18 March 2014

ముస్లింలలో ఆమ్ ఆద్మీ పార్టీ కి పెరుగుతున్న ప్రజాదరణ


  
భారత దేశ జనాభాలో 20 కోట్ల వరకు ముస్లింలు ఉన్నారు. యూ‌పి,బిహార్,ఆస్సామ్,పశ్చిమ బెంగాల్,జమ్ము-కాశ్మీర్,మహారాష్ట్ర,ఆంధ్ర ప్రదేశ్ మొదలగు రాష్ట్రాలలో ముస్లిం లు అధికం గానే ఉన్నారు. లోక్ సభ కు చెందిన దాదాపు 80 నియోజక వర్గాలలో  ముస్లింలు 35% కన్నా ఆదికముగా  ఉండి ఎన్నికలను ప్రభావితం చేసే స్థితి లో ఉన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ముస్లిం వోటర్లను ఎరాజకీయ పక్షం నిర్లక్ష్యం చేసే స్థితి లో లేదు.
2014 లో జరగనున్న  16 వ లోక్ సభ ఎన్నికల ప్రచార వాతావరణాన్ని గమనించిన దాదాపు అన్నీ రాజకియ పక్షాలు  ముస్లింల పట్ల తమ దృష్టిని ప్రసరించినట్లు  కన్పిస్తున్నది. ఇంతవరకు హిందుత్వకు ప్రాధాన్యమిస్తూ  ముస్లిం వొట్ల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపక,ఎన్నికలలో ముస్లిం అబ్యర్ధులకు అల్ప ప్రాధాన్యత ఇచ్చే  బి‌జే‌పి కూడా తన విధానాలను మార్చుకొని కొన్ని స్థానాలలో ముస్లిం అబ్యర్ధులను నిలబెట్టుతుంది. పార్టీ అద్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ గతం లో తాము చేసీన తప్పులను మన్నించమని ముస్లిం లను కోరినారు. కాంగ్రెస్స్ అల్పసంఖ్యాక వర్గాల బద్రతకు, సంక్షేమానికి తను చేసిన,చేయ బోతున్న పనులను ఏకరువు పెడుతూ ముస్లిం వోట్ బ్యాంక్ ను నిలబెట్టు కోవడానికి అష్టకష్టాలను పడుతుంది. ముజఫర్ నగర్ అల్లర్లతో ముస్లింలలో తన పట్ల మసక బారిన విశ్వాసాన్ని తిరిగి సాధించడానికి ములాయం ముప్పతిప్పలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా దేశ  రాజకేయ చిత్రపటం పైకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఏవిదంగా ముస్లింలను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తుందో, ముస్లింలలో ముఖ్యంగా నిరుద్యోగం, నైరాశ్యం తో భాద పడుతున్న ముస్లిం యువకులకు ఏవిధంగా ఒక ఆశాజ్యోతి గా మారినధో పరిశీలించుదాము.

వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఒక   యువ చిరు  వ్యాపారి తాను గత  డిల్లీ ఎన్నికలో చేసిన తప్పు ను సరిదిద్దు కోబోతున్నాను అంటున్నాడు.తన ప్రాంతం లోని కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలలో లెక్కలోనికి తీసుకోదగిన పార్టీ కాదు,దానికి వోటు వేయడం దండగా  అని చెప్పిన మాటలను నమ్మి నాను అని కానీ ఈ సారి లోక్ సభ ఎన్నికలో తనకు వస్తున్న అవకాశాన్ని కోల్పోనని,ఆమ్ ఆద్మీ పార్టీ కి తప్పని సరిగా వోటు వేస్తాను అని అంటున్నాడు. వచ్చే లోక్ సభ ఎన్నిక ల సంధర్భం గా  కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఉన్న ఈ  అబిప్రాయమే చాలా మంది ముస్లింలలో కన్పిస్తున్నది. ఇది ఇంతకు పూర్వం అవినీతి నిరోధకానికి కేజ్రీవాల్ చేపట్టిన ఉద్యమం పట్ల ముస్లిం లు చూపిన వైఖరికి ఇది బిన్నంగా ఉంది. ముస్లింలను ఆకర్షించటానికి ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ అవినీతి కన్నా మతోన్మాదం (కమ్యూనలిజం) దేశానికి పట్టిన పెద్ద చీడ అన్నారు.

