాంతాలలో  15-59 మద్య వయస్సు ఉంది పనిచేసే మహిళలు 58% ఉండగా అది 2012 నాటికి 54% కు తగ్గింది. పట్టణ ప్రాంత మహిళలలో అది 23% నుంచి 20% కు తగ్గింది.
§  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే పురుషుల సంఖ్య 2005 లో 73% ఉండగా, 2012 లో 65% కు తగ్గింది.
§  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే స్త్రీల సంఖ్య 2005 లో 91% ఉండగా, 2012 లో 86% కు తగ్గింది.
§  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధక లభిదారులలో 44% మంది స్త్రీలు.   
§  2005 లో 50% కాన్పులు హాస్పటల్ లో జరగగా, 2012 లో దాని శాతం 70% కు పెరిగింది.
§  2005 లో బ్యాంక్ అక్కౌంట్ లు ఉన్న స్త్రీల శాతం 18% ఉండగా, 2012 నాటికి అది 38% కు పెరిగింది.
§  2005 లో 6-14 సంవత్సరాల మద్య ఉండి  పాఠశాలలో నమోదు చేసుకొన్న బాలికల శాతం 88% ఉండాగా 2012 నాటికి అది 96% కు పెరిగింది.
§  2005 లో 6-14 సంవత్సరాల మద్య ఉండి  పాఠశాలలో నమోదు చేసుకొన్న బాలుర శాతం 92% ఉండాగా 2012 నాటికి అది 96% కు పెరిగింది.
§  2001లో0-6సంవత్సరాల మద్య వయస్సు గల పిల్లలలో  ప్రతి 1000మంది బాలురకు 927 మంది బాలికలు కలరు. 2012 నాటికి అది తగ్గి ప్రతి 1000మంది బాలురకు 919 బాలికలు ఉన్నారు.
§  పురుషుల సగటు వివాహ వయస్సు 17.8 సంవత్సరాలుగా ఉంది.

మానవభివృద్ధి సూచిక లో ఆంధ్ర ప్రదేశ్ వెనుకంజ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మహిళలకు ఆర్ధిక రంగంలో సాదికారికత సాధించుటకు ఏర్పడిన స్వయం-సహాయక బృందాలు (SHG)జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సాదించినవి. సుమారు 10.53 లక్షల స్వయం-సహాయక బృందాలు,ఎక్కువుగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒక కోటి మంది కి పైగా మహిళలను సబ్యులుగా కలిగి దేశంలోనే అధికంగా బ్యాంక్ రుణాలను పొందిన రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ పేరుగాంచినది. కానీ 2011 జనాభా లెక్కలు,నేషనల్ హెల్త్ సర్వే-3,రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన బులిటెన్ ప్రకారం మనవాభివృద్ధి సూచికలో అనగా  అక్షరాస్యతా,ఆరోగ్యం, వివాహ వయస్సు,పునరుత్పత్తి,స్త్రీ-పురుష నిష్పత్తి,జనన-మరణాల శాతం,మాత-శిశు మరణాల శాతం మొదలగు విషయాలలో దేశం లో   అత్యంత దిగువ స్థానం లో ఉన్నది.
·        జాతీయ అక్షరాస్యతా శాతం 74.04% ఉండగా అది ఆంధ్ర ప్రదేశ్ లో 67.6% గా ఉంది.
·        జాతీయo గా స్త్రీ వివాహ వయస్సు సగటున 20.2 సంవత్సరాలు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో అది 18.7 సంవత్సరాలు గా ఉంది.
·        ఆంధ్ర ప్రదేశ్ లోని 33.5%  స్త్రీల బాడీ మాస్ ఇండెక్స్ సాదారణ స్థాయి కన్నా తక్కువగా ఉంది.
·        జాతీయం గా స్త్రీలలో రక్త హీనత కలిగిన వారు 55.3% ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని స్త్రీలలో 62.9% స్త్రీలు రక్త హీనతతో బాదపడుతున్నారు.
·        జాతీయం గా గ్రామీణ ప్రాంతాలలోని శిశువుల మరణ శాతం 7% గా  ఉండగా అది ఆంధ్ర ప్రదేశ్ లో 7.4% శాతం  ఉంది.
·        పుట్టిన నవజాత శిశువులలో 50%మండి పుట్టిన 28 రోజుల లోపే మరణిస్తున్నారు.
·        ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య పెరిగినప్పటికి, శిశు మరణాల రేట్ తగ్గలేదు.
మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని 50% స్త్రీలు నిరక్షరాస్యులు,తొందరగా వివాహం చేసుకొంటున్నారు,రక్తహీనతతో భాదపడుతున్నారు.తక్కువ బరువుతో పుట్టడం, ఇతర ఆరోగ్య కారణాలవలన ఆంధ్ర ప్రదేశ్ లో  శిశుమరణాల శాతం కూడా అధికంగానే  ఉంది. 




No comments:

Post a Comment