22 April 2017

ఇస్లామిక్ స్వర్ణ యుగం (The Golden Age of Islam)




"ముస్లింలు కానప్పటికీ, పురాతన ఆచార్యుల నుండి తర్కం నేర్చుకోవాలి." ఇబ్న్ రష్ద్ (అవర్రోస్)
ప్రపంచ చరిత్రలో ఇస్లామిక్ స్వర్ణ యుగం లేదా   ముస్లిం పునరుజ్జీవన యుగం అనేది అద్భుతమైన, ప్రసిద్దిచెందిన  యుగం. ఈ యుగం లో ఇస్లామిక్/ముస్లిం  భూభాగాలు అత్యంత మేధావులైన కొంతమంది ఆలోచనాపరులకు జన్మనిచ్చినవి. తొమ్మిదవ మరియు 13 వ శతాబ్దాల మధ్య, బాగ్దాద్ (బైట్ అల్-హిక్మా), డమాస్కస్ (అల్-జాహిరియా), టింబక్టు (సాంకోరే), కార్డోబా (రాయల్ మస్జిద్) మరియు కైరో (దార్ అల్-హిక్మా)లోని  గ్రంథాలయాలు మొత్తం గ్రీక్ ప్రపంచంలో కంటే ఎక్కువ లిఖిత ప్రతులు మరియు సాహిత్యం కలిగి ఉన్నవి.

 చైనా  నుంచి నేర్చుకొన్న కాగితం తయారి మరియు ప్రపంచ యాత్రికులనుంచి గ్రహించిన అనువాద నైపుణ్యాలతో ఇస్లామిక్ పండితులు బహుముఖ విజ్ఞాన శాస్త్రవేత్తలుగా, ప్రతిభా వంతులు గా  మారారు.  గోళాకార త్రికోణమితి, వ్యవసాయం, భౌతికశాస్త్రం, ఔషధం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేశారు, ఖగోళశాస్త్రజ్ఞులు ఖగోళ పట్టికలను ఉపయోగించి నక్షత్రాల ఎత్తును కొలిచేందుకు ఆధునిక ఖగోళ వేధశాలను ఏర్పాటు చేశారు.
చీకటి యుగాలలో  యూరోప్ క్షీణిస్తున్నప్పుడు మరియు చర్చి మూఢ నమ్మకాలతో  విజ్ఞాన శాస్త్రాన్ని అవహేళన చేస్తున్నప్పుడు ఇస్లామిక్ పండితులు మానసిక  ఆసుపత్రులను, సంచార వైద్యశాలలను  ఏర్పాటు చేశారు. టోలెమిని సరిదిద్దడం, భూమి యొక్క చుట్టుకొలతను నిర్ధారిoచారు. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి, మశూచి , చికెన్ ఫాక్స్ లేదా తట్టు నివారణకు టికాలు వేయడం ప్రారంభించారు.
 రోగులకు  కైరోలోని కలావన్ వైద్యశాలలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ క్రింద సేవలు అందించబడేవి. అవిర్రోస్ మరియు అవిసెన్న గ్రీక్ తత్వ శాస్త్రమును సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ముస్లిం ప్రపంచం లో అక్షరాస్యత అధికం గా ఉంది.  సింద్ బాద్ మరియు అలీ-బాబా ప్రపంచానికి అభిమాన వ్యక్తులుగా మారారు.  డియోఫాంటస్, ఆర్యాభట్ట, ఆర్కిమెడెస్, బాదుయానా సిద్దాంతాలు ప్రచురితం పొందినాయి. "అల్గోరిథం " ఉపయోగించిన  ఆల్-ఖర్విజ్మి ఆల్జీబ్రా పితామహుడిగా   పేరుగాంచాడు.
ఇస్లామిక్ స్వర్ణయుగం   మహిళలకు అత్యంత ప్రాధ్యాన్యత ఇచ్చింది.  మూరిష్ స్పెయిన్లో అనేకమంది స్త్రీ విద్వాంసులు ఉన్నారు మరియు అవిర్రోస్ స్త్రీ సమానత్వం గురించి బహిరంగ చర్చను లేవనేత్తినాడు.  అవిర్రోస్  తన  తహఫత్ అల్-తహాఫత్ (Incoherence of Incoherence) లో అరిస్టాటిల్ తత్వశాస్త్రం కు బలమైన సమర్ధకునిగా నిలిచాడు మరియు అరబిక్ ప్రపంచo లో  తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రంను సమన్వయ పరిచాడు. నియోప్లాటోనిజం మరియు మాలిక్ ఇబ్నె అనస్ భావాల  ద్వారా విశ్వం యొక్క అంతిమ అవగాహన కోసం కృషి చేసాడు. అల్-ఘాజలి మరియు అవేర్రోస్ సమగ్రమైన మానవ హక్కుల కోసం పోరాడారు.

దురదృష్టవశాత్తు క్రైస్తవులు స్పానిష్ మూర్స్ కు  వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు, హులగ్ ఖాన్ నాయకత్వం లో మంగోలుల దండయాత్రలు ఇస్లామిక్ విజ్ఞాన భాండాగారాలను  దహనం చేసినవి  మరియు అరబ్ నాగరికత మరియు విజ్ఞానంను ద్వంసం చేసినవి. ఈవిధంగా 13వ శతాబ్దం లో అరబ్/ముస్లిం నాగరికత,విజ్ఞాన వికాసమ  క్షిణిoచి యూరప్ లో సాంస్కృతిక పునర్జీవన చాయలు ప్రారంభమైనవి.
ఒకప్పుడు విజ్ఞాన స్వర్ణ యుగంకు ప్రతీకలుగా నిలిచిన అరబ్ ప్రపంచం లోని ప్రభుత్వాలు నేడు తమ జాతియాదాయం లో కేవలం 0.2% మాత్రమే విజ్ఞానం, పరిశోధన మరియు అభివ్రుద్ది రంగాలకు కేటాయిస్తున్నాయి. మొత్తం ఇస్లామిక్ ప్రపంచం లో  కేవలం 500 విశ్వవిద్యాలయాలు మాత్రమె ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 100 ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాల్లో ఒక్కటి కూడా అరబ్ ప్రపంచం లో లేదు.  ఉన్నత విద్య ప్రమాణాలు క్షీణించినవి. 1901 నుండి, ఇద్దరు ముస్లింలు మాత్రమే సైన్స్ లో నోబెల్ బహుమతిని పొందారు.  ఇస్లామిక్ దేశాల్లో  పురుషుల ప్రస్తుత అక్షరాస్యత రేట్లు ఆఫ్గనిస్తాన్లో 43 శాతం, పాకిస్తాన్లో 58 శాతం, ఈజిప్ట్లో 70 శాతం, మాలి, సెనెగల్ మరియు గినియా లో 30-40 శాతం వరకు ఉన్నాయి. మహిళా అక్షరాస్యత వెనుకబడి  ఉంది
ఈ గణాంకాలు ఒక ముస్లిం హృదయాన్ని  బద్దలు చేస్తాయి. మధ్య ప్రాచ్యం, తూర్పుదక్షిణ ఆసియా  మరియు ఆఫ్రికా లోని ముస్లిం ప్రపంచం అంతటా హింస, లింగ అసమానత ప్రబలoగా  ఉన్నాయి. సుదూర భవిష్యత్తులో తిరిగి అరబ్/ఇస్లామిక్ ప్రపంచం లో మేధో అభివృద్ది, విజ్ఞాన అభివృద్ధి వెలుగులోకి రావచ్చని ఆశిద్దాము.