65 ఏళ్లుగా కాంగ్రెస్స్ కు వోట్ వేసిన ముస్లింలు పొందినది ఏమీలేదని, పైగా 65 సంవత్సరాలు స్వతంత్రబారత దేశం లో ముస్లిలు సాదించినది ఏమీలేదనని, ఇదే విషయాన్ని గోపాల్ సింగ్ కమిటీ, సచార్ కమిటీలు స్పష్టపరిచాయని, సమాజ్ వాది పార్టీ కూడా ముస్లిం లను అడ్డుపెట్టుకొని అధికారాన్ని పొందిన్నదన్న వాస్తవాలను ముస్లిములు గుర్తించాలని ఆం ఆద్మీ పార్టీ తెలిపింది. పైగా బి‌జే‌పి ని అధికారం లోనికి రాకుండా చేయగలేగేది ఆం ఆద్మీ పార్టీ మాత్రమేనన్న భరోసాను ముస్లింలలో కల్పించింది

ముస్లిం లు మెల్లగా  కాంగ్రెస్ కు  దూరం కావటం , బి‌జే‌పి ప్రధాన మంత్రి అబ్యర్ధి  నరేంద్ర మోదిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న తీరును హర్షిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో బలమైన,విశ్వసనీయమైన పార్టీ గా తయారు అవుతుందని ఉన్నత ముస్లిం విద్యావంతులు అబిప్రాయ పడుతున్నారు.సాదారణ ఎన్నికలకొరకు  ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన  61 మండి అబ్యర్ధులలో 11 మంధి ముస్లింలు కావడం ఒక విశేషం. మోదిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న తీరు ముస్లింలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ఠ ను పెంచినది .ముస్లింల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న ప్రత్యేక విధానం అనగా ముస్లిం అబివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వడం  20-40 సంవత్సరాల మద్య వయస్సు ఉన్నముస్లిం లలో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ పదే పదే వల్లించే మత కల్లోలాల భయం కన్నా  ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం అబివృద్ధి విషయాలపై దృష్టి సారించడం కూడా  ఆ పార్టీ వేసిన ముందడుగు చర్య  గా వర్ణించ వచ్చును.

డిల్లీ ఎన్నికలలో ఆం ఆద్మీ పార్టీ ఏర్పర్చిన టాస్క్ ఫోర్స్/ముస్లిం లను ఉద్దేశించి కేజృవాల్ జారీచేసిన ప్రకటనలు  ఆ పార్టీ ని ముస్లింల వద్దకు చేర్చటం లో సఫలమైనవి.చివరకు  సంప్రదాయకం గా కాంగ్రెస్స్ ను సమర్దించే జమాతే-ఏ-ఇస్లామి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ని సమర్ధించ వలసి వచ్చింది. రక్షణ కన్నా అబివృద్ధి అనగా విద్యా,ఆరోగ్యం, ఉపాధి గృహవసతి వంటి సమస్యలను ప్రస్తావించి ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం ప్రజల హృదయాలను కొల్లగొట్టింధి. బి‌జే‌పి,కాంగ్రెస్స్ లకు బిన్నంగా ముస్లింల రక్షణ,ముస్లింలను తృఫిపరచటం,రిజర్వేషన్  వంటి అంశాలను ప్రస్తావించకుండానే, ముస్లింల వెనుకబాటుతనాన్ని, అందుకు అవసరమైన మౌలిఖవసతులను, ముస్లిం ల అబివృద్ధిని, అందుకు చేయవలసిన కృషిని ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలను ఆకర్షించినది. మైనారిటీ లకు తృప్తి పరచడం వంటి విషయాలలో తనకు నమ్మకము లేదని, వాటి బదులు అందరికి సమానవకాశాలు కల్పించుతానని కేజృవల్ అంటున్నాడు.మెరుగైన విద్యావకాశాలు కల్పించడం ద్వార్ ముస్లింల అబివృద్ధికి తోడ్పడుతానని అంటున్నాడు. అధికారం లోనికి వస్తే పబ్లిక్ స్కూళ్ళ కన్నా మెరుగైన విద్యను గవర్నమెంట్ స్కూళ్ళలో భోదిస్తామని అంటున్నారు. 

ఆద్మ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద కేజ్రివల్ తన దేశవ్యాప్త ఎన్నికల పర్యటనలలో భాగం గా  గుజరాత్ లో అబివృద్ధి పేర జరిగిన బూటకపూ ప్రచారాన్ని, అబివృద్ధి ముసుగు లో జరుగుతున్న అవినీతిని,అక్కడివాస్తవాలను వివరించడము  లో పత్రికలు/మీడియా సరియైన పాత్రను వహించడం లేదని విమర్శించారు. 11ఏళ్ల మోడి పరిపాలనలో జరిగిన అబివృద్ధిపేర జరుగుతున్నా ప్రచారం అంతా మీడియా సృష్టి అని వాస్తవాలను ప్రజలకు తెలుపవలసిన బాధ్యత తనపై ఉన్నదన్నారు. మోడి పాలనలో 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, 16000 చిన్న తరహా పరిశ్రమలు మూత పడినాయని,సబ్సిడీలు బంద్ అయినాయి,11% అబివృద్ధి సాదించలేదని, అతి తక్కువ దరకు చదరపు మీటరు 1 రూపాయికి భూమిని పారిశ్రామికవేత్తలకు ఇవ్వవలసి రావడంజరిగినదని, అవినీతి పెరిగిందని  ఆయన అన్నారు. వీటన్నింటినీ మీడియా పట్టిచ్చుకోవడం లేదని, అభివృద్ధి పేర తప్పుడు ప్రచారం జరుతున్నదని అన్నారు. 2002గుజరాత్ మారణకాండ కేసులలో కోర్టులచే క్లీన్ చిట్ పొందిన మోడిని ఆ విషయం పై ప్రస్తావించకుండానే, గుజరాత్ అబివృద్ధి విషయం లో మోడి పేర మీడియా లో మరియు దేశవ్యాప్తం గా జరుగుతున్నఘనమైన అబద్దపు ప్రచారాన్ని ఖండించారు. వాస్తవాలు తెలుసుకోవడానికే గుజరాత్ పర్యటన చేస్తున్నానని, తన ఆరోపణలకు సరియైన సమాధానాలు లబించడం లేదని అన్నారు.

మోడి కంచుకోట ఐనా గుజరాత్ లో అబివృద్ధి పేర జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్న కేజ్రివాల ప్రకటనలను భారతీయ ముస్లింలు  స్వాగతిస్తున్నారు. 2002 మారణకాండను ప్రస్తావించకుండానే, మోడి పేర మీడియా లో మరియు దేశవ్యాప్తం గా జరుగుతున్నాఅబద్దపు ప్రచారాన్నికేజృవాల్   ఖండిస్తున్న తీరును ముస్లింలు మెచ్చుకొంటున్నారు. ఇక మోడి సంగతికి వస్తే మోడిని విజయవంతం గా నిలువరించే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే  ముస్లిం లు నమ్ముతున్నారు.          కేజ్రివాల ముస్లిం ల పట్ల ఎటువంటి అనుకూల ప్రకటనలు చేయన్నప్పటికి ముస్లిం ల అబివృద్ధి పై అతను చేస్తున్నవ్యాఖ్యలు   ముఖ్యం గా ముస్లిం యువతారాన్ని అతనికి దగ్గర చేస్తున్నాయి. గుజరాత్ లోని ఆం ఆద్మీ పార్టీ సమర్ధకులలో ముస్లిం యువకులు ముఖ్యం గా 20-40 మద్య వయస్సు వారు అధికం గా ఉన్నారు. 