21 April 2017

నాగరికత వికాసానికి ముస్లిం చేసిన సేవలు (Muslim Contributions to Civilization)

.

ఇస్లాం యొక్క ప్రముఖ విమర్శకుడు సామ్ హారిస్, ఇటీవలి వ్యాసంలో పాకిస్థాన్ విద్యా కార్యకర్త మాలాలా యూసఫ్ జాయిని "1,000 సంవత్సరాల్లో ముస్లిం ప్రపంచం నుంచి బయటకు వచ్చిన  గొప్పదనం" అని సూచించాడు. అనగా మలాలా తోటి ముస్లింలు వెనుకబడినవారు మరియు ఆమె దర్మం ఇస్లాం మార్పు లేదా పురోగతికి దోహదపడదు అని అర్ధము.

హారిస్, అతని లాంటి ఇతరుల నమ్మకాలకు విరుద్ధంగా ముస్లింలు నాగరికత అభివృద్ధి కి  విపరీతమైన కృషి చేసారు. నిజానికి ఇస్లాం ధర్మం జ్ఞానం కు అధిక ప్రాధాన్యత నిచ్చును. ప్రపంచ చరిత్రలో ప్రధాన ధోరణులను లేదా సంఘటనలను మర్చిపోయిన లేదా విస్మరించిన వ్యక్తులు "చారిత్రాత్మక స్మృతి“historical amnesia " తో  బాధపడుతున్నారని చెప్పవచ్చు. హారిస్ మరియు ఇతరుల చేత చేయబడిన కొన్ని సాధారణీకరణలు మరియు దురదృష్టాలను తొలగించాలని నేను ఆశిస్తున్నాను. ముస్లింలు శతాబ్దాల కాలం లో నాగరికతకు చేసిన సేవలను వివరిస్తాను.
1.విద్యారంగానికి చేసిన సేవలు Contributions to Education:
ప్రపంచవ్యాప్తం గా సార్వత్రిక విద్య కోసం  మాలాల చేసిన విజ్ఞప్తి వెనుక విద్య రంగంలో ముస్లింలకు   సుదీర్ఘ మరియు సగర్వమైన  చరిత్ర ఉంది. ఫాతిమా మరియు మిరియం అల్ ఫిర్హి అనే ఇద్దరు ముస్లిం మహిళలు, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయo అల్-ఖరావయ్యిన్(Al-Qarawiyyin) ను 859 AD లో మొరాకో లోని ఫేజ్ నగరం లో స్థాపించారు. ఇక్కడ  అనేక సంవత్సరాలుగా విద్యార్థులు లౌకిక మరియు మతపరమైన అంశాలలో శిక్షణ పొందేవారు. వారి విద్యాబ్యాసం పూర్తి అయిన తరువాత   చివరిలో పరిక్షలు నిర్వహించి వారి ప్రతిభ   ఆధారంగా డిగ్రీలను ప్రదానం చేసేవారు. విద్యారంగం లో డిగ్రీలను ప్రధానం చేసే భావన ఫెజ్ నుండి అండలూసియా, స్పెయిన్ మరియు తరువాత ఇటలీ  లోని బోలోగ్నా విశ్వవిద్యాలయo మరియు ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ మరియు ఇతర ప్రదేశాలకు  వ్యాపించింది.
అండలూసియాకు చెందిన స్పానిష్ ముస్లింలు విద్యకు బలమైన మద్దతుదారులుగా ఉండేవారు  మరియు చీకటి యుగాలలో యూరప్ ను  కప్పి ఉంచిన అంధకార ముసుగును  తొలగించడానికి వీరు తోడ్పడ్డారు.  8వ మరియు 15వ శతాబ్దాల మధ్య అండలూసియా విద్య మరియు జ్ఞానాలకు ప్రపంచ కేంద్రంగా ఉంది. కార్డోబా, గ్రెనడా మరియు సెవిల్లె వంటి స్పానిష్ విశ్వవిద్యాలయాలు ముస్లిo ఆచార్యుల నుండి  విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకున్న క్రైస్తవ మరియు యూదు విద్యార్థులను కలిగి ఉన్నాయి. ముస్లిం స్పెయిన్లో అధ్యయనం చేయటానికి మహిళల ను ప్రోత్సహించారు. ఈ విద్యా వాతావరణం లేకుండా  సహనశీలత అనే భావన  నేడు "పాశ్చాత్య ప్రపంచం" ను చేరుకోనేది కాదు.  
2.తత్త్వ శాస్త్ర అభివృద్ధి కి చేసిన సేవలు (Contributions to philosophy):
8 వ శతాబ్దంలో గ్రీక్ తత్వశాస్త్రం యొక్క సంపుటాలను ముస్లిం పండితులు వారసత్వంగా పొందినప్పుడు ప్రపంచ నాగరికత అభివృద్ధి   మొదలైంది. ప్రాచీన గ్రీస్ గ్రంథాల జ్ఞానం ముస్లిం పండితులచే లాటిన్ నుండి అరబిక్ కు  అనువదించబడి  ప్రపంచ చరిత్రలో గొప్ప జ్ఞాన సంపదను  సృష్టించింది. ముస్లిం పండితులు సోక్రటీస్, అరిస్టాటిల్ మరియు ప్లాటో వంటి గొప్ప గ్రీకు తత్వవేత్తలను  ఐరోపా పండితులకు  అందుబాటులోకి తెచ్చారు.   గ్రీక్ తత్వశాస్త్రం ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించబడింది. ముస్లింలు ఐరోపా పునరుజ్జీవనోద్యమం మరియు జ్ఞానోదయం వెనుక ప్రధాన పాత్ర వహించారు. గ్రీకు తత్వశాస్త్రం ను పునరుత్థానం చేసి మత సిద్ధాంతాలతో మరియు రక్తపాత అంతర్గత విభేదాలతో నిండి ఉన్న  ఐరోపా ఖండానికి  నూతన జీవితాన్ని ఇచ్చారు.