యూ‌పి పర్యటనలో కేజ్రివాల పట్ల ముస్లింలు చూపిన ఆదరణ ముస్లింలలో అతనికున్న ప్రాబల్యాన్ని చూపుతుంది. యూ‌పి పర్యటనలో కేజ్రివల్ సభలకు హాజరుఐనవారిలో అధికులు ముస్లింలు,అల్లర్ల భాదితులు.  యూ‌పి లో కాంగ్రెస్స్ ముస్లింలలో తన వోట్ బ్యాంక్ ను ఏనాడో కోల్పోయినది, క్రమంగా సమాజవాది పార్టీ తన వ్యవహార శైలితో,ముజఫర్ నగర్ అల్లర్లతో  ముస్లింల ఆగ్రహానికి గురిఐనది. ముస్లింలలో ములాయం పొగుట్టుకొన్న ప్రతిష్ఠ ను కేజృవాల్ పూర్తి చేస్తున్నారు.నిన్నటివరకు ముస్లిం ల రక్షకుడు మూలాయము  అని నమ్మిన ముస్లిం లు నేడు బి‌జే‌పి ని ఎదుర్కొనే ధీటైన శక్తి ఆం ఆద్మీ పార్టీ కి మాత్రమే ఉందని మరియు మోడి కి సరియైన ప్రత్యర్ధి కేజ్రివల్ అని నమ్ముతున్నారు. ఎన్నికల సమయం లోనే యూ‌పి‌ఏ కు ముస్లిం లు గుర్తుకు వస్తున్నారని ముస్లింలు అంటున్నారు. పార్లమెంట్ చివరి సమావేశాలలోనే మతహింస బిల్లును ప్రవేశపెట్టడం, ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ ల పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ స్టే ఇచ్చినపుడు యూ‌పి‌ఏ దానిని సమర్ధవంతంగా సుప్రేమ్ కోర్ట్ లో ఎదుర్కొలేదనే భావన ముస్లిం విద్యావంతులలో అధికం గా ఉంది. మతకల్లోలాల ప్రస్తావనలకు కాలం చెల్లినదని, అబివృద్ధి ప్రధానమని  ముస్లింలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలనలో ముస్లింలకు ఏమి ఉపయోగం  జరగలేదని, ముస్లిం ల వెనుకబాటుకు అసలు  కాంగ్రెస్ ప్రధాన కారణమని కేజ్రివల్/ఆం ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ముస్లింలు నమ్ముతున్నారు. బి‌జే‌పి-ఆమ్ ఆద్మీ పార్టీ ల మద్య జరిగే  ఎన్నికల పోరాటం  లో కాంగ్రెస్ ను ముస్లింల వోటు చీల్చే పార్టీ గా ముస్లింలు భావిస్తున్నారు.ముస్లింలలో వచ్చిన ఈ పరిణామం వచ్చే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి లాభదాయకంగా మారుతుందని చెప్పవచ్చును. ఆమ్ ఆద్మీ పార్టీ అవతరణ ,వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలను, కాంగ్రెస్ కు గల ముస్లిం వోట్ బ్యాంకు ను కొంతవరకు దెబ్బతిస్తుందని ఖచ్చితం గా చెప్పవచ్చును.

ముస్లిం యువకులు, విద్యావంతులు,  ,ఆలిగర్ ముస్లిం యునివర్సిటీ  ,జామియా విశ్వవిద్యాలము ఉపాద్యాయులు, విద్యార్ధి నాయకులు,పూర్వవిద్యార్ధులు, ముస్లింమేధావులు,మత నాయకులు   క్రమంగా కేజ్రివల్/ఆం ఆద్మీ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. కేజృవల్ బాంబె పర్యటన ముస్లింలలో విజయవంతం కాకపోయినప్పటికి దేశవ్యాప్తం గా ముస్లింలలో ముఖ్యం గా యువకులలో ఆం ఆద్మీ పార్టీ పట్ల ఆసక్తి, ఆమోదం పెరుగుతున్నది. తన పట్ల ఉన్న ఆసక్తిని ఏవిధం గా ఆం ఆద్మీ పార్టీ వోట్ లలోనికి మార్చుకొని, స్థానాలు సంపాదిస్తుందో ముస్లింలు వేచి చూడాలి ముస్లింల మద్దతు తో పాటు ఒక నియోజక వర్గం నుంచి గెలవడానికి ఆ అబ్యర్ధి అనుసరించే విధానాలపై కూడా  ఆమ్ ఆద్మీ పార్టీ విజయాలు ఆధార పడి ఉంటాయాని చెప్పవచ్చును. ఏది ఏమైనా ముస్లిం ల మద్దత్తు పొందటం లో ఆమ్ ఆద్మీ పార్టీ సఫలమైనది అని మరియు ముస్లిం లకు మరొక ప్రత్యాన్నము అది ముస్లిం అబివృద్ధి ప్రధానం గా ఉండేది లబించినదని చెప్పవచ్చును.

.
.












No comments:

Post a Comment