అనేకమంది ముస్లిం పండితులు జ్ఞానం సంపాదించుట  తమ జీవిత లక్ష్యoగా  చేసుకున్నారు. 11 వ మరియు 12 వ శతాబ్దాలలో తోలి ఇస్లామిక్ తత్వశాస్త్రాన్ని విప్లవాత్మకమైనదిగా రూపొందించిన అల్-గజాలి ఒక సూఫీ ముస్లిం.  గ్రీకు తత్వశాస్త్రం యొక్క "ఆధ్యాత్మిక" లేదా "మతపరమైన" వివరణగా వర్ణించబడే నియోప్లాటోనిజం అభివృద్ధికి ఇతను  సహాయపడినాడు.  అల్-ఘజాలి రచనల  సమయంలో ముస్లిం తత్వవేత్తలు, పురాతన గ్రీస్ యొక్క ఆలోచనల గురించి చదివారు. అయితే ఈ ఆలోచనలు సాధారణంగా ఇస్లామిక్ బోధనలకు  విరుద్దo గా ఉన్నాయి. అల్-ఘజాలి అరిస్టాటిల్ తర్కం మరియు నియోప్లాటోనిక్ మార్గాల పద్ధతులను అనుసరింఛి   ఈ అంశాలను ఇస్లామిక్ తత్వం తో  సంయోగం చేసేందుకు దోహదపడినాడు.
ఇబ్న్ ఖాల్డన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ముస్లిం ఆలోచనాపరులలో ఒకరు. 14 వ మరియు 15 వ శతాబ్దాల వరకు ఉన్న గొప్ప చరిత్రకారులలో ఒకరిగా మరియు సామాజిక శాస్త్రాల స్థాపకుడిగా గుర్తింపు పొందిన ఇబ్న్ ఖాల్డన్ ముకద్దీమా రచించినాడు. ఆధునిక సుపరిపాలన మార్గం సుగమం చేశాడు.  "ప్రజల మంచి కోసం సార్వభౌమత్వం ఉంది మానవులు  కలిసి జీవించాల్సిన అవసరం నుండి  ఒక పాలకుని  యొక్క అవసరం ఏర్పడుతుంది. పాలకుడు శాంతి బద్రతలను పరిరక్షించబోతే సమాజం ముక్కలుగా విరిగిపోతుంది అని అంటాడు. ఆంగ్ల సామాజిక ఒడంబడిక వాదుల పై ప్రభావం కలిగినాడు.
3.ఆరోగ్య సంరక్షణకు కృషి Contributions to health care:
విద్య మరియు విశ్వవిద్యాలయ వ్యవస్థతోపాటు, ముస్లింలచే నాగరికతకు అందించబడిన వైవిధ్యమైన సహకారం  వైద్యం. ఈజిప్ట్ లోని కైరోలో 872 లో, అహ్మద్ ఇబ్న్ తులున్ హాస్పిటల్ స్థాపించబడినది. ఇది ఇతర ఇతర ఇస్లామిక్ ఆసుపత్రులకు మార్గదర్శకం.  ఈ వైద్యశాలలో ఎటువంటి వివక్షత లేకుండా అందరికి ప్రవేశం కల్పించబడినది.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి  కూడా  ప్రవేశం ఉంది. .
తులన్ వైద్యశాల స్థాపించబడిన  వంద సంవత్సరాలు తర్వాత. "శస్త్రచికిత్స యొక్క తండ్రి" గా పిలువబడే అల్-జహ్రావి అనే ఒక సర్జన్ మరుసటి 500 సంత్సరాల పాటు యూరోపియన్ సర్జన్లకు మార్గదర్శిగా ఉపయోగపడిన గ్రంధం రచించినాడు.  స్కాల్పెల్స్, ఎముక కోసే రంపం , మరియు ఫోర్సెప్స్ వంటి అల్-జరావి యొక్క శస్త్రచికిత్సా పరికరాలు ఇప్పటికీ ఆధునిక శస్త్రవైద్యులు ఉపయోగిస్తున్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ను  నిర్వహించిన మొట్టమొదటి శస్త్రవైద్యుడు అల్-జహ్రావి.

విలియం హార్వే కనుగొన్న రక్త ప్రసరణ గురించి ముస్లిం మతాధికారి ఇబ్న్ నఫిస్ దాదాపు మూడు వందల సంవత్సరాల ముందు 13 వ శతాబ్దంలో వివరించినాడు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించడానికి శరీరంలో ఒక యాంటీజెనిక్ పదార్ధం తయారుచేసే టీకా పద్దతిని  ముస్లింలు మొదట రూపకల్పన చేసారు. టీకా  యొక్క పరిచయం ఇంగ్లాండ్ లో టర్కిష్ రాయబారి యొక్క భార్య 1724 లో యూరప్ కు తీసుకువచ్చింది.

శరీర శుబ్రతకు ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముస్లిం శాస్త్రవేత్తలు సోడియం హైడ్రాక్సైడ్ మరియు వేజటబుల్ నూనె ను సుగంధ ద్రవ్యాలతో కలిపి సబ్బు తయారు చేసారు. ఇంగ్లాండ్ కు షాంపూ పరిచయం చేసినది ముస్లింలే.

4.విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కి  తోడ్పాటు Contributions to science:
ఖగోళ శాస్త్రం అభివృద్ధి ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తల కృషి ఎంతైనా ఉంది. 9వ శతాబ్దం ప్రారంభంలో, ఖలీఫా అల్-మౌంమ్ బాగ్దాద్ లో   మరియు డమాస్కస్ లో ఖగోళ వేధశాలను స్థాపించాడు. ఐదు వందల సంవత్సరాల తరువాత, 1420 లో ప్రిన్స్ ఉల్గ్ బే, సమార్ఖండ్ లో  ఒక భారీ వేధశాలని నిర్మించారు, తరువాత 1577 లో ఇస్తాంబుల్ లో  సుల్తాన్ మురాద్ III మరొక అబ్జర్వేటరీ నిర్మించినాడు.  
.ఒట్టోమన్లు ​​ ప్రధాన ఖగోళ వేదశాలలు కలిగి ఉన్నారు. 16వ శతాబ్దపు  ఒట్టోమన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు తక్కి అల్-దిన్ ఖగోళ పట్టికలు మరియు ఖగోళ పరిశీలనా సాధనాలను సృష్టించాడు. ఇది నక్షత్రాల అక్షాలు మరియు వాటి మధ్య ఉన్న దూరాన్ని కొలిచేందుకు సహాయపడింది.
ఆధునికకాల రసాయన శాస్త్రజ్ఞులు ఉపయోగించే అనేక ప్రాధమిక ప్రక్రియలు మరియు ఉపకరణాలను కనిపెట్టడం ద్వారా ముస్లింలు రసాయనిక  శాస్త్ర వికాసానికి తోడ్పడ్డారు.

ఆధునిక కెమిస్ట్రీ స్థాపకుడైన జబీర్ ఇబ్న్ హేయాన్, ఆండలూసియాలో 8 వ మరియు 9 వ శతాబ్దాలలో, స్వేదనం ద్వారా రసాయన శాస్త్రంలోకి రసవాదాన్ని  రూపాంతరం చెందించడం లేదా బాయలింగ్ పాయింట్స్ లో మార్పులు చేయడం ద్వార ద్రవాలను  వేరుచేయడం చేసాడు.  స్ఫటికీకరణ, ఆవిరి మరియు వడపోత ప్రక్రియలను అభివృద్ధి చేయటంతోపాటు, అతను సల్ఫ్యూరిక్ మరియు నైట్రిక్ ఆమ్లం కూడా కనుగొన్నాడు. చరిత్రకారుడు ఎరిక్ జాన్ హోల్మియార్డ్ జబీర్ ఇబ్న్ హేయన్ యొక్క పని ఆదునిక రసాయన వేత్తలైన రాబర్ట్ బోయెల్ మరియు ఆంటోయిన్ లావోయిసియర్ కంటే మిన్న అని పేర్కొన్నారు.

9 వ శతాబ్దంలో ఆండలూసియా యొక్క ఒక ముస్లిం ఇంజనీర్ ఇబ్న్ ఫిర్నాస్ ప్రపంచం లో మొట్టమొదటి విమాన చోదకుడు. 852 లో స్పెయిన్లోని కార్డోబాలోని పెద్ద మస్జిద్  యొక్క మినార్ నుండి చెక్క పట్టీలకు కట్టిన వదులైన వస్త్రాన్ని ఉపయోగింఛి దూకుతాడు. ఆవిధంగా  అతను మొదటి పారాచూట్ ను సృష్టించాడు.

ముస్లింలు ఫ్లైయింగ్ మరియు ఏవియేషన్ శాస్త్రానికి దగ్గిరగా ఉండే   భౌతిక శాస్త్ర అధ్యయనం, లో నిపుణులు. తన కృషికి 1979 నోబెల్ బహుమతిని పొందిన మొహమ్మద్ అబ్దుస్ సలాం, ఒక పాకిస్తాని సైద్ధాంతిక (theoretical) భౌతిక శాస్త్రవేత్త. అతను సైద్ధాంతిక భౌతిక శాస్త్ర రంగంలో, ప్రత్యేకంగా విద్యుదయస్కాంత మరియు బలహీనమైన శక్తులను ఏకీకృతం చేసారు.


ఇంతవరకు నేను ముస్లింలు నాగరికత అభివృద్ధికి అందించిన రచనల ఉపరితలం భాగాన్ని మాత్రమే సృజించాను.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు  ముస్లింలు వెనుకబడిన మరియు దుష్ప్రవర్తన కలవారు అన్న భావన తొలగించడానికి  ఈ రచనల గురించి నేర్పించాలి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు విద్య, ఔషధం మరియు ఇతర విజ్ఞానశాస్త్రాలలో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి.  జ్ఞానం కోసం మార్గదర్శకులుగా వారి సాంప్రదాయాన్ని కొనసాగిoచాలి.

ఇస్లామీయ స్వర్ణయుగం నాటి ప్రముఖ ఇస్లామిక్ తత్వవేత్తలు (Islamic Political Thinkers in Arabic Golden Ag


ఇస్లామీయ స్వర్ణయుగంను   ఇస్లామీయ పునరుజ్జీవనము అని కూడా పిలుస్తారు,  సాంప్రదాయకంగా ఈ యుగం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకూ కానవస్తుంది. కొందరైతే దీనిని 15వ శతాబ్దం వరకూ పొడిగించారు. కొందరైతే 16వ శతాబ్దం వరకూను. ఈకాలంలో ఇస్లామీయ ప్రపంచం లోని ఇంజనీర్లు, పండితులు, వర్తకులూ; కళలకూ, వ్యవసాయానికి, విత్తశాస్త్రానికి, పరిశ్రమలకు, న్యాయశాస్త్రానికి, సాహిత్యానికి, నావికానికి, తత్వానికి, శాస్త్రాలకూ మరియు సాంకేతికరంగానికీ తమ తోడ్పాటునందించారు. తమ సాంప్రదాయక శాస్త్రాలకు స్థానమిస్తూనే కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టారు. హౌవర్డ్ R. టర్నర్ ఇలా వ్రాస్తాడు: "ముస్లిం కళాకారులూ, శాస్త్రజ్ఞులూ, రాకుమారులూ మరియు కార్మికులూ అందరూ కలసి ఒక కొంగ్రొత్త సంస్క్రతికి నాంది పలికి దాని ముద్రను అనేక ఖండములలో గల అనేక సమాజాలపై వేశారు.
ఇస్లామిక్ తత్వశాస్త్రం ను పరిశిలించిన ఇస్లామిక్ ప్రపంచం లో తాత్విక ఆలోచనాపరులు చాలా మంది కనిపిస్తారు. వారిని గురించి తెలుసుకోవడం వారి రచనలను అధ్యయనం చేయడం ద్వారా ఇస్లామిక్ సమాజం యొక్క మేధో స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. నేను ముస్లింలందరికీ ఐదుగురు ముస్లిం తత్వవేత్తలను సిఫార్సు చేయాలనుకుంటున్నాను. ఈ పరిచయం తగినంత ఆసక్తిని ఉత్పన్నం చేస్తుంది, తద్వారా ప్రజలు వారిని చదవడం ప్రారంభించవచ్చు.
ఈ గొప్ప తత్వవేత్తల రచనలను చదవడానికి తత్వశాస్త్రం యొక్క విద్యార్థి లేదా గురువుగా ఉండవలసిన అవసరం లేదు. వారి రచనల యొక్క సంక్లిష్టత మరియు ఆడంబరం, ఇస్లామిక్  స్వర్ణ యుగం యొక్క నాణ్యతకు సూచనగా చెప్పవచ్చు. అందరు విద్యావంతులైన ముస్లింలు వారి వారసత్వాన్ని వారి మేధో సంపదను తెలుసుకోవాలి. వారి రచనల యొక్క పఠనం ఇస్లామిక్ నాగరికత యొక్క విశాలమైన మేధో హద్దులను గ్రహించడంలో మనకు సహాయం పడవచ్చు.
ఇస్లామిక్ స్వర్ణ యుగం నాటి ప్రసిద్ద తత్వవేత్తలు
1.ఆల్-కిండి:
లాటిన్ లో(Latin: Alkindus) అల్కిన్డుస్ లేదా అల-కిండిగా పిలువబడే అబు యూసుఫ్ య'అక్యుబ్ ఇబ్న్ 'ఇస్సాఖ్ అద్-సబ్బ అల్-కిన్ది(Arabic: أبو يوسف يعقوب بن إسحاق الصبّاح الكندي‎‎,  ( 801–873 AD), ఒక ముస్లిం అరబ్ తత్వవేత్త, బహుముఖు ప్రజ్ఞాశాలి , గణిత శాస్త్రజ్ఞుడు, వైద్యుడు మరియు సంగీతకారుడు.


అల్-కిండి కింది తెగకు చెందినవాడు. అతను బస్సాలో జన్మించాడు మరియు బాగ్దాద్లో చదువుకున్నాడు.  అల్-కిండి ని హౌస్ ఆఫ్ విస్డం(wisdom) లో  అబ్బాసిద్ ఖలీఫాలు  అరబిక్ భాష లోకి గ్రీకు శాస్త్రీయ మరియు తాత్విక గ్రంథాల అనువాదాన్ని పర్యవేక్షించేందుకు నియమించారు. "ప్రాచీన తత్వవేత్తల "  ( మొదట్లో ముస్లిం పండితులు గ్రీకు తత్వశాస్త్రన్ని ఆ విధంగా పిలిచేవారు.) పరిచయం అతని మేధో అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది మరియు అతడు వందలాది ఒరిజినల్ (వాస్తవమైన) గ్రంథాలను, గణితము, ఖగోళ శాస్త్రం, ఔషధ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం మరియు ఆప్టిక్స్, వాతావరణ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జంతు శాస్త్రం   గురించి వ్రాయటానికి దారితీసింది.

గణితశాస్త్ర రంగంలో, అల్-కిండి భారతీయ అంకెలను ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ ప్రపంచానికి పరిచయం చేయటంలో ముఖ్య పాత్ర పోషించారు. అతను గూఢ లిపి విశ్లేషణలో  మార్గదర్శకుడు మరియు  అనేక సాంకేతికలిపులను,  నూతన పద్ధతులను రూపొందించాడు. తన గణిత మరియు వైద్య నైపుణ్యం ఉపయోగించి, వైద్యులు ఔషధాల యొక్క శక్తిని గణించడాన్ని  అభివృద్ధి చేయగలిగాడు.
అల్-కిండి యొక్క తత్వసంబంధ రచనలకు ముఖ్య ఉద్దేశ్యం తత్వశాస్త్రం మరియు ఇతర "సనాతన" ఇస్లామిక్ శాస్త్రాలు, ముఖ్యంగా వేదాంతశాస్త్రం మధ్య అనుకూలత పెంపొందించడం. ఆయన రచనలలో అనేకమైనవి వేదాంతశాస్త్రంలో ఆసక్తి కలిగి ఉన్న అంశాలతో నిండి ఉన్నవి. వీటిలో అల్లాహ్ స్వభావం, ఆత్మ మరియు ప్రవచనాత్మక జ్ఞానం ఉన్నాయి. ముస్లిం మేధావులకు అందుబాటులో ఉన్న తత్వశాస్త్రాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ, అతని స్వంత తాత్విక ఉత్పత్తి అల్-ఫరాబిచే కప్పివేయబడింది మరియు ఆధునిక పండితుల పరిశీలన కోసం అతని పాఠాలు చాలా తక్కువగా ఉన్నాయి.

అల్-కిండి అనేక రకాలైన ఆలోచనలకు  గురువుగా ఉన్నారు మరియు అతని కాలంలోని గొప్ప ఇస్లామిక్ తత్వవేత్తలలో ఒకరిగా ఉన్నారు.

ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ పండితుడు  జిరాలోమో కార్డానో (1501-1575) అతనిని మధ్యయుగాల యొక్క పన్నెండు మంది  గొప్ప తత్వవేత్తలలో ఒకడిగా భావించారు. ఇబ్న్ అల్-నడిమ్ ప్రకారం, అల్-కిండి కనీసం రెండు వందల అరవై పుస్తకాలు రాశారు, జ్యామితి (ముప్పై రెండు పుస్తకాలు), ఔషధం మరియు తత్వశాస్త్రం (ఇరవై రెండు పుస్తకాలు), తర్కం (తొమ్మిది పుస్తకాలు), మరియు భౌతిక శాస్త్రం పన్నెండు పుస్తకాలు).

భౌతికశాస్త్రం, గణితం, ఔషధం, తత్వశాస్త్రం మరియు సంగీతం యొక్క రంగాలలో అతని ప్రభావం చాలా శతాబ్దాల కాలం వరకు కొనసాగింది. అతని పుస్తకాలు  చాలా వరకు కోల్పోయినప్పటికీ,  గెరార్డ్ అఫ్ క్రెమోనియా ద్వారా లాటిన్ అనువాదాల రూపంలో మరియు ఇతరుల ద్వారా  అరబిక్ లిఖిత ప్రతులలో తిరిగి కనుగొనబడ్డాయి; ముఖ్యంగా, ఇరవై  శతాబ్దం మధ్యకాలంలో ఒక టర్కిష్ లైబ్రరీలో అతని కోల్పోయిన రచనల్లో ఇరవై నాలుగు దొరికాయి.

ఇస్లామిక్ వేదాంతం అభివృద్ధికి ఆయన చేసిన గొప్ప కృషి గ్రీకు ఆలోచనను ముస్లిం ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం. బాగ్దాద్ లో  అబ్బాసిద్ కాలిఫాలచే  ప్రోత్సహించబడిన (బైత్ అల్-హిక్మా) నుండి అల్-కిండీ తన కార్యకలాపాలు నిర్వహించాడు.  అనేక ముఖ్యమైన గ్రంథాలను అనువాదం చేయడంతోపాటు అల్-కిండి ప్రామాణిక అరబిక్ తాత్విక పదజాలం రూపొందించాడు. అతడి ప్రభావం అల్ ఫరాబి, అవిసెన్నా మరియు అల్-గజాలి వంటి తత్వవేత్తల పై ఉంది.
తన రచనలలో ఆల్-కిండి ఒక వైపున తత్వశాస్త్రం మరియు సహజ వేదాంతాల మధ్య అనుకూలతను చూపడమే కాక మరోవైపు వెల్లడి లేదా ఊహాజనిత వేదాంతశాస్త్రంను  ప్రదర్శించాడు.(వాస్తవానికి అతను ఊహాత్మక వేదాంతశాస్త్రంను తిరస్కరించాడు). అతను కారణాన్ని జ్ఞాన జ్ఞానం యొక్క గొప్ప మూలం అని విశ్వసించాడు, అతని తాత్విక పద్ధతి ఎల్లప్పుడూ అసలు కానందున  తరువాత ఆలోచనాపరులు (అతను అరబిక్ భాషలో వ్రాసిన మొట్టమొదటి తత్వవేత్త అయినందున)  అతనిని వివాదాస్పదంగా పరిగణించారు. అతను విజయవంతంగా అరిస్టాటిల్ మరియు (ముఖ్యంగా) నూతన-ప్లాటోనిస్ట్ ఆలోచనలను ఇస్లామిక్ తత్వశాస్త్రం లో చేర్చాడు. ఇది  ముస్లిం మేధావి ప్రపంచంలో గ్రీకు తత్వశాస్త్రం యొక్క పరిచయం మరియు ప్రాచుర్యంలో ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.

2.అల్-ఫరాబి (872-951 AD)Al-Farabi (872-951 AD)  

అరబిక్ లో అల్-ముఅల్లిం  అల్-థానీగా పిలువబడే అబూ నసర్ ముహమ్మద్ అల-ఫరాబి ను  “ఇబ్న్ సిన మరియు అవర్రోస్లతో(Averroes) పాటు ముస్లింలలో పెర్పిటెటిక్స్(Peripatetics) లేదా హేతువాది” గా గుర్తించారు. అతను తన పుస్తకం "రెండు తత్వవేత్తల ఆలోచనలు సేకరించడం" ("The gathering of the ideas of the two philosophers") లో ప్లేటో మరియు అరిస్టాటిల్ యొక్క ఆలోచనలను సేకరించేందుకు ప్రయత్నించాడు. ఫరాబి ప్రపంచం లో రెండవ ఉపాధ్యాయుడు (“the second master" of philosophy)  (అరిస్టాటిల్ మొదటివాడు) మరియు ప్రపంచం యొక్క గొప్ప తత్వవేత్తలలో ఒకడుగా పిలువబడతాడు. అతని రచనలు  అలెగ్జాండ్రియన్ తాత్విక ఆలోచనను పునరుద్ధరించడం మరియు నూతన రూపు ఇవ్వడానికి అంకితం చేయబడినవి.
అరిస్టాటిల్ మరియు ప్లాటోనిక్ ఆలోచనల విశ్లేషణ లో  అతని కృషి గొప్పది  మరియు ఇస్లామిక్ ప్రపంచం ఈ సెంట్రల్ ఆసియన్ తత్వవేత్తకి ఎంతోగా   రుణపడి ఉంది. అతను గ్రీకు తత్త్వ శాస్త్రాన్ని అభివృద్ధి పరచినాడు. అతను తత్వశాస్త్రం, గణితం, సంగీతం, మెటాఫిజిక్స్ మరియు  రాజకీయ తత్త్వశాస్త్రంలో ఘటికుడు మరియు  అతని రచనలు ఆయా శాస్త్రాలలో  ప్రామాణికాలుగా పరిగణించ బడాతాయి.  రాజకీయ తత్త్వ శాస్త్రంలో అతడి అతి ముఖ్యమైన పుస్తకం “అరా అహ్ల్ అల్ మదీనా అల్-ఫాయీల”. (అత్యంత ఉన్నత  ప్రమాణాలు కల నగర ప్రజల అభిప్రాయలు) (The Views of the People of The Virtuous City).
తన ఉన్నత/సంపన్న ప్రమాణాలు కల నగరం(Virtuous City) ను, ఆల్-ఫరాబి  ప్లాటో రిపబ్లిక్ లో మాదిరి ధర్మం పై ఆధారపడిన నగరం గా వివరిస్తాడు. దానిలో అతను  పౌరుల అంతిమ సంతోషాన్ని కోరుకుంటాడు మరియు తత్వవేత్తల జ్ఞానోదయ దృక్పథాలతో మార్గనిర్దేశం చేస్తాడు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన సుగుణాలను పరిశీలించిన మొట్టమొదటి ముస్లిం తత్వవేత్తగా  అల్-ఫరాబీని భావిస్తారు.  ఇస్లాం మరియు ప్రజాస్వామ్యం పరస్పర పూరకాలు అని వాదించిన  తత్వవేత్త అల్-ఫరాబి. ప్రజాస్వామ్యంపై అతని భావాలు ఉన్నతమైనవి. స్వేచ్ఛా సమాజాలలో (free societies) మర్యాదపూర్వకమైన సమాజాలు (virtuous societies) కావాలని, స్వేచ్ఛా సమాజాలలో (ఫ్రీ సొసైటీలలో) ఉన్న మంచి వ్యక్తులు ధర్మం కొనసాగించటానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు అని అoటాడు.ఆల్ ఫరాబి గురించి  పఠనం విజ్ఞానదాయకంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అతను రాజకీయల  గురించి ఆలోచించటమే కాకుండా మిమ్మిల్లి కూడా రాజకీయాల గురించి ఆలోచింపజేస్తాడు.

3.ఇబ్నె సీనా/అవిసెన్నా 980-1037

అవిసెన్నా గా పిలువబడే అబూ అలీ అల్-హుసేన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ సీనా  (ఆంగ్లం : Abū ʿAlī al-Ḥusayn ibn ʿAbd Allāh ibn Sīnā) (పర్షియన్ : ابو علی الحسین ابن عبدالله ابن سینا ); యొక్క జననం క్రీ.శ. 980లో జరిగింది. అతని మరణం 1037 హమదాన్ లో సంభవించినది.   ఇతనిపై హిప్పోక్రాత్స్(hippocrates),గాలెన్, ఆరిస్టొటిల్, అల్-కిండి,అల్-ఫరాబి,అల్-బెరూని ప్రభావం కలదు. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ కు చెందిన వాడు.
ఇతనిని ఆంగ్లం మరియు లాటిన్ వారు అవిసెన్నా పేరుతో గుర్తిస్తారు. ఇబ్న్ సీనా ఒక పర్షియన్ ముస్లిం, మరియు ఇస్లామీయ వైద్యపితామహుడు, ఇస్లామీయ తత్వవేత్త. ఇతను ఇస్లామీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు, అల్-కెమీ (రసాయనిక శాస్త్రవేత్త), హాఫిజ్ ఎ ఖురాన్, తర్కవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, కవి, మానసిక శాస్త్రవేత్త, వైద్యశాస్త్రజ్ఞుడు, షేఖ్, మరియు ధార్మిక వేత్త.
ఇబ్న్ సీనా దాదాపు 450 విషయాలపై తన రచనలు సాగించాడు, ఇందులో 240 నేటికినీ మిగిలివున్నాయి. ముఖ్యంగా 150 విషయాలు ఇస్లామీయ తత్వంపై మరియు 40 ఇస్లామీయ వైద్య శాస్త్రంపై రచింపబడినవి. 
ఇతని ప్రఖ్యాత పుస్తకం వైద్య గ్రంథంవైద్య గ్రంధం (The Book of Healing), ఇదో మహా విజ్ఞాన సర్వస్వం, మరియు వైద్య సూత్రాలువైద్యసూత్రాలు (The Canon of Medicine) ఈ గ్రంధాలు, యూరప్ లోని అనేక విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథంగా 19 వ శతాబ్దంలో వుండేది.
ఇబ్న్ సీనా ను ప్రారంభ నవీన వైద్యపితామహుడిగా గుర్తిస్తారు. ఇతని పేరుమీదుగా ఓ శిఖరానికి పేరు పెట్టారు.వృక్ష సముదాయానికి అవిసెన్నా అని పేరున్నది. చంద్రుడిపై ఓ క్రేటర్ కు ఇతని పేరు పెట్టారు.
ఇతని ప్రసిద్ద వచనాలు:
ప్రపంచము తెలివైన   మతరహిత   మరియు మతసహిత  తెలివి లేని వ్యక్తుల మద్య విభజించబడింది. (The world is divided into men who have wit and no religion and men who have religion and no wit)
ప్రతి దానికి కారణాలు ఉన్నందువలన  ఒకదానిగురించి అర్ధం చేసుకోవలనంటే దానికి కారణాలు తెలుసుకోవలె (The knowledge of anything, since all things have causes, is not acquired or complete unless it is known by its causes)
మానసిక సారాంశం మనము మానసిక రూపం లోపించిన శిశువుల్లో కనుగొంటాము
As to the mental essence, we find it in infants devoid of every mental form

4.అల్-ఘజ్జాలి (1058-1111 AD)Al-Ghazzali (1058-1111 AD)

అబూ హమీద్ అల్-ఘజాలి ఇస్లామిక్ ఆలోచనావాది మరియు ఇస్లాం  యొక్క అతి ముఖ్యమైన పండితులలో ఒకరు. ఇతను ఒక తత్వవేత్త, న్యాయశాస్త్ర  పండితుడు మరియు వేదాంతవేత్త మరియు ఇబ్న్ అరబీ వలే  రహస్య ఆధ్యాత్మిక ఆలోచనాపరుడు (mystical thinker). అనేకమంది ముస్లింలకు అల్-ఘజజాలి ముజాద్దాద్ (Mujaddid) అనగా  ఇస్లాం యొక్క పునరుత్థానం కోసం కృషి చేసిన వాడుగా కనిపిస్తాడు.  తత్త్వవేత్తలు మరియు వేదాంతుల మధ్య హేతువాదులు  మరియు సాంప్రదాయవాదులు   మరియు మిస్టకల్ మరియు సాంప్రదాయికల మధ్య సమన్వయము  చేయడానికి ప్రయత్నించాడు. అతని “ఇహ్య ఉలూం అల్-దిన్”, (ది రివైవల్ ఆఫ్ రిలీజియస్ సైన్సెస్ The Revival of Religious Sciences)విబిన్న వాదాల మద్య సమన్వయము కుదిర్చే బంగారు మధ్యే మార్గం.
షరియా మరియు తరిఖా (law and mysticism) ను సమన్వయ పరచడం లో ఇతనిని భారత దేశ షేక్ రబ్బానీ(ఇస్లామిక్ తత్వవేత్త) తో పోల్చవచ్చు. ఇహ్యా ఇతని ముఖ్యమైన రచన  మరియు అందరు  ఇస్లామిక్ పండితుల ద్వారా చదవబడాలి.  విద్యావంతులైన ముస్లింలు అందరూ అల్-ఘజాలి యొక్క “కితాబ్ అల్-మున్కిద్ మిన్ అల్ దలాల్” (kitaab al-Munqidh min al-Dalal) ను చదవవలసి ఉంటుంది, దీనిలో అతని పండిత  మరియు ఆధ్యాత్మిక సందేహాలు మరియు సత్యం  కోసం అతని  అన్వేషణ గ్రహించ వచ్చు. ఈ పుస్తకం ఒక స్వతంత్ర కళల విద్యగానే ఉంది.
“తత్వవేత్తల యొక్క విరుద్ధమైన భావనలు ”అతని ప్రధాన రచన ఇస్లామిక్ జ్ఞానమీమాంస లో ముఖ్యమైనది. సంశయవాదంతో అతను అన్ని సంఘటనలకు కారణం   భౌతిక సంయోగాల మేళవింపు  కాదని దేవుని అభీష్టం(will of god)అని అభిప్రాయ పడినాడు. తరువాతి శతాబ్దంలో ఎవర్రోస్ అల్-ఘజాలి యొక్క విరుద్దానికి విరుద్దం ప్రకటించినాడు

5.ఇబ్న్ రష్ద్ (1126-1198 AD)Ibn Rushd (1126-1198 AD)

పడమటి దేశాల వారిచే   అవెర్రొస్ గా పిలవబడే ఇబ్న్ రష్ద్ మధ్యయుగ అండలుషియాకు చెందిన తత్వవేత్త. ఇతను తర్కం, అరిస్తోతిల్ మరియు ఇస్లామిక్ తత్వ శాస్త్రము, మాలకి ఇస్లామిక్ న్యాయశాస్త్రం పై రచనలు చేసినాడు.  పాశ్చాత్య మత మరియు తత్వశాస్త్రంపై ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. కొందరు ముస్లిం చరిత్రకారులు ఇతనిని ఆధునిక జ్ఞానోదయం ఉన్న పడమటి అరిస్తోతిల్ అని వర్ణించారు. ఇబ్న్ రష్ద్ ఒక గొప్ప ఆలోచనాపరుడు. అతను న్యాయాధిపతి, ఇస్లామిక్ చట్ట (మాలికి) నిపుణుడు, వైద్యుడు మరియు తత్వవేత్త.
తన “ఫాస్ల్ అల్-మకాల్” (నిర్ణయాత్మక గ్రంధం The Decisive Treatise ) లో అతను తత్వశాస్త్రం, విజ్ఞానo, మతం, విశ్వాసం మరియు కారణం గురించి ఆలోచన చేస్తాడు. అతని తహఫత్ అల్-తహాఫత్ (Incoherence of Incoherence) అనేది అల్-ఘజాలి  యొక్క తాహత్ అల్-ఫలాసిఫహ్ (Tahat al-Falasifah ) కు క్రమబద్ధమైన ఖండన  మరియు అరిస్టాటిల్ తత్వశాస్త్రం కు బలమైన రక్షణగా అభివర్ణించారు. ఇబ్న్ రష్ద్ మరియు అల్-ఘజాలి ఇద్దరి రచనలను ఇస్లామిక్ తాత్విక వారసత్వ ప్రముఖ రచనలుగా చెప్పవచ్చు. అందరు ముస్లింలు ఈ తత్వవేత్తలను చదవాలి; వారి  వాదనలలో కొన్ని సన్నిహితంగా ఉంటాయి.
6.ఇబ్న్ అరబీ (1165-1240 AD)Ibn Arabi (1165-1240 AD)
షేక్  అల్-అక్బర్ గా పిలవబడే “అబు అబ్ద్ అల్లాహ్ ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్నె అరాబ్బి అల్-హతిమి అత్-తై” "గొప్ప పండితుడు, అరబ్ అండలూసియన్ సున్ని విద్వాoసుడు, సూఫీ రహస్యవాది, కవి మరియు తత్వవేత్త.
ఇబ్న్ అరబీ  చాలా ప్రత్యేకమైన, అత్యంత కలవరపెట్టే మరియు అదే సమయంలో అత్యంత లోతైన ముస్లిం తాత్విక ఆలోచనాపరుడు. అతను అల్-ఫరాబి లేదా ఇబ్న్ రష్ద్ వంటి హేతుబద్ధ తత్వవేత్త కాదు. అతను రహస్యవాద, ఊహాజనిత మరియు ఏవిధంగాను వర్ణించలేనివాడు. ఇబ్న్ అరబి బహుశా మానవ మేధో వారసత్వంలో మొదటి పోస్ట్ మోడర్న్ మరియు ఫెమినిస్ట్ తత్వవేత్త. అతని రచనలు ఫుసుస్ అల్-హికామ్ (జ్ఞానం యొక్క అంచులలో ) మరియు ఫుతుహత్ అల్-మక్య్యా (మక్కాన్ ఓపెనింగ్స్) బహుశా ఇస్లామిక్ రహస్యవాద మరియు తాత్విక ఆలోచన యొక్క శిఖరం లాంటివి.  ఇబ్న్ అరబీని అర్ధం చేసుకోకుండా ఇస్లామిక్ మేధో వారసత్వాన్ని ఎన్నటికీ పూర్తిగా అర్ధం చేసుకోలేరు.
ప్రొఫెసర్ విలియం చిట్టిక్ ఇబ్న్ అరబీ యొక్క ఆలోచన మీద అనేక పుస్తకాలు రాశారు. ఇబ్న్ అరబీ సృష్టి యొక్క ప్రయోజనం మరియు అర్ధం అల్లాహ్ యొక్క నిరంతర స్వీయ-బహిర్గతం (తజల్లి) గా ఉంటుంది అని వివరణ ఇస్తాడు. ఇబ్న్ అరబీ గ్రంధం  “అల్-షేక్ అల్-అక్బర్” చదవండి.

7.ఇబ్న్ ఖాల్దున్ (1332-1406 AD)Ibn Khaldun (1332-1406 AD)

ఇబ్న్ ఖాల్దున్ ఉత్తర ఆఫ్రికన్ అరబ్ చరిత్రకారుడు. ఇతనిని  సమాజ శాస్త్రం మరియు జనాభా శాస్త్రం వంటి  ఆధునిక విభాగాల యొక్క అగ్రగామిగా పేర్కొన్నారు. అతను తన పుస్తకం, ముక్దాదిమా లేదా ప్రోలేగోమీనాకు ప్రసిద్ధి చెందాడు.
ఇబ్న్ ఖల్దున్ అందరు  సాంఘిక శాస్త్రవేత్తలకు  షేక్ వంటి వాడు.  అతను చరిత్ర యొక్క తత్వవేత్త మరియు మొదటి సాంఘిక శాస్త్రవేత్త. సూత్ర సిద్ధాంతం (normative theory) మీద అనుభావిక భావనను (empirical thought) నొక్కిచెప్పిన మొదటి ప్రధాన ఇస్లామిక్ ఆలోచనాపరుడు. ఇబ్న్ ఖాల్దున్ సాంఘిక శాస్త్రాలలో  మూడు ముఖ్యమైన రచనలు చేశాడు. అతను అనుభావిక వాస్తవాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు, మార్పు యొక్క సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు మరియు మార్పు కు గుర్తుగా   గిరిజన సంఘీభావాన్ని గుర్తించాడు.  ప్రపంచానికి మంచి పాలనను అందించడానికి ఇతని రచనలు తోడ్పడతాయి.రాజకీయ సిద్ధాంతం మరియు దౌత్యంలో ఆయన అభిరుచులు అతడిని  ఇస్లామిక్ ఆలోచన లో చాలా గౌరవనియమైన స్థానాన్ని ఇస్తాయి